ఆంజనేయుడికి మొత్తం ఎన్ని అవతారాలు ఉన్నాయి? | How many avatars of goddess Hanuman | dharma sandehalu | Bhakthi margam
ఆంజనేయుడికి మొత్తం ఎన్ని అవతారాలు ఉన్నాయి?
ఆంజనేయునికి మొత్తం చాలా అవతారాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా తొమ్మిది అవతారాలను పరాశర సంహిత వివరించింది.
1.) ప్రసన్నాంజనేయ అవతారం
స్వామి ఈ అవతారంలో భక్తులకు అభయం ఇస్తూ గద క్రిందకు ఉంటుంది.
2.) వీరాంజనేయ అవతారం
మైందుడు అనే భక్తుడిని అనుగ్రహించడానికి స్వామి ఈ అవతారం ధరించాడ.3.)వింశతిభుజ అవతారం
ఈ అవతారంలో స్వామికి ఇరవై చేతులు ఉంటాయి. ఈ అవతారం వల్లే స్వామికి భవిష్యద్బహ్మ అయ్యే వరం వచ్చింది4). పంచముఖ ఆంజనేయ అవతారం
సీతమ్మతల్లి శతకంఠ రావణుడిని వధించే సమయంలో స్వామి ఈ అవతారం ధరించాడు. ఈ అవతారంలో స్వామికి ఐదు ముఖాలుంటాయి.5). అష్టాదశభుజాంజనేయ అవతారం
ఈ అవతారంలో స్వామికి 18చేతులు ఉంటాయి. మృత సంజీవని విద్యకు అధిపతి.6.) సువర్చలాంజనేయ అవతారం
ఈ అవతారంలో స్వామి భార్య అయిన సువర్చలా దేవితో కలిసి ఉంటాడు.7). చతుర్భుజాంజనేయ అవతారం
ఈ అవతారంలో స్వామి నాలుగు చేతులతో ఉంటాడు. కపిలుడు అనే భక్తుడిని అనుగ్రహించడానికి స్వామి ఈ అవతారం ధరించాడు.8). ద్వాత్రిశభుజాంజనేయ అవతారం
ఈ అవతారంలో స్వామికి 32 చేతులు, మూడు తలలు ఉంటాయి9).వానరాంజనేయ
రామాయణంలో మనకు కనపడే ఆంజనేయస్వామి అవతారమే ఈవానరాంజనేయ అవతారం.ఈ నవ అవతారాలే గాక సప్తముఖీ ఆంజనేయ, ఏకాదశముఖీ ఆంజనేయ వంటి అవతారాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.
శ్రీరాముడి కార్యాన్ని సిద్ధింప జేసేందుకు దుష్టులను శిక్షించేందుకు, మంచి వాళ్లని కాపాడుతూ ధైర్యంగా ఉండేందుకు ఆ పరమ శివుడే ఆంజనేయ స్వామిగా అవతరించాడని పరా శర సంహిత చెబుతోంది. అయితే ఆంజనేయ స్వామి వాయు దేవుడి అనుగ్రహం ద్వారా వానర వీరుడైన కేసరికి, ఆయన భార్య అంజనా దేవిలకు పుట్టాడు హనుమాన్.
హనుమంతుడు బాలుడిగా ఉండగానే రుద్ర తేజంతో కనిపించేవాడట. అయితే ఆంజనేయ స్వామి సుగుణాలు రామాయణ మహా కావ్యంలో చక్కగా వర్ణించారు.
వీరత్వాన్ని, శూరత్వాన్ని, దయా గుణాన్ని వివరించారు. ఆంజనేయ స్వామికి మొత్తం తొమ్మిది రూపాలు ఉన్నాయట.
కానీ ఆ అవతారాలు ఏంటో చాలా మందికి తెలియదు. అసలు హను మంతుడు అన్ని అవతారాలు ఎందుకు ఎత్తాడో కూడా తెలీదు.
అయితే రాముడి బంటుగా, ప్రజల్లోని భయాలను పారద్రోలే దివ్య శక్తిగా ఉన్న ఆంజనేయ స్వామి ఈ తొమ్మిది అవతారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం .ఆంజనేయ స్వామి 9 రూపాల్లో మొదటిది వీరాంజనేయుడు. రెండోది ప్రసన్నాంజనేయుడు. మూడోది వింశతి భుజాంజనేయుడు.
నాలుగోది అష్టా దశ భుజాంజనేయుడు, ఐదోది సువర్చలాంజనేయుడు, ఆరోది పంచ ముఖ ఆంజనేయుడు, ఏడోది చతుర్భుంజానేయుడు, ఎనిమిదోది ద్వాత్రింశద్భుజాంజనేయుడు, తొమ్మిదోది వానరాకార ఆంజనేయుడు. అయితే వివిధ సందర్భాల్లో హనుమ మొత్తం తొమ్మిది అవతారాలు ధరించారు.
ఈ తొమ్మిది ఆంజనేయ స్వామి అవతారాలు హనుమన్నఅవతారాలుగా ప్రసిద్ధి పొందాయి. అయితే ఇందుకు సంబంధించిన విషయాలు, వివరణలు అన్నీ పరా శర సంహితలో ఉన్నాయి.
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
Hanuman Avatars Explained Telugu, Hanuman 9 Avatars Telugu | Complete Details & Secretshanuman 9 avatars, anjaneya swamy avatars telugu, hanuman forms telugu, panchamukha hanuman, hanuman powerful forms, anjaneya swamy history telugu, hindu gods avatars telugu, bhakthi margam, spiritual telugu videos, hanuman secrets telugu, indian mythology telugu, hanuman facts
#Hanuman #AnjaneyaSwamy #HanumanAvatars #BhakthiMargam #SpiritualIndia #HinduMythology #TempleFacts #TeluguYouTube #Devotional #HanumanPower

Comments
Post a Comment