12 జ్యోతిర్లింగాలు ఎలా దర్శించాలి ? వాటి పేర్లు | 12 jyotirlinga name and place list in telugu | bhakthi margam | భక్తి మార్గం


12 జ్యోతిర్లింగాలు

అభిషేక ప్రియుడు, బోళా శంకరుడు, అర్ధనారీశ్వరుడు, నీలకంఠుడు, ఈశ్వరుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పరమేశ్వరుడికి ఎన్నో నామాలు. ఇక భారత దేశంలో శివుడుకి ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికి వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను పొందాయి. 
శైవులు శివున్ని మూర్తి రూపంలో, లింగరూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు. ఆ 12జ్యోతిర్లింగాలు మన భారత దేశంలోనే ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

రామనాథస్వామి లింగం - రామేశ్వరం
శ్రీశైల క్షేత్రం (మల్లి కార్జున లింగం) - శ్రీశైలం
భీమశంకర లింగం - భీమా శంకరం
ఘృష్ణేశ్వర జ్వోతిర్లింగం - ఎల్లోరా గుహలు
త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరాలయం (త్రయంబకేశ్వర్, నాసిక్)
సోమనాథ లింగం - సోమనాథ్
నాగేశ్వర లింగం - దారుకావనం (ద్వారక)
ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రం
మహాకాళ లింగం - ఉజ్జయని
వైద్యనాథ జ్వోతిర్లింగం - చితా భూమి (దేవఘర్)
విశ్వేశ్వర లింగం - వారణాశి
కేదార్‌నాథ్‌ ఆలయం  -  హిమాలయాలలో

1. Somnath :Prabhasapattan, near Veraval, Sourashtra, Gujarat
2. Mallikarjun :Shrishailya, Andhra Pradesh
3. Mahankal :Ujjain, Madhya Pradesh
4. Omkar :Amaleshwar Omkar, Mandhata, Madhya Pradesh
5. Kedarnath:Himalayas
6. Bhimashankar:Dakini region, Taluka Khed, District Pune, Maharashtra
7. Vishveshwar:Varanasi, Uttar Pradesh
8. Tryambakeshwar:Near Nashik, Maharashtra
9. Vaidyanath (Vaijanath): (Note 1)Parli, District Beed, Maharashtra
10. Nagesh (Nagnath) :(Note 2)Darukavan, Oundh, District Hingoli, Maharashtra
11. Rameshwaram: Setubandh, near Kanyakumari, Tamilnadu
12. Ghrushneshwar (Ghrushnesh): Verul, District Aurangabad, Maharashtra


1 . గుజ‌రాత్ రాష్ట్రం -

సోమ‌నాధ జోతిర్లింగం గుజరాత్‌ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. దీనిని ప్రభాస్ క్షేత్రం అంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికీ ప్రజ్వరిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమ నాథేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి.

2. ఆంధ్ర‌ప్ర‌దేశ్ -

శ్రీ‌శైలం మ‌ల్లికార్జున స్వామి జోతిర్లింగం శ్రీశైల మల్లికార్జునేశ్వరుడు మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా దోర్నాల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి 52 కిలోమీటర్ల, హైదరాబాద్‌కు 230 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది.ఇక్కడ కృష్ణానది పాతాళగంగా వర్ణిపంబడింది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠములలో ఒక్కటి. పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభువుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిశాడు. భూ ప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే గణాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షన్ముఖుడికి ప్రతీచోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడు.ఆది శంకరాచార్యుడు శివానందలహరిని ఇక్కడే వ్రాశాడు.  పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్లిపోయి కార్తీకుడిగా వెలిశాడు. తన తప్పిదం వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానదీ తీరం శ్రీశైల శిఖరంలో తప్పస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ సహిత మల్లిఖార్జునులుగా వెలిశారు. శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన వేయి లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన అయిదు లింగాలు ఇక్కడే కొలువు తీరినట్లు చెబుతారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానందాలహరి రాసారని ప్రతీతి.

3.మహాకాళుడు 

(అవంతి) ఉజ్జయిని, మధ్యప్రదేశ్ - క్షిప్రానది ఒడ్డున ఉంది. ఈ నగరంలో 7 సాగర తీర్థాలు, 28 తీర్థాలు, 84 సిద్ధ లింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండం ఉన్నాయి.ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడి శ్రీచక్రయంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహా కాళేశ్వరుడికి పాతఃకాలం భస్మాభిషేకం చేస్తారు. ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు.

4. శ్రీ ఓంకారేశ్వరుడు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో ఈ పుణ్య‌క్షేత్రం ఉంది. శ్రీ ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు-మామలేశ్వరము,శివపురి, మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో వింద్య పర్వత సానువుల్లో నర్మదానది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. ఇక్కడ ఒకే లింగం రెండు బాగాలుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతుంది. అమ్మవారు అన్నపూర్ణ.

5.వైద్యనాథుడు (అమృతేశ్వరుడు) - 

పర్లి (కాంతిపూర్), దేవఘర్, బీహార్ - బ్రహ్మ, వేణు, సరస్వతీ నదుల సమీపంలో ఉంది. సహ్యాద్రి కొండల అంచునుంది. అమృతమధనానంతరం ధన్వంతరిని, అమృతాన్ని ఈ లింగంలో దాచిరనీ, సృశించిన భక్తులకు అమృతం లభించుననీ నమ్మకం.శ్రీవైద్యనాథేశ్వరుడు పాట్నా నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కంతిపూర్‌ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు.

6.శ్రీనాగనాథేశ్వరుడు లేదా నాగేశ్వరుడు .

మహారాష్ట్ర ప్రభాస రైల్వేస్టేషన్‌కు సమీపంలో శ్రీనాగనాథేశ్వర ఆలయం ఉంది. ఈ జోతిర్గింగాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోగిర్లింగంగా పరిగనిస్తారు. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ.

7.రామేశ్వరుడు - రామేశ్వరం, 

తమిళనాడు - శ్రీరాముడు పరమశివుని అర్చించిన స్థలం - కాశీ గంగా జలంను రామేశ్వరంనకు తెచ్చి అర్చించిన తరువాత, మరల రామేశ్వరములోని ఇసుకను కాశీలో కలుపుట సంప్రదాయం. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధినీ దేవి.

8.భీమశంకరుడు

 - డాకిని, భువనగిరి జిల్లా, పూనే వద్ద, మహారాష్ట్ర - చంద్రభాగ (భీమ) నది ఒడ్డున, భీమశంకర పర్వతాలవద్ద - త్రిపురాపుర సంహారానంతరం మహాశివుడు విశ్రాంతి తీసికొన్న చోటు. అమ్మవారు కమలజాదేవి. శాకిని, ఢాకిని మందిరములు కూడా యున్నవి. మోక్ష కుండము, జ్ఙాన కుండం ఉన్నాయి.

9.విశ్వనాథుడు -

 వారణాసి, ఉత్తరప్రదేశ్ - కాశీ అని కూడా ప్రసిద్ధం - వరుణ, అసి నదులు గంగానదిలో కలిసే స్థానం - పరమపావన తీర్థం - ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణేశ్వరి.

10.త్రయంబకేశ్వరుడు -

నాసిక్, మహారాష్ట్ర - గౌతమీ తీరాన - ఇక్కడి లింగం చిన్న గుంటవలె కనిపించును, అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న (బొటనవేలివంటి) లింగాలున్నవి. అమ్మవారు కొల్హాంబిక. గంగాదేవి మందిరం ఉంది. కుశావర్త తీర్థం, గంగాధార తీర్థం, వరాహ తీర్థం ముఖ్యమైనవి. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సింహస్థపర్వం పెద్ద పండుగ.

11.కేదారేశ్వరుడు -

హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్ - మందాకినీ నదీ సమీపంలో- మంచుకారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే దర్శనానికి తెరచి ఉంటుంది.

12.ఘృష్ణేశ్వరుడు (కుసుమేశ్వరుడు) - 

వెరుల్ నగర్, ఔరంగాబాదు ఎల్లోరా గుహల వద్ద, మహారాష్ట్ర - (దేవగిరి లోనిదే జ్యోతిర్లింగమని కూడా చెప్పుదురు).

Comments