ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైభవం | ఆలయాలు, రుచులు మరియు ప్రత్యేకతలు 💥 | East Godavari famous temples | bhakthi Margam

 


🌟 ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవ నిలయం – ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా 🌟

1. ప్రముఖ దివ్య క్షేత్రాలు (Famous Temples)


1. అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం (రత్నగిరి కొండ)

2. ద్రాక్షారామం: శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం (పంచారామ క్షేత్రం & అష్టాదశ శక్తిపీఠం – దక్షిణ కాశీ)

3. సామర్లకోట: శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయం (పంచారామ క్షేత్రం)

4. పిఠాపురం: శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయం, పాదగయ క్షేత్రం, శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థానం, కుంతీ 5. మాధవ స్వామి ఆలయం (మాధవ క్షేత్రం), మరియు పురుహూతికా దేవి ఆలయం (అష్టాదశ పీఠం)

6. అంతర్వేది: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం (సముద్ర సంగమ క్షేత్రం)

7. ర్యాలి: శ్రీ జగన్మోహన స్వామి దేవాలయం (ముందు వైపు మోహిని, వెనుక వైపు విష్ణు రూపం ఉన్న ఏకైక క్షేత్రం)

8. వాడపల్లి: శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (ఏడు శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి)

9. ద్వారపూడి: శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం (ఆంధ్రా శబరిమల)

10. అప్పనపల్లి: శ్రీ బాలబాలాజీ స్వామి దేవాలయం (అప్పనపల్లి వెంకన్నబాబు)

11. అయినవిల్లి: శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం

12. మురమళ్ళ: శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి ఆలయం (నిత్య కల్యాణ క్షేత్రం)

13. కోరుకొండ: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం (తొలి గిరి ప్రదక్షిణ క్షేత్రం)

14. మందపల్లి: శ్రీ మందేశ్వర స్వామి ఆలయం (శని త్రయోదశి ప్రసిద్ధ శని క్షేత్రం)

15. బిక్కవోలు: శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం మరియు సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయం (చాళుక్యుల శిల్పకళా వైభవం)

16. గొల్లాలుమామిడాడ: శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం (గోదావరి అంతర్వాహినిగా ప్రసిద్ధి – చిన్న కాశీ)

17. సర్పవరం: శ్రీ భావనారాయణ స్వామి ఆలయం (కాకినాడ సమీపం)

18. తొలి తిరుపతి: శ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయం (పెద్దాపురం సమీపం)

19. ముక్తేశ్వరం: శ్రీ క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయం (కోటిపల్లి అవతలి గట్టు)

20. చింతలూరు: శ్రీ ధన్వంతరి స్వామి ఆలయం (ఆరోగ్య ప్రదాత)

21. ముమ్మిడివరం: శ్రీ బాలయోగి ఆశ్రమం మరియు మందిరం

22. నవ జనార్ధన క్షేత్రాలు: రాజమండ్రి, ధవళేశ్వరం, కోరుకొండ మొదలైన ప్రాంతాల్లోని 9 విశిష్ట జనార్ధన స్వామి ఆలయాలు.


2. శక్తి స్వరూపిణులు – జిల్లా గ్రామదేవతలు


1. కాకినాడ: శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం

2. తలపులమ్మ లోవ (తుని): శ్రీ తలపులమ్మ తల్లి ఆలయం (ఘాట్ రోడ్ అందాలు)

3. పెద్దాపురం: శ్రీ మరిడమ్మ తల్లి దేవస్థానం

4. కాండ్రకోట: శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం

5. చింతలూరు: శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం

6. దేవీపట్నం: శ్రీ గండిపోశమ్మ తల్లి ఆలయం (గోదావరి తీరం)

7. కత్తిపూడి: శ్రీ సత్తిమ్మ తల్లి ఆలయం

8. గొల్లపాలెం: శ్రీ ధనమ్మ తల్లి ఆలయం


3. ఊరు - పేరు - ప్రత్యేక రుచులు & వస్తువులు (District Specials)

🥖 నోరూరించే రుచులు:

1. ఆత్రేయపురం: ప్రపంచ ప్రసిద్ధ పూతరేకలు (Geographical Indication - GI Tag గుర్తింపు పొందినవి)

2. తాపేశ్వరం: మడత కాజా మరియు ప్రసిద్ధ మహాలడ్డూ

3. కాకినాడ: కోటయ్య కాజా మరియు సుబ్బయ్య హోటల్ బుట్ట భోజనం

4. ముక్కామల: పప్పుచెక్కలు మరియు చీనీ కోవా

5. మండపేట: బెల్లం గవ్వలు

6. బొబ్బర్లంక: కొబ్బరుండలు

7. కత్తిపూడి: కరకజ్జం

8. బెండపూడి: బెల్లం జీళ్ళు

9. మామిడాడ: మామిడి తాండ్ర

10. తాళ్ళరేవు: తాటి తాండ్ర

11. వడిశలేరు: నోరూరించే చేగోడీలు


🌾 ప్రకృతి & పంటల సిరి:

1. అమలాపురం: పచ్చని అరటి తోటలు

2. కొత్తపేట: కొబ్బరి తోటల అందాలు

3. గంగలకుర్రు: తీపి గంగా బొండాలు (కొబ్బరి బొండాలు)

4. జగ్గంపేట: తీపి జాంపళ్ళు

5. ప్రత్తిపాడు: జొన్నపొత్తులు

6. రాజానగరం: రుచికరమైన సీతాఫలాలు

7. ఏలేశ్వరం: ప్రత్యేకమైన వంకాయలు

8. అడ్డతీగెల: పనసకాయలు

9. గోకవరం: నోరూరించే మామిడి తోటలు

10. గొల్లప్రోలు: ఘాటైన పచ్చమిర్చి


🎨 కళలు, చేనేత & సంస్కృతి:

1. ఉప్పాడ: అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఉప్పాడ పట్టుచీరలు (జామ్దాని)

2. పుల్లేటికుర్రు: సాంప్రదాయ చేనేత చీరలు

3. కడియం: దేశంలోనే అతిపెద్ద పూలతోటలు (న Nursery లు)

4. ద్వారపూడి: బట్టల హోల్‌సేల్ సంత

5. పిఠాపురం: సువాసనల అత్తరు సెంటు

6. అంబాజీపేట: వంటాముదం (ఆముదాల తయారీ)

7. జగ్గన్నతోట: సంక్రాంతి వేళ జరిగే ప్రపంచ ప్రసిద్ధ 'ప్రభల తీర్థం'


🌉 పర్యాటకం & కట్టడాలు:

1. రాజమండ్రి: ఆసియాలోనే ప్రసిద్ధ రైల్వే బ్రిడ్జి మరియు రోడ్-కమ్-రైల్ బ్రిడ్జి

2. ధవళేశ్వరం: సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన చారిత్రక ఆనకట్ట (బ్యారేజ్)

3. రావులపాలెం: గోదావరి ప్రవేశ ద్వార వంతెన

4. ఎదుర్లంక: బాలయోగి బ్రిడ్జి

5. కోటిపల్లి: చారిత్రాత్మక నావల రేవు

6. రాజోలు: గోదావరి లంక గ్రామాల అందాలు, రాజుల దర్జా

7. పెద్దాపురం: చారిత్రక పాండవుల మెట్ట

8. సామర్లకోట: పాతకాలపు పంచదార ఫ్యాక్టరీ

9. అనపర్తి: సమృద్ధిగా ఉండే చేపల చెరువులు

10. మారేడుమిల్లి: దట్టమైన అడవుల అందాలు, ఎకో-టూరిజం

11. కాకినాడ హోప్ ఐలాండ్: సముద్ర తీర సహజ రక్షణ దీవి

12 . కళలకు కాణాచి - చదువుల తల్లి నిలయం

🎭 కాకినాడ కళా వైభవం:

1. కాకినాడ 'యంగ్ మెన్స్ క్లబ్' నాటకరంగం నుండి తెలుగు సినిమాను ఏలిన మహానుభావులు ఎందరో ఇక్కడి వారే:

 1. ఎస్.వీ. రంగారావు (మహానటుడు)

2. రేలంగి (హాస్య చక్రవర్తి)

3. అంజలీదేవి, సూర్యకాంతం

4 నల్ల రామమూర్తి, ఆదినారాయణ రావు, సంగీత దర్శకుడు సత్యం మొదలైన వారు ఈ గడ్డ పైనే వికసించారు.

📚 చదువుల తల్లి సరస్వతీ నిలయం రాజమండ్రి:

తెలుగు భాషకు, సంస్కరణలకు వెన్నుముకగా నిలిచిన లబ్ధప్రతిష్ఠులైన రచయితలు, సంస్కర్తలు ఇక్కడి వారే:

ఆదికవి నన్నయ్య: ఆంధ్రమహాభారత రచనకు శ్రీకారం చుట్టిన పుణ్యభూమి.

కందుకూరి వీరేశలింగం పంతులు: సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికుడు.

చిలకమర్తి లక్ష్మీనరసింహం, పానుగంటి లక్ష్మీనరసింహారావు, మొక్కపాటి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, వేదుల, దేవులపల్లి కృష్ణశాస్త్రి, భమిడిపాటి, మునిమాణిక్యం వంటి దిగ్గజాల సాహిత్య నిలయం.

సినీ రంగ ప్రముఖులు జయప్రద, రాజబాబు, అలీ మొదలైన వారు కూడా ఈ రాజమండ్రి ప్రాంతం వారే!


Related Postings:

1. Stotras In Telugu

5. Rashi Phalalu


East Godavari district temples, tourpu godavari jilla temples, Godavari jilla specialities, Telugu travel vlogs, Godavari temples history in Telugu, Bhakthi Margam, PK Voice Pithapuram,East Godavari temples, East Godavari district famous temples, Godavari district tourist places, temples in East Godavari, tourpu godavari jilla temples, Annavaram Satyanarayana Swamy temple, Pithapuram Padagaya kshethram, Kukkuteswara Swamy temple Pithapuram, Draksharamam Bhimeswara Swamy, Samarlakota Kumara Bhimeswara Swamy, Ainavilli Vinayaka temple, Ryali Jaganmohana Swamy temple, Antarvedi Lakshmi Narasimha Swamy, Vadapalli Venkateswara Swamy, Dwarapudi Ayyappa temple, Mandapalli Saneeswara Swamy temple, Korukonda Narasimha Swamy, Bikkavolu temples, Talupulamma Lova Kakinada, Kakinada Nookalamma temple, Peddapuram Maridamma, Devipatnam Gandiposamma, Atreyapuram Pootharekulu GI tag, Tapeswaram Madatha Kaja, Rajahmundry Godavari bridge, Dowleswaram Barrage, Kadiam nurseries flower gardens, Maredumilli forest tourism, Uppada pattu sarees, Kakinada Kotaiah Kaja, Joint East Godavari district specialities, Godavari culture and history, famous food in Godavari district, Andhra Pradesh temple tourism, Telugu devotional videos, Bhakthi Margam, PK Voice Pithapuram, viral travel tags Telugu 

Comments