కార్తీక మాసం లో పఠించాల్సిన మంత్రం, నైవేద్యం | karthika masam 30 days mantras in telugu | bhakthi margam


కార్తీక మాసం లో పఠించాల్సిన మంత్రం, నైవేద్యం
 

1వ రోజు :- నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు
 దానములు:- నెయ్యి, బంగారం
 పూజించాల్సిన దైవము:- స్వథా అగ్ని
 జపించాల్సిన మంత్రము:- ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా

 2వ రోజు :- నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు    
  దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు
  పూజించాల్సిన దైవము:- బ్రహ్మ
  జపించాల్సిన మంత్రము:- ఓం గీష్పతయే - విరించియే స్వాహా

 3వ రోజు:- నిషిద్ధములు :-  ఉప్పు కలిసినవి, ఉసిరి
  దానములు:- ఉప్పు
  పూజించాల్సిన దైవము:- పార్వతి
  జపించాల్సిన మంత్రము:-  ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా

 4వ రోజు:- నిషిద్ధములు:- వంకాయ, ఉసిరి
 దానములు:- నూనె, పెసరపప్పు
 పూజించాల్సిన దైవము:- విఘ్నేశ్వరుడు
 జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా

5వ రోజు:- నిషిద్ధములు:- పులుపుతో కూడినవి
దానములు:- స్వయంపాకం, విసనకర్ర
జించాల్సిన దైవము:- ఆదిశేషుడు
జపించాల్సిన మంత్రము:-  (మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)

 6వ రోజు:- నిషిద్ధములు:- ఇష్టమైనవి , ఉసిరి
దానములు:- చిమ్మిలి
పూజించాల్సిన దైవము:- సుబ్రహ్మణ్యేశ్వరుడు
జపించాల్సిన మంత్రము:- ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా

 7వ రోజు:- నిషిద్ధములు:- పంటితో తినే వస్తువులు, ఉసిరి
దానములు:- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం
పూజించాల్సిన దైవము:- సూర్యుడు
జపించాల్సిన మంత్రము:- ఓం. భాం. భానవే స్వాహా

 8వ రోజు:-నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం
దానములు:- తోచినవి - యథాశక్తి
పూజించాల్సిన దైవము:- దుర్గ
జపించాల్సిన మంత్రము:- ఓం - చాముండాయై విచ్చే - స్వాహా

 9వ రోజు:-నిషిద్ధములు:- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి
దానములు:- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
పూజించాల్సిన దైవము:- అష్టవసువులు - పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః

10వ రోజు:- నిషిద్ధములు:- గుమ్మడికాయ, నూనె, ఉసిరి
దానములు:- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె
పూజించాల్సిన దైవము:- దిగ్గజాలు
జపించాల్సిన మంత్రము:- ఓం మహామదేభాయ స్వాహా

11 వ రోజు:- నిషిద్ధములు:- పులుపు, ఉసిరి
దానములు:- వీభూదిపండ్లు, దక్షిణ
పూజించాల్సిన దైవము:- శివుడు
జపించాల్సిన మంత్రము:-  ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ

 12వ రోజు:- నిషిద్ధములు:- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి
దానములు:- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ
పూజించాల్సిన దైవము:- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము:- ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా

13వ రోజు:- నిషిద్ధములు:- రాత్రి భోజనం, ఉసిరి
దానములు:- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం
పూజించాల్సిన దైవము:- మన్మధుడు
జపించాల్సిన మంత్రము:-  ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా

 14వ రోజు:- నిషిద్ధములు:- ఇష్టమైన వస్తువులు, ఉసిరి
దానములు:- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె
పూజించాల్సిన దైవము:- యముడు
జపించాల్సిన మంత్రము:- ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా

15వ రోజు:-నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు
దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు 
పూజించాల్సిన దైవము:- శివుడు
జపించవలసిన మంత్రం:- 'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'

 16వ రోజు:- నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది,ఎంగిలి, చల్ల
దానములు:- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము:- స్వాహా అగ్ని
జపించాల్సిన మంత్రము:- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః

17వ రోజు:-నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు
దానములు:- ఔషధాలు, ధనం
పూజించాల్సిన దైవము:- అశ్వినీ దేవతలు
జపించాల్సిన మంత్రము:- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా

18వ రోజు:- నిషిద్ధములు:- ఉసిరి
దానములు:- పులిహార, అట్లు, బెల్లం
పూజించాల్సిన దైవము:- గౌరి
జపించాల్సిన మంత్రము:- ఓం గగగగ గౌర్త్యె స్వాహా

 19వ రోజు:-నిషిద్ధములు:- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి
దానములు:- నువ్వులు, కుడుములు
పూజించాల్సిన దైవము:- వినాయకుడు
జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా

 20వ రోజు:- నిషిద్ధములు:- పాలు తప్ప - తక్కినవి
దానములు:- గో, భూ, సువర్ణ దానాలు
పూజించాల్సిన దైవము:- నాగేంద్రుడు
జపించాల్సిన మంత్రము:- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం

 21వ రోజు:- నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం
దానములు:- యథాశక్తి సమస్త దానాలూ
పూజించాల్సిన దైవము:- కుమారస్వామి
జపించాల్సిన మంత్రము:- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా

 22వ రోజు:- నిషిద్ధములు:- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి
దానములు:- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు
పూజించాల్సిన దైవము:- సూర్యుడు
జపించాల్సిన :-మంత్రము:- ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా

 23వ రోజు:-నిషిద్ధములు:- ఉసిరి, తులసి
దానములు:- మంగళ ద్రవ్యాలు
పూజించాల్సిన దైవము:- అష్టమాతృకలు
జపించాల్సిన మంత్రము:-  ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృ కాయ స్వాహా

24వ రోజు:- నిషిద్ధములు:- మద్యమాంస మైధునాలు, ఉసిరి
దానములు:- ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు
పూజించాల్సిన దైవము:- శ్రీ దుర్గ
జపించాల్సిన మంత్రము:- ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా
 25వ రోజు:- నిషిద్ధములు:- పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు
దానములు:- యథాశక్తి
పూజించాల్సిన దైవము:- దిక్వాలకులు
జపించాల్సిన మంత్రము:-  ఓం ఈశావాస్యాయ స్వాహా

26వ రోజు:- నిషిద్ధములు:- సమస్త పదార్ధాలు
దానములు:- నిలవవుండే సరుకులు
పూజించాల్సిన దైవము:- కుబేరుడు
జపించాల్సిన మంత్రము:- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా

 27వ రోజు:-నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, వంకాయ
దానములు:- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు
పూజించాల్సిన దైవము:- కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము:- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా

 28వ రోజు:-నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ
దానములు:- నువ్వులు, ఉసిరి
పూజించాల్సిన దైవము:- ధర్ముడు
జపించాల్సిన మంత్రము:- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా

 29వ రోజు:- నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి
దానములు:- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము:- శివుడు (మృత్యుంజయుడు)
జపించాల్సిన మంత్రము:- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్

30వ రోజు:- నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి
దానములు:- నువ్వులు, తర్పణలు, ఉసిరి
పూజించాల్సిన దైవము:- సర్వదేవతలు, పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః

Related Postings:

1. Stotras In Telugu

5. Rashi Phalalu

tags: nitya pooja vidhanam in telugu , nitya parayana slokas in telugu, nitya parayana mantralu , daily puja procedure at home , daily pooja vidhi ,most powerful mantras in telugu , most powerful slokas 

Comments