శ్రీ మరిడమ్మ తల్లి దేవస్థానం పెద్దాపురం | Peddapuram Sri Maridamma Thalli Temple History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం
శ్రీ మరిడమ్మ తల్లి దేవస్థానం
స్థల పురాణం
పూర్వకాలంలో కలరా, మశూచి లాంటి వ్యాధులు ప్రబలి ఊరిలో అనేక మంది మృత్యువు భారిన పడుతుండేవారు. పెద్దాపురం పరిసర ప్రాంతాల నుండి కలరా, మశూచి మహమ్మారిని పారద్రోలిన మారెమ్మ అమ్మవారు పాత పెద్దాపురంలో గ్రామదేవతగా ఎన్నో ఏళ్ల క్రిందటే వెలిశారు. ఆనాటి నుండి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆతల్లికి పూజాది కార్యక్రమాలు నిర్వహించేవారు.
17 వ శతాబ్దములో పెద్దాపురంలో మానోజి “ చెరువుకి అతి సమీపంలో గ్రామదేవతగా శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలిసారు. ప్రస్తుతం మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశం అంతా చిట్ట అడివి గా వుండేధి. ఒక సారి ఆ అడవిలో పశువుల కాపరులకి “ 16 ఏళ్ల యువతి కనిపించి నేనుచింతపల్లి వారి ఆడపడుచుని నేను ఈ ప్రదేశములో వున్నాను అని మా వాళ్ళకి చెప్పండి. అని చెప్పి మాయం అయ్యింది ఈ వింతను చూసిన పశువుల కాపరులు వెనువెంటనే చింతపల్లి వారికి జరిగింది అంతా చెప్పారు.
అంతకు మునుపే మరిడమ్మ అమ్మ వారు చింతపల్లి వారికి కలలో కనిపించి తనకి మానోజీ చెరువు సమీపంలో ఆలయం నిర్మించవలసినదిగా ఆజ్ఞాపించారు. ఆ చింతపల్లి కుటుంబ సభ్యులు అంతా ఆ మానోజి చెరువు చుట్టుపక్కల ప్రాంతములు వెతకగా వారికి పసుపు పూసిన ఒక కర్ర గద్దె అమ్మవారి ప్రతి రూపము దర్శనమిచింది. ఈ గద్దెను ఇక్కడే ప్రతిష్ఠించి తాటాకు పాక వేసి ఆనాటి నుండి నిత్య ధూప ధీప, నైవేధ్యములు చెల్లించి ఆరాధించటము ప్రారంభించారు.
మరిడమ్మ జాతర మహోత్సవం
ఈ మరిడమ్మ అమ్మ వారి జాతర ప్రతీ సంవత్సరము జేష్ఠ మాసం లోని అమావాస్య నుండి ప్రారంభ మై ఆషాడమాసంలోని అమావాస్య వరకూ 37 రోజుల పాటు ఎంతో వైభవముగా జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుండి మరిడమ్మ అమ్మ వారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తూంటారు ఒక్క ఆదివారం రోజునే దాదాపు 40 నుండి 50 వేల మంది వరకూ భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించుకుంటారని ఆలయ కమిటీ సమాచారం.
ఉయ్యాల తాడి
బహులైక జేష్ఠ అమావాస్యకు పక్షం (పదిహేను రోజులు) ముందు అమ్మ వారికి ఉయ్యాల తాడిని వేస్తారు. జాతర రోజు నుండి జాతర ముగిసే వరకూ అమ్మవారు, ఆమె ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు ఈ ఉయ్యాల తాడి వద్దే ఆడి పాడి భక్తుల ఆలనా పాలనలు చూస్తారని భక్తుల విశ్వాసం.
ఈ ఉయ్యాల తాడిని రైతులు వారి వారి పొలాల గట్లమీద ఏపుగా ఎదిగిన తాడిని సమర్పించడానికి ఎగబడతారు అలా సమర్పించడానికి రైతులు ఆలయ కమిటీ వారికి 6 నెలల ముందుగానే చెప్పుకోవలసి వుంటుంది.
ఉయ్యాల తాడిని కేవలం భుజాల మీద మాత్రమే దాదాపు 100 మందికి పైగా హరిజన సోదరులు ఊరేగింపుగా ముందు డప్పులు మ్రోగుతుంటే ఆ తదుపరి గరగలు నడుస్తూ వుంటే దారిపొడవునా గ్రామ ప్రజలు ఆడపడుచులు తాడిలకు స్నానం చేయించి పసుపు కుంకుమలు రాసి పాత పెద్దాపురం కోటముందు మీదుగా గుడివద్దకు సాగనంపుతారు (వారిని కాదని వేరొకరు తేలేరు ఆ దారి కాదని వేరొక దారి పోరాదు) అది వారి భుజాల మీదుగా ఆ దారి మీదుగానే గుడివద్దకు రావాలి అది అనాదిగా వస్తున్న ఆచారం.
తొలి జాతర
పెద్దాపురం పట్టణంలో ఉన్న 28 వార్డుల్లో దాదాపు అన్ని వార్డుల ప్రజలు మరిడమ్మ అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తారు ఐతే మొట్టమొదటి జాతర మాత్రం పాత పెద్దాపురం కోటముందు గ్రామస్థులు మాత్రమే నిర్వహిస్తారు. వీరు నిర్వహించేది జాగారం మిగిలిన వీధుల వారు నిర్వహించేది సంబరం గానూ వ్యవహరిస్తారు.
బహులైక జేష్ఠ అమావాస్య సాయంత్రం మొట్టమొదట జాతర గరగలు గుడి వద్ద జాతర గరగల కంటే ముందు ఎత్తి అమ్మవారి సమక్షంలో గరగ నృత్యం ఒక ఆట పులి నృత్యం ( పులి ఆటకి రాష్ట్రము లోనే ప్రసిద్ధి చెందిన పులి ఆటకారులున్నారిక్కడ ) ఒక ఆట ఆడి పాత పెద్దాపురం కోటముందుకి పయనమవుతారు మరిడమ్మ ఆస్థానం నుండి తీసుకువెళ్లిన గరగలను పాతపెద్దాపురం మరిడమ్మ ఆలయానికి అనువంశిక ఆలయ ధర్మకర్తలు పానుపు వేసి పసుపు కుంకుమలు పూసి, కాగడాలు వెలిగించి ధూపదీప నైవేద్యాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించి, అమ్మవారికి ఇష్టమైన పాటపాడి హారతి ఇవ్వడంతో పాన్పు పూర్తవుతుంది - తరువాత జాతర కార్యక్రమం అంగరంగ వైభవంగా, గరగలు, పులి, కొయ్యడాన్సులు, తప్పెటగుళ్లు, కర్రసాము, కోలాటం ఇంకా అనేక ఇతర కార్యకమాలతో, దేవతా వేషధారణ లతో వున్న ట్రాక్టర్ల ఊరేగింపుతో బాణాసంచా పేలుళ్లతో రెండు ఆలయాల వద్ద భారీగా జరుగుతుంది. - ఇంకా సరిదిద్దవలసి ఉంది వంగలపూడి శివకృష్ణ.
గ్రామదేవతగా వెలసిన శ్రీ మరిడమ్మ ఆలయం
ఇక్కడ ఉన్న ఒక కర్రగద్దె అమ్మవారి ప్రతి రూపంగా దర్శనమిచ్చింది అని చెబుతుంటారు. ఇలా దర్శనమిచ్చే ఈ అమ్మవారిని గ్రామదేవతగా ఆరాధిస్తారు. ఈ అమ్మవారు గ్రామదేవతగా ఉంటూ ఇక్కడి భక్తులను కాపాడుతుందని వారి విశ్వాసం. మరి ఈ అమ్మవారు ఎవరు? ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం మండలంలో శ్రీ మరిడమ్మ అనే గ్రామదేవత ఆలయం ఉంది. అయితే 17 వ శతాబ్దం చివరలో పెద్దాపురంలోని మానోజి చెరువు సమీపంలో గ్రామదేవతగా శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలసినట్లు స్థానికుల ద్వారా తెలియుచున్నది.
ఆ కాలంలో ఇక్కడ ఉన్న చెరువు చుట్టూ పక్కల ప్రదేశం చిట్టడివిగా ఉండేది. ఒకసారి అడవి నుంచి పశువుల్ని తోలుకు వచ్చే కాపరులకు మనోజి చెరువు ప్రాంతంలో 16 ఏళ్ళ యువతి కనిపించి నేను చింతపల్లి వారి ఆడపడుచును. నేను ఈ ప్రదేశంలోనే ఉన్నానని మా వాళ్లకు చెప్పండి అని చెప్పి అంతరార్థమైనది. ఈ వింతను చూసిన పశువుల కాపరులు పరుగు పరుగున వెళ్లి చింతపల్లి వారికీ తెలియచేసారు.
ఆ కుటుంబ సభ్యులు మానోజి చెరువు ప్రాంతంలో గాలించగా వారికీ పసుపు పూసిన ఒక కర్రగద్దె అమ్మవారి ప్రతి రూపంగా దర్శనమిచ్చింది. ఆ గద్దెని అక్కడే ప్రతిష్టించి తాటాకు పాక వేసి ఆనాటి నుండి నిత్య దీపధూప, నైవేద్యాలు చెల్లించి ఆరాధించటం ప్రారంభించారు.
అయితే కలరా లాంటి భయంకర వ్యాధుల నుండి ఆ గ్రామప్రజలను రక్షించు అమ్మవారుగా ఎన్నో నిదర్శనములు చూపించింది. ఇక పిలిస్తే పలికే తల్లిలాంటి ఈ అమ్మవారిని చుట్టూ పక్కల గ్రామాలవారు కూడా ఆరాధించటం ప్రారంభించారు. ఇంకా మహమ్మారి కలరా జాడ్యం నుండి రక్షించు దేవతగా మానోజి చెరువు గట్టున వెలసిన అమ్మవారు కాబట్టి ఈ తల్లిని మారెమ్మ అని కూడా పిలిచేవారు. ఆ తల్లే మరిడమ్మగా ప్రఖ్యాతి గాంచింది.
ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో నెల రోజులపాటు ఈ మరిడమ్మ అమ్మవారి జాతర ఎంతో వైభవముగా జరుగుతుంది. ఈ సమయంలో దూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శిస్తారు.
పెద్దాపురం
కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా పేరొందిన పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఏటా 37 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.
చింతపల్లి వారి ఆడపడుచుగా
మరిడమ్మ అమ్మవారు సామర్లకోట చింతపల్లి వారి ఆడపడుచు. ఇప్పటికీ ఆ వారుసులే ఇక్కడ ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. వారి కుల దేవతగా పెద్దాపురం పట్టణంలో వెలసి స్థానిక ప్రజలనే కాకుండా యావత్ ఆంధ్రావనిని సంరక్షిస్తున్న వరదేవతగా ప్రఖ్యాతి గాంచింది. ఏటా ఆషాఢమాసంలో 37 రోజుల పాటు జాతరను జరపడం ఆనవాయితీగా వస్తోంది.
వారానికో వీధి సంబంరం
గ్రామ దేవతగా ఆరాధించే పెద్దాపురం పట్టణంలో ఆయా వీధుల వారు అమ్మవారి సంబరాలను నిర్వహించడం ఆనవాయితీ. రూ.లక్షలు వెచ్చించి అమ్మవారి సంబంరం నిర్వహిస్తుంటారు. ఆ వీధిలో ఆరంభమయ్యే సంబరంలో మరిడమ్మ అమ్మవారిని ఊరేగిస్తూ పలు దేవతామూర్తుల వేషధారణలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రధానంగా చాపలవీధి, కుమ్మరవీధి, పాశిలివీ«ధి, కొత్తపేట, రామారావుపేట, బంగారమ్మ గుడివీధి తదితర వీధుల్లో అమ్మవారి సంబరాలు నిర్వహిస్తారు.
ఆషాఢంలో నూతన దంపతులు రాక
వివాహమైన నూతన దంపతులు పెద్దాపురం అమ్మవారిని దర్శి«ంచుకుంటారు. ఆషాఢమాసమంతా ఇక్కడే తీరునాళ్లు జరుపుతుంటడడంతో సతీమణి, మరదళ్లు, బావమరుదులతో ఇక్కడకు వచ్చి తీర్థంలో సరదాగా గడుపుతుంటారు.
నేడు జాగరణ
ఏటా ఆషాఢమాసం ఆరంభంలో నిర్వహించే మరిడమ్మ అమ్మవారి జాగరణ మహోత్సవం నేటి రాత్రి ప్రారంభం కానుంది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు ఆలయ ట్రస్టీ చింతపల్లి బ్రహ్మాజీ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.పుష్పనాథం, ధర్మకర్తల ఆధ్వర్యంలో ప్రారంభయ్యే జాతరను రాష్ట్ర హోంశాఖా మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజులు ప్రారంభిస్తారు.
ఆలయాన్ని దేవాదాయ శాఖాధికారు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. రాత్రికి అమ్మవారి ఊరేగింపుతో పాటు వేకువ జామువరకు గరగల నృత్యం, భారీ మందుగుండు సామగ్రి పేలుడు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని అసిస్టెంట్ కమిషనర్ పుష్పనాథం విజ్ఞప్తి చేశారు.
By Air
The nearest airport is Rajahmundry Airport 37 km away.
By Rail
The nearest railway station is 5 km away Samalkot Junction.
Temple Address
Maridamma Temple,
Saravari St, Peddapuram, East Godavari,
Andhra Pradesh, Pincode – 533437.
Temple Timings
Morning : 5am to 12pm
evening : 4pm to 8pm
Comments
Post a Comment