పోలి పాడ్యమి రోజు ఏ విధంగా దీపాలను వెలిగించాలి ?| Poli Padyami Pooja Vidhanam In Telugu | Poli Padyami 2023 | Bhakthi Margam | భక్తి మార్గం
పోలి పాడ్యమి ( పోలిస్వర్గం )
పోలి పాడ్యమి - ఇది కార్తీకమాసం ముగిసిన తరువాత వచ్చిన పాడ్యమి రోజు.దీన్ని పోలిస్వర్గం అని కూడా అంటారు. పూర్వం ఓ మహిళ కార్తీకమాసం నెల రోజులు క్రమం తప్పకుండా నియమనిష్ఠలతో దీపారాధన చేసి పరమశివుని పూజించి మోక్షం పొందిందని.. పోలి పాడ్యమి రోజున స్వర్గ ప్రాప్తి పొందిందని పురాణ కథనం.
డిసెంబరు 12 కార్తీక అమావాస్య వచ్చింది... డిసెంబరు 13 పోలి పాడ్యమి అంటారు. ఈ రోజుతో కార్తీకమాసం పూర్తై మార్గశిర మాసం మొదలవుతుంది. కార్తీకమాసంలో నెలరోజుల పాటూ నియమంగా పాటించినవారు.
Panchangam
Tithi పాడ్యమి : Dec 13 05:01 AM to Dec 14 03:09 AM
విదియ : Dec 14 03:09 AM to Dec 15 12:56 AM
Nakshatram జ్యేష్ఠ: Dec 12 11:56 AM to Dec 13 11:05 AM
మూల: Dec 13 11:05 AM to Dec 14 09:47 AM
Yogam శూల: Dec 12 06:51 PM to Dec 13 04:17 PM
గండ: Dec 13 04:17 PM to Dec 14 01:24 PM
Karanam కింస్తుఘ్న: Dec 13 05:02 AM to Dec 13 04:09 PM
బవ: Dec 13 04:09 PM to Dec 14 03:09 AM
భాలవ: Dec 14 03:09 AM to Dec 14 02:05 PM
Time to Avoid (Bad time to start any important work)
Rahukalam 12:10 PM to 1:32 PM
Yamagandam 8:03 AM to 9:25 AM
Varjyam 08:16 AM to 09:47 AM
Gulika 10:47 AM to 12:10 PM
Good Time (to start any important work)
Amritakalam 03:48 AM to 05:19 AM
Abhijit Muhurtham Nil
పోలి పాడ్యమి నోము కధ:
ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్లు. ఆ అయిదుగు కోడళ్లలో చివరిది … చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పూవులు కోయడం … పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకూ దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది. పూవులు కోయడానికి … పూజలు చేయడానికి … అసలు గుడికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త.సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా వుంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది.
పోలి అత్తకు తాను మహా భక్తురాలిననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనకచేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున వుంచి, మిగతా కోడళ్ళను తీసుకుని గుడికి వెళ్లి వచ్చేది.ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి, ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్లింది. పోలి ఏ మాత్రం బాధపడకుండా, బావి దగ్గరే స్నానం చేసి … పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్ల కవ్వానికి వున్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది.
పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది.ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త, తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్లు పట్టుకుంది.
ఆ వెంటనే మిగతా కోడళ్లు ఒకరి తరువాత ఒకరుగా ఒకరి కాళ్లు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్లిపోయింది.
అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు … కార్తీక అమావాస్య వరకూ ప్రతి నిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయతీగా వస్తోంది. ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది.
పోలి పాడ్యమి పూజ విధానం
స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గం నోము ఒకటి. పురాతనకాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోన్న ఈ నోము, ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ, జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ వుంటుంది.
కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా అమావాస్య రోజు పోలిని స్వర్గానికి పంపిస్తారు. కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడే లేచి నెల రోజులు చేసినట్టుగా స్నానం చేసి అరటి దొప్పలో వత్తిని వెలిగించి చెరువులో కానీ ఒక బేసిన నీళ్ళు పోసికాని దీనిని వదులుతూ ఈ కధను చదువుకోవాలి. తరువాత కథ అక్షింతలు తల మీద వేసుకోవలను.
పురాణ కథ
ఇక కథలోకి వెళితే ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్లు. ఆ అయిదుగు కోడళ్లలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పూవులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకూ దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది. పూవులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త.సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా వుంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది.
పోలి అత్తకు తాను మహా భక్తురాలిననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనకచేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున వుంచి, మిగతా కోడళ్ళను తీసుకుని గుడికి వెళ్లి వచ్చేది.ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి, ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్లింది. పోలి ఏ మాత్రం బాధపడకుండా, బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్ల కవ్వానికి వున్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది.
పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది.ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త, తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్లు పట్టుకుంది.
ఆ వెంటనే మిగతా కోడళ్లు ఒకరి తరువాత ఒకరుగా ఒకరి కాళ్లు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్లిపోయింది.అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకూ ప్రతి నిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయతీగా వస్తోంది. ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది.
కార్తీకమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున 30 వత్తులతో దీపం వెలిగించి నీటి ప్రవాహంలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది.
పోలి పాడ్యమి విశిష్టత
స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలి స్వర్గం నోము. ప్రాచీనకాలం నుంచి కార్తీకమాసంలో స్త్రీలు అందరిని ప్రభావితం చేసే నోములలో పోలిస్వర్గం నోము ఒకటి.
ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకూ ప్రాతః కాలమేలేచి నదీ స్నానం చేసి దీపములను వెలిగించలేనివారు, ఈ పోలి స్వర్గం నాడు తెల్లవాఝామునే లేచి నదిలో స్నానమాచరించి అరటిదొప్పలో దీపములు వెలిగించి వదిలిపెట్టిన యెడల కార్తీకమాసం అంతా తెల్లవాఝామున నదీస్నానమాచరించిన ఫలితము, దీపములు వెలిగించిన ఫలితములు కలుగును.
పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి (పోలి పాడ్యమి)రోజున వెలిగించుకోవాలి.
స్త్రీలందరూ ఈ రోజున కలసికట్టుగా నదీస్నానం చేసి, నదిఒడ్డునే దీపములను వెలిగించి, నోమును ఆచరించి, బ్రాహ్మణోత్తమునలకు స్వయంపాకములు, దీపదానములు ఇచ్చి ఆశీర్వాదములు పొందుతారు. కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం.
పొలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గమునకు తీసుకువెళ్ళే వృత్తాంతమే పోలిస్వర్గం నోము కధ.
పోలి స్వర్గం రోజు ఏ విధంగా దీపాలను వెలిగించాలి?
కార్తీక మాసం చివరి రోజు అమావాస్య రోజు పెద్ద ఎత్తున ఆ శివునికి అభిషేకాలు నిర్వహించి, రావిచెట్టుకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు.కార్తీక మాసం నెల రోజులు దీపాలను వెలిగిస్తారు.
అయితే ఈ నెలలో చివరి రోజైన మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున దీపాలను అరటి దొప్పలతో పెట్టి నదులలో వదలడాన్ని పోలి స్వర్గం అని పిలుస్తారు.అయితే ఈసారి అమావాస్య సోమవారం వచ్చింది.
పాడ్యమి మంగళవారం రావడంతో పోలి దీపాలను ఎప్పుడు వెలిగించాలి అన్న సందిగ్ధంలో ఉన్నారు.అయితే ఈ పోలి దీపాలను మంగళవారం తెల్లవారు జామున వెలిగించడం మంచిదని పండితులు చెబుతున్నారు.
మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు స్త్రీలు వేకువజామున నిద్రలేచి నదీ స్నానాలు ఆచరించి ఆ నదిలో ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి అరటి దొప్పల పై పెట్టీ నదులలో వదులుతారు.అదే విధంగా ఆ నది మాతకు పసుపు, కుంకుమ, పూలతో పూజిస్తారు.
పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకుని పోలి కథను వినాలి.
పురాణాల ప్రకారం పోలి అనే మహిళకు కార్తీకమాసంలో దీపారాధన చేయకుండా ఉండటానికి జాగ్రత్త పడిన తన అత్త కుటిల బుద్ధితో దీప సామాగ్రిని దాచి ఉంచి తను మాత్రమే గుడికి వెళ్లి దీపాలు పెట్టేది.
కానీ పోలీ మాత్రం చెట్టు నుంచి పత్తిని తీసుకుని ఒత్తులు తయారు చేసుకునేది.అలాగే మజ్జిగ కవ్వానికి ఉన్న వెన్న ద్వారా దీపాలను వెలిగించి ఎవరికీ కనపడకుండా ఆ దీపం పై గంపను బోర్లించేది.
ఎన్ని దీపాలు వెలిగించాలి ?
పోలి పాడ్యమి.. కార్తీక మాసం చివరి రోజు చేసే క్రతువు. ఉదయాన్ని వత్తులు వేసి.. అరటి దొప్పలులో దీపం పెడతారు. అలా భగవంతుడిని కోలుస్తారు. హరిహరులకు కార్తీకమాసం ప్రీతకరమైంది. మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటిదొప్పలులో దీపాలను వెలిగించి భక్తుల నదులు, పుష్కరిణిలలో వదులుతారు. వీలుకానీ వారు ఇంటి వద్ద బకెట్/ టబ్‌లో వేస్తారు. మహాశివుడు, అమ్మవారికి పూజలు చేస్తున్నారు.
30 వత్తులు
కార్తీకమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున 30 వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే.... ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని లేదా స్వయంపాకాన్ని దానం చేస్తారు. తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మీ రూపంగా భావిస్తుంటారు. కాబట్టి చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు.
ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది. ఇలా నెల మొత్తం గడిచిపోయాక చివరికి అమావాస్య రోజున కూడా పోలికి దీపాలు వెలిగించే అవకాశం లేకుండా ఇంటి పనులన్నీ తనకు చెప్పి అత్త గుడికి వెళ్లిపోయారు.ఈరోజు కూడా పోలి యథావిధిగా ఇంటి పనులన్నీ ముగించుకొని కార్తీక దీపాలను వెలిగించింది .ఎన్ని కష్టాలు అవాంతరాలు ఎదురైనా పోలి మాత్రం దీపాలు వెలిగించడంతో దేవతలు ఆనందపడి పోలిని స్వర్గానికి తీసుకువెళ్లడానికి స్వర్గ లోకం నుంచి దేవతలు వస్తారు.అందు కోసమే శుద్ధ పాడ్యమి రోజున పోలి స్వర్గం అనే పండుగను జరుపుకుంటారు.
ఈరోజు ఎవరైతే 30 వత్తులను వెలిగించి నీటిలో వదులుతారో వారికి ఈ నెల మొత్తం దీపారాధన చేసినంత పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రగాఢ నమ్మకం.
నదులు కాలువలు అందుబాటులో లేని వారు ఒక గిన్నెలో నీటిని పోసి తులసి కోట ముందు ఈ దీపాలను వెలిగించి గంగా దేవికి నమస్కరించడం ద్వారా పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
Related Postings:
1. Stotras In Telugu
tags : karthika masam,karthik pooranam pooja vidhanam,పోలి పాడ్యమి[పోలిస్వర్గం] ,Poli Padyami [Polisvargam] ,పోలి పాడ్యమి నోము కధ , పోలి స్వర్గం రోజు ఏ విధంగా దీపాలను వెలిగించాలి? , పోలి పాడ్యమి విశిష్టత , పోలి పాడ్యమి పూజ విధానం , importance of karthika puranam , karthika padyami history , poli padyami history, poli padyami story , bhakthi margam.in , padyami , poli swargam , poli padyami pooja vidhanam , karthika puranam pooja vidhanam , Karthika Masam 2023, Karthika Poli Padyami 2023, poli padyami 2023, poli padyami 2023 Date And Time,How To Light Poli Swargam Deepam, Karthika Poli Swargam Story In Telugu, Poli Swargam 2023 date, Significance of Poli Swargam Deepam during Karthika month, History of Poli Swargam, Poli Swargam History In Telugu

Comments
Post a Comment