సంక్రాంతి శుభ ముహుర్తం , పూజా విధానం | sankranti date and time, sankranti Pooja vidhanam | bhakti margam |


మకర సంక్రాంత

హిందూ పంచాంగం ప్రకారం, సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ నెల 15వ తేదీ సోమవారం నాడు మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఇదే సమయంలో ఉత్తరాయానం ప్రారంభమవుతుంది. 

ఈ సమయంలో ఖర్మలన్నీ ముగుస్తాయి. ఆ మరుసటి రోజు నుంచే అంటే జనవరి 16వ తేదీ నుంచి వివాహాది తదితర శుభకార్యాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సందర్భంగా సంక్రాంతి శుభ ముహుర్తం ఎప్పుడొచ్చింది... ఈ పర్వదినాన సూర్యదేవుని ఆశీస్సుల కోసం ఎలాంటి పూజలు చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

శుభ ముహర్తం

ఈసారి శుభ ముహుర్తం 15 జనవరి 2024 సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 5:36 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో మీరు భగవంతుడిని ఆరాధించొచ్చు. మకర సంక్రాంతి మహా పుణ్య కాలం ఉదయం 7 గంటల నుంచి ఉదయం 8:46 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో సూర్య దేవునితో పాటు శ్రీ విష్ణుమూర్తిని పూజించాలి.

పూజా విధానం

* మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడితో పాటు శని దేవుడిని ఆరాధించాలి.

మకర సంక్రాంతి పండుగ రోజున బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేచి, స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించాలి.

* రాగి పాత్రలో కొంత నీరు తీసుకుని, అందులో కొద్దిగా సింధూరం, అక్షింతలు, ఎర్రని పువ్వులు వేసి సూర్య దేవునికి అర్ఘ్యం సమర్పించాలి.

* మకర సంక్రాంతి సందర్భంగా సూర్య భగవానుడికి బెల్లం, నువ్వులు సమర్పించాలి.

* సూర్యుడికి హారతి ఇచ్చే సమయంలో ఈ మంత్రాలను జపించాలి.

ఓం గృణీం సూర్యః ఆదిత్యః

ఓం హ్రీం హ్రీం సూర్యాయ సహస్రరాయ రాయ

ఓం హ్రీం హ్రీం సూర్య ఓం’ అనే మంత్రాలను జపించాలి.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags : panchangam , telugu festivals , 2024 , Daily panchangam , telugu festivals 2024 , telugu 2024 festivals , bhakthi margam , december 2024 rashi phalalu , rashi phalalu  , gantala panchang , today panchangam, sankranti panchangam, sankranti date and time, Pooja vidhanam bhakti margam, 

Comments