శ్రీ కుక్కుటేశ్వరస్వామి దేవాలయం పిఠాపురం | Pithapuram Sri Kukkuteshwara Swamy Temple History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం | Padagaya Temple Pithapuram
కుక్కుటేశ్వరుడి దేవళం
భారతదేశంలోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు.
శివుడు కోడి రూపాన్ని ధరించిన క్షేత్రం !
చుట్టూ పచ్చని పొలాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, మరోవైపు గోదావరి నదికి నెలవైన ఈ పిఠాపురం అష్టాదశశక్తి పీఠాలలో ఒకటైన పురుహూతికా అమ్మవారికి నిలయం. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. అమ్మవారి పేరుమీదనే ఈ ఊరికి పిఠాపురం అన్న పేరొచ్చింది. కుక్కుటేశ్వర దేవాలయం కుక్కుటేశ్వర దేవాలయం కోనేరు (పాదగయ) కు ముందు తూర్పుముఖంగా ఉంటుంది. గుడికి ఎదురుగా ఏకశిల నంది విగ్రహం అతి పెద్దగా శ్రీశైల నందిని పోలి ఉంటుంది. కుక్కుటేశ్వర లింగం తెల్లగా గర్భాలయంలో కొలువై ఉంటుంది.
ఈ ఆలయానికి రెండు వైపులా పురూహూతికా అమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి. పురుహూతికా దేవి ఆలయం కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.
ఐతిహ్యం
హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషను కి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్తాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు. గుడి చాలా చిన్నది. అయినప్పటికి అష్టాదశ శక్తీ పీఠాల శిల్పాలు చెక్కబడి ఎంతో అందంగా ఉంటుంది.
శివ పూజ
శివమ్ అంటే మంగళం అని అర్థం .. శుభాలను ప్రసాదించువాడే శంకరుడు. శివ నామ స్మరణ వలన .. శివ పూజ వలన సమస్త పాపాలు నశించి సకల శుభాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి పరమశివుడు తన లీలా విశేషాలలో భాగంగా ఎన్నో ప్రదేశాలలో ఆవిర్భవించాడు .. వాటిలో 'పిఠాపురం' ఒకటి.
అమ్మవారి శక్తి పీఠం
సదా శివుడిని ఇక్కడ 'కుక్కుటేశ్వర స్వామి'గా పూజిస్తుంటారు. 'పిఠాపురం' అమ్మవారి శక్తి పీఠంగానే కాదు, స్వామివారు 'కోడి' రూపాన్ని ధరించిన క్షేత్రంగాను చెబుతారు. గయాసురుడిని సంహరించడం కోసం త్రిమూర్తులు పథక రచన చేస్తారు.
కుక్కుటేశ్వరుడు
అందులోభాగంగా తెల్లవారక మునుపే గయాసురుడు మేల్కొనాలి. అలా జరగడం కోసం శివుడు 'కోడి' రూపాన్ని ధరించి కూస్తాడు. తెల్లవారిందనుకుని మేల్కొన్న గయాసురుడిని సంహరిస్తాడు. ఆ రాక్షసుడి కోరిక మేరకు స్వామి లింగ రూపంలో అక్కడే వెలిశాడు. అందుకే ఇక్కడి స్వామిని 'కుక్కుటేశ్వరుడు' గా ఆరాధిస్తూ వుంటారు.
పుణ్య క్షేత్రం
ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగిన పిఠాపురం పవిత్రమైన గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో జైన, బౌద్ధ, శైవ మరియు వైష్ణవ దివ్య క్షేత్రాల కూడలిగా ఉన్నది. పిఠాపురం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్ఫు గోదావరి జిల్లాకు చెందిన పుణ్య క్షేత్రం.
దత్త క్షేత్రములు
శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయుల వారు స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురం లో మాత్రమే కలదు. మిగతా దత్త క్షేత్రములలో స్వామివారి పాదుకలు కలవు.
త్రిగయా క్షేత్రాల్లో ఒకటి .. పితృముక్తి క్షేత్రంగా ఖ్యాతిగాంచిన ఆ ఆలయం విశిష్టత ఏమిటంటే.
చుట్టూ పచ్చని పొలాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, మరోవైపు గోదావరి నదికి నెలవైన ఈ పిఠాపురం ప్రస్తావన పురాణాల్లో కూడా ఉంది. ఏ ఊరు పూర్వం బుద్ద రాజధానిగా ఉండేది. అందుకనే పిఠాపురాన్ని పాదగయ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న తటాకాన్ని పాదగయ తీర్ధమని అంటారు.
పాదగయ తీర్ధం వద్ద గయాసురుని పాదాలున్నాయి. కనుక ఇక్కడ పెద్దలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే.. పుణ్యలోకం ప్రాపిస్తుందని నమ్మకం
పాదగయ కోనేరుకు ముందు తూర్పుముఖంగా కుక్కుటేశ్వర దేవాలయం ఉంటుంది. గుడికి ఎదురుగా పెద్ద ఏకశిల నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది శ్రీశైలంలోని నందిని పోలి ఉంటుంది. ఇక గర్భాలయంలో కొలువైన కుక్కుటేశ్వర స్వామి లింగం తెల్లగా ఉంటారు.. స్వచ్ఛమైన మనసుతో కోరి కొలిచినవారి కోర్కెలు తీరుస్తున్నాడు భోళాశంకరుడు
కుక్కుటేశ్వర ఆలయానికి ఇరువైపులా పురూహూతికా అమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి. ఈ గుడి చాలా చిన్నది. అయినప్పటికి అష్టాదశ శక్తీ పీఠాల శిల్పాలు చెక్కబడి ఎంతో అందంగా ఉంటుంది.
పిఠాపురం దత్త క్షేత్రాల్లో ప్రాముఖ్య క్షేత్రం. శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన 'శ్రీ పాద శ్రీ వల్లభ. స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు.
శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే ఉంది. మిగతా దత్త క్షేత్రాల్లో స్వామివారి పాదుకలు మాత్రమే పూజలను అందుకుంటాయి.
పాదగయ క్షేత్రం
శిరోగయ = గయ క్షేత్రం – బీహారు రాష్ట్రం; ఫల్గునీ నదీ తీరం; విష్ణు క్షేత్రం; మంగళగౌరీ దేవి శక్తి పీఠం.
నాభిగయ = జాజిపూర్ క్షేత్రం – ఒరిస్సా రాష్ట్రం; యజ్ఞవేదికా స్వరూప బ్రహ్మ; గిరిజాదేవి శక్తి పీఠం.
త్రిగయా క్షేత్రాల్లో ఒకటైన పాదగయ క్షేత్రం.. పితృ ముక్తి కరమ క్షేత్రంగా ఖ్యాతిగాంచింది.
పాదగయ క్షేత్రం లోకి మనం ప్రవేశించగానే .. పరమశివుడు ధ్యానం చేస్తూ మనకు ధర్శినం ఇస్తారు .. నిజంగా శివున్ని చూస్తూ ఉంటే మనసు మనకు తెలియకుండానే స్వామి వారి చిరునవ్వు దగ్గర నిలిచిపోతుంది.
పక్కనే కోనేరు కనిపించడం తో కాళ్ళు కడుక్కుంటూ పక్కకు చూస్తూ ఉంటే .. గయా సుర వృత్తాతం (స్థలపురాణం) మనకు కనిపిస్తుంది .
పాదగయ క్షేత్రం లో కోనేరులో స్నానం చేయడానికి .. తగిన ఏర్పాట్లు ఉన్నాయ్ ,పాదగయ క్షేత్రం శివనామస్మరణతో మారు మోగుతుంది .
వాయు మార్గం
విమానాల్లో వచ్చే యాత్రికులు రాజమండ్రి (60 కి. మీ) లేదా వైజాగ్ (180 కి. మీ) ఎయిర్ పోర్ట్ లో దిగి, క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి పిఠాపురం చేరుకోవచ్చు
రైలు మార్గం
సామర్లకోట రైల్వే జంక్షన్ పిఠాపురం నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడ తెలంగాణ, రాయలసీమ మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే అన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగుతాయి. స్టేషన్ బయట షేర్ ఆటోలు లేదా బస్టాండ్ కు వెళ్లి ప్రభుత్వ బస్సుల్లో ఎక్కి పిఠాపురం చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం
కాకినాడ, సామర్లకోట, రాజమండ్రి, తుని తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు ప్రతిరోజూ తిరుగుతుంటాయి.
చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు
2. Lord Sri Saibaba Temple 1.7 కి. మీ.
3. శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం 11 కి. మీ.
4. SRI KRISHNA Mandapam 13 కి. మీ.
5. SRI VENKATESWAR SWAMI TEMPLE 13 కి. మీ.
6. ganesh temple 14 కి. మీ.
7. Someswara Swami Temple 15 కి. మీ.
8. Panduranga Temple 15 కి. మీ.
9. SRI SITA RAMALAYAM TEMPLE IN NAYAKAMPALLI 22 కి. మీ.
10. Vigneswara Temple 22 కి. మీ.
Comments
Post a Comment