రాత్రి పూట అక్కడ ఏం జరుగుతోంది? చూసిన వారు ఎందుకు పిచ్చివారవుతారు? 😱 | Mysterious Facts About Nidhivan Temple Uttar Pradesh | Vrindavan


నిధివన్’ మిస్టరీ

వృందావనం నిధివన్ రహస్యం.. నేటికీ కృష్ణుడు రాసలీలలు చేసే అద్భుత క్షేత్రం 🙏

శ్రీకృష్ణుడి గురించి చిన్నతనం నుంచి మనమంతా ఎన్నో కధలు వినే ఉంటాం. గోపికలను ఏడిపిస్తూ, వెన్నను దొంగిలిస్తూ, పట్టుబడినప్పుడు తన అమాయకమైన చూపులతో అందరి మదిని దోచుకుంటూ ఎంతో అల్లరి పిల్లవాడిగా అనిపిస్తాడు. గ్రామస్తులను, గోపికలను తన వేణు గానంతో ఎంతగా ఆకట్టుకునేవాడో కూడా విని ఉంటారు. 

అలాగే శ్రీకృష్ణుడి రాస-లీల గురించి కూడా ఆధ్యాత్మిక వేత్తలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఇవన్నీ చాలా మనోహరంగా అనిపిస్తాయి. ఎన్నో శతాబ్ధాల కాలం నుంచి శ్రీకృష్ణుడికి సంబంధించి ఈ కధలు ప్రచారంలో ఉన్నాయి.వీటికి నిధివన్ ను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

వృందావన్ లోని దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ఆలయ సముదాయం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తుంది. కృష్ణుడు ఇక్కడ గోపికలతో ఆహారాన్ని తయారు చేస్తాడని, అంతేకాకుండా తన అర్ధాంగి రాధతో, గోపికలతో రాస లీల జరుపుతాడని చెబుతారు. ఈ కారణంగానే ప్రతి రోజు సాయంత్రం 5 గంటల తరువాత నిధివన్ ను మూసి వేస్తారు. అసలు ఈ మర్మం వెనుక కారణాల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నిధివన్’ మిస్టరీ.. ఈ ఆలయంలో రాత్రి మంచాన్ని అలంకరిస్తారు.. ఉదయం అంతా చెల్లాచెదురు.. ఏం జరుగుతోంది?

సాయంత్రం 5 గంటలు దాటితే నిధివన్‌లోకి ప్రవేశాన్ని నిషేదిస్తారు. రంగ్ మహల్‌లో మంచాన్ని అందంగా అలంకరిస్తారు. ఉదయం చూసేసరికి ఆ గదిలో వస్తువులన్నీ చిందరవందరగా ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుంది?

ఇతిహాసాలతో ముడిపడిన దేశం మనది. అందుకే ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది బృందావనం. ఇందులోని నిధివన్ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. 

కృష్ణుడు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది గోపికలే. బృందావనంలో కృష్ణుడు నిత్యం వందలాది గోపికలతో రాసలీలల్లో మునిగితేలేవాడట. ఆ ప్రాంతం ఇప్పటికీ ఉనికిలో ఉంది. అదే నిధివన్. ఉదయం వేళలో భక్తులు నిధివన్‌ను సందర్శించవచ్చు. కానీ, సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రం ఆ పరిసరాల్లోకి అడుగు పెట్టకూడదు. ఎందుకంటే రాత్రివేళల్లో ఇప్పటికీ అక్కడ శ్రీకృష్ణుడు గోపికలతో ఆటలాడుతాడట. వినేందుకు ఇది చిత్రంగానే ఉన్నా.. స్థానికులు మాత్రం దీన్ని బలంగా నమ్ముతారు. 

నిధివన్ గురించి చెప్పమని స్థానికులను అడిగితే.. ఈ విషయాన్నే ముందుగా చెబుతారు. పగటి వేళలలో మీరు ఎంతసేపైనా అక్కడ గడపండి. కానీ, సాయంత్రం 5 తర్వాత మాత్రం ఆ పరిసరాల్లో అస్సలు ఉండవద్దని హెచ్చరిస్తారు. 

కృష్ణుడు ప్రతి రాత్రి అక్కడికి వచ్చి తన ప్రియురాలైన రాధా, తదితర గోపికలతో కలిసి నృత్యం చేస్తాడని ప్రజలు విశ్వసిస్తారు. కానీ.. అక్కడి ప్రజలు దీన్ని ఇప్పటివరకు ప్రత్యక్షంగా చూడలేదు. దాని గురించి తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే.. గతంలో అలా ప్రయత్నించివారికి పట్టిన పరిస్థితి గురించి వారికి తెలుసు. 

ఔనండి.. నిధివన్‌లో రహస్యాన్ని ఛేదించేందుకు చాలామంది ప్రయత్నించారు. కొందరు నిధివన్‌లోని చెట్ల వెనుక దాక్కొని నిజాన్ని తెలుసుకుందామని ప్రయత్నించారట. తర్వాతి రోజు వారు షాక్‌తో మతిస్థిమితం కోల్పోయినవారిలా ప్రవర్తించారట. 

కొందరు చూపు, మాట కోల్పోయారట. అక్కడ ఏం జరుగుతుందో చూసేందుకు అస్సలు ప్రయత్నించకూడదని, అది చాలా చిత్రంగా.. భయానకంగా, మనస్సును కదిలించేదిగా ఉండవచ్చని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే, నిధివన్ సమీపంలో నివసించే ప్రజలు రాత్రైతే అటువైపు ఉండే కిటికీలు, తలుపులు తెరవరు. 

నిధివన్‌లో అడుగు పెడితే.. అక్కడ మీకు అనేక చెట్లు. రాత్రివేళల్లో ఆ చెట్లు గోపికలుగా మారతాయని, తెల్లవారుజామున మళ్లీ చెట్లుగా కనిపిస్తాయని స్థానికులు చెబుతారు. 

ఆ చెట్లు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. సాధారణంగా చెట్ల వేర్లు కిందకి, కొమ్మలు పైకి ఉంటాయి. కానీ, అక్కడ మాత్రం రివర్స్. చెట్ల వేళ్లు పైకి ఉన్నట్లుగా వంకరటింకరగా ఉంటాయి. నిధివన్ లోపల ‘రంగ్ మహల్’ ఆలయం ఉంటుంది. 

దీన్నే రాధా రాణి హ్రీంగర్-ఘర్ అని కూడా అంటారు. జానపద కథల ప్రకారం.. కృష్ణుడు ప్రతి రాత్రి ఇక్కడకు వస్తాడు. తన చేతులతో స్వయంగా రాధను ఆభరణాలతో అలంకరిస్తాడు. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే.. రంగ్ మహాల్ లోపల ఒక మంచం, దానికి సమీపంలో అనేక ఆభరణాలు, మేకప్ ఉత్పత్తులను చూడవచ్చు. 

నిధివన్ గురించి విని చాలా మంది కట్టుకథలు అని కొట్టిపడేస్తారు. కానీ, స్థానికులు ఇందుకు తామే సాక్ష్యమని చెబుతారు. అక్కడ ఏం జరుగుతుందో చూడకపోవచ్చు. కానీ, ప్రతి రాత్రి ‘రంగ్ మహల్‌’లో ఎవరో నృత్యం చేస్తున్నట్లుగా గజ్జెల శబ్దాలు తమకు వినిపిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. ‘రంగ్ మహల్’లో ప్రతి రాత్రి దేవతల కోసం గంధపు చెక్కతో తయారు మంచాన్ని సిద్ధం చేస్తారు. 

పూజారులు తమల పాకు, వేప, వక్క, కూజా నీటిని మంచం పక్కన ఉంచుతారు. ఆ తర్వాత ఆలయానికి తాళాలు వేస్తారు. ప్రతి ఉదయం పూజారి ఆ ఆలయంలోకి వెళ్లినప్పుడు అవన్నీ అలంకరణలు చెల్లాచెదురుగా కనిపిస్తాయి. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉంటాయి. అందుకే రాధాకృష్టులు రోజూ ఆ ఆలయంలోకి వస్తారని భక్తులు నమ్ముతున్నారు. సాయంత్రం 5 గంటలు వరకు మాత్రమే ఆ ఆలయంలోకి అనుమతి ఉంటుంది. 

5 తర్వాత పూజారులు ప్రసాదాన్ని 5 ముద్దలుగా చేసి ఆలయంలో పెడతారు. వాటిలో ఒక ముద్దను పూర్తిగా, రెండు ముద్దలు సగం తినేసినట్లుగా ఉంటాయి. ప్రతి రోజు ఆ ప్రసాదం ఈ విధంగానే వస్తుంది. ఇది కూడా అంతుబట్టని రహస్యమే. దీనికి సంబంధించిన వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.

​శ్రీకృష్ణుడి జన్మస్థానం:

శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మథురను ఆధ్యాత్మిక ప్రేమ నగరంగా పిలుస్తారు. మథుర కేవలం చారిత్రక నగరమే కాదు. దీని చుట్టూ భగవంతుడికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక నమ్మకాలు ముడిపడి ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర జిల్లాలో వృందావన్ నగరం ఉంది. ఇక్కడ శ్రీ కృష్ణుడి భక్తుడు, తాన్సేన్ కు సంగీతం నేర్పించిన గొప్ప సంగీత కళాకారుడు స్వామి హరిదాస్ గురించి ఓ రాతి ఫలకంపై ప్రస్తావించబడి ఉంటుంది. దీనిలో శ్రీకృష్ణుడి రాసలీల గురించి కూడా ప్రస్తావించబడింది.

కన్నయ్య రాసలీలలు:

శ్రీకృష్ణుడి రాసలీల గురించి అనేక పుస్తకాల్లో, జానపదాల్లో ప్రముఖంగా వివరించబడింది. వీటి ప్రకారం కన్నా అని పిలువబడే శ్రీకృష్ణుడు రాధ, గోపికలు లేదా సఖిలతో నాట్యం చేసేవాడట. ఆయన వేణుగానం వినిపించినప్పుడల్లా వృందావనం మొత్తం పులకించి ఆనంద తరంగాలు వ్యాపించేవని చెబుతారు. నిధివన్ ఆలయంలోని శ్రీకృష్ణున్ని స్థానికులు 'ఠాకూర్జీ' అని కూడా పిలుస్తారు. రాత్రి సమయాల్లో ఆయన రాధ, గోపికలతో కలిసి ఇక్కడ ఆధ్యాత్మిక కార్యకలాపాలు (రాస లీలలు) నిర్వహిస్తాడని అంటారు. కానీ మానవులెవరూ దీనిని చూడలేరు.

అసాధారణమైన వృక్షం:

సాధారణంగా మనం ఒక చెట్టును ఎలా చూస్తాం? కాండం, ఆకులు, కొమ్మలు, వేర్లతోనే కదా? వేర్లు ముఖ్యంగా భూమికి లోపల ఉంటాయి. కానీ నిధివన్ లో కనిపించే చెట్ల మూలాలు (వేర్లు) భూమి నుంచి పైకి వచ్చి కనిపిస్తాయి. అంతే కాదు కొమ్మలు భూమి వైపు వంగి ఉంటాయి.

వాన్సీ చోర్ రాధా రాణి:

నిధివన్ లో వాన్సీ చోర్ రాధా రాణి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ స్థానికుల కధనం ప్రకారం.. శ్రీకృష్ణుడు తన వేణువును వాయిస్తూ రాధా రాణిపై శ్రద్ధ చూపే వాడు కాదట. అందుకే ఆమె కృష్ణుడి వేణువును దొంగిలించినట్లు చెబుతారు. ఈ ఆలయంలో రాధా మాట విగ్రహంతో పాటు గోపీ లలిత విగ్రహం కూడా ఉంటుంది.

నిధివన్ లో రాత్రి ఎందుకు ఉండరు?

సూర్యాస్తమయం తరువాత నిధివన్ ఆలయ సముదాయ ద్వారాన్ని మూసివేస్తారు. ఈ లోపు అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ బయటకు రావాలి. ఎవరైనా చీకటి పడిన తరువాత లోపల ఉండాలని ప్రయత్నిస్తే వారికి దృష్టి లోపం, వినికిడి సమస్యలు, మూగతనం వస్తాయని చెబుతారు. దాదాపు దశాబ్ధ కాలం క్రితం ఓ శ్రీకృష్ణ భక్తుడు రాసలీలను చూసేందుకు నిధివన్ లోనే ఉండిపోయాడట. మరుసటి రోజు తలుపులు తెరిచి చూసే సరికి అతడు మానసిక స్థితి తప్పి ఉన్నట్లు స్థానికుల కధనం.

విశాఖ కుండ్:

రాసలీల సమయంలో గోపికల్లో ఒకరైన విశాఖకు తీవ్ర దాహం వేస్తే శ్రీకృష్ణుడు తన వేణువుతో ఓ రంధ్రాన్ని తవ్వుతాడు. అది నీటితో నిండుకుని విశాఖ దాహం తీరుస్తుంది. అప్పటి నుంచి ఇక్కడి నీటి కొలనును విశాఖ కుండ్ గా పిలుస్తారు.

రంగ్ మహల్:

నిధివన్ లో రంగ్ మహల్ ఉంటుంది. ఈ ప్రదేశాన్ని ప్రతి రోజూ రాత్రి రాధా, కన్నయ్యలు సందర్శిస్తారని చెబుతారు. రంగ్ మహల్ లోని గంధపు చెక్కతో చేయబడిన పాన్పును ప్రతి రోజూ 7 గంటల లోపు పూలతో అలంకరిస్తారు. తామర నీటితో పాటు ఇతర పదార్ధాలను పాన్పుకు దగ్గర్లో ఉంచుతారు.

హరిదాస్ కీర్తనలు చేసిన ప్రదేశం:

నిధివన్ లో ప్రసిద్ధ సంగీతకారుడు హరిదాస్ ఆధ్యాత్మిక కీర్తనలు చేసేవాడని చెబుతారు. ఆయన సంగీతానికి ముగ్ధుడైన బంకే బిహారీ జీ (శ్రీకృష్ణుడిని ఈ పేరుతోనూ పిలుస్తారు) ఆయన కలలో కనిపించి ఈ ప్రదేశంలోనే తాను నివసించి ఉంటానని చెప్పినట్లు కధనం.

తులసి ఆకులను తుంచడం నిషిద్ధం:

నిధివన్ లో ప్రతి తులసి మొక్క ఒక జతగా ఉంటుంది. శ్రీకృష్ణుడు రాసలీలను చేసే సమయంలో ఈ తులసి మొక్కలు గోపికలుగా మారతాయట. ఆలయ పరిసరాల నుంచి తులసి ఆకులను తుంచడం నిషిద్ధం. ఇలా చేసినవారికి ఊహించని విపత్తులు సంభవిస్తాయని నమ్ముతారు. అందుకే ఎవరూ ఇక్కడి తులసి మొక్కలను తాకే సాహసం చేయరు.

శ్రీకృష్ణుడు, రాధ ఇక్కడ ప్రతి రాత్రి రాసలీలను ప్రదర్శిస్తారా? అనేది చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ నమ్మకాలు భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కృష్ణున్ని విష్ణుమూర్తి యొక్క 8వ అవతారంగా భక్తులు కొలుస్తారు. మర్మమేదైనా, సంఘటనలు ఏమైనా వృందావన్ భక్తుల నుంచి ఓ గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

ఎలా వెళ్లాలి?

వాయు మార్గం:

వృందావన్ లో విమానాశ్రయం లేదు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న ఖెరియా ఇక్కడికి సమీప విమానాశ్రయం. ఇది వృందావన్ కు 53 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వృందావన్ కు 128 కిలోమీటర్ల దూరం. ప్రైవేటు వాహనాలు, ట్యాక్సీ ద్వారా విమానాశ్రయం నుంచి వృందావన్ కు చేరుకోవచ్చు.

రైలు మార్గం:

వృందావన్ కు నేరుగా రైలు మార్గం లేదు. ఇక్కడికి సమీపంలోని మథుర కంటోన్మెంట్, మథుర జంక్షన్ వరకూ ప్రతి రోజూ రైళ్లు నడుస్తుంటాయి. మథుర నుంచి వృందావన్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

రోడ్డు మార్గం:

ప్రధాన నగరాల నుంచి వృందావన్ కు నేరుగా బస్సులు నడవవు. ఇక్కడికి సమీప బస్టాండ్ మథురలో దిగి అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వృందావన్ కు ఆటో, ట్యాక్సీ, క్యాబ్ ద్వారా చేరుకోవాలి. కారులో, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే వారు వృందావన్ కు సులభంగా చేరుకోవచ్చు.

Related Postings:

1. Stotras In Telugu

5. Rashi Phalalu


Nidhivan mystery Telugu, Vrindavan Nidhivan secrets, Radha Krishna Raasleela Nidhivan, Rang Mahal mystery, Nidhivan trees mystery, Lord Krishna stories Telugu, Bhakthi Margam, PK Voice Pithapuram, Nidhivan after 5 PM, Vrindavan temple history, Indian temple mysteries, spiritual secrets India.

Comments