డిసెంబర్ 2023 రాశి ఫలాలు | December 2023 Rashi Phalalu | Monthly Rasi Phalalu In Telugu 2023 | bhakthi margam | భక్తి మార్గం
12 రాశుల వారికి డిసెంబర్ 2023 రాశి ఫలాలు
డిసెంబర్ 2023 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు
1.మేషం రాశి
అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి
ఈ రోజు చేపట్టిన వ్యవహారాలలో విజయం లభిస్తుంది. బంధు మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి.
2.వృషభం రాశి
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి
ఈ రోజు ముఖ్యమైన వ్యవహారములు మధ్యలో నిలిచిపోతాయి. సన్నిహితులతో అకారణ విభేదాలు తప్పవు. అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృధా ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.
3.మిధునం
మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి ఈ రోజు సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన వాహన, గృహ యోగములు ఉన్నవి. వ్యాపార పరంగా ఉన్న ఇబ్బందులు క్రమం క్రమంగా తొలగుతాయి.
4.కర్కాటకం రాశి
పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి ఈ రోజు నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురు చూస్తున్న అవకాశములు లభిస్తాయి. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. దగ్గరి వారి నుండి కీలక విషయాలు తెలుస్తాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. వ్యాపారమున లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి.
5.సింహం రాశి
మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి ఈ రోజు చేపట్టిన పనులందు ఆటంకాలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఇంటా బయటా సమస్యలు పెరుగుతాయి. దైవ సంబంధిత విషయములలో ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్న పాటి సమస్యలు తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి.
6.కన్య రాశి
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి ఈ రోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో ఆకారణ కలహ సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. సంతాన విద్యా విషయాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో ఆందోళనలు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి.
7.తులా రాశి
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి ఈ రోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయం. ముఖ్యమైన సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి.
8.వృశ్చికం రాశి
విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి ఈ రోజు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. బంధు మిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతతకు దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది.
9.ధనుస్సు రాశి
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి ఈ నెలలో అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయట పడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలాకాలంగా రావలసిన బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగాలలో అధికారులు సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తారు.
వాహన వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మాసం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది.
10.మకరం రాశి
ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి ఈ రోజు చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. కుటుంబ వ్యవహారాలలో. ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం వలన నష్టాలు తప్పవు. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి.
11.కుంభం రాశి
ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి ఈ రోజు చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయులతో వున్న వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. దైవ సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి.
12.మీనం రాశి
పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి ఈ రోజు గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులందు శ్రమ అధికమౌతుంది. ఇతరులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు పెరుగుతాయి. దాయాదులతో స్థిరస్తి విషయమై ఉన్న సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.

Comments
Post a Comment