అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ చరిత్ర | Annavaram satyanarayana swamy temple history in telugu | bhakthi margam | భక్తి మార్గం | Annavaram Prasadam

అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ చరిత్ర

స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం. ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి జపం  ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. 

భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపస్సు చేసి  మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామిగా వెలసి రత్నగిరి, లేదా రత్నాచలం కొండగా మారుతాడు.

గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామరాయణం వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు.

 ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు. మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి.

 వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891లో ప్రతిష్టించారు.

సత్యనారాయణ స్వామి వ్రతం గురించి

హిందువులు శ్రీ సత్యనారాయణ వ్రతం భారతదేశం అంతటా భక్తులందరు సంపద, విద్య, శ్రేయస్సు కోసం, ఆరోగ్య సమస్యలు మరియు వ్యాపారంలో విజయం సాధించడం కోసం ఈ వ్రతంను చేస్తారు. శ్రీ సత్యనారాయణ స్వామి త్రిమూర్తుల రూపంలో(బ్రహ్మ, విష్ణు, శివ ) అన్నవరం వద్ద రత్నగిరి కొండల మీద ఉన్నారు. ఈ క్షేత్రాన్ని మరియు స్వామి వారిని దర్శించుకోవడానికి యాత్రికులు వందల మరియు వేల సంఖ్యలో వస్తున్నారు. సగటు హాజరు రోజుకు ఇప్పుడు ఐదు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఏకాదశి మాసం వ్రతములకి చాలా పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది, వ్యక్తిగతంగా భక్తులు కూడా ఇతర సౌకర్యవంతంగా ఉన్న రోజుల్లో వచ్చి వ్రతాలు నిర్వహించుకుంటారు.

ఈ వ్రతం యొక్క ప్రత్యేకత తెలియజేస్తూ ముఖ్యమైన పురాణం ఉంది. నారద మహర్షి మర్థ్యాస్ (ఈ ప్రపంచంలోని పురుషులు) కష్టాలతో ఉండడాన్నిసహించలేక విష్ణుమూర్తిని ప్రార్ధించాడు అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యేక్షమై కష్టాల్లో ఉన్నవారు శ్రీ సత్యనారాయణ స్వామికి వ్రతం చెయ్యడం వల్ల పురుషుల సమస్యలు తొలగి మరియు మరణానంతరం ప్రాపంచిక శ్రేయస్సు మరియు సార్ధకత పొందుతారు అని చెప్పాడు.

వ్రతం ఎలా చెయ్యాలో కూడా వివరించాడు. ఆరాధనాభావం కలిగిన మొదటి బ్రాహ్మనుడు వ్రతం నిర్వర్తించిన ఇది కూడా భద్రశీలానగరం చక్రవర్తి తుంగధ్వజ, మరియు అతని రాజ్యంలో గొల్ల కులానికి రాజు ఉల్కాముఖ, సాధువు అనే వైశ్య వ్యాపార మనిషి శ్రీ సత్యనారాయణస్వామి (విష్ణువే) ద్వారా తేగలిగారు వర్ణించబడింది.

ఒక విద్యావంతుడైన మరియు ఆరాధనాభావం కలిగిన బ్రాహ్మనుడు ఆహారం కోసం మరియు జీవనోపాధి కోసం సంచారిగా తిరుగుతుండగా విష్ణువు తన పైన జాలి కలిగి ఒక బ్రాహ్మణ మారువేషంలో అతనికి దర్శనమిచ్చి విష్ణువు అవతారం అయిన శ్రీ సత్యనారాయణస్వామి యొక్క వ్రతం చేయమని అది ఎలా చేయాలో కూడా అతనికి సలహా ఇచ్చాడు. అతను వ్రతం కోసం కావాల్సిన డబ్బు కోసం భిక్షాటన చేసి బ్రాహ్మణుడు చెప్పిన విధముగా వ్రతం చేసాడు.చేసిన పిదప అతనికి కష్టాలు తొలిగి సంతోషంగా కుటుంబంతో జీవనం కొనసాగింది.

ఒకరోజు ఆ బాహ్మణుడు వ్రతం చేస్తుండగా ఒక చెట్లు నరికే అతను దప్పిక కోసం బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడు అతను వ్రతాన్ని గమనించి దాని గురించి తెలుసుకొని అతను కూడా సత్యనారాయణ వ్రతం చేసాడు అతనికి కూడా కష్టాలు తొలగిపోయి సుఖంగా బ్రతికాడు ఇలా సత్యనారాయణ వ్రతం అందరూ చేయడం ఆరంభించారు.

సత్యనారాణ స్వామి వ్రతానికి సంబంధించి స్కందపురాణం ప్రకారం మరో కథ ప్రచారంలో ఉన్నది, ఒక ఉన్నతమైన వైశ్య దంపతులైన సాధువు మరియు లీలావతి సత్యనారాణ స్వామి వ్రతం చేస్తాము అని మనసులో అనుకోని ప్రార్ధించగా వారికి కళావతి అనే బాలిక జన్మించెను, మరియు ఆమెను గొప్ప ఉత్సాహవంతుడైన యువకునికి ఇచ్చి వివాహం జరిపించెను. సాధువు మరియు అతని అల్లుడు కలిసి వ్యాపారం చేయసాగెను మరియు సత్యనారాయణస్వామి వారి ఆశీస్సులతో బాగా దనం ఆర్జించెను, కానీ వారు సత్యనారాయణస్వామి వ్రతం చేయడం మరిచెను.

వ్యాపారం చేసి మరింత ఆర్జించుటకు వారు సముద్రపు ఒడ్డున ఉన్న రత్నసాణపురం వెళ్లెను, కానీ వారు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం వ్రతం చేయకపోవడం వలన స్వామి వారి ఆశిస్సులు లభించక నష్టాలు వచ్చెను. మరియు ఒక రాత్రి స్థానిక రాజు యొక్క ఖజానా దొంగిలించబడింది, నిర్దోషులైన వీరిని దోషులుగా పరిగణించి కారాగారంలో బంధించెను.

అందువలన తల్లి కూతుళ్లు ఇరువురు సమస్తం కోల్పోయి పేదరికాన్ని అనుభవిస్తూ తిండి కోసం ఇంటి ఇంటికి తిరుగుతూ బిక్షాటన చేయసాగెను, ఆలా బిక్షాటన చేస్తుండగా కళావతికి ఒక బ్రహ్మణ ఇంటి దగ్గర స్వామి వారి వ్రతంలో పాల్గొని ప్రసాదం పొందెను, ఇంటికి వెళ్లిన వెంటనే ఆమె తన తల్లికి ఈ విషయం చెప్పగా ఇలా వ్రతం చేయకపోవడం వలనే తమకు అన్ని కష్టాలు వచ్చెను అని గ్రహించి ఆలస్యం చేయకుండా వ్రతం చేసెను, దానివలన స్వామి వారి ఆశిస్సులు తిరిగి ఆనందంగా జీవించసాగిరి.

ఆ వ్రత ఫలితంగా, సాధువు మరియు అతని అల్లుణ్ణి నిర్దోషులుగా భావించి విడుదల చేయడమే కాకుండా స్వామి వారి ఆజ్ఞ మేరకు వారికి నజరానా ఇచ్చెను, అప్పుడు వారు స్వామి వారి వ్రతం చేసి, స్వచ్చంద సంస్థలకు విరాళాలు ఇచ్చి తమ స్వస్థలానికి పడవలో బయలుదేరెను. అప్పుడు పడవలో సత్యనారాయణస్వామి ఒక సన్యాసి వేషంలో వచ్చి ఇందులో ఏముంది అని అడగగా సన్యాసి రూపంలోని స్వామి వారిని గ్రహించక అతన్ని ఎగతాళి చేస్తూ చెత్త ఉంది అని చెప్పెను, అప్పుడు స్వామి వారి చెత్తనే ఉంది అనగా అందులోని సంపద అంత వ్యర్ధంగా మారెను. ఇది గమనించిన అల్లుడు సాధువుకి వివరించగా సాధువు కన్నీళ్లతో స్వామి వారిని శరణు వేడుకొనెను.

మరొకసారి అతను వ్రతం ఆచరించడంలో విఫలమయ్యెను అని సన్యాసి చెప్పగా, సన్యాసి వేషంలో ఉన్నది స్వామి వారు అని గ్రహించి సాధువు ప్రార్ధించెను, అప్పుడు వారు తమ సంపద అంత తిరిగి పొంది ఒడ్డుకు చేరుకొనెను, అక్కడ నుండి తన భార్యకి తాను వస్తున్నట్టు వర్తమానం పంపెను, అది తెలుసుకున్న లీలావతి ఆనందంతో భర్తని తీసుకు రావడానికై స్వామి వారి వ్రతం త్వరగా పూర్తి చేయమని తన కుమార్తెకు పురమాయించేను, ఆ తొందరలో వ్రత ప్రసాదం స్వీకరించడం మరిచెను, దాని పరిణామంగా వారి సంపద మరియు అల్లుడు కూడా ఆ పడవతో పాటు సముద్రంలో మునిగిపోయెను.

సాధువు తన కుమార్తె సతీ సహగమనానికి సిద్దమౌతుండగా చాలా బాధపడెను, వెంటనే తన తప్పిదం గ్రహించి స్వామి వారు ఒక్కరే తనను ఆదుకోగలరు అని తెలుసుకొని ప్రార్ధించడం మొదలు పెట్టెను.తన భర్తను చేరుకొనే తొందరలో వ్రత ప్రసాదం తీసుకోకుండా వెళ్లడమే ఈ విపత్తుకి కారణం అని వివరించెను, వెంటనే కళావతి ఇంటికి చేరుకొని ప్రసాదం స్వీకరించి వచ్చెను ...దాని వలన తన భర్త సురక్షితంగా ఒడ్డుకు చేరుకొనెను.

 అప్పుడు కళావతి తన భర్తకి స్వామి వారి గురించి మొత్తం వివరించగా, అతను కూడా స్వామి వారికి ముగ్ధుడై స్వామి వారిని ప్రార్ధించసాగెను, మరియు స్వామి వారి ఆశీర్వాదంతో అతను రత్నగిరికి అనే పర్వతంగా మారెను, స్వామి వారు అక్కడే శాశ్వతంగా నివాసం ఏర్పరచుకొనెను. తన భర్త పొందిన మోక్షానికి పారవశ్యంలో మునిగి కళావతి కూడా పంపా నదిగా మారి ఆ పర్వతం పక్కన ప్రవహించసాగెను.

Related Postings:
1.Dharmasandehalu
2.Lord Vishnu Temples
3.Lord Shiva Temples
4. Stotras In Telugu
5.Mysteries Temple

tags: annavaram prasadam,annavaram room booking online,prakash sadan annavaram room booking online,annavaram devasthanam online booking,annavaram temple details,Annavaram Temple History, Timings & Accommodation, annavaram temple sevas online booking,annavaram temple official website,annavaram temple distance, annavaram devasthanam rooms, annavaram temple timings tomorrow, annavaram temple timings vratham ticket price, annavaram temple kalyanam timings,kakinada disct, east godavari, ap famous temples

Comments