ధనుర్మాస విశిష్టత | dhanurmasam 2023 start date and end date | Bhakthi Margam Telugu


*ధనుర్మాసం*

డిసెంబర్ 17 నుంచి ధనుర్మాసం ప్రారంభం. మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. ధనుర్మాసమంతా విష్ణు పారాయణాలతో దేవాలయాలు మారుమోగుతాయి.. మార్గశిరం ఈ మాసంలోనే ధనుర్మాసం జరుగుతుంది... మాసాలలో మార్గశిరాన్ని నేనే అని విష్ణుమూర్తి స్వయంగా చెప్పుకున్నారంటే ఈ మాసానికి వున్న వైశిష్టత అర్థమవుతుంది.

*మార్గశిరం విశిష్టత*

మార్గశిరం అంటే మార్గాల్లో శ్రేష్టమైనదని అర్థం. మార్గంలో సాధనం అనగా ఉపాయాల్లో గొప్పది. మార్గం అనగా కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం. కార్తికేయుడు, కాలబైరవుడు, దత్తాత్రేయుడితోపాటు భగవద్గీత అవతరించింది కూడా ఈ మాసంలోనే కావడం విశేషం. మార్గశిర మాసం శ్రీకృష్ణతత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ మాసంలో లక్ష్మీదేవిని, నారాయణుడిని తులసితో పూజిస్తే సకల సంపదలు కలుగుతాయని శాస్ర్తాలు చెబుతున్నాయి.

*ధనుర్మాస విశిష్టత*

మార్గశిర మాసంలో ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకరరాశిలో సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. విష్ణువుకు ప్రీతిపాత్రమైన ధనుర్మాసోత్సవాన్ని వైష్ణవులు ఎంతో పవిత్ర మాసంగా భావిస్తున్నారు. ఈనెల 17వ తేదీ నుంచి జనవరి 14న గోదాదేవి కల్యాణంతో ముగుస్తుంది. ధనుర్మాసం మొత్తం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంది. తెలుగు సంస్కృతిలో ధనుర్మాసం ఒక భాగం. 

నెలపాటు వైష్ణవ ఆలయాల్లో విశిష్ట పూజలు నిర్వహించారు. తిరుప్పావై పఠనం, గోదాకల్యాణం, ఆండాళమ్మ పూజలు నిర్వహించారు. తిరుమలలో సుప్రభాతం బదులు తిరుప్పావై పఠిస్తారంటే ఈ మాసానికి ఎంత పవిత్రత ఉందో తెలుసుకోవచ్చు. జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార, వ్యవహారాలు, సంప్రదాయాలు కలిసిన అంశాల్లో ధనుర్మాసం ఒకటి. ఈ మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతోపాటు దరిద్రం దూరమవుతుందని భక్తుల నమ్మకం.

*గోదాదేవి ఆవిర్భావం*

రోజుకు ఒక పాశురం చొప్పున 30 రోజులు 30 పాశురాలు పాడి గోదాదేవి ఆ రంగనాధునిలో ఐక్యం అయిపోయింది.

*ఉత్తరద్వార దర్శన భాగ్యం*

పరమ పవిత్రమైన ధనుర్మాసంలో మరో ప్రత్యేకమైన రోజు ముక్కోటి ఏకాదశి. ఈ రోజున అన్ని వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉపవాసం ఉంటే మూడుకోట్ల ఏకాదశుల వ్రతం ఆచరించినంత ఫలితం భక్తుల నమ్మకం.

*సంక్రాంతి సంబరాలు*

అన్ని గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు కనబడుతోంది. ఇళ్లముందు పెద్ద పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, కొత్త బట్టలు, సాంప్రదాయ దుస్తులు, వంటకాలు, బంధువుల రాకపోకలు ఇలా గ్రామాల్లో పండుగ వాతావరణం మారుమోగుతుంది.

*ఈ ధనుర్మాసం లో వచ్చే పండుగలు*

డిసెంబర్ 17 ప్రారంభం

డిసెంబర్ 18 సుబ్రమణ్య షష్ఠి

డిసెంబరు 23 ముక్కోటి ఏకాదశి,

                      గీతాజయంతి

డిసెంబర్ 24 హనుమద్ వ్రతం

డిసెంబర్ 26 శ్రీ దత్త జయంతి

జనవరి 12 వివేకానంద జయంతి

జనవరి 14 భోగి, 

 గోదాదేవి కళ్యాణం,

 ధనుర్మాసం ముగింపు.


Related Postings:

 tags : bhakthi margam , telugu panchangam , telugu calender , margasira masam , margasira masam 2023-2024 , Thiruppavai Pasuram 1 in telugu thiruppavai in telugu Bhakthi Margam Telugu  భక్తి మార్గం,dhanurmasam pooja vidhanam in telugu, dhanurmasam 2023 start date, thiruppavai pravachanam by chinna jeeyar swamy ,Thiruppavai Telugu with Lyrics,thiruppavai chinna jeeyar, thiruppavai ms subbulakshmi, thiruppavai by chaganti koteswara rao, Tiruppavai 1st Pasuram with Meaning in telugu ,Andal Thiruppavai Pasuram 1, goda devi story telugu, goda devi kalyanam by chaganti koteswara rao, goda devi kalyanam story in telugu animated, goda devi temple, ranganayaka swamy temple , dhanurmasam muggulu, goda devi pooja vidhanam in telugu, thiruppavai 2023, ranganayaka temple

Comments