సుబ్రహ్మణ్య స్వామి ఆలయం బిక్కవోలు | Bikkavolu Subramanya Swamy Temple History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం
మూడు వందల ఏళ్ల చరిత్ర కల్గిన బిక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి అందరికీ తెలిసినా.. కొన్ని విషయాలు మాత్రం చాలా మందికి తెలియవు.
ఆలయం చరిత్ర
1100 సంవత్సలముల చరిత్ర కలిగిన బిక్కవోలు అతి ప్రాచీన శైవ క్షేత్రములలో ఒకటి, గోదావరి తీర మండలం, రాజమహేంద్రవరము, కాకినాడ కెనాల్ రోడ్డు ప్రక్కన ఉన్న బిక్కవోలు గొప్ప ఆధ్యాత్మిక చారిత్రాత్మక విశేషాలతో తూర్పు చాళుక్యల శిల్పకళా వైభవంతో నిర్మించబడిన అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందినది.
ఈ ఆలయాన్ని చాళుక్య రాజులలో ఒకరైన విజయాదిత్య III 849 – 892 సెంచరీ AD లో నిర్మించారు. ఈ క్షేత్రం మొదట చాళుక్య విక్షముని పేరిట విక్షమపురంగాను, కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందినది.
ఈ పవిత్ర దేవాలయము శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయములో ఉన్నది. శ్రీ కుమార సుబ్రాహ్మణ్యస్వామి వారు దక్షిణముగా కొలువుదీరి ఉన్నారు. అలాగే, ఇక్కడ పార్వతి, విజయ గణపతి, భద్రకాళి మరియు వీరభద్ర స్వామి ఆలయాలు గమనించవచ్చు. ఆలయలములో నెమలి వాహనం స్వామి విగ్రహం ముందు ఉంటుంది.
సహజంగా ఎక్కడైనా వివాహితుడైన వల్లీ దేవసేన సమేతుడయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉండటం పరిపాటి. అయితే అవివాహితుడయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దక్షిణాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తూ ఉండటంతో బిక్కవోలు గ్రామానికి ప్రత్యేకత సంతరించుకుంది. తమిళనాడు పళనలో వేంచేసి ఉన్న స్వామి వారు... ఆ తరువాత బిక్కవోలులు కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భారత దేశంలో రెండో కుమార క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది. పదకొండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతానం లేని స్త్రీలకు సంతాన ప్రాప్తినిచ్చే స్వామి వారిగా ప్రసిద్ధి గాంచారు.
పంచారామాల కంటే 300 ఏళ్ల ముందే తూర్పు చాళుక్యులచే నిర్మించబడిన బిక్కవోలులోని ప్రసిద్ధి చెందిన ప్రాచీన గోలింగేశ్వరాలయంగా ప్రసిద్ది చెందింది. శైవ కుటుంబం మొత్తం కొలువై ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత. ఈ దేవాలయానికి ఎడమ వైపు రాజరాజేశ్వరుని ఆలయం, కుడివైపు చంద్రశేఖర స్వామి వారి ఆలయం ఉంటాయి. సుబ్బారాయుడి షష్టి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇదే దేవాలయంలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పై ప్రత్యేక కథనాన్ని ఏబీపీ దేశం మీకోసం అందిస్తోంది.
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయం దక్షిణాభిముఖంగా ఉండటం చేత స్వామి వారికి ఇష్టమైన మంగళ వారం, శుద్ధ షష్టి, కృత్తికా నక్షత్రం రోజులలో సుబ్రహ్మణ్యేశ్వ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో స్వామి దగ్గర ఉన్న సర్పానికి పూజలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. స్వామి వారికి ఇష్టమైన పర్వ దినాల్లో రాహు, కేతు, కుజ సర్ప దోషాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు. సంతానం లేని స్త్రీలు షష్టి సందర్బంగా స్వామి చెంతనే ఉన్న సహజ పుట్టపై నాగుల చీర ఉంచి దానిని ధరించి ఆలయ ఆవరణలో నిద్రిస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఆలయ విశిష్టత
శ్రీ కుమార సుబ్రాహ్మణ్యస్వామి వారు బ్రహ్మచారిగా కొలవబడుచున్నారు. ఈ స్వామి అత్యoత తేజస్సు కలిగి చతుర్భుజుడై అభయ ముద్రలో దర్శనం ఇవ్వడం విశేషం. పై రెండు చేతులలో దండం, పాశం ఉంటాయి. ఇక క్రింద కుడి చేతిలో అభయమిస్తున్న స్వామి ఎడమ చేతిని తన నెమలి వాహనం పై ఉంచడం జరిగినది. స్వామి వారికి కుడి వైపున సహజ సిద్ధమైన పుట్టఉన్నది. ప్రతిరోజు రాత్రి పళ్లెంలో పాలు పోసి ఈ పుట్టవద్ద ఉంచడం ఈ ఆలయ సంప్రదాయం.
శ్రీ కుమార స్వామి పళనిలోవలే దక్షిణ ముఖంగా, బ్రహ్మచారిగా కొలువై ఉన్నందున ఈ స్వామిని దర్శించి అభిషేకములు జరిపించినంతనే విశ్వాధిపతి అయిన స్వామి అనుగ్రహం వలన సకల గ్రహశాంతి కలిగి, కోరిన కోర్కెలు నెరవేరడం ఇక్కడ విశేషం. ప్రత్యేకించి రాహు, కేతు, కుజగ్రహశాంతిని కోరి జరిపించే దోష నివారణ పూజలు వలన అనేక మందికి వివాహ సిద్ధి, సంతానం, నష్టాలు మరియు శారీరక ఈతి బాధల నుండి పరిహారం లభిస్తుంది అని ప్రజల నమ్మకం.
అత్యంత ఘనంగా షష్టి ఉత్సవం
బిక్కవోలు సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్టిని పురస్కరించుకుని భారీ స్థాయిలో తీర్థ మహోత్సవం నిర్వహిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి తరలి వస్తుంటారు. సృష్టి మహోత్సవంలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ప్రాచీన గోలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో పూజలు చేయడం ద్వారా సంతాన ప్రాప్తి లభిస్తుందని భక్తులు నమ్మకం. అందుకే ఇక్కడికి ఎక్కువగా సంతాన లేమి సమస్యతో బాధపడే వాళ్లు వస్తుంటారు. భక్తి, శ్రద్ధలతో స్వామి వారిని పూజించి మొక్కులు చెల్లించుకుంటారు.
భారీ ఏర్పాట్లు
సుబ్బారాయుడి షష్టి కన్నుల పండువగా జరిగే సుబ్బారాయుడి షష్టి ఉత్సవ ఏర్పాట్లతో బిక్కవోలు గ్రామం షష్టి శోభ సంతరించుకుంది. కుమార సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామంలోని గోలింగేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల దేవాలయాల గోపురాలు, ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. దేవాలయం ముందు పెద్ద పందిరి వేసి చూపరులను ఆకట్టుకునే విధంగా భిన్న రంగుల వస్త్రాలతో సృజనాత్మకంగా తీర్చిదిద్దారు. గ్రామంలోని పెద్ద వంతెన నుండి దేవాలయం వరకు ప్రధాన రహదారులకు ఇరు వైపులా విద్యుత్ దీపాలంకరణతో పాటు ప్రధాన కూడళ్లలో చూపరులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ దీపాలతో భారీ దేవతా ప్రతిమలు ఏర్పాటు చేశారు.
షష్టికి.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెబుతున్నారు. దర్శన సమయంలో భక్తులు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు బారికేడ్లు నిర్మించారు. అదే రోజు షష్టి కళా వేదికపై ప్రసిద్ధి గాంచిన వివిధ బ్యాండ్ కచేరీలు, రాత్రికి అత్యంత వైభవంగా స్వామివారి గ్రామోత్సవం, స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో బాణాసంచా ప్రదర్శనా పోటీలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఉత్సవాలు జరిగే రోజుల్లో ప్రసిద్ధ కళాకారులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని షష్టి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, అనపర్తి వ్యవసాయ కమిటీ అధ్యక్షుడు జేవీవీ. సుబ్బారెడ్డి, ఆలయ ఈవో ఆకెళ్ల రామ భాస్కర్, షష్టి ఉత్సవ కమిటీ ప్రతినిధి తమ్మిరెడ్డి నాగశ్రీనివాస రెడ్డిలు తెలిపారు.
Poojas
Mahasivarathri: Rudrabishekam and Laksha Pathri Pooja are conducted by the Priests,
Radha Sapthami: On this auspicious occasion Poojas are conducted for "Suryanarayana",
Laksminrayana Pooja,
Navagraha Pooja,
Sanithrayodasi Abhishekam: Abhishekam for Sani Bhagavan,
Hanuman Jayanthi,
Navarathri Pooja: Poojas are conducted for 9 Days,
Kathika Sapthaham: Samaradhana,
Subrahmanya Pooja for fertility.
రవాణా:
By Road
Bikkolu - Rajamundry :39kms
Bikkolu - Kakinada :31kms
By Train
By Air
Temple Timings:
Morning: 6.00 A.M. to 12.00 A.M.
Evening : 4.30 P.M. to 8.00 P.M.
Temple Address
Subramanyam Swamy Temple,
Bikkolu,
East Godavari District,
Andhra Pradesh,
India.
Comments
Post a Comment