తమిళనాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 5 ఆలయాలు | subramanya swamy temples in tamilnadu | Bhakthi Margam



తమిళనాడులోని 5 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు

భారతదేశంలో హిందూ పండుగలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడు రాష్ట్రంలో పర్వత ప్రాంతాలతో పాటు అనేక చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ ప్రజలు ముఖ్యంగా కొలిచే దేవుళ్లలో పార్వతీ పరమేశ్వరుల రెండవ కుమారుడైన కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) ఒకరు. తమిళనాడు రాష్ట్రంలో అనేక ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ఉన్నాయి.

ప్రతి ఏటా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్యేశ్వర షష్టిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. రాక్షసుడైన తారకాసురున్ని వధించేందుకు జన్మించిన కుమారస్వామిని విజయాన్ని ప్రసాదించే దైవంగా భక్తులు కొలుస్తారు. ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆయనను పూజించడం, తలచుకోవడం చేస్తుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర షష్టి సందర్భంగా తమిళనాడులో భక్తులు సందర్శించే ప్రముఖ ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళనాడులో 5 ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు:

1.శివ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం: ఈ దేవాలయం మురుగనలాంగ్ (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) ఆయన భార్యలు వల్లినాయకి, దైవనాయకి లకు అంకితం చేయబడింది.

2.కుమురన్ కుంద్రన్: 40 ఏళ్ల నాటి మురుగన్ ఆలయం ఇది

3.తిరుపొరుర్కందస్వామి ఆలయం

4.పళని మురుగన్ ఆలయం

5.స్వామినాధస్వామి ఆలయం

తమిళనాడులో సుబ్రహ్మణేశ్వర స్వామిని ప్రజలు ఎంతో ఆరాధిస్తారు. ఇక్కడ పురాణ ప్రాముఖ్యత కలిగిన అనేక మురుగన్ ఆలయాలు ఉన్నాయి. సుబ్రహ్మణేశ్వర షష్టి సందర్భంగా వాటిలో 5 ప్రముఖ ఆలయాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

తమిళనాడులో 5 ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు:

స్వామిమలైజి: 

స్వామి మలై అనే ఈ క్షేత్రానికి గొప్ప విశిష్టత ఉంది. సుబ్రహ్మణ్యస్వామి తన తండ్రి పరమశివునికి జ్ఞానోదయం చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలై పేర్కొనబడింది.

1. శివ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం:

ఈ దేవాలయం మురుగనలాంగ్ (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) ఆయన భార్యలు వల్లినాయకి, దైవనాయకి లకు అంకితం చేయబడింది. సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధంలో దైవనాయకిని, ప్రేమలో వల్లినాయకిని గెలిచినప్పుడు ఈ ఆలయాన్ని స్థాపించినట్లు చెబుతారు. ఇక్కడి గోడలపై కుడ్య చిత్రాలు, అలంగకరణలు ఆశ్చర్యపరుస్తాయి.

 ఏవిధంగా చేరుకోవాలి:

చెన్నై నుంచి దూరం: 10 కిలోమీటర్లు

సందర్శన వేళలు: ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ok

పూజలందుకునే దైవం: మురుగన్ (సుబ్రహ్మణ్యేశ్వరుడు)

సందర్శనకు సరైన సమయం: నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు

2. కుమురన్ కుంద్రన్:

40 ఏళ్ల నాటి మురుగన్ ఆలయం ఇది. ఇక్కడ ప్రతి అంతస్తులోనూ ఎన్నో దేవతా విగ్రహాలు ఉంటాయి. సుందరమైన అలంకరణలతో, వైభవం ఉట్టిపడే నిర్మాణంతో ఓ కొండపై ఈ ఆలయం ఉంటుంది. 

కంచి మఠానికి చెందిన సాధువు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ మురుగన్ ఆలయం నిర్మించాలని ప్రతిపాదించారట. సాధువు వెళ్లిపోయిన తరువాత ఈ ఆలయం నిర్మాణం అంత త్వరగా జరగలేదు. చాలా మందికి ఆయన ఇక్కడ ఆలయం ఎందుకు నిర్మించమన్నారో అర్ధం కాలేదు. 20 ఏళ్ల తరువాత ఈ కొండపై మురుగన్ యొక్క ఆయుధం కనిపించడంతో ఆలయ నిర్మాణం జోరందుకుని శరవేగంగా పూర్తయ్యింది.

 ఏవిధంగా చేరుకోవాలి:

చెన్నై నుంచి దూరం: 26 కిలోమీటర్లు

సందర్శన వేళలు: ఉదయం 6.30 నుంచి 11, సాయంత్రం 4.30 నుంచి 8.30 వరకు

పూజలందుకునే దైవం: మురుగన్

సందర్శనకు సరైన సమయం: నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు

3. తిరుపొరుర్కందస్వామి ఆలయం:

పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాక్షసులతో తిరుచెందూర్ వద్ద ఆకాశంలో, తిరుప్పారన్ కుందారం వద్ద భూమిపై, తిరుపొరూర్ వద్ద గాలిలో యుద్ధం చేసినట్లు ప్రస్తావన ఉంది. అగస్త్య మహాముని పొతిగై పర్వతాల గుండా ప్రయాణిస్తుండగా ఈ ప్రదేశాన్ని గుర్తించినట్లు కధనం. తరుక అనే అసురునిపై సుబ్రహ్మణ్యేశ్వరుడు విజయం సాధించిన తరువాత ఈ ప్రాంతం పొరుర్ (తమిళంలో యుద్ధం), తరుకపురి, సమరపురిగా పిలవబడుతుంది. గాలి, భూమి, ఆకాశంలో మూడు చోట్ల సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధం చేయడం వలన దీనికి తిరుపొరుర్కందస్వామి ఆలయంగా పేరు వచ్చినట్లు చెబుతారు.

 ఏవిధంగా చేరుకోవాలి:

చెన్నై నుంచి దూరం: 40 కిలోమీటర్లు

సందర్శన వేళలు: ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకూ

పూజలందుకునే దైవం: మురుగన్

సందర్శనకు సరైన సమయం: మే నుంచి జూన్ మధ్య

4. పళని మురుగన్ ఆలయం:

శివ పార్వతుల తనయుడైన కుమారస్వామిని మురుగన్, కార్తికేయ అని కూడా పిలుస్తారు. పురాణ కధనం ప్రకారం విఘ్నాదిపత్యం కోసం సోదరులైన వినాయకుడు, కుమార స్వామి మధ్య ఓ పోటీ జరుగుతుంది. ఎవరైతే ప్రపంచంలో అన్ని పుణ్యనదుల్లో స్నానం ఆచరించి ముందుగా కైలాసం చేరుకుంటారో వారికే విఘ్నాదిపత్యం దక్కుతుంది.

దీంతో కుమార స్వామి తన నెమలి వాహనంపై శరవేగంగా పుణ్యనదులకు చేరుకోగా అక్కడ ముందుగానే వినాయకుడు ప్రత్యక్ష్యమయ్యేవాడు. తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన ప్రపంచంలోని అన్ని పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన ఫలం వినాయకుడికి దక్కి ఆయన విజేత అవుతాడు. దీంతో ఆగ్రహించిన కుమారస్వామి పళని వద్దే ధ్యానం ఆచరించి పరిపక్వత చెందినట్లు పురాణ కధనం.

 ఏవిధంగా చేరుకోవాలి:

మధురై నుంచి దూరం: 100 కిలోమీటర్లు

సందర్శన వేళలు: ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ

5. స్వామినాధస్వామి ఆలయం:

కావేరీ నది పరివాహిక ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం సుబ్రహ్మణ్యేశ్వరుడి 6 పవిత్ర ఆలయాలుగా పిలువబడే అరుపడైవీడులో ఒకటి. కొండపై 60 అడుగుల ఎత్తు ఉండే ఆలయంలో స్వామినాధస్వామి విగ్రహం, కొండ కింద తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరుల మందిరాలు ఉంటాయి. మూడు గోపురాలతో నిర్మితమైన ఈ ఆలయంలోని విగ్రహాలు గ్రానైట్ తో చేయబడ్డాయి. ప్రణవ మంత్రంతో తండ్రి పరమేశ్వరున్ని సుబ్రహ్మణేశ్వరుడు ఇక్కడే సంతృప్తి పరచడంతో ఈ ఆలయంలో స్వామి వారు స్వామినాథస్వామిగా పేరొందారు.

 ఏవిధంగా చేరుకోవాలి:

చెన్నై నుంచి దూరం: 300 కిలోమీటర్లు

సందర్శన వేళలు: ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags : Bhakthi Margam, Subramanya shasti, history of Subramanya shasti, story of Subramanya shasti, importance of Subramanya shasti, Subramanya shasti in telugu, shasti story, bhakthi margam.in , 6 Subramanya Swamy Temples In Tamilnadu, Shanmughanathar Temple, Kunnakudi., Sikkal Singaravelan Temple., Siruvapuri Sri Balasubrahmanyam temple., Six Abodes of Murugan., Skandhashramam Temple, Chennai., Subramaniasamy Temple, Ettukkudi., Subramaniya Swamy Temple, Thiruparankundram.,Subramaniya Swamy Temple, Tiruchendur.6 subramanya swamy temples in tamilnadu, 6 padai murugan temple list, six temples of murugan, 6 subramanya swamy temples in tamilnadu, top 10 murugan temples in tamilnadu, oldest murugan temple in tamilnadu

Comments