శ్రీ జగన్నాథ, ఆంజనేయ & వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానం లాలాపేట | Lalapet Sri Jagannadha,Anjaneya,Venkateswara Swamy History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం


శ్రీ జగన్నాథ, ఆంజనేయ & వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానం

ఆలయం గురించి

శ్రీ జగన్నాథ, ఆంజనేయ & వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానం గుంటూరు జిల్లానందు గల లాలాపే, కొత్తపేటలో ఉన్నాయి. ఈ ఆలయంలో ముగ్గురు దేవతామూర్తులు కొలువైయున్నారు, వారు శ్రీ జగన్నాథ స్వామి, ఆంజనేయ స్వామి & వెంకటేశ్వర స్వామి.

మొదటగా ప్రతి దేవునికి వేరు వేరుగా మఠాన్నిస్థాపించారు. మొట్టమొదటగా “ శ్రీ పద్మావతి ఆండాళ సమేత ”, “ శ్రీ వెంకటేశ్వర స్వామి ” మఠాన్ని స్థాపించారు, తరువాత కొత్తపేటలో “ శ్రీ జగన్నాథ స్వామి ” మఠాన్ని మరియు కొత్తపేట ట్యాంక్ గ్రౌండ్ ముందు ఆంజనేయ స్వామి మఠాన్ని స్థాపించారు. అందువలన ఈ మఠాలు గుంటూరు నందు చాలా ప్రసిద్ధి చెందాయి. స్థానిక నాయకుడైన 'శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు', 1719 లో ఈ మఠాలను సందర్శించి గుంటూరు ప్రాంతంలో 300 ఎకరాలు విరాళంగా ఇచ్చారు.

ఆ తరువాత కాలంలో ప్రజలు వారి వారి కోరికలను నెరవేర్చుకొనుటకు, లక్ష్యాలను సాధించుటకు మరియు అభివృద్ధి చెందుటకు ఈ మూడు మఠాలను దర్శించేవారు. ప్రస్తుతం, అయోధ్య జగన్నాథ దాసు బాబాజీ & శ్యామల దాసు, భగవాన్ దాసు బాబాజీ వారసులు ఈ మఠాల్లో అర్చనలు చేస్తున్నారు. వైశాఖ మరియు ఆషాడ మాసాలు ఈ ఆలయాలకు చాల ముఖ్యమైనవి మరియు ఈ మాసాల్లో బ్రహ్మోత్సవం మరియు రధోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.

ఆలయ చరిత్ర

క్రీ.శ 1717 సంవత్సరం ఉత్తరాదిన నివసించు భక్తులు అయోధ్య జగన్నాధ దాసు బావాజీ, అయోధ్య శ్యామల దాసు బావాజీ మరియు అయోధ్య భగవాన్ దాసు బావాజీ అను వారు దక్షిణ భాగమున వలస వచ్చి మూడు మఠములలోప్రస్తుతము గుంటూరు లాలాపేట నందు "శ్రీ పద్మావతి ఆండాళ్" సమేత "శ్రీ వెంకటేశ్వర స్వామి" వారిని ప్రతిష్టించి, కొత్తపేట నందు గల మఠములో "శ్రీ జగన్నాధ స్వామి"ని ప్రతిష్టించి మరియు కొత్తపేట గుంట గ్రౌండ్ ఎదురుగా ఉన్న మఠము నందు శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్టించించారు.

ఈ మఠములకు వచ్చు భక్తులు భోజన వసతులు చూసి మరి సాగనంపేవారు. అదే విధంగా ప్రతి దినము జరిగేది.1795 వ సంవత్సరంలో వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు గారు ఈ మఠమును సందర్శించి, 300 ఎకరాల భూమిని ఈ మఠానికి ఇచ్చారు.
అప్పటి నుంచి ఈ మూడు మఠములకు దూప దీప నైవేద్యములతో ప్రతి నిత్యము పూజలు జరుగుచున్నవి.

కాలక్రమేణా 1965-66న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయశాఖ స్వాధీనపరుచుకుంది.

తదుపరి 1974 -75 న శ్రీ జగన్నాధ స్వామి వారి దేవస్థానమును మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానమును స్వాధీన పరుచుకుంది.

క్రీ శ 1717 సంవత్సరం నుండి ప్రస్తుతం వరకు అయోధ్య జగన్నాధ దాసు బావాజీ, అయోధ్య శ్యామల దాసు బావాజీ మరియు అయోధ్య భగవాన్ దాసు బావాజీ వారి కుటుంబికులచే శ్రీ స్వామి వారాల అర్చకత్వములు నిర్వహించెదరు.
ఈ దేవస్థానంలో 'వైఖాన ఆగమన శాస్త్ర' ప్రకారం శ్రీ స్వామి వార్లకు పూజలు నిర్వహించబడును.

ఈ దేవస్థానములలో జ్యేష్ఠ మాసం నందు శ్రీ పద్మావతి ఆండాళ్లు సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మరియు శ్రీ జగన్నాథ స్వామి వారికీ 7 రోజులు వైభవంగా పాంచాహ్నికముగా బ్రహ్మోత్సవములు జరుగును.

ఆషాడ మాసంలో శ్రీ జగన్నాధ స్వామి వారికీ ఘనంగా రధోత్సవం నిర్వహించబడును.
వైశాఖ మాసంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికీ 5 రోజులు పంచాహ్నకముగా హనుమాన్ జయంతి ఉత్సవములు మరియు హనుమాన్ జయంతి తరువాత రోజున శ్రీ స్వామి వారికి సహస్రఘటాభిషేకం జరుపును.

దేవతా మూర్తులు

Sri Padmavathi Andal Sametha Sri Venkateswara Swamy

శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గుంటూరు జిల్లాలోని లాలాపేట్ లో కొలువైవున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజూ అనేక మంది భక్తులు అభిషేకం, అర్చన మరియు పూజలు చేస్తారు. స్వామి వారికి ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో 7 రోజుల బ్రహ్మోత్సవాలు జరుపుతారు.

Sri Jagannadha Swamy 

శ్రీ జగన్నాథ స్వామి గుంటూరు జిల్లాలోని కొత్తపేటలో నిర్మించబడింది. ఈ ఆలయంలో అర్చకత్వం, వంశపారంపర్యంగా బావాజీ కుటుంబానికి చెందిన వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఆషాడ మాసంలో భక్తులు జగన్నాథ స్వామి యొక్క రధోత్సవం ఒక వేడుకగా జరుపుకుంటారు. ఈ ఆలయ అభివృద్ధిని క్రమబద్ధీకరించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ బాధ్యత తీసుకుంది.

Sri Anjaneya Swamy

శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కొత్తపేట లో నిర్మించబడింది. ఈ ఆలయంలో అర్చకత్వం, వంశపారంపర్యంగా బావాజీ కుటుంబానికి చెందిన వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజూ అనేక మంది భక్తులు అభిషేకం, అర్చన మరియు పూజలు చేస్తారు. వైశాఖ మాసంలో వచ్చే హనుమాన్ జయంతి ఉత్సవాన్ని 5 రోజుల పాటు పండుగగా జరుపుకుంటారు.

సందర్శించవలసిన ప్రదేశాలు

Sri Panakala Lakshmi  Narasimha Swamy vari Devasthanam Mangalagiri

ఈ ఆలయం గుంటూరు నుండి 28 కిలో మీటర్ల దూరంలో వుంది. ఈ ఆలయ ప్రధాన దేవతామూర్తి అయిన శ్రీ పానకాల లక్ష్మి నరసింహ స్వామి కొండ మీద కొలువై వుంటారు. ఆలయ గుడి మెట్ల నుండి కుడివైపున శ్రీ కృష్ణదేవరాయల మరియు కోంచెం పైకి వస్తే అక్కడ శ్రీ మహాప్రభు చైతన్య యొక్క పాద ముద్రలు చూడవచ్చును. మెట్ల మార్గ మద్యంలో మోహము మాత్రమే కనపడుతూ, నోరు పెద్దగా తెరచి ఉన్న శ్రీ పానకాల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం ఉంటుంది. 1955 లో దేవాలయం ఎదుట ఒక ధ్వజసంబంధం ఏర్పాటు చేయబడింది.

ఆలయం వెనుక శ్రీ లక్ష్మీ దేవాలయం ఉంది. ఈ ఆలయానికి పశ్చిమాన ఒక పెద్ద సొరంగం ఉందని అది కృష్ణా నదిపై ఉన్న ఉండవల్లి గుహలకు దారితీస్తుందని భక్తుల నమ్మకం. విజయనగర రాజులకు సంబందించిన రాతి శాసనాలపై వారి రాజు అయిన శ్రీ కృష్ణ దేవరాయలు కొండపల్లిని ఆక్రమించిన ఘటన గురించి లిఖించబడింది.

Sri Amareswara Swamy vari Devasthanam Amaravathi 

ఈ ఆలయం గుంటూరు నుండి 106 కిలో మీటర్ల దూరంలో వుంది. అమరావతి అమరేశ్వర ఆలయం ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉంది. ఈ ముఖ్యమైన యాత్రా కేంద్రం, పవిత్ర కృష్ణా నది ఒడ్డున కలదు. భక్తులు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ఈ దేవాలయాన్ని సందర్శించడానికి విచ్చేస్తారు. ఒకానొక కాలంలో గుంటూరు ఒక ముఖ్యమైన బౌద్ధ కేంద్రంగా ఉండేది. తర్వాత కాలంలో హిందూ రాజులు సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. బౌద్ధ స్థూపం సమీపంలో అమరేశ్వర దేవాలయం ఉంటుంది, ఈ ప్రాంతంలో బ్రాహ్మణత్వం పునరుద్ధరణ ఉందన్న వాస్తవానికి సాక్ష్యంగా తెలుస్తుంది. బౌద్ధమతం తగ్గిన 8 వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడింది. అప్పటినుండి ప్రజలు తమ కోరికలను తీర్చుకునేందుకు ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు.

Undavalli Caves

భారతీయ రాతి నిర్మాణాలలో ఒకటైన ఏకశిలా నిర్మాణాలకు ఉదాహరణ ఈ ఉండవల్లి గుహలు మరియు పురాతన విశ్వకర్మ స్థాపిత యోగ్యమైనది. ఇవి గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం లోని ఉండవల్లి గ్రామంలో కృష్ణా నది దక్షిణ ఒడ్డున కలవు. విజయవాడకి నైరుతి దిశలో 6 కి.మీలు మరియు గుంటూరు కి ఈశాన్యంగా 22 కి.మీల దూరంలో ఉన్నాయి.

5 మీటర్ల ఎత్తైన బుద్ధుని విగ్రహం ఈ గుహలలో చాలా ముఖ్యమైన భాగం. ఈ గుహల్లో ఇంకో ముఖ్యమైన విశేషం ఏమిటి అనగా విష్ణు, శ్రీ మహా విష్ణువు ప్రతిమని ఒకే గ్రానైట్ రాయిపై చెక్కబడింది.

Bhavani Island

భవాని ఐలాండ్ ఒక పర్యాటక కేంద్రం, ఇది కృష్ణానది ఒడ్డున ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలదు. ఇక్కడ పిల్లలు స్వేచ్ఛగా ఆడుకోవచ్చును మరియు పెద్దలు ఈ వాతావరణాన్ని ఎంతో ఆస్వాదిస్తారు, రోజువారీ కార్యక్రమాల నుండి ఉపశమనం పొందవచ్చును. కృష్ణానదిని ఆస్వాదించడానికి ఇక్కడ చక్కటి బోటింగ్ సదుపాయాలు కలవు. ఈత కొలనులు బాగా శుభ్రంగా చూసుకుంటున్నారు, ఇవే కాకుండా ఇంకా చాలా నీటి క్రీడలు కలవు.మొత్తంగా ఇది చాలా చక్కని పర్యాటక ప్రదేశం.

Sri Trikoteswara Swamy vari Devasthanam Kotappakonda Narasaraopet Guntur District                                                      

Guntur to Kotappakonda Distance 60 KM.

Sri Saharalingeswara Sri Anjaneya swamy vari Devasthanam, Poonuru, Guntur District

Sri Durga Malleswara Swamy vari Devasthanam, Vijayawada  

Sri Lakshmi Padmavathi Sametha Sri Venkateswara Swamy vari Devasthanam  Vykuntapuram, Tenali Town

Sri Malleswara Swamy vari Devasthanam, Pedakakani Guntur District

ఆలయ సమయాలు

శ్రీ జగన్నాధ స్వామి దేవస్థానం

ప్రతి రోజు ఉదయం 06:00 గంటల నుండి 11:30 గంటల వరకు మరియు సాయంత్రం 05:00 గంటల నుండి 08:30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.

శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం

ప్రతి రోజు ఉదయం 06:00 గంటల నుండి 11:30 గంటల వరకు మరియు సాయంత్రం 05:00 గంటల నుండి 08:30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.ప్రతి మంగళవారం, శనివారం మరియు పండగ సమయాలలో ఉదయం 05:00 గంటల నుండి 11:30 గంటల వరకు మరియు సాయంత్రం 5:00 గంటల నుండి 9:30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.

శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామి దేవస్థానం

ప్రతి రోజు ఉదయం 06:00 గంటల నుండి 11:30 గంటల వరకు మరియు సాయంత్రం 05:00 గంటల నుండి 08:30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.ప్రతి శనివారం మరియు పండుగ సమయాలలో ఉదయం 6:00 గంటల నుండి 11:30 గంటల వరకు మరియు సాయంత్రం 5:00 గంటల నుండి 9:30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.

రవాణా

By Road

వియజయవాడ, నర్సారావు పేట, తెనాలి మరియు హైదరాబాద్ ల నుండి గుంటూరుకి బస్సు సదుపాయం కలదు. గుంటూరు బస్టాండ్ నుండి కిలోమీటరు దూరంలో ఆలయం కలదు.

By Train

ఆలయానికి సమీపములో 3 కిలోమీటర్ల దూరములో గుంటూరు రైల్వే స్టేషన్ కలదు.

By Air

గుంటూరు నుండి 50 కి.మిల దూరంలో విజయవాడ జాతీయ విమానాశ్రయం కలదు

Temple Address

Sri Jagannadha,Anjaneya,Venkateswara Swamy Temple,

Kothapeta Village,

Lalapet Mandel,

Guntur District,

Andhra Pradesh State,

India.
Tags : sri jaganandha ,anjaneya,venkateshwara swamy temple lalapet history in telugu,sri jaganadha swamy temple history in telugu,sri anjaneya swamy temple history in telugu,sri venkateshwara swamy temple history in telugu,guntur district famous temples,andhra pradesh famous temples,india famous temples,world famous temples,lord hanuman famous temples,lord venkateshwara swamy temple history in telugu,Guntur Jagannadha Swamy Temple, Lalapet Venkateswara Swamy Temple, Kothapet Anjaneya Swamy, Ayodhya Jagannadha Das Bavaji, Guntur Mathams History, Vasireddy Venkatadri Naidu Guntur, Guntur Rathotsavam, Vaikhanasa Agama Puja, Hanuman Jayanti Guntur, Guntur Tourism Places, Mangalagiri Panakala Swamy, Amaravathi Amareswara Temple, Undavalli Caves, Bhavani Island Vijayawada.Jagannadha & Venkateswara Swamy Temples Guntur,  Guntur Mathams History, Sri Jagannadha Swamy Guntur,  Historic Temples of Guntur

Comments