వారఫలితాలు తేదీ 1 డిసెంబర్ 2023 శుక్రవారం నుండి 7 గురువారం | వారఫలితాలు | weekly Rasi Phalalu In Telugu 2023 | bhakthi margam | భక్తి మార్గం


వారఫలితాలు

వారఫలితాలు తేదీ 1 డిసెంబర్ 2023 శుక్రవారం నుండి 7 గురువారం వరకు

మేష రాశి(Aries) వార ఫలాలు

ఈ రాశి వారు ఈ వారం ప్రారంభంలో చేసే పనులన్నింట్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు సీనియర్లు, జూనియర్ల సహకారం లభిస్తుంది. ఈ సమయంలో పెద్దవారి సలహా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. భూమి, ఇల్లు లేదా పూర్వీకుల ఆస్తి కొనుగోలు, అమ్మకం గురించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు శ్రేయోభిలాషులను సంప్రదించాలి. వ్యాపారులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలొస్తాయి. ప్రేమ జీవితంలో ఉండే వారికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

వృషభ రాశి(Taurus) వార ఫలాలు

ఈ వారం ప్రారంభంలో వాతావరణంలో మార్పుల కారణంగా ఆరోగ్య పరమైన సమస్యలు ఎదురుకావొచ్చు. ఈ కారణంగా మీ పనులు అసంపూర్ణంగా ఉండొచ్చు. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పొచ్చు. బెట్టింగ్, లాటరీ లేదా ఏదైనా రిస్క్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టకండి. వ్యాపారులకు నష్టాలు రావొచ్చు. ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.

మిధున రాశి(Gemini) వార ఫలాలు

ఈ రాశి వారు ఈ వారంలో పిల్లల గురించి కొన్ని శుభవార్తలను వింటారు. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. పనిలో సీనియర్లు మీ పట్ల దయ చూపుతారు. ఉద్యోగులు నచ్చిన ఉద్యోగం పొందొచ్చు. యువత ఎక్కువ సమయం సరదాగా గడుపుతారు. మీరు చాలా కాలంగా భూమి, ఆస్తులను విక్రయించాలని ఆలోచిస్తుంటే, మీ కోరిక నెరవేరుతుంది. మీ ప్రేమ సంబంధం బలంగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయంలో జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది.

కర్కాటక రాశి(Cancer) వార ఫలాలు

ఈ రాశి వారికి ఈ వారం కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. వారం ప్రారంభంలో కొంత ఆందోళన ఉంటుంది. ఉద్యోగులకు పనిలో సీనియర్లు సహకరించకపోవడం వల్ల నిరుత్సాహానికి గురవుతారు. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. మీకు రావాల్సిన బకాయిలు సకాలంలో అందకపోవచ్చు. మీ జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది

సింహ రాశి(Leo) వార ఫలాలు

ఈ వారం మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు కొన్ని పెద్ద ఒప్పందాలు చేసుకుంటారు. మీకు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలుంటే, ఈ వారం పరిష్కరించబడతాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి ఈ సమయం మంచిగా ఉంటుంది. మీరు కుటుంబానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది.

కన్య రాశి(Virgo) వార ఫలాలు

ఈ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మీరు అకస్మాత్తుగా పెద్ద సమస్యను ఎదుర్కొంటారు. అయితే మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. వారం ప్రారంభంలో వ్యాపార ప్రయాణంలో ఆశించిన లాభాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఆదాయ వనరులు పెరుగుతాయి. మీ ఆస్తులు పెరిగే అవకాశం ఉంది. మీరు గతంలో ఏదైనా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టినట్లయితే, పెద్ద లాభాలను పొందొచ్చు. ఈ వారం మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.

తులా రాశి (Libra) వార ఫలాలు

ఈ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి మంచి అవకాశాలొస్తాయి. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారుల ప్రణాళిక ప్రభావవంతంగా ఉంటుంది. విదేశీ ఉద్యోగాలు, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

వృశ్చిక రాశి(Scorpio) వార ఫలాలు

ఈ రాశి వారు ఈ వారం సరైన సమయంలో బడ్జెట్ రూపొందించినట్లయితే, మీరు ఊహించిన దాని కంటే ఎక్కువ విజయాన్ని సాధించొచ్చు. మీ పనులను నెరవేర్చడంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. వ్యాపారులు ఈరోజు తమ తెలివితేటలతో పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారం చేసే వారు ఈ సమయంలో ఊహించని లాభాలను పొందుతారు. మీ ప్రేమ, వైవాహిక జీవితం బాగుంటుంది.

ధనుస్సు రాశి (Sagittarius) వార ఫలాలు 

ఈ రాశి వారు ఈ వారం పనులన్నీ స్వయంగా పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఈ వారం మంచిగా ఉంటుంది. పదోన్నతులు, బదిలీలు నిలిచిపోయినట్లయితే దాన్ని అవి ఈ వారం పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. భూమి, ఇల్లు కొనాలన్న మీ కల నెరవేరుతుంది. వారం చివర్లో కొన్ని శుభకార్యక్రమాలు నిర్వహించొచ్చు.

మకర రాశి(Capricorn) వార ఫలాలు

ఈ రాశి వారికి గత వారం కంటే ఈ వారం మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబంలో ఏవైనా వివాదాలుంటే, పెద్దలు, తోబుట్టువుల సహాయంతో పరిష్కరించుకుంటారు. విదేశాల్లో వ్యాపారాన్ని కొనసాగించాలనుకునే వారికి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగులు వారం ప్రారంభంలో గొప్ప అనుభవాన్ని పొందగలరు. ఉద్యోగులకు కార్యాలయంలో నాణ్యత పెరుగుతుంది. ఎగుమతి, దిగుమతి చేసే వ్యాపారులు ఊహించని లాభాలను పొందొచ్చు. మీ ప్రేమ జీవితంలో అపార్థాలన్నీ తొలగిపోతాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

కుంభ రాశి(Aquarius) వార ఫలాలు

ఈ రాశి వారు ఈ వారం ఆశించిన విజయాలను సాధించేందుకు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. వారం మధ్యలో విహారయాత్రకు వెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులు విద్యపై ఏకాగ్రత పెట్టలేరు. మీ ప్రేమ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామి, భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ జీవిత భాగస్వామితో ఏదైనా విషయంలో విభేదించొచ్చు.

మీన రాశి(Pisces) వార ఫలాలు

ఈ రాశి వారు ఈ వారం పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. స్నేహితుల సహాయంతో పనులకు సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి. ఐటీ రంగానికి సంబంధించి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అవివాహితులకు ఈ వారం వివాహం కుదిరే అవకాశం ఉంది. ఒంటరి వ్యక్తుల జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి కలుస్తారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags : panchangam , telugu festivals , december 2023 , Daily panchangam , telugu festivals 2023 december , telugu 2023 festivals , bhakthi margam , december 2023 rashi phalalu , rashi phalalu  ,  డిసెంబర్ 2023 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు, monthly rasi phalalu in telugu 2023, rasi phalalu 2023 to 2024 in telugu, mulugu rasi phalalu 2023 to 2024 pdf, gantala panchangam 2023 to 2024 , ttd telugu panchangam 2023 to 2024 , december rasi phalalu in telugu 2023, today rasi phalalu in telugu 2023, today panchangam, today rasi phalalu in telugu 2023, december month rasi phalalu in telugu 2023, వారఫలితాలు , Monthly Rasi Phalalu , Daily Rasi Phalalu 2023, Daily Rasi Phalalu In Telugu, Weekly Rasi Phalalu telugu, Weekly Rasi Phalalu 2023

Comments