డిసెంబర్ 13 రాశి ఫలాలు | December 13 Rashi Phalalu | Bhakthi Margam


 డిసెంబర్ 13 రాశి ఫలాలు

మేష రాశి 

ఈ రాశి వారు ఈరోజు సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి సహాయంతో భవిష్యత్తు కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తారు. వారసత్వానికి సంబంధించిన పత్రాలలో కొన్ని సమస్యలు రావొచ్చు. ఈ కారణంగా సోదరులతో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. పిల్లల సహకారంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. 

ఈరోజు మీకు 70 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు హనుమాన్ ఆలయంలో ధ్వజ స్తంభాన్ని సమర్పించాలి.

వృషభ రాశి 

ఈ రాశి వారికి ఈరోజు సామాజిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు పెద్ద ఎత్తున పనుల్లో పాల్గొంటారు. ఈరోజు మీరు రాజకీయ పరిచయాల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. ఈరోజు మీ పెండింగ్ పనులను కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులు విద్యపై ఏకాగ్రత వహించాలి. ఈరోజు స్నేహితులతో కలిసి సమయాన్ని వృథా చేయకండి. వ్యాపారులు ఈరోజు తెలివిగా పని చేయడం వల్ల మంచి ప్రయోజనం పొందుతారు.

ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు మీ అత్తమ్మ లేదా సోదరికి ఎర్రని వస్త్రాన్ని దానం చేయాలి

మిధున రాశి 

ఈ రాశి వారు ఈరోజు ఉదయం నుంచి పనుల్లో బిజీగా ఉంటారు. అంతేకాదు చాలా శక్తివంతంగా ఉంటారు. మీరు రోజువారీ జీవితంలో భిన్నంగా ఏదైనా చేసేందుకు ప్రయత్నిస్తే, అది మానసిక, శారీరక అలసటను తొలగిస్తుంది. కాబట్టి ఎవరినైనా విశ్వసించే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. లేదంటే మీ పనుల్లో ప్రతికూలతలు ఎదురుకావొచ్చు. వ్యాపారులు ఈరోజు పారదర్శకతను పాటించాలి. భార్యభర్తల మధ్య సమన్వయం ఉంటుంది.

ఈరోజు మీకు 73 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు నువ్వులు, బెల్లాన్ని ప్రవహించే నీటిలో వేయాలి

కర్కాటక రాశి

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు, దానికి సంబంధించిన ప్రణాళికల గురించి బాగా ఆలోచించాలి. ఉద్యోగులు ప్రత్యేక వ్యక్తులతో సమయాన్ని వెచ్చిస్తారు. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. మీ విజయానికి మార్గం సుగమం చేస్తుంది. మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని మనస్పర్దలు రావొచ్చు.

ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు హనుమంతుడిని పూజించి సుందరకాండను పఠించాలి.

సింహ రాశి 

ఈ రాశి వారు ఈరోజు ఇంట్లో కొన్ని మార్పుల కోసం లేదా పునర్నిర్మాణం కోసం కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అంతేకాదు కొన్ని ప్రణాళికలు కూడా వేస్తారు. మీ ఇంట్లో ఏదైనా ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానుకోవాలి. దగ్గరి బంధువు లేదా మీ ప్రియమైన వ్యక్తితో ఆస్తికి సంబంధించి వివాదాలు ఉండొచ్చు. వ్యాపారులు ఈరోజు తమ కార్యకలాపాల్లో బిజీగా ఉంటారు.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు హనుమాన్ దేవాలయంలో కొబ్బరికాయ, తమలపాకులు, పూలమాలలతో పాటు పచ్చిమిర్చి తదితర వాటిని సమర్పించాలి

కన్య రాశి 

ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొస్తాయి. ఏదైనా కోర్టు కేసు లేదా ఆస్తి సంబంధిత విషయాల్లో పరిస్థితులు అనుకూలంగా ముగిసే అవకాశం ఉంది. ఈ కారణంగా మీకు చాలా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారులు ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి. ఉద్యోగులు తమ ప్రణాళికల గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు.

ఈరోజు మీకు 69 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు సాయంత్రం వేప చెట్టుకు నీరు సమర్పించి మల్లె నూనెతో దీపం వెలిగించాలి

తుల రాశి

ఈ రాశి వారు ఈరోజు ఇంటి పెద్దల సలహాలను నిర్లక్ష్యం చేయకండి. వారి సహకారం మీకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో సీనియర్ల నుంచి సహకారం పొందుతారు. నేడు యంత్రం, ఇనుముకు సంబంధించిన రంగాల్లో ప్రయోజనకరమైన విజయాన్ని పొందొచ్చు. మీరు చేస్తున్న పనులకు ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగులు అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి.

ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు మీరు హనుమంతుడికి బూందీ సమర్పించాలి

వృశ్చిక రాశి 

ఈ రాశి వారికి ఈరోజు కెరీర్లో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. మతపరమైన సంస్థల సేవా కార్యక్రమాలు, పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ కారణంగా మీరు మనశ్శాంతి పొందుతారు. వాహనం కొనాలని ఆలోచిస్తుంటే, ఇప్పుడు వాయిదా వేసుకోవాలి. వ్యాపారులు ఈరోజు మరింత కష్టపడాలి. మీకు కొత్త వ్యాపార ఆర్డర్లు రావొచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు హనుమంతుని ఎదుట ఐదు మల్లెపూల దీపాలను వెలిగించాలి

ధనస్సు రాశి 

ఈ రాశి వారు ఈరోజు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా గడుపుతారు. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే, దాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఏదైనా ప్రభుత్వ పత్రాలను పూర్తి చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అనుభవం ఉన్న వ్యక్తుల సలహా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఎవరితోనైనా భాగస్వామి కావాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

ఈరోజు మీకు 71 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు హనుమంతుడికి బూందీ సమర్పించాలి

మకర రాశి 

ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన పనుల్లో స్నేహితులకు సహాయం చేస్తారు. దీంతో వారు బాగా సంతోషిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు వారి శ్రమకు తగ్గ ఫలితాలను పొందుతారు. మీరు ఏదైనా లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ జీవిత భాగస్వామి నుంచి సలహా తీసుకోవాలి. మీరు విలువైన వస్తువులు, నిత్యావసర వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని కారణాల వల్ల వ్యాపారులకు ఈరోజు కొన్ని ఆటంకాలు ఏర్పడొచ్చు.

ఈరోజు మీకు 65 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి

కుంభ రాశి 

ఈ రాశి వారు ఈరోజు తమ పనిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల కారణంగా మీకు ఇబ్బందులు ఉండొచ్చు. మీ ఖర్చులపై నియంత్రణ ఉంచాలి. కొన్ని పనులను పూర్తి చేయడం వల్ల మీ మనోబలం పెరుగుతుంది. ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, సమయం అనుకూలంగా ఉంటుంది. గ్రహాల ప్రభావంతో సానుకూల ఫలితాలొస్తాయి.

ఈరోజు మీకు 94 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు రావి చెట్టుకు నీటిని సమర్పించాలి

మీన రాశి

ఈ రాశి వారు ఈరోజు తమ వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఈరోజు మీరు కార్యాలయంలో నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని పొందుతారు. వ్యాపారులు తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. మీ కుటుంబ వాతావరణంలో సానుకూల మార్పులొస్తాయి. ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా చేయాలి. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువత మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని మనస్పర్దలు రావొచ్చు.

ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు చేపలకు పిండి పదార్థాలను తినిపించాలి.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags : December 13 Rashi Phalalu , today rashi phalalu ,2023 December 13 Rashi Phalalu,panchangam , telugu festivals , december 2023 , Daily panchangam , telugu festivals 2023 december , telugu 2023 festivals , bhakthi margam , december 2023 rashi phalalu , rashi phalalu , డిసెంబర్ 2023 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు, monthly rasi phalalu in telugu 2023, rasi phalalu 2023 to 2024 in telugu, mulugu rasi phalalu 2023 to 2024 pdf, gantala panchangam 2023 to 2024 , ttd telugu panchangam 2023 to 2024 , december rasi phalalu in telugu 2023, today rasi phalalu in telugu 2023, today panchangam, today rasi phalalu in telugu 2023, december month rasi phalalu in telugu 2023, వారఫలితాలు , Monthly Rasi Phalalu , Daily Rasi Phalalu 2023, Daily Rasi Phalalu In Telugu, Weekly Rasi Phalalu telugu, Weekly Rasi Phalalu 2023

Comments