లక్ష్మీ గణపతి ఆలయం బిక్కవోలు | Bikkavolu Lakshmi Ganapathi Temple History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం


బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

భారత దేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ముక్కోటి దేవతలు ఉన్న ఈ దేశంలో మొదటి పూజ మాత్రం ఆ వినాయకుడికే చేస్తారు. అటువంటి వినాయకుడు కొలువై ఉన్న ఓ దేవాలయం మాత్రం ప్రపంచ దష్టిని ఆకర్షిస్తోంది. దేశ విదేశాల నుంచి ఇక్కడకు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అందుకు కారణం ఆ ఆది దేవుడి చెవిలో మన కోరికలను నేరుగా చెప్పుకోవడానికి వీలు ఉండటమే. దేశంలో మరెక్కడా ఇలా వినాయకుడి చెవిలో కోరికలను చెప్పుకోవడానికి వీలు కాదు.

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం 

విశిష్టమైన ఈ గణపతి దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా బిక్కబోలు అనే గ్రామంలో ఉంది. అత్యంత శక్తిమంతుడిగా పేరొందించిన ఈ వినయకుడు స్వయంభువుడు. అంటే భూమి నుంచి తనంత తానుగా జన్మించినవాడని అర్థం.

ఈ వినాయకుడి మహిమలు తెలిసి క్రీస్తుశకం 840లో చాలుక్యులు ఈ వినాయకుడికి సుందరమైన దేవాలయాన్ని నిర్మించారని స్థానిక రాతిశాసనాలు స్పష్టం చేస్తున్నాయి. స్థానిక కథనాన్ని అనుసరించి ఈ దేవాలయం మొదట్లో భూమిలోకి కూరుకుపోయి ఉండేదని చెబుతారు.

ఇక భూమి నుంచి బయటికి వచ్చిన ఈ దేవాలయం రోజురోజుకు పరిమాణంలో పెరుగుతూ ఉండేది. ఇప్పటికీ ఈ పెరుగుదలను మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ దేవాలయంలో వినాయక విగ్రహానికి ఉన్న తొండం కుడివైపునకు ఉంటుంది.


ఒకరోజు స్వామివారు నేరుగా ఒక భక్తుల కలలోకి వచ్చి తాను ఉన్న చోటును వివరించాడు. అటు పై ఆ భక్తుడు ఈ విషయాన్ని తన స్నేహితుల ద్వారా భక్తులకు తెలియజేశాడు. దీంతో గ్రామస్తులంతా కలిసి ఈ విగ్రహాన్ని వెలికి తీసినట్లు చెబుతారు.

ఇది చాలా అరుదైన విషయం. ముఖ్యంగా ఈ దేవాలయానికి వచ్చే భక్తులు తమ కోర్కెలను స్వామి వారి చెవిలో చెబుతారు. అటు పై ముడుపులు కట్టుకొంటాడు. ఇలా చేయడం వల్ల చాలా కాలంగా నెరవేరని తమ కోర్కెలు నెరవేరుగాయని భక్తుల నమ్మకం. ఇందుకు సంబంధించిన అనేక నిదర్శనాలను చూపిస్తారు.

అదే విధంగా ఇక్కడ ఉన్న నంది, భూలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకొంటే అన్ని పాపాలు హరించి పోతాయని భక్తుల నమ్మకం. ఈ బిక్కవోలు గ్రామంలో తూర్పు చాళుక్యులు నిర్మించిన అనేక దేవాలయాలు ఉన్నాయి.

క్రీస్తుశకం 849 నుంచి 892 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చాళుక్యరాజు 3వ గుణ విజయాదిత్య పేరు పై ఈ గ్రామానికి ఆ పేరు వచ్చినట్లు చెబుతారు. ఆయన కాలంలో నిర్మించిన అనేక దేవాలయాల్లో శ్రీ రాజ రాజేశ్వరీ దేవాలయం, శ్రీ చంద్రశేఖర స్వామి దేవాలయం ముఖ్యమైనవి.


రాజరాజేశ్వరీ దేవాలయంలోనికి ప్రవేశించిన వెంటనే దివ్యమైన అనుభూతి కలుగుతుంది. అదే విధంగా ఈ దేవాలయంలో విరభద్ర స్వామి, సుబ్రహ్మణ్యస్వామి తదితర దేవుళ్లకు కూడా దేవాలయాలు ఉన్నాయి.

ఈ గుడిలోని వినాయకుడి చెవిలో  కోరికలు చెబితే

మనసులోని కోరికలు ఆ దేవాలయంలోని వినాయకుడి చెవిలో చెబితే నెరవేరుతాయట. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే కోరిన కోరికలను నెరవేరుస్తాడు. విఘ్నాలకు అధిపతిగా అగ్రపూజలందుకునే గణేశుడిని నిత్యం దేవతలు సైతం ఆరాధిస్తారంటే ఆయన శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ స్వామి అన్ని చోట్లా కొలువై భక్తులకు అండగా ఉంటాడు.


అలాంటి వాటిలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీలక్ష్మీగణపతి దేవాలయం ఒకటి. ఇక్కడ కొలువున్న వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని చెబుతారు.ఈ ఆలయాన్ని క్రీ .శ 840లో చాళుక్యులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని స్థంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు లిఖించి ఉన్నాయి.

అప్పట్లో దేవాలయం భూమిలోనే ఉండేదట. 19వ శతాబ్దంలో ఒక భక్తుడికి కలలో కనిపించి గణనాథుడు తన ఉనికిని చాటినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ఆ భక్తుడు గ్రామస్తులకు ఈ విషయం చెప్పి ఆలయాన్ని వెలికితీయడంతో స్వామి బయటపడ్డాడరని చెబుతారు. భూమిలో నుంచి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మనసులోని కోరికలను విఘ్నేశ్వరుడి చెవిలో చెప్పుకుంటారు. ఇలా చెప్పి ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడ నందీశ్వరుడిని, భూలింగేస్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ రాజరాజేశ్వరి ఆలయం కూడా ఉంది.

ఈ ఆలయంలోకి ప్రవేశించగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు పేర్కొంటారు. వీరభద్రుడితోపాటు సుబ్రమణ్య స్వామి కొలువున్నారు. ఈ ఆలయంలో ఏటా గణపతి నవరాత్రులతోపాటు సుబ్రమణ్వేశ్వర ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడ గణపతి హోమం చేయించినవారికి స్వామి అండగా ఉంటారని భావిస్తారు.

గణపతి ఉత్సవాల సమయంలో సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవాలు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఇక్కడ గణపతి హోమం నిర్వహించడం వల్ల ఇంటిలో ఎటువంటి అశుభాలు జరగవని చెబుతారు.

స్వామి వారి ప్రత్యేకతలు 

బిక్కవోలు శ్రీలక్ష్మీగణపతి స్వామి విగ్రహం 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పున ఉంటుంది. భారీ కాయంతో ఉన్న స్వామి వారి తొండం కుడివైపు తిరిగి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. నాగాభరణం, నాగ మొలతాడు, నాగ యజ్ఞోపవీతం, బిళ్లకట్టు పంచెతో సుఖాశీనులైన స్వామి వారు భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా సుప్రసిద్ధుడు. 

రవాణా:

By Road

Bikkolu - Rajamundry :30kms

Bikkolu - Kakinada :31kms

By Air

The nearest airport is at Madhuripudi which is 35 km away.

By Train

The nearest railway station is at Samalkota which is 10 km away.

Temple Timings

Morning : 5am to 12pm

Evening : 4pm to 8pm

Temple Address

Temple opening hours:
Morning – 07:00 am to 12:00 noon, and
Evening – 04:00 pm to 09:00 pm.
Location:
Bikkavolu Vinayaka Temple,
Bikkavolu Village and Mandal,
East Godavari district,
Andhra Pradesh,
India.
Pin code: 533344.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags : lakshmi ganapathi temple bikkvolu history in telugu, bikkvolu famous temples, ganesh famous temples, east gadavari famous temples, kakinada famous temples,andhra pradesh famous temples, india famous temples, world famous temples,lord vinayaka temples,bikkvolu subramanyam swamy temple history in telugu, bikkavolu vinayaka temple history in telugu, bikkavolu subramanya swamy temple, bikkavolu vinayaka temple darshan timings, bikkavolu vinayaka temple distance, bikkavolu vinayaka temple history in telugu,  bhakthimargam, bhaktimargam, bhakti margam, Bhakthi Margam, bhakthimargam.in, 

Comments