తిరుప్పావై 3వ పాశురం | Thiruppavai pasuram 3 in telugu | dhanurmasam | Bhakthi Margam | భక్తి మార్గం
తిరుప్పావై 3వ రోజు పాశురం
మొదటి అయిదు పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై యొక్క ముఖ్యోద్దేశ్యాన్ని తెలియ జేస్తాయి." చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి; దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుడిని పూవులతో పూజిస్తే, పాపాలు నశిస్తాయి. " అని గోదాదేవి విన్నవిస్తుంది.
3. పాశురము :
ఓఙ్గి యులగళన్ద ఉత్తమన్ పేర్ పాడినాఙ్గిళ్ నంబావైక్కు చ్చాత్తినీరాడినాల్
తీఙ్గిన్ఱి నాడెల్లామ్ తిజ్గిళ్ ముమ్మారిపెయ్ దు
ఓఙ్గువళై ప్పోదిల్ పొఱివండు కణ్ పడుప్ప
తేఙ్గాదే పుక్కిరున్దు శీర్ త్తములై పత్తి
వాఙ్గ- క్కుడమ్ నిఱైక్కుమ్ వళ్ళల్ పెరుమ్ పశుక్కళ్
నీఙ్గాద శెల్వమ్ నిఱైన్దేలో రెమ్బావాయ్.
భావము:
ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీ కృష్ణ సంశ్లేషమే! ఐనా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంతానందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు. ఆ పరమానంద మూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి, యీ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళిస్నానాన్నాచరిస్తే - దుర్భిక్షమసలు కలుగనే కల్గదు. నెలకు మూడు వర్గాలు కురుస్తాయి.
పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్లిపడుతూ ఆనంద సమృద్దిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి.
ఇవన్నీ సమృద్దికి సంకేతాలే! ఇక పాలు పిదుక గోవుల పోదుగలను తాకగానే - కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తోంది గోద!
s
3వ మాలిక
ఈ ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది. దీని నాచరించుటవలన వ్రతాన్నాచరించనవారికే కాక లోకమునకంతకును లాబించుము. ఇది ఇహపరసాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణపరమాత్మకదా! మరి విశేషంగా ఆరాధించిన వారికేకాక లోకానికంతకూ కల్యాణాన్ని కల్గించి శుభాలను చేకూర్చేవాడని వ్రతఫలాలను వివరిస్తోంది గోదాదేవి.Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
tags: thiruppavai pasuram in telugu lyrics,thiruppavai telugu pdf with meaning, thiruppavai pravachanam in telugu pdf, thiruppavai pravachanam by chinna jeeyar swamy, thiruppavai pdf telugu, thiruppavai pasuram in telugu lyrics, goda devi pasuram in telugu pdf, goda devi ashtottara shatanamavali in telugu, goda devi story in telugu, bhakthimargam, bhakthi margam, bhakthi margam telugu, bhaktimargam, bhakti margam, thiruppavai pasuram in telugu mp3 free download, thiruppavai mp3 free download tamil m.s. subbulakshmi, thiruppavai in telugu pdf free download, thiruppavai telugu books, thiruppavai pasuram 3 meaning, thiruppavai 3rd pasuram in telugu, thiruppavai pasuram third in telugu
Comments
Post a Comment