తలుపులు, తాళాలు లేని వింత ఊరు! | శని శింగనాపూర్ అద్భుత చరిత్ర 😱 | sani singanapur history in telugu | bhakthi margam | భక్తి మార్గం


శని శింగనాపూర్

శని శింగనాపూర్ భారతదేశం, మహారాష్ట్రలోని, శని శింగనాపూర్ లో ఉన్న ఈ ఆలయం శని దేవుని ఇంకొక ముఖ్య పుణ్యక్షేత్రం. శింగనాపూర్ షిరిడి, ఔరంగాబాద్ మధ్యలో నెలకొని ఉంది. ఇక్కడి దైవము "స్వయంభు" అనగా భూమి నుండి స్వయంగా ఉద్భవించిన నల్లని, గంభీరమైన రాతి విగ్రహం.

ఆలయ చరిత్ర

నోటి మాట ద్వారా తరతరాలకు అందించబడిన స్వయంభు ( =సంస్కృతంలో స్వయముగా ఆవిర్భవించిన) యొక్క కథ ఈవిధంగా సాగుతుంది: గొర్రెల కాపరి పదునైన చువ్వతో రాతిని ముట్టుకొనగా దానినుంచి రక్తం స్రవించడం ప్రారంభమైంది. దీనితో గొర్రెల కాపరులు దిగ్బ్ర్హాంతి చెందగా, వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతాన్ని చూచేందుకు గుమికూడింది. ఆ రాత్రి అత్యంత భక్తిశ్రద్ధలు గల గొర్రెల కాపరి యొక్క స్వప్నంలో శనీశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. 

తాను "శనీశ్వరుడి"నని చెప్పెను. అద్వితీయముగా కనిపించుచున్న ఆ నల్లరాయి తన స్వయంభు రూపమని కుడా ఆయన చెప్పినాడు. గొర్రెల కాపరి స్వామిని ప్రార్థించి ఒకవేళ తాను స్వామికి ఆలయం నిర్మించ వలెనేమో అని అడిగెను. 

దీనికి సమాధానముగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ అని కావున, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని చెప్పెను. ప్రతిరోజూ పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా 'తైలాభిషేకం' చేయమని ఆయన గొర్రెల కాపరికి చెప్పెను. అంతేకాక మొత్తం పల్లెకి బందిపోటుల లేదా కన్నములు వేసే వారు లేదా దొంగల భయం ఉండదని మాట ఇచ్చెను.

అందుచే ఈరోజు వరకు కూడా శనీశ్వర స్వామిని ఎటువంటి కప్పు లేకుండా ఆరు బయట చూడవచ్చును. ఈ రోజు వరకు ఏ ఇంటికి, దుకాణముకు, ఆలయముకు కూడా తలుపులు ఉండవు. తపాలా కార్యాలయానికి కూడా తలుపులు, తాళాల ప్రసక్తి లేకపోవడం మనం చూసి నమ్మవచ్చు. శనిభగవానుని యందు భయముచే, శనిభగవానుని ఆలయము వద్ద ఒక కిలోమీటరు వ్యాసార్థం లోపల ఉన్న నివాస స్థలములు, గుడిసెలు, దుకాణములు మొదలైనవాటి వేటికి తలుపులు కాని తాళాలు కాని ఉండవు.

 శని శింగనాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడి జరగలేదు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకుని చనిపోయారు. ఇతరులు చాలామంది దీర్ఘకాల అనారోగ్యం, మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధరకాల శిక్షలు అనుభవించారు.

 శనీశ్వరుని కృపకు పాత్రులు కావాలనుకునే వేలమంది భక్తులు ప్రతిరోజూ ఈ శని శింగనాపూర్‌ను దర్శిస్తారు. శనివారములలో ఈ స్థలం చాల రద్దీగా ఉంటుంది. శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. అదే విధంగా 'అమావాస్య రోజున వచ్చే శనివారం శనీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణింపబడుతుంది. ఆయన దీవెనల కోసం వేలమంది భక్తులు ఈ ఆలయం వద్ద గుమికూడతారు.

యేలిననాటి శని వున్న వారు హనుమంతుడిని పూజిస్తే శని వలన కలిగే ఈతి బాధలను తగ్గించుకోవచ్చని నమ్ముతారు ..త్రేతాయుగం లో రావణుడి బారి నుండి తనను కాపాడాడు కాబట్టి కృతజ్ఞత గా హనుమంతుని ఎవరైతే పూజిస్తారో, మరి ముఖ్యం గా శనివారం లో పూజిస్తే వారికి ఎలాంటి బాధలు ఉండవని వరం అందిస్తాడు శని దేవుడు మొత్తం కాకున్నా చాలావరకు బాధలను తగ్గించగలను అని మాట ఇస్తాడు అప్పటినుంచి హనుమంతుడిని పూజిస్తారు అలాగే శని దశ నడుస్తున్నవారు శివుడిని పూజిస్తే కూడా ఫలితం ఉంటుంది అని విశ్వసిస్తారు.

🔱 పూజా విశేషాలు & పరిహారాలు:

తైలాభిషేకం: స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ఇక్కడ అత్యంత ప్రధానమైన పూజ.

ముఖ్యమైన రోజులు: శనివారాలు, శని త్రయోదశి మరియు అమావాస్యతో కూడిన శనివారం (శని అమావాస్య) ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

హనుమత్ ఆరాధన: ఏలిననాటి శని దోషాలు ఉన్నవారు హనుమంతుడిని పూజించడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. రావణుడి చెర నుండి తనను విడిపించినందుకు గాను, హనుమ భక్తులను తాను పీడించనని శని దేవుడు వరం ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి.

శివారాధన: శని దశ నడుస్తున్న వారు శివుడిని ఆరాధించడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.

address and contact

Shri Shanaishwar Devasthan
Shanishingnapur, 
Taluka: Nevasa, 
Dist.: Ahamadnagar
Pin. 414 105.
 Maharashtra, India.
Telephone:+91 2427 238110 , +91 2427 238108
Email:shanishingnapur@yahoo.com
tags:sani singanapur history in telugu,shani shingnapur temple timings,shani shingnapur temple distance,shani shingnapur temple maharashtra,shani shingnapur temple significance,shani shingnapur temple accommodation,shani shingnapur temple phone number,maharashtra famous temples,bhakthimargam,bhaktimargam, bhakti margam, bhakthimargam.in bhakthi margam telugu , Shani Shingnapur temple history, Shani Shingnapur no doors village, Shani Shingnapur mystery in Telugu, శని శింగనాపూర్ చరిత్ర, Shani Shingnapur Maharashtra, Shani Dev self manifested idol, Shani Shingnapur story Telugu, no doors no locks village India, Shani dosha nivarana pariharalu, Shani pariharam Telugu, Hanuman Shani dev story, Lord Shani devotion, Shani thrayodasi special, Shani Amavasya puja, Shani Mahatyam Telugu, Shiridi to Shani Shingnapur, Shani bhagavan temple, devotional vlogs Telugu, Bhakthi Margam, viral temple mysteries India

Comments