సంక్రాంతి అంటే ఏమిటీ | సంక్రాంతి అంటే అసలైన అర్థం | what is sankranti| meaning of sankranti | bhakthi Margam


సంక్రాంతి

సంక్రాంతి అంటే ఏమిటీ

సంక్రాంతి అనగా నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు.అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది.సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది నవ్యాంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్టాలలో ప్రముఖంగా జరుపుకుంటారు . 

ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో నాలగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ మూడు రోజులలో మొదటి రోజు బోగిమంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గో పూజలతో అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో, మూడురోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది.

సంక్రాంతి అంటే అసలైన అర్థం

రంగు రంగుల రంగవల్లులు, భోగి మంటల వెలుగులు, గంగిరెద్దుల విన్యాసాలు పతంగుల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు వీటన్నింటి కలబోతే సంక్రాంతి. తెలుగు ప్రజల ముఖ్య పండుగ సంక్రాంతి.. సంక్రాంతి అంటే నూతన క్రాంతి. మరి ఈ పండుగ విశేషాలు ఏంటో చూసేద్దామా..

సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. తమ చేతికి పంటలు వచ్చాయనే ఆనందంతో రైతులు ఈ పండుగని ఉత్సవంలా జరుపుకుంటారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు.. సిటీలన్నీ చిన్నబోతాయి.. చిన్నా పెద్దా అందరూ కూడా బస్సు, రైలు.. ఇలా తమకి ఎలా వీలైతే అలా పల్లె బాట పయనమవుతారు. ఇక ఇక్కడ మొదలు ఓ నాలుగైదు రోజులు సిటీలన్నీ ఖాళీ అయిపోతే.. పట్నాలేమో పంట పొలాలు, పందేలు ఒక్కటేంటి అన్నింటా మేమే అన్నట్లుగా మురిసిపోతాయి. అసలు సంక్రాంతికి ఇంత క్రేజ్ ఎందుకు అంటే.. ఆ విశేషాలే తెలుసుకుందాం..

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్నే మకర సంక్రమణం అంటారు. ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. సంక్రాతిని మూడు రోజులు జరుపు కుంటారు. అందులో మొదటి రోజు భోగి. రెండొవ రోజు మకర సంక్రాంతి, మూడోవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాల్లో మాత్రం నాల్గవ రోజును ముక్కనుమగా కూడా జరుపుకుంటారు.

భోగి

ఈ మూడు రోజుల్లో మొదటి రోజున భోగి మంటలు వేస్తారు. ఇళ్ళలోని పాతవస్తువులను తీసి వాటిని భోగి మంటల్లో వేస్తారు. సంక్రాంతి పండుగ మూడు రోజులు కూడా ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేసి మురిసిపోతారు మహిళలు. భోగి రోజున చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. దీంతో వారిపై ఉన్న దిష్టి మొత్తం పోవడమే కాకుండా.. సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు చిన్నారులపై ఉంటాయని నమ్ముతారు. దాంతో పాటు పిల్లలు స్నానం చేసే నీటిలో రేగు పండ్లు వేస్తారు. ఇలా చేయడం వల్ల రేగిపళ్ళలోని ఆయుర్వేదిక్ లక్షణాలు చలికాలంలో వచ్చే చర్మ వ్యాధులను దూరం చేస్తుందని చెబుతారు.

సంక్రాంతి

ఇక సంక్రాంతి పండుగ రోజున పొంగలి పిండి వంటలతో పితృదేవతల, దేవుళ్ళ పూజలు చేస్తారు. ఈ చనిపోవియన వారికి వండి వడ్డిస్తారు కాబట్టి.. రోజున పెద్దల పండుగ అని కూడా అంటారు. కొంతమంది ఈ రోజున బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేస్తారు.

కనుమ

కనుమ రోజున శివునికి ఇష్టమైన నందిని పూజించడం ఆచారం. గో పూజలు చేసి మాంసప్రియులు ఆనందంగా జరుపుకుంటారు.

ముక్కనుమ (సంక్రాంతి ముగ్గులు)

నాల్గవ రోజు అంటే చివరి రోజు ముక్కనుమన అమ్మవారిని నైవేద్యం పెడతారు. సంక్రాంతి అంటేనే అన్నదాతకు ఆనందాన్ని ఇచ్చే పండుగ. వచ్చే పంటలు కూడా బాగుండాలని కోరుకుంటూ సూర్య భగవానుని పూజిస్తారు.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags : Haridas, haridasu,lord Vishnu, maha Vishnu stories, story about Haridas,why Haridas will come to home, bhakthi Margam, margashiri masam, danuru masam, bhakthi Margam.in , importance of Haridas, significance of Haridas, Pongal, sankranti,kanuma, importance of sankranti festivals, Pooja Vidhanam of sankranti festival,makkars sankranti, time and date of sankranti festival, Pongal date and time 2024,bhogi date 2024, what is sankranti, meaning of sankranti, bhogi, sankranti,kanuma,

Comments