కోతి రూపంలో ప్రత్యక్షమైన హనుమంతుడు 😲 | Appanaveedu Sri Abhaya Anjaneya Swamy Temple History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం


 
శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం

ఆలయ చరిత్ర

కృష్ణా - పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన హనుమాన్ జంక్షన్ లో నూజివీడు జమీందారు ఎం.ఆర్.అప్పారావు గారి తండ్రి శ్రీ మేకా వెంకటాద్రి అప్పారావు బహద్దూర్ గారు స్వామి వారి విగ్రహాన్ని 1938 సంవత్సరం ప్రతిష్టించారు. జమిందార్ దార్ శ్రీ మేకా వెంకటాద్రి అప్పారావు బహద్దూర్ గారు  హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి  వచ్చారు  ఆయనకు విపరీతమైన ఆకలివేయటంతో  ఆహారం కోసం వెతికారు కానీ చుట్టు ప్రక్కల ఎక్కడ ఆహారంగాని, పళ్ళు గాని లేవు ఎటుచూసిన బీడు భూములు, డొంకలు, ముళ్ళు పొదలతో నిండి అక్కడ అంతా నిర్మానుష్యముగా ఉంది అప్పుడు ఒక వానరం జమిందారు గారి చేతిలో అరటి పండు పెట్టి అదృశ్యమై పోయింది. 

ఆ పండును భుజించిన జమీందారు గారికి ఎంతో శక్తి వచ్చినట్లు అయింది తనకు సాక్షాత్తు శ్రీరామ పద భక్తుడైన ఆంజనేయస్వామి వారే అలా కోతి రూపంలో వచ్చి అరటిపండు ఇచ్చి వెళ్లాడని గ్రహించి జమీందారు హృదయం భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందింది. అడగకుండా తన ఆకలి తీర్చిన కొండంత దేవుడు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించాలని ఆయన మనస్సులో తక్షణం సంకల్పము కలిగినది. 

ఒక మహత్కార్యానికి తొలి బీజము పడిన అధ్బుత క్షణాలు అవి తన భక్తులను దుష్ట గ్రహ పీడన బారి నుండి రక్షించేoదుకు స్వయంగా విచ్చేసిన ఆంజనేయస్వామి నిలువెత్తు మానవరూప విగ్రహాన్ని తయారు చేయించిన జమీందారు నాలుగు రోడ్ల కూడలి అయిన హనుమాన్ జంక్షన్లో స్వామి వారి విగ్రహం ఏర్పాటు చేశారు. అప్పటికి ఆ ప్రాంతంలో నాలుగైదు పూరిళ్ళు తప్ప ఏమీలేవు. ఎలాంటి అభివృద్ధి లేదు. రామయాణ మహా కావ్యంలో దండ కారణ్యంగా ఉండేది. ఆనాడు వెంటనే అరటిపండ్లును తీసుకునివచ్చి శ్రీరామునికి ఇచ్చి ఆయన క్షుద్భాధను తీర్చాడు ఆ గాధని తలపించే విధంగా హనుమాన్ జంక్షన్ కూడలిలో రామా . 

అగు ఇవిగో అరటి పండ్లు అంటున్న ఆంజనేయ విగ్రహాన్ని, ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా రోడ్డు అవతల రామాలయాన్ని నిర్మించారు. శ్రీరామనవమి నాడు ఈ ఆలయములో  సీతారాములు కళ్యాణవేడుక అత్యద్భుతముగా భక్తుల నయనాలకు కమనీయ ధృశ్యముగా జరుగుతుంది.

పశ్చిమ గోదావరి జిల్లా, నవాబు పాలెంకు చెందిన దంతినాడు సన్యాసిలింగం ఈ విగ్రహానికి మానవ రూపకల్పన చేశారు. గానుగ సున్నంతో 9 అడుగుల  శ్రీ స్వామి వారి విగ్రహాన్ని తయారు చేసి ఎంతో వ్యయ ప్రయాసాలతో ఎడ్ల బండి పై తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టింప చేశారు.

దేవతా మూర్తులు

SRI ABHAYA ANJANEYA SWAMY TEMPLE

శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం

సందర్శించవలసిన ప్రదేశాలు

APPANAVEEDU (HANUMAN JUNCTION)

శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, అప్పనవీడు గ్రామం( హనుమాన్ జుంక్షన్), పెద్దపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా.

రవాణా

By Road

temple is 0.5 km from the hanuman junction Bus station

By Train

The nearest railway station is Nuziveedu 2 km away from temple

By Air

The nearest airport is at Gannavaram which is 25 KM away from temple

Temple Timings 

Morning : 5am to 11am

Evening : 4pm to 8pm

Temple Address

Sri Abhaya Anjaneya Swamy Temple,

Appanaveedu Village,

Peddapadu Mandel,

West Godavari District,

Andhra Ptadesh State,

India.
Tags : sri abhaya anjaneya swamy temple appanaveedu history in telugu ,lord hanuman famous temples,west godavari famous temples,andhra pradesh famous temples,india famous temples,world famous temples,Hanuman Junction Miracle, Abhaya Anjaneya Swamy Temple History Telugu, Hanuman Junction Temple Mystery, abhaya anjaneya swamy temple, hanuman junction temple telugu, anjaneya swamy miracle story, hanuman temple history telugu, krishna west godavari temples, hanuman blessings story, indian temples telugu, bhakthi margam, spiritual telugu videos, hanuman facts telugu, powerful temples andhra pradesh, #AnjaneyaSwamy #HanumanJunction #HanumanMiracle #BhakthiMargam #TempleFacts #SpiritualIndia #IndianTemples #TeluguYouTube #Devotional #HanumanBlessings

Comments