ఈరోజు మార్గశిర షష్ఠి తిథి వేళ రాశిఫలాలు | December 18 2023 రాశిఫలాలు | Rashi Phalalu | Bhakthi Margam


ఈరోజు మార్గశిర షష్ఠి తిథి వేళ రాశిఫలాలు

మేష రాశి

ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. పనికి సంబంధించి మీరు కొంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది వ్యాపారులు కొన్ని ప్రణాళికలు రూపొందిస్తారు. వీటి కోసం అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడితే మీకు మంచి ఫలితాలొస్తాయి. చాలా కాలంగా కొనసాగుతున్న వివాదాలు ఈరోజు ముగిసే అవకాశం ఉంది. మీ కుటుంబంలో అతిథి రాక వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ పనులను వాయిదా వేయకుండా చూసుకోవాలి. లేదంటే సమస్యలు ఎదురుకావొచ్చు.

ఈరోజు మీకు 69 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి.

వృషభరాశి

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు విద్యలో కొన్ని కొత్త పరిశోధనలలో భాగం కావొచ్చు. మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయంలో సీనియర్ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. మీకు రావాల్సిన బకాయిలు దక్కడంతో ఆనందంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ కారణంగా మీరు మీ బాధ్యతలను సులభంగా నిర్వర్తించగలరు. మీ పిల్లల విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.

ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు గోమాతకు పచ్చి గడ్డిని తినిపించాలి.

మిధున రాశి 

ఈ రాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీ కుటుంబంలోని వ్యక్తుల నుంచి ప్రయోజనాలు పొందుతారు. మీ వ్యాపారంలో కొత్త భాగస్వామిని కలిగి ఉండొచ్చు. కొత్త ఇల్లు కొనాలనుకునేవారు, కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకోవచ్చు. మీ బంధువులలో ఒకరి నుంచి కొంత నిరాశగా ఉన్న సమాచారాన్ని వినొచ్చు. మరోవైపు విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. మీరు ఇతర విషయాలపై ఎక్కువ శ్రద్ధ వహించకండి. లేదంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈరోజు మీకు 62 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. /span>

కర్కాటక రాశి

ఈ రాశి వారికి ఈరోజు సామాజిక రంగాలలో పని చేసే వ్యక్తుల పట్ల గౌరవం పెరుగుతుంది. మీరు విహారయాత్రకు సిద్ధమైతే, అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు కొన్ని పెద్ద మార్పులు చేయొచ్చు. దీని వల్ల మీకు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. మరోవైపు సీనియర్ సభ్యులు మీపై కోపంగా ఉంటారు. మీ ఆలోచన, అవగాహనతో అన్ని పనులు పూర్తి చేస్తారు. మీ కుటుంబ జీవితంలో కొత్త అతిథి రావొచ్చు. మీ తోబుట్టువులతో గొడవలు రాకుండా నివారంచేందుకు ప్రయత్నించాలి.

ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీటిని సమర్పించాలి.

సింహ రాశి

ఈ రాశి వారికి ఈరోజు హానికరంగా ఉంటుంది. మీ ప్రసంగం, ప్రవర్తనలో మాధుర్యాన్ని కొనసాగించాలి. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు ఆసక్తి చూపుతారు. మీ కుటుంబంలో బంధాలన్నీ ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇదివరకు చేసిన పొరపాట్లకు చింతించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రత్యర్థులు మిమ్మల్ని వేధించేందుకు ప్రయత్నిస్తారు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

ఈరోజు మీకు 89 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి.

కన్య రాశి

ఈ రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఏదైనా పెద్ద నిర్ణయాన్ని సమయానికి తీసుకోవాలి. మీ స్నేహితులు, బంధువుల నుంచి ఆర్థిక సాయం పొందొచ్చు. మీరు కొన్ని పాత రుణాలు తీసుకున్నట్లయితే, వాటిని వీలైనంత త్వరగా చెల్లించేందుకు ప్రయత్నించాలి. కొత్త ఇల్లు కొనాలన్నా మీ కల నెరవేరుతుంది. విద్యార్థులకు మనసులో ఏదైనా గందరగోళం ఉంటే, గురువుల మద్దతు తీసుకోవాలి.

ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు గాయత్రీ చాలీసా పఠించాలి.

తులా రాశి

ఈ రాశి వారు ఈరోజు చాలా మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తే, ఈరోజు మంచి రాబడిని పొందే అవకాశం ఉంది. మీరు చేసే పనిలో ఏదైనా పొరపాటు జరిగితే, సీనియర్ల నుంచి తిట్లు తినాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు లావాదేవీల విషయంలో చాలా స్పష్టంగా ఉండాలి. ఎవరి వివాదాల్లోనూ తలదూర్చకండి. చాలా కాలం తర్వాత మీ స్నేహితుడిని కలవడం వల్ల ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి బహుమతిని తీసుకురావొచ్చు. మీ డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి.

వృశ్చిక రాశి 

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే, అది ఈరోజు పరిష్కరించబడుతుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ తండ్రికి ఏదైనా వాగ్దానం చేస్తే, అది నెరవేర్చాలి. ఈరోజు ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. ఎందుకంటే అవి తిరిగొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీ పనికి సంబంధించి కొన్ని వ్యూహాలను రూపొందించొచ్చు. దీని కోసం మీరు సీనియర్లతో మాట్లాడాల్సి ఉంటుంది.

ఈరోజు మీకు 65 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు శ్రీ విష్ణుమూర్తిని పూజించాలి.

ధనస్సు రాశి

ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు దూర ప్రయాణం చేయాలనుకుంటే దాన్ని వాయిదా వేయాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే పనుల్లో సోదరుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా చాలా ఓపికగా ఉండాలి.

ఈరోజు మీకు 74 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.

మకర రాశి 

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ కుటుంబంలో కొన్ని పాత వివాదాలు తెరపైకి రావొచ్చు. ఈ కారణంగా కుటుంబంలో వాతావరణం సమస్యలతో నిండి ఉంటుంది. ఈ కారణంగా మీ ఆరోగ్యం కూడా క్షీణించొచ్చు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే, ఈ సమయం వాయిదా వేయాలి. మీ కుటుంబంలో కొన్ని సమస్యల కారణంగా మీరు అకస్మాత్తుగా విహారయాత్రకు వెళ్లాల్సి రావొచ్చు. వ్యాపారులు ఈరోజు చాలా ఆలోచనాత్మకంగా ప్రణాళికలు రూపొందించాలి.

ఈరోజు మీకు 63 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి.

కుంభ రాశి 

ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కొత్త ఇల్లు లేదా వాహనం తదితర వాటిని కొనుగోలు చేయాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ కుటుంబంలో జరిగే గొడవలు ముగిసే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యల నుంచి మీరు విముక్తి పొందుతారు. మీరు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో పనిపై ఏకాగ్రత వహించాలి. మీరు చేసే కొన్ని పొరపాట్ల కారణంగా పై అధికారుల నుంచి కొన్ని తిట్లు తినాల్సి రావొచ్చు. మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో, పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు పేద ప్రజలకు సహాయం చేయాలి.

మీన రాశి 

ఈ రాశి వారికి ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబంలోని సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో మరింత సంతోషకరంగా ఉంటుంది. మీ బంధువుల నుంచి డబ్బులు అప్పుగా తీసుకోవాలనిపిస్తే, దానిని సులభంగా పొందుతారు. మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్యకు సంబంధించి ఏదైనా గొడవ ఉంటే, అది పరిష్కరించబడుతుంది. మీ ఇంటికి కొత్త వాహనాన్ని తీసుకురావొచ్చు. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారులు కొన్ని కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు.

ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు శివ లింగానికి పాలు సమర్పించాలి.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags : December 18 Rashi Phalalu , today rashi phalalu ,2023 December 18 Rashi Phalalu,panchangam , telugu festivals , december 2023 , Daily panchangam , telugu festivals 2023 december , telugu 2023 festivals , bhakthi margam , december 2023 rashi phalalu , rashi phalalu ,rasi phalalu 2023 to 2024 in telugu, mulugu rasi phalalu 2023 to 2024 pdf, gantala panchangam 2023 to 2024 , ttd telugu panchangam 2023 to 2024 , december rasi phalalu in telugu 2023, today rasi phalalu in telugu 2023, today panchangam, today rasi phalalu in telugu 2023.shasti rashi Phalalu, margashiri shasti rashi Phalalu.

Comments