హరిదాసు | హరిదాసు అంటే ఎవ్వరు? హరిదాసు సంక్రాంతి నెలలో ఎందుకు వస్తారు | Haridas| who is Haridas| why Haridas came in sankranti month | Bhakthi Margam |భక్తి మార్గం


హరిదాసు

హరిదాసు అనే పేరుతో మూడు వర్గాలలో ప్రసిద్దులు కలరు.నారదుడు మొదటి హరిదాసు అంటారు.

హరిదాసు వేషధారణ చేతిలో చిరతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టి, మెడలో ఒక పూల హారం ధరించి చక్కగా తిలకం దిద్దుతాడు. తెలుగు రాష్ట్రాలలో పండులప్పుడు ముఖ్యంగా సంక్రాంతికి వీరికి విశేష ప్రాముఖ్యత ఉన్నది, హిందువుల నమ్మకం ప్రకారం హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే దానధర్మాలు అందుకోని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని దివించెవారు హరిదాసులు .

వీరు నెలరోజులు పాటు వీధి వీధినా హరినామన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరు ఇచ్చే ధన,ధాన్య , వస్తు దానాలను స్వికరిస్తారు . సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా బావిస్తారు .ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు.

ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది.శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. చిడతలు వాయిస్తూ, కీర్తనలు పాడుతూ, వాటికి అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రతి వాకిలికి వెళ్తారు. అందరూ తమ స్థాయిని బట్టి హరిదాసుకు బియ్యం , కూరగాయలు, డబ్బుల రూపంలో దానం చేస్తారు.

హరిదాసును విష్ణు మూర్తికి సంకేతంగా భావిస్తారు. తల మీద ఉండే గిన్నెను భూమికి ప్రతీక అని చెప్తారు. లోకంలో ఉండే సుఖాలకు లొంగిపోయి దేవుడిని మర్చి-పోవద్దని హరిదాసు కీర్తనలు పాడతాడు. అలాగే ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా అందరూ సమానమని హరిదాసు కీర్తనల్లో, రూపంలో ఉంటుంది. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమంటని కొంతమంది నమ్మకం అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు.

అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు. హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.కాలంతో పాటుగా హరిదాసులు వాహనాల మీదే తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. రికార్డు చేయించిన హరినామ కీర్తనలను మైక్‌ ద్వారా ప్రజలకు వినిపిస్తున్నారు.

మొదటి వర్గం

వీరు శ్రీహరి గాధల వ్యాప్తికి కృషి చేయుచూ హరికథ అనే ప్రక్రియ ద్వారా ప్రదర్శనలిచ్చుచూ ఉందురు.

రెండవ వర్గం

కర్ణాటక ప్రాంతములో హరిదీక్ష తీసుకొని భజన, గానం, నృత్యాల ద్వారా హరి నామాన్ని వ్యాప్తి చేయువారు.

మూడవ వర్గంవీరు 

హరినామ సంకీర్తన చేయుచూ కార్తీకమాసము, సంక్రాంతి సమయాల్లో గ్రామములలో బిక్షాటన చేయువారు

Haridasu: ఎవరీ హరిదాసు? సంక్రాంతి రోజున ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందో తెలుసా?

హరిదాసు కీర్తనలు, సంక్రాంతి సంబరాలు, ఈ రెండింటికి మధ్య ఎంతో సంబంధం ఉంది. సంక్రాంతి పండగ రోజు ఒక చేతిలో చిడతలు, మరో చేతిలో తంబురా, నుదుటన మూడు నామాలు, తలపై అక్షయ పాత్ర పెట్టుకుని సంక్రాంతి రోజున కనిపిస్తారు హరిదాసులు. హరిలో రంగ హరి అంటూ విష్ణు కీర్తనలు చేస్తూ కనిపించే హరిదాసులు సంక్రాంతి రోజు వస్తుంటారు. ఇంటింటికి తిరుగుతూ భిక్షం అడుగుతారు.

సంక్రాంతికి కనిపించే హరిదాసులు ఎవరు, హరిదాసులకు సంక్రాంతికి మధ్య సంబంధం ఏంటి, ఎందుకు సంక్రాంతి రోజు కనిపిస్తారు లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హరిదాసు ఎలా ఉంటారంటే.. హరిదాసుల తలపై అక్షయ పాత్ర ఉంటుంది. రాగి పాత్రను గుమ్మడికాయలాగా తీర్చిద్ది దానిని తలపై ఉంచుకుంటారు. ఒక చేతిలో చిడతలు, మరో చేతిలో తంబురా, కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. నుదుటన మూడు నామాలు, పంచె, పైనా శాలువా కప్పుకుని కనిపిస్తారు.

వీధుల్లో తిరుగుతూ విష్ణు కీర్తనలు ఆలపిస్తుంటారు. చిడతలు, తంబురా, గజ్జెలను లయబద్ధంగా కదిలిస్తుంటారు. శ్రీరామదాసు రచించిన పాటలను ఆలపిస్తారు. సంక్రాంతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు హరిదాసులు వీధుల్లో ఇంటింటికి తిరుగుతుంటారు.

హరిదాసు ప్రత్యేకత ఏంటంటే.. * హరిదాసు చిడతలు వాయిస్తూ వీధుల్లో తిరుగుతున్నప్పుడు భిక్షం అడగరు. ఎవరైనా దానం చేస్తేనే తీసుకుంటారు. * అలాగే వీరు వెనక్కి తిరిగి చూడరు. ఇళ్లు దాటి ముందుకు వెళ్లారంటే ముందుకే నడుస్తూ వెళ్తారు. * వీధుల్లో తిరుగుతున్నంత సేపు విష్ణు కీర్తనలు చేస్తుంటారు. ఎవరితోనూ ఎలాంటి మాటలు మాట్లడరు.

* ఇంటి ముందు నుండి హరిదాసు వెళ్తున్నప్పుడు ఆయన కాళ్లు కడిగి ఆయన ఆశీస్సులు పొందుతుంటారు. * ఎవరైనా బియ్యం, డబ్బు ఇస్తే పాత్రలో వేసేందుకు వీలుగా కిందకు వంగుతాడు. * సంక్రాంతి వేడుకలు ముగిశాక హరిదాసులంతా భద్రాచలంలో సమావేశం అవుతారు. * వారికి వచ్చిన బియ్యం, డబ్బులతో భద్రాచలం ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేస్తారు. * హరిదాసు వేషాధారణలో ఉన్నంత వరకు వారు రాత్రిపూట రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తారు.

హరిదాసులు భిక్షగాళ్లా?

హరిదాసులు భిక్షగాళ్లు అని చాలా మంది తప్పుగా అనుకుంటారు. కానీ హరిదాసులు ప్రత్యేకమైన కారణంతో వీధుల్లో తిరుగుతుంటారు. సంక్రాంతి పండగ రోజున అందరూ భగవాన్ నామస్మరణ చేయాలని, అదే వినాలని, భగవంతుడి కృపకు పాత్రులు కావాలన్న ఉద్దేశంతో విష్ణు కీర్తనలు చేస్తూ వీధుల్లో తిరుగుతుంటారు.

హరిదాసులు ఎవరినీ భిక్షం అడగరు. వేస్తే తీసుకుంటారు. తీసుకున్న భిక్షాన్ని కూడా వారు అన్నదానానికి ఉపయోగిస్తుంది

ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనది. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశికి వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ఆ మహావిష్ణువు నిద్ర నుండి మేల్కొంటాడని, ఆ దేవతలు అందరూ కూడా అన్నిరోజులూ ఆయన దర్శనం కోసం ఎదురుచూసి ఎదురుచూసి, వైకుంఠ ద్వారాలు తెరవగానే వాళ్ళు కూడా మహావిష్ణువు దర్శనం చేసుకుంటారని. ఒకరు ఇద్దరూ కాదు ముక్కోటి దేవతలు ఒకేచోట ఆ మహావిష్ణువును కీర్తిస్తూ, స్తుతిస్తూ  ఉంటారని చెబుతారు.

ఇదంతా ఒకటైతే ధనుర్మాసం మొదలవ్వగానే హరినామస్మరణ చేసుకుంటూ గ్రామాలు, వీధులు తిరిగే హరిదాసుల సందడి మాత్రం ఎంతో ప్రత్యేకం. 

ఒకప్పుడు ధనుర్మాసం ప్రారంభం అవ్వగానే పట్టు పంచె, పట్టు కండువా నడుముకు కట్టుకుని, మెడలో పూల హారం, నొసటన ఆ నారాయణుడి నిలువు నామాలు, నెత్తిమీద అక్షయపాత్ర, ఒకచేతిలో చిడతలు, మరొక చేతిలో నారదుని తుంబుర లాంటి వీణ, కాళ్ళకు గజ్జెలు. ఇలా అన్నిటి కలయికలో గ్రామాలలో వీధి వీధి తిరిగి ఆ శ్రీమన్నాయణుడి గురించి గీతాలు ఆలపిస్తూ, పరిస్థి ఇల్లు ఇచ్చే బియ్యం, కూరగాయలు, డబ్బులు ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి పుచ్చుకుని వెళ్ళేవాళ్ళు. ఇలా ధనుర్మాసం మొత్తం ముగిసేదాక చేసేవారు. 

హరిదాసు వెనుక ఉన్న కథ

ఆ మాసం మొత్తం వారికి బోలెడు బియ్యం, పప్పులు, డబ్బులు సమకూరేవి. అయితే కాలంతో పాటు సంప్రదాయాలు సన్నగిల్లినట్టే హరిదాసు కుటుంబాలు తగ్గాయో లేదా వారు చక్కగా చదువుకుని ఇతర వృత్తులను చేపట్టి ఉద్యోగాలు చేసుకుంటూ అలా ఇల్లిల్లు తిరగడం దండగని మాసం మొత్తం ఉన్న ఆచారాన్ని పండుగకు పరిమితం చేశారు కాబోలు హరిదాసుల ఉనికి అప్పటికీ ఇప్పటికీ తగ్గిపోయిందని చెప్పచ్చు.

ఇక ఈ హరిదాసు రూపం వెనుక ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపం ఉందని ప్రజల విశ్వాసం. అందుకే ఈ హరిదాసు గ్రామాలలో వీధులన్నీ తిరిగేటప్పుడు  బీదవాళ్ళు, డబ్బున్న వాళ్ళు అనే తేడా లేకుండా అందరి ఇళ్లకు వెళతాడు. అలాగే ప్రతి ఇంటివారు ఇచ్చినది తీసుకుంటాడు తప్ప ఖచ్చితంగా ఇంత ఇవ్వాలనే నియమం ఏది పెట్టడు.

సంక్రాంతి వండుగ రోజు పట్టు పరికిణీలు, పట్టు చీరల్లో మెరిసిపోయే అమ్మాయిలు, ఇంటి ముందు రంగురంగుల ముగ్గు మధ్యలో పెట్టిన గొబ్బెమ్మ చుట్టూ చేరి గొబ్బెమ్మను గురించి పాటలు పాడుతుంటే, హరిదాసు తలమీద అక్షయపాత్రను పెట్టుకుని ఆ ఇంటి ముందుకు వస్తే, ఆడపిల్లలు అందరూ హరిదాసు అక్షయపాత్రలో బియ్యం పోయడానికి పోటీలు పడుతుంటే ఆ సన్నివేశం నిజంగా ఎంతో అబ్బురంగా ఉంటుంది.

కళారూపం జీవం గుర్తొచ్చే సమయం!!

జానపద కళారూపాలలో ఎన్నో ఉన్నాయి. వాటిలో వీధులు తిరుగుతూ కథలు కథలుగా జరిగిన వాటిని కావ్యాలుగా మార్చి ఆలపించి ప్రాచారం చేయడం కూడా ఒకటి. వీటిని జానపద పాటలు అంటారు. తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో ఇలాంటి జానపద పాటలు ఎన్నో వినబడుతాయి. అలాంటివే గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ అమ్మాయిలు పాడే పాటలు మరియు వీధులు వీధులు తిరుగుతూ హరిదాసులు ఆలపించే భక్తిపరమైన అలాపనలు. విచిత్రం ఏమిటంటే ఉదయాన్నే హరిదాసులు నెత్తి మీద అక్షయపాత్ర పెట్టుకుని భిక్ష కోసం బయలుదేరినప్పుడు మొదలుపెట్టే ఆ భగవంతుని స్మరణ తిరిగి చీకటి పడే వేళకు ఇంటికి చేరినప్పుడు మాత్రమే ఆగుతుంది. మధ్యలో ఎక్కడా వారు ఎవరితో మాట్లాడరు కూడా. 

రూపం రసరమ్యం!! 

హరిదాసు రూపం ఆ మహావిష్ణు రూపమని, ఆయన తలమీద ఉండే అక్షయపాత్ర సాక్షాత్తు భూదేవి అని ఆయన భూదేవిని మోసుకుంటూ ఇలా ప్రజల మధ్య తిరుగుతూ వస్తాడని చెబుతారు. ఇంతటి లోతైన తత్వం ఈ రూపంలో ఉంది మరి.

రంగురంగుల ముగ్గులు కొత్త జీవితాన్ని ఆ రంగుల్లా కళగా ఉండమని చెబుతుంటే హరిలో రంగ హరి!! అనే హరిదాసుకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుందాం!

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags : Haridas, haridasu,lord Vishnu, maha Vishnu stories, story about Haridas,why Haridas will come to home, bhakthi Margam, margashiri masam, danuru masam, bhakthi Margam.in , importance of Haridas, significance of Haridas, 


Comments