శ్రీకాళహస్తి ఆలయం 🔥 వాయు లింగం రహస్యాలు 😱 | Srikalahasthi Sri Kalahastheeswara Swamy Temple History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం


శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయం

ఆలయం గురించి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయం భారతదేశంలో అత్యంత పురాతన మరియు చారిత్రక శైవ ఆలయాలలో ఒకటి. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు  వాయులింగ రూపునిగా  పూజలు అందుకుంటున్నాడు.దక్షిణ కైలాసము గా పిలవబడే ఏకైక పుణ్య క్షేత్రం. 
పార్వతి దేవి ఇక్కడ జ్ఞానప్రసూనాంభికగా పూజలు అందుకుంటుంది. శ్రీకాళహస్తి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నందలి చిత్తూరు జిల్లా లో ఉంది. 

శ్రీ కాళహస్తీశ్వర ఆలయం పశ్చిమ ముఖంగా, కొండ పక్కన మరియు స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. కొన్ని చోట్ల ఆలయానికి గోడలాగా కొండ ఉంటుంది, అందువల్ల దేవాలయ ఆకృతి ప్రణాళికను అనుసరించలేదు. ఆలయానికి ఉత్తరాన దుర్గాంభికా కొండ, దక్షిణాన కన్నప్ప కొండ మరియు తూర్పున కుమారస్వామి కొండ ఉంది.రాహు-కేతు పూజ శ్రీకాళహస్తిలో చాలా ప్రసిద్ధి చెందింది. శ్రీ కాళహస్తి ఆలయం ఎల్లప్పుడూ రాహు-కేతు పూజలకు వచ్చిన భక్తులతో నిండిపోయి ఉంటుంది.

ఇక్కడ దేవతామూర్తి అయిన జ్ఞానప్రసూనాంబ సంపదకు (జ్ఞానాన్ని ప్రసాదించే లేదా జ్ఞాన దేవతగా) ప్రతీకగా నిలుస్తుంది.

తమిళ చోళులు మరియు విజయనగర రాజులు ఈ ఆలయానికి ఎన్నో నిర్మాణాలు చేశారు. ఈ ఆలయాన్ని, అది శంకరాచార్యుల సందర్శించి పూజలు చేసినట్టుగా చెప్పుకుంటారు. క్రీ.పూ 10 వ శతాబ్దంకి సంబందించిన చోళ శాసనాలు ఉన్నాయి. శ్రీ కాళహస్తి శతకం అనే తెలుగు పద్యంలో, ఈ ఆలయ వివిష్టతను వివరించారు, మరియు కర్నాటక సంగీత విద్వాంసుడు అయిన ముత్తుస్వామి దీక్షితార్ తన కృతి 'శ్రీ కాళహస్తీశ'లో ఈ ఆలయ గొప్పదనాన్ని పాడారు.

1516వ సంవత్సరంలో శ్రీ కృష్ణదేవరాయలు దేవాలయ ప్రవేశ మార్గాన్ని, ప్రవేశ మార్గానికి ఒక చిన్న కోటను(బురుజు) నిర్మించారు. దేవాలయ ప్రాకారానికి బయట కొద్దిగా భూమిలోపలకి (భూగర్భంలో) గణపతి ప్రతిమ ఉన్నది మరియు దేవాలయంలో శివపార్వతులు కొలువైయున్నారు. ప్రధాన తలుపు దగ్గర ప్రాచీనమైన గోపురం 36.5 మీటర్లు (120 అడుగులు) ఎత్తు కలదు మరియు దేవాలయం మొత్తం శిల్పాలు చెక్కారు.

మానవాళి అవతరించే ముందుగా, వాయు దేవుడు  కర్పూర లింగానికి వెయ్యి సంవత్సరాలకు పైగా తపస్సు చేసెను. అతని తపస్సుకి మెచ్చిన మహా శివుడు ప్రత్యక్షమై, " ఓ వాయు దేవా! విశ్వమంత ఉండే నీవు, ఎటు కదలకుండా ఇక్కడే ఉండి నాకోసం తపస్సు చేసావు కావున నేను నీ తపస్సుకి మెచ్చి మూడు వరాలు ప్రసాదిస్తున్న కోరుకొనుము" అని అన్నారు. అప్పుడు వాయు దేవుడు "స్వామి! నేను ఈ విశ్వమంత ఉండాలి అనుకుంటున్నా, ప్రతి జీవంలోనూ అంతర్లీనంగా పరమాత్మ కాకుండా ఇంకోలా ఉండాలి అనుకుంటున్నా మరియు నా తదనంతరం నిన్ను స్మురించే ఆ కర్పూర లింగానికి నామకరణం చేయాలనుకుంటున్న" అన్నారు.

సాంబశివుడు,"నీ కోరికలు మన్నించాను, నీవు విశ్వమంత ఉంటావు మరియు నీవు లేకుంటే జీవరాశి మనుగడ ఉండదు, నీ ద్వారా ఈ లింగం విశ్వమంత వ్యాపిస్తుంది మరియు సురులు, అసురులు, గరుడ, గంధర్వలు, కిన్నెరలు, కింపురుషులు, సిద్దులు, సాధులు, మనుషులు మరియు చరాచర జీవరాశి ఈ లింగాన్ని పూజిస్తారు" అని చెప్పి అదృశ్యం అయ్యెను. ఆ తర్వాత విశ్వమంతా ఈ లింగాన్ని ఆరాధిస్తున్నారు.అప్పటి నుండే ఈ కర్పూరలింగం వాయులింగముగా పీలవబడుతుంది. 

ఈ ఆలయ వైభవాన్ని చాటుటకు చాలా పురాణాలు ఉన్నాయి, అందులో ప్రధానమైనది మహా శివుని శాపగ్రస్తమై, పార్వతీదేవి దేవరూపం నుండి మానవరూపం ధరించడం. ఆ పాప పరిహారంకోసమై పార్వతీదేవి తప్పస్సు ఆచరించి తన దేవదేవుడు అయిన మహా శివుని మెప్పించి తన పూర్వరూపంకు వెయ్యి రెట్లు గొప్పదైన రూపాన్ని పొందెను .
శాపఫలంగా రాక్షషిగా మారిన ఘనకల, శ్రీకాళహస్తిలో 15 సంవత్సరాలు మహా దేవుణ్ణి ప్రార్ధించి, భైరవ మంత్రాన్ని పటించి తన పూర్వ రూపాన్ని పొందెను.

మయూర, చంద్ర మరియు దేవేంద్రలు కూడా ఇక్కడి స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి కాళహస్తిలో ప్రార్ధించడం ద్వారా తమ పాపాలను పోగొట్టుకున్నారు. శ్రీ కాళహస్తిలో మహాశివుడు భక్త మార్కండేయకి దర్శనమిచ్చి, గురువు ఒక్కరే ఎంత గొప్ప విద్యనైనా బోధించగలరు, కావున గురువు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరునితో సమానము అని ప్రభోదించెను.

ఆలయం చరిత్ర

క్రీ.శ. 2వ 3వ శతాబ్ధాలలో తమిళ దేశానికి చెందిన శైవ నయనార్లు అప్పర్ సుందర్, తిరుజ్ఞాన సంబందర్, మాణిక్య వాచకర్ మొదలైన వారు ఈ క్షేత్రాన్ని సందర్శించి దీని ప్రాముఖ్యన్ని గురించి భక్తితో గానం చేసియున్నారు. శ్రీ ఆదిశంకరచార్యులు ఈ క్షేత్ర సందర్శణాంతరం తన శివానంద లహరి లో భక్త కన్నప్ప ను ఉదహరించడమే గాక ఈ క్షేత్రం లో భువనేశ్వరి దేవి పీఠాన్ని స్పటిక లింగాన్ని ప్రతిష్టించారు. గిరిజన ప్రాంతంలో ఈ క్షేత్రం నిర్మింపబడి ఉండటం వలన క్రీ. శ. 5,6 శతాబ్దాల దాకా దీని పోషణ గూర్చి ఎవరూ తమ దృష్టిని కేంద్రీకరింపలేక పోయారు. కానీ దక్షిణ భారత దేశంలో పల్లవుల రాకతో అధ్బూతమైన శిల్ప కళాఉధ్యమం రాజకీయంగా, ప్రాంతీయంగా అభివృధి చెందింది. ఆ నాడు దేవాలయ నిర్మాణము త్వరగా పాడవకుండాఉండేందుకు కలప, రెల్లు, మట్టితో నిర్మింపబడేవి. భక్తి ఉధ్యమం ప్రారంభమయ్యే దాకా శ్రీకాళహస్తి క్షేత్రం స్థానికంగా పలుకుబడి కలిగియున్న ఆటవిక సాయకుల చే ఆదరింపబడుతూ ఉండేది.

శిల్పం ద్వారా శాలి శాసనాల ద్వారా లభ్యమైన ఆధారాలను బట్టి క్రీ.శ. 9 వ శతాబ్దంలో పల్లవ చోళ రాజులు ఈ క్షేత్రంలో దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. కుళోత్తుంగ చోళుడు ఈ దేవాలయ గోపురాన్ని నిర్మించినారు. ధూర్జటి రచించిన శ్రీ కాళహస్తి మహత్యము వలన వీర నరశింహ యాదవ రాయలు హైమ, గిరిజ గుహ భైరవ గుహ అనే గుదనాలను, గోపుర మంట పాదులను నాట్య మందిరాన్ని ఇటుకలతో నిర్మించినట్లు తరువాత క్రీ.శ.12 వ శతాబ్ధానికి వీర నరసింహ రాయలు గోపురాలు, ప్రాకారాలు నిర్మించి వుండటానికి చెప్పవచ్చు. 

దక్షిణ గోపురాన్ని 12వ శతాబ్ధం లో కులోత్తుంగ చోళుడు కట్టించారు. బిక్షాల గోపురం ను దేవదాసి బిచ్చాలు కట్టించిందని ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహ రాయలు కాలములో జరిగినట్లు చెప్పుదురు. పదహారు కాళ్ళ మండపం లోనే క్రీ.శ.1529 లో క్రీ.శే.కృష్ణదేవరాయల సోదరుడైన అచ్చుతరాయల పట్టాభిషేక మహోత్సవము జరిగినది. కీ.శే.16వ శతాబ్ధంలో శ్రీ కృష్ణ దేవరాయలు ఒక మండపాన్ని నిర్మింప చేశాడు. దానినే ‘రాయల మంటపం ‘ అంటారు. మరియు పెద్ద గాలి గోపురం నిర్మించినారు. గోల్కొండ రాజ్య మంత్రులైన అక్కన్న, మాదన్నలు తమ పేర్లతో ఇక్కడ శివలింగాలు ప్రతిష్టించారు.

ఈ దేవాలయ నిర్మాణ విస్తరణ కేవలం ఉత్తర, దక్షిణ,పశ్చిమ దిశల వైపు మాత్రమే సాగినది. కానీ పర్వతము అడ్డుగా వుండడము వల్ల తూర్పు వైపునకు సాగలేదు. పడమటి దిశ వైపు చూపు గలిగిన గర్భగుడి ఎటువంటి అలంకారాలు లేకుండా పల్లవుల నాటి శైలి పోలివుంది. దీనివల్ల ఈ దేవాలయము పల్లవుల కాలమునాటిదని తెలుస్తుంది. ఈశ్వరునిగర్భగుడికి ఈశాన్య దిక్కున నాలుగు మీటర్ల దూరములో అమ్మవారి గర్భగుడి నిర్మింపబడి వున్నది. ఈ సన్నిదిలో నెలకొన్న దేవిని జ్ఞానప్రసూనాంబ అని పిలుస్తారు. 

ఈశ్వరుని సన్నిది శిల్ప కళ వెలుపలి భాగం కనిపించే అద్భుత చిత్రములైన కూట పంజర శాల వరుసలు, తామరపు మొగ్గల చిత్రములు, స్థంబాల, మీద గల అందమైన రంగు వల్లులు పాండ్య, విజయ నగర రాజుల నాటివని తెలుపుతున్నాయి. కీ.శ. 18వ శతాబ్ధంలో తమిళనాడుకు చెందిన నాటుకోటి శెట్టియార్ లోపలి ప్రాకారంలో గల శివాలయం, దేవి ఆలయాలకు, మంటపాలకు నాలుగు వైపుల వసారాలు కట్టించి వాటి కొక రూపాన్ని ఏర్పరచినారు.

ప్రాశస్త్యము

శివానందైక నిలయము (కైలాస పర్వతము)

శివానందైక నిలయము అనే పర్వతము ఈ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రము నందు కలదు. ఈ శివానందైక నిలయము కైలాస పర్వతము గల పంచశిఖరములలో ప్రశిద్ధమనే శిఖరము. బ్రహ్మదేవుడు సృష్టికార్యము చేయు శక్తిని కోరి శివుని ప్రార్ధించగ బ్రహ్మదేవునికి శివుడు ఈ శిఖరం నీవు ఓర్వలేని బరువుతో భూమి మీద ఎక్కడ జారవిడిచెదవో అదియే దక్షిణ కైలాసము గా ప్రసిద్ధి పొందును. ఆ క్షేత్రమున నీవు తపమాచరించిన, స్వర్ణాభిష్టములు పొందగలవని పరమశివుడు బ్రహ్మదేవునకు వరమొసంగెను. ఆనాడు బ్రహ్మ దేవునకు పరమశివుడు అనుగ్రహించిన పర్వత శిఖరమే నేడు శ్రీకాళహస్తీలోని శివానందైక (కైలాస పర్వతము ) నిలయముగా కొలువుధీరియున్నది. ఇందుకు చిహ్నంగానే ఈ యొక్క క్షేత్రము నందు బ్రహ్మదేవుని ఆలయము కూడా కలదు.

ప్రస్తుతము దక్షిణ కైలాసములోని శివానందైక నిలయ పర్వత శిఖరమునే కన్నప్ప కొండగా పిలువబడుచున్నారు. కావున ఈ క్షేత్రమును సిద్ధ క్షేత్రమని ప్రసిద్ధి పొందినది.
ప్రపంచ ముదయించిన మొదటి రోజుల్లో వాయు దేవుడు   భక్తి శ్రద్దలతో కర్పూర లింగ రూపములో ఉన్న  శ్రీకాళహస్తీశ్వరుని  పూజించి అనేక వేల సంవత్సరములు తపస్సు చేశాడని తెలియచున్నది. ఆయన తపస్సు కు సాక్షాత్కరించిన పరమేశ్వరుడు ‘వాయుదేవా ‘ నీవు చలనం గలవాడవయ్యును చలనం లేని భక్తితో నన్నింత కాలం ధ్యానించి చేసిన తపస్సుకు ఆనందించాను. భక్తుడవు కనుక నీకు కావలసిన వరాలు ఇవ్వడానికి వచ్చాను. నీకు కావలసిన వరాలు ఏమిటో కోరుకో యిస్తా అన్నాడు.

అందుకు వాయు దేవుడు ‘స్వామి’ నేని ప్రపంచము నందు లేని తావంటూ లేకుండగను, పరమాత్మ చందంబున ప్రతి జీవి యందు నేను ప్రధానమై యుండు లాగునను, నీ ప్రతిరూపమైన ఈ కర్పూర లింగము నా పేరు పిలువబడునట్లు నాకు వరములను ప్రసాదింపు ‘అని దోసిలి పట్టాడు. సాంబ శివుడు సంతోషించి ‘ఓయీ ! నీవు అభిలషించిన ఈ మూడు వరములను కోరదగినవే. నీ అభిమతము ననుసరించి నీవీ ప్రపంచమంతటను వ్యాపించి వుండువు. నీవు లేక జీవరాశి బ్రతుక జాలదు. నా యీ లింగము ఇక మీద నీ పేరున వాయు లింగమని ప్రఖ్యాతి గాంచి సమస్త సుర అసుర గరుడ గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధి సాధ్వి నరముని వరుల చేతను పూజాలందుకొని నని’ వరములిచ్చి అదృశ్య మయ్యెను. నాటి నుండి ఈ క్షేత్ర మందలి కర్పూర లింగం వాయు లింగమను పేరున సమస్త లోకాల వారిచే పూజ లందుకోoటుంది.

శ్రీ జ్ఞానప్రసూనాంబ :

దక్షయజ్ణ సమయమున ద్రాక్షాయణి దేవి యాగాగ్ని యందు దగ్దమైన పిదప మరల హిమవంతుని పుత్రికగ గౌరీ దేవి గా జన్మించి, పరమశివుని కళ్యాణమాడ పూనెను. అందులకు గాను పరమేశ్వరుడు ఈ యొక్క శక్తిని నీవు తిరిగి పరిపూర్ణముగా పొందిన గాని వివాహమాడుటకు వీలుపడదని చేప్పెను. అందులకు పరమేశ్వరి తక్షణ కర్తవ్యము ఏమని పరమేశ్వరుని కోరగ అప్పుడు పరమేశ్వరుడు పరమేశ్వరికి (పంచాక్షరి) మంత్రోపదేశము ఉపదేశించెను. 

తదుపరి పరమేశ్వరి ఈ యొక్క క్షేత్రమునందు తన స్వహస్తము తో శ్రీచక్ర స్థాపన కావించుకొని అనుష్టించి తన శక్తిని తాను తిరిగి పొంది పరమేశ్వరుని కళ్యాణముచేసుకొని శ్రీచక్ర బిందు స్థాపనమున నిలచి తాను సాధించిన జ్ఞాన శక్తిని సమస్త జీవరాసులకు పంచి పెడుతూ వున్నది. కావున ఈ క్షేత్రము యందు జ్ఞానప్రసూనాంబికగ వ్యవహరించి పూజాలందుకొనబడుచున్నది. తనచే మంత్రోపదేశము పొందినటువంటి భరద్వాజ మహాముని (మహర్షి) మొదలు ఇప్పటి వరకు భరద్వాజ వంశీకులే ఈ క్షేత్రము యందు షడ్ కాల పూజలు నిర్వహించడం జరుగుచున్నది.

సువర్ణముఖి నది : - ( దివ్య గంగా)

అగస్త్య మహా ముని తన శిష్య గణంబుతో దక్షిణ దిగ్భాగమునకు వచ్చి తపము చేయుచుండెను. అప్పుడు వారికి నీరు లభింపకుండుటచే బ్రహ్మను గూర్చి ఘోర తపమాచరిoచెను. బ్రహ్మ ప్రత్యక్షమై తపమునకు మెచ్చి వర ప్రసాదముగా ముని కోరిన విధముగా ఆకాశ గంగను నియోగించెను. గంగా దేవి సువర్ణముఖరీ స్రవంతి రూపమును అగస్త్య పర్వతములో అవతరించి శ్రీకాళహస్తి మీదుగా ఉత్తర వాహినియై తూర్పు సముద్రమున కలియుచున్నది. ఈనాడు నదిలో అనేక తీర్ధ రాజములు విలసితములై దక్షిణ కైలాసమునానుకొని ప్రవహించు చున్నది. 

సువర్ణముఖి ఈ క్షేత్రము న ఉత్తర వాహిని గా ప్రవహించుచున్నది. ఇది గంగా నదికి సమానమైనదిగా పురాణ ప్రసిద్ధినొంది యున్నది. గంగాధి నదులకు పన్నెండు సంవత్సరములకు ఒకమారు మాత్రమే పుష్కరములు వచ్చును. కానీ ఈ దక్షిణకైలాస క్షేత్రములోని సువర్ణముఖి నదికి మాఘమాసమున మఖా నక్షత్రముతో కూడిన పౌర్ణమి రోజున విశేషముగా పుష్కరము జరుగుచున్నది.

కృత యుగంలో చెలిదీవుర్వు(సాలి పురుగు) తన శరీరము నుండి వచ్చు సన్నని దారముతో కొండపై నున్న శివుడునకు గుళ్ళు గోపురములు, ప్రాకారములు కట్టి శివుని పూజించు చుండెను. గాలి విచినప్పుడేల్లా తెగిపోయిన దారములను మరల అంటించుచు ఏమరపాటు లేక శివ సేవ చేయు చుండెను. ఒక నాడు శివుడు పరీక్ష చేయదలచి అక్కడ మండుచున్న దీపములో తగిలి సాలీడు కట్టిన గుడి, గోపురములు తగలబడ పోవుచున్నట్లు చెసేను. ఇది చూసి సాలీడు దీపమును మ్రింగుటకు పోగా శివుడు ప్రత్యక్షమై దని భక్తికి మెచ్చి వరము కోరుకొనుమనెను. అప్పుడు సాలీడు మరల తనకు జన్మ లేకుండా చేయమని కోరుకొనేను. అందుకు శివుడు సమ్మతించి సాలీడు తనలో ఐక్యమై పోవునట్లు చేసెను. ఈ విధముగా సాలీడు శివసాయిజ్యము పొంది తరించినది.

త్రేతా యుగములో ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతి దినము శివలింగమునకు పూజ చేసి పోవుచుండెను. త్రేతా యుగము ముగిసి ద్వాపర యుగము వచ్చినది. అప్పుడు ఏనుగు శివ లింగమును సేవింప జొచ్చును. అది స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు, పుష్పములు, బిల్వ దళములు తెచ్చి పాము తెచ్చిన మణులను త్రోసివేసి తాను తెచ్చిన నీటితో అభిషేకించి పుష్పములను అలంకరించి పూజించి వెడలి పోవుచుండెను.

మరునాడు ఉదయం పాము వచ్చి చూచి తాను పెట్టి వెళ్ళిన మణులను గాక వానికి బదులు బిల్వములు, పుష్పములు పెట్టియుండుట గాంచెను. అది అప్పుడు త్రోసి వేసి,తాను తెచ్చిన మణులను పెట్టి పూజించి వెళ్ళేను. తరువాత ఏనుగు వచ్చి యధా ప్రకారము తన పూజ గావించుకొని వెళ్ళేను. ఇట్లు కొంత కాలము తమ తమ ఇష్టాను సారముగా పూజ చేసి ఈశ్వరుని సేవించుచు వచ్చినవి. తాను అర్పించిన మణులను ఎవరో ఉద్దేశ్య పూర్వకముగా తీసివేయుచున్నారని సందేహించిన పాము ఒక చాటున ఉండి గమనించ సాగెను, యధావిధిగా ఏనుగు వచ్చి మణులను తోసివేసి తన వెంట తెచ్చిన పుష్పములను ఉంచగా పాము ఆగ్రహించి ఏనుగు ను సంహరించే నెపముతో దాని తొండములోనికి దూరి బాధించసాగెను. 

బాధను తట్టుకోలేక ఏనుగు ఒక బండరాయికి తన తలను పదే పదే మోదగా ఏనుగు తొండములోని పాము మరియు ఏనుగు మరణించి శివసాయుజ్యము పొందెను. ఈ స్మృతి చిహ్నముగా కాళము పంచముఖి ఫణాకారముగా, శిరో పరిభాగమునకు ఏనుగు సూచకముగా రెండు దంతములను, సాలెపురుగు అడుగు భాగములోను, తన లింగాకృతిలో ఐక్యమొసరించుకొని శివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా ఇచ్చట దర్శనము ఇచ్చుచున్నాడు. ఆనాటి నుండి ఈ కేత్రమును శ్రీకాళహస్తి అని పేరు వచ్చినది

భక్త కన్నప్ప :

అర్జునుడు పరమేశ్వర సాయిజ్యము పొందుటకు తిన్నడుగా కలి యుగమున జన్మించెను. పొత్తి పినాడు అని తెలుగు దేశంలోగల ప్రాంతమునందు ఉడుమూరు పల్లె కలదు. అందు నాధనాధుడు తండే అని బోయ దంపతులకు శివాను గ్రహముతో ఒక మగ శిశువు జన్మించెను. ఆ బాలునకు తిన్నడు అని పేరు పెట్టిరి. అతడు విలు విద్యలో దిట్ట అయ్యెను. ఒకనాడు అతడు వేటాడి అలిపి పోయి చెట్లు క్రింద నిద్రించు చుండుతరి శివుడు సాక్షాత్కారించి ఇట్లనేను. ఇక్కడి కొండ దగ్గర మొగలేటి యొడ్డున శివుడున్నాడు. 

పోయి అతనిని కొలువుము. వెంటనే మేల్కోంచి చూడా ఒక అడవి పంది కనిపించెను. దానిని వెంటాడుతూ వెంట పడగ అది శివుడు ఉన్న చోటికే వానిని తెచ్చును. అప్పుడు తిన్నడు అచ్చటనే శివుని సాన్నిధ్యమున నిలిచిపోయి తన్మయుడై శివుని పరిపరి విధముల తన నివాస గృహమునకు రమ్మని ప్రార్ధించెను. కాని తన వేడుకోలు ఫలించక పోగా అతడు ఇచ్చటనే శివుని వద్ద నిలిచిపోయెను.ప్రతి దినము అరణ్యమునకు వెళ్ళి పందిని వేటాడి చంపి, కాల్చి మాంస కండముల రుచి చూచి పక్వమైన వాటిని యేరి ఆకు దొప్పల యందుంచుకొని ఫల,పుష్ప బిల్వ దళములను శిరస్సు పై మోపి చంక యందు వింటివి, విపున నమ్ముల పొదియు, పుక్కిట సువర్ణముఖి నది తీర్ధమును కొని తన ఆరాధ దైవమునకు అందించెను. 

నోటితో తెచ్చిన గంగతో శివునికి అభిషేకించి, ఆకు దిప్పలతో తెచ్చిన మాంస శకలంబులను మహా నైవేద్యము గా నిడి శివుడు ప్రీతి చెందగా తిన్నడు ఆనందించెను'
ఆ సమయమున శివ గోచరడును సదాచార సంపన్నుడైన నొక బ్రాహ్మణుడు కూడ వచ్చి స్వామిని ప్రతి దినము అర్చించి పోవు చుండెను. చాలా కాలము నుండి పూజించుచున్న ఆ బ్రహ్మనునికి కొత్తగా చేయుచుండిన తిన్నని పూజలు ఎంగిలి మంగలముగా కనపడెను. దానికి అతను విచారించి,’ స్వామి మీ ఆలయం ఇటీవల కొన్ని దినములుగా నిరీతిగా మారుటకు కరణమేమని ‘ ప్రార్ధించి తెలపకున్న ప్రాణములు విడుతునని శపదంబు చేసెను. 

అప్పుడు స్వామి వాక్కుగా ఇట్లు వినబడెను. ఒక చెంచు నన్నిట్లు పూజ చేయుచున్నాడు. అతడు గొప్ప భక్తుడు, వాని భక్తికి ఎంత మహిమ కలదో నీవు కూడ చూతువు గాక యని అతనిని తన వెనుక దాగి యుండి అంతయు గాంచమనెను.కొంత సేపటికి వాడుక మేరకు తిన్నడు యధా ప్రకారముగా వచ్చి స్వామికి అభిషేకమాచరించి తెచ్చిన మాంసపు ముక్కలు తినమనేను. కానీ స్వామి తినలేదు. ఇంతలో స్వామికి ఒక కన్ను వెంట నీరు కారునారంభించేను. క్రమముగా అది అధిక మయ్యెను. తీన్నడది గాంచి స్వామి కంటి జబ్బు వచ్చినదని చాలా భాధపడెను. గుడ్డను చుట్టగా చుట్టి నోటి ఆవిరి పట్టి కంటికి అద్దినాడు. తంగేడాకు మెత్తినాడు.

నిమ్మరసముతో నూరి పోసినాడు. కలువ పువ్వు తెచ్చి కంటి రుద్దినాడు. అడవి అంతయు తిరిగి వెదకి వెదకి ఎన్నో మందులు తెచ్చి వేసినాడు. లాభము లేక పోయేను. ఇంతలో కంటి నుండి రక్తం కూడా కారనారంభించేను. చివరకు కంటికి కన్నె మందు అనుకోని బాణముతో తన కంటి నొకదానిని పెకిలించి స్వామి కంటిపై నంటి పెట్టినాడు. దానితో స్వామి కన్ను నెమ్మిదించేను. కానీ విను వెంటనే రెండవ కన్ను నుండి కూడా రక్తము కారనారంభించేను. తిన్నడు నవ్వి ‘ఓ స్వామి ని దయ చేత కంటి మందున్నది’ అని కాలితో నెత్తురు కారుచున్న స్వామి వారి రెండవ కంటిని గుర్తుకై అదిమి పట్టి తన రెండవ కంటిని పెకలించ పోయేను. వెంటనే శివుడు తిన్నని భక్తికి పారవశ్యమునకు మెచ్చి సతీ సమేతుడై ప్రత్యక్షమై తిన్ననుకి, ఆ బ్రాహ్మణునికి శివ సాయుజ్యము నొసగెను. ఆనాటి నుండి శివునికి కన్నిచ్చి సార్థకముగా కన్నప్ప అను పేరు వడసి లోకులకు భక్తి మార్గ ప్రదీపకుడను శ్రీకాళహస్తి క్షేత్రములో భక్తి శిరోధార్యమై వెలుగొందుచున్నాడు.

దేవతా మూర్తులు

Sri Kalahastheeswara Swamy

మహా శివుని ధృడమైన భక్తుల పేర్ల వలన "శ్రీ కాళహస్తి" అని పిలుస్తున్నారు, అవి సాలీడు (శ్రీ), సర్పం (కాల) మరియు ఏనుగు (హస్తి). వారి అపారమైన భక్తికి మెచ్చిన శివుడు వాటిని వాయు లింగంలో విలీనం చేసి శ్రీ కాళహస్తీశ్వరుడిగా మారెను.

ఏనుగు ప్రతిరోజు తొండంతో నదిలో నుండి నీరు తీసుకువచ్చి శివలింగం శుభ్రం చేసి లింగం పైన బిల్వ ఆకులు ఉంచి పూజించేది.

సాలీడు శివలింగం కోసం గూడు నిర్మించి రక్షణ కల్పిస్తుండేది.

పాము (కాల) విలువైన రత్నాలతో శివలింగాన్ని అలంకరించేది. ఈ విధంగా, వారు అన్ని వేరువేరుగా ఇతరులకు తెలియకుండా వాయు లింగాన్ని పూజించేవారు.

ఒక రోజు, సాలీడు ధూళి మరియు వాతావరణం నుంచి రక్షించడానికి వాయు లింగం చుట్టూ చాలా మందపాటి గూడును అల్లెను, పాము విలువైన రత్నాలతో శివలింగాన్ని అలంకరించి ఉండగా, ఈ విషయం తెలియని ఏనుగు,ఇదంతా ఎవరో తన పూజని నచ్చక ఇలా చేస్తున్నారు అనుకోని తొండంలోని నీటితో లింగాన్ని శుభ్రపరుస్తుంది.

ఇలా చేయడం గమనించిన పాము ఏనుగును చంపడానికి తొండంలోనికి ప్రవేశించగా, మదమెక్కిన ఏనుగు తలను, తొండను శివలింగానికి బలంగా గుద్దుకుంది. అయితే ఈ ప్రక్రియలో సాలీడు, ఏనుగు తొండం మరియు వాయు లింగం మధ్యలో నలిగి చనిపోతుంది. పాము, తొండం లింగానికి బలంగా తాకడంవలన మరియు ఆ పాము విషయానికి ఏనుగు కూడా చనిపోతాయి.

అప్పుడు శివుడు ప్రత్యేక్షమై వారి నిస్వార్థ భక్తికి మెచ్చి వారి ముగ్గురికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు సాలీడు గొప్ప రాజుగా పునర్జన్మ పొందెను మరియు పాము ఏనుగు వారి పూర్వజన్మ కర్మలు తొలగి స్వర్గం చేరుకున్నాయి.

Sri Gnanaprasunambika Devi

శ్రీ జ్ఞానప్రసూనాంబిక దేవి శ్రీ కాళహస్తీశ్వర స్వామి యొక్క పత్ని, ఈమె పార్వతి దేవి యొక్క అవతారం.

మహా శివుడు పార్వతిదేవికి పవిత్రమైన పంచాక్షరీ మంత్రం ఇచ్చి ఏకాగ్రతతో పటించామని చెప్పగా పార్వతీదేవి ఏకాగ్రతతో చేయలేకపోయెను, అందువలన ఆగ్రహించిన శివుడు, ఆమెని శపించి భూలోకమునందు ఒక స్త్రీగా మార్చెను. ఆ దేవతామూర్తి పశ్చాత్తాప్పడి శాపవిమోచనం ఇవ్వమమని మహా శివుణ్ణి వేడుకొనెను.

అనుగ్రహించిన శివుడు ఆమెని మానవరూపంలో కైలాస పర్వతం దగ్గర శివ లింగాన్ని ఆరాధిస్తూ తపస్సు చేయమని చెప్పెను, అప్పుడు పార్వతిదేవి నారద ముని సహాయంతో దక్షిణ కైలాసం ఐన ఇక్కడికి వచ్చి మహా శివుణ్ణి స్మరిస్తూ తప్పస్సు చేసెను మరియు పంచాక్షరీ మంత్రాన్ని పటించెను. అందుకు మెచ్చిన శివుడు ఆమెని జ్ఞానప్రసూనాంబికగా భక్తులకు ప్రసిద్ధి చెందునని దీవించెను.

సందర్శించవలసిన ప్రదేశాలు

Veyilingala Kona Waterfalls

ఈ జలపాతం పేరు తెలుగు భాష నుండి వచ్చింది, వెయ్యి "లింగాల లోయ" అని దాని అర్ధం. రాళ్లతో సహజ సిద్ధంగా ఏర్పడిన లింగాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది శ్రీ కాళహస్తి నుండి 8 కి.మీ దూరంలో కలదు, పురాణాల ప్రకారం జలపాతంలో నీటికి ఎన్నో చర్మ రోగాల నివారించే ఔషధ గుణాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడి అద్భుతమైన ప్రకృతి అందాలు, దేశ విదేశాల సందర్శకులని ఆకర్షిస్తుంది.
                           

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానము శ్రీకాళహస్తి 

పరోక్ష సేవల వివరాలు:

1.పరోక్ష సేవ రాహు కేతు పూజ  రూ. 500/.(రాహుకాలములో) 
2.పరోక్ష సేవ శ్రీస్వామి అమ్మవార్ల అభిషేకము .రూ.   1000/-(ఉదయం 7.00 గ// లకు) 
3.పరోక్ష సేవ  శ్రీ స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం . రూ.501/ (ఉదయం 8.45 గం//లకు)
4.పరోక్ష సేవ శ్రీ మృత్యుంజయ స్వామి అభిషేకం. రూ. 1000/-(ఉదయం 9.30 గం//లకు
5.పరోక్ష సేవ శ్రీ మృత్యుంజయ స్వామి జపం రూ.  216/-(ఉదయం 9.00 గం// లకు
6.పరోక్ష సేవ చండీ హోమం.. రూ. 1116/- (ఉదయం11-00 గం//లకు)
7.పరోక్ష సేవ రుద్ర హోమం . రూ. 1116/-(ఉదయం11-00 గం//లకు)
8.పరోక్ష సేవ మహన్యాస రుద్రాభిషేకo రూ. 1500/-(సాయంత్రం 4.00 గం// లకు)
9.పరోక్ష సేవ శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి  వారి అభిషేకం. రూ. 300/- (ఉదయం 8.00 గం/ లకు గురువారం మాత్రమే)
10.పరోక్ష సేవ శ్రీ శనీశ్వర స్వామి వారి అభిషేకం రూ. 300/- (సాయంత్రం 5.00 గం// లకు శనివారం మాత్రమే) 

ఈ పరోక్ష సేవలు వినియోగించుకొను భక్తులకు వారి ఎంపిక చేసుకోబడిన సేవను వీక్షించుటకు వారు రిజిస్టర్ చేయబడిన మొబైల్ నెంబరుకు సేవ లింక్ దేవస్థానం వారిచే లింక్ పంపబడును. 

రవాణా

By Road

రోడ్డు మార్గాన బెంగళూరు నుండి తిరుపతికి 5 గంటలకు సమయం పడుతుంది, చెన్నై నుండి తిరుపతికి 5 గంటలకు సమయం పడుతుంది. తిరుపతి నుండి శ్రీకాళహస్తికి,అన్ని వేళల బస్సుల సదుపాయం కలదు. తిరుపతి నుండి ప్రతి అర గంటకి బస్సులు కలవు.

By Train

శ్రీకాళహస్తిలో రైల్వే స్టేషన్ కలదు. శ్రీకాళహస్తి తిరుపతి-విజయవాడ బ్రాడ్ గేజ్ రైల్వే మార్గంలో ఉంది, కనుక అన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి. శ్రీకాళహస్తి దక్షిణ భారతదేశంలోని అన్ని పట్టణాలకు అనుసంధనమై ఉంది. హైదరాబాద్, విజయవాడ మరియు కలకత్తా నుంచి రైళ్లు కలవు. రేణిగుంట శ్రీకాళహాస్తికి కేవలం 25 కి. మీ దూరంలో ఉంది.

By Air

శ్రీకాళహస్తికి 29 కి. మీ దూరంలో తిరుపతి విమానాశ్రయం (టీర్), తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్ ఉంది. శ్రీకాళహస్తికి 96 కి. మీ దూరంలో చెన్నై విమానాశ్రయం (మా), చెన్నై, తమిళనాడు ఉంది.

Temple Timings

Morning : 5am to 11am
Evening : 4pm to 8pm

Temple Address

Sri  Kalahastheeswara Swamy Temple,

Srikalahasthi Village,Mandel,

Chittoor District,

Andhra Pradesh State,

India.
Tags : sri kalahastheeswara swamy temple srikalahasthi history in telugu, chittoor famous temples, andhra pradesh famosu temples,india famous temples,world famous temples, srikalahasthi famous temples, temple timings, near temples, temple,  Rahu Ketu Pooja Powerful Temple | Srikalahasti address, srikalahasti temple telugu, kalahasti temple history, vayu lingam temple, rahu ketu pooja srikalahasti, shiva temples andhra pradesh, dakshina kailasam, kannappa story telugu, shiva temples india, bhakthi margam, devotional telugu, famous temples ap, srikalahasti rahu ketu pooja,

Comments