కార్తీక మాసంలో తులిసి పూజ ఎందుకు చేస్తారు? | Why Tulasi Puja is performed in the month of Kartika masam | bhakthi margam | భక్తి మార్గం
కార్తీక మాసంలో తులిసి పూజ ఎందుకు చేస్తారు? ఎప్పుడు చెయ్యాలి?ఫలితం ఏంటి..?
పండగలన్నీ జనజీవితాన్ని ప్రభావితం చేసేవే. కార్తీక మాసం నెల రోజులూ పండగ వాతావరణమే. ఈ మాసంలో భక్తులు జపం, దానం, ఉపవాసాది పుణ్యకర్మలతో ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతారు. కార్తీక మాసానికే ‘ఊర్జమాసమ'ని పేరు. ఊర్జము అంటే పుణ్యం అని అర్థం. హరిహరులకు ప్రీతికరమైన కారీకాన్ని సూక్ష్మధర్మ ప్రబోధితమైనదిగా అభివర్ణిస్తారు.
కార్తీక మాసంలో తులిసి పూజ ఎందుకు చేస్తారు?
కార్తీకమాసంలో భక్తులు శివ క్షేత్రాలకు, వైష్ణవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కు, తులసి చెట్టు కూడా పూజలు నిర్వహిస్తారు. ఉసిరి చెట్టు విష్ణు స్వరూపంగా చెప్పుకున్నాం.
కార్తీక మాస ప్రాశస్త్యం పద్మ, స్కాంద పురాణాల్లో విశేషంగా పేర్కొన్నారు. ఇది సద్గతికి నూతన మోక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణం వెలిగించడం, క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి చెట్టుకు పూజలు చేయడం ఈ మాసపు ఆధ్యాత్మిక శోభను రెట్టింపు చేస్తాయి. ముఖ్యంగా తులసి పూజ. మరి తులసి పూజ విశిస్టత, మరియు తులసి పూజ వల్ల పొందే ఫలితం గురించి తెలుసుకుందాం...
తులసి పూజ యొక్క విశిష్టత!
కార్తీకమాసం ఒక్కోరోజు ఒక్కో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. ప్రతి పూజా హరిహరుల అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ వుంటుంది. అలాంటి కార్తీకమాసంలో చెప్పబడుతోన్న విశిష్టమైన పూజల్లో 'తులసి పూజ' ఒకటిగా కనిపిస్తుంది. సాధారణంగా చాలామంది ఇళ్లలో తులసికోట కనిపిస్తూ వుంటుంది. స్నానం చేయగానే తులసిమొక్కకు ప్రదక్షిణలు చేసి పూజిస్తూ ఉంటారు. అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతోన్న తులసిని, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తుంటారు. కార్తీకమాసంలో లక్ష్మీనారాయణులు తులసికోటలో కొలువై ఉంటారని శాస్త్రం చెబుతోంది. ఈ కారణంగా కార్తీకంలో తులసిపూజ మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది
జగన్మాతకి కొన్ని అంశాలున్నాయి. వాటిల్లో తులిసి విశేషమైనది. ఈమె విష్ణుమూర్తి పాదాల వద్ద నివాసం ఏర్పరచుకొన్న సాధ్వీమణి, విష్ణుమూర్తికి అలంకరా స్వరూపినిగా ఉంది. ధైవారాధనకు ఉపయోగించే సమస్త పుష్ప, పత్రాలన్నింటిలోకి ఇది చాలా ఉత్తమైమనది. తులసి మొక్కను చూడటం వల్ల, స్పర్శ చేత తపస్సంకల్ప పూజాదులు సిద్దిస్థాయి. సమస్త తీర్థాలనూ పవిత్రం చేస్తూ, పరమ పావనియై, దోషాలను దహం చేసే అగ్ని స్వరూపిణి తులసి. మానవులు చేసే సత్కర్మలన్నీ సఫలమవ్వాలంటే తులసి ఉండితీరవలసిందే. సర్వకామద, మోక్షద, అయిన తులసి భారతదేశంలో అవతరించిన కల్పవ్రుక్షం. ఇది ఉన్నవారి ఇంట ఆయుష్యు, ఆరోగ్యం, ఐశ్వర్యం వర్థిల్లుతాయి.
కార్తీక మాసంలో తులసి కోటకు ఎప్పుడు పూజలు చెయ్యాలి?
కార్తీకా మాసంలో వచ్చే ద్వాదశి రోజున తులసి కోటలో ఉసిరి కొమ్మను నాటి, దీపారాధన చేసి, ప్రత్యేక పూజలు చేస్తారు. చలిమిడితో చేసిన ప్రమిదల్లో ఆవునేతితో దీపాలు పెడతారు. క్షీరాబ్ది ద్వాదశినాటి సాయంకాలం వేళ తులసి కోట ముందు దీపాలు వెలిగించిన ఇంట కలకాలం ధనధాన్యాలు నిలుస్తాయని శాస్త్రవచనం. క్షీరాబ్ధి ద్వాకార్తీక శుద్ధ ద్వాదశి నాడు సూర్యాస్తమయం తర్వాత స్నాన, దాన పూజాదులు చేసిన వారికి అధిక ఫలం కలుగుతుంది..
దుష్ట ప్రయోగాలు ... విషకీటకాలు దరిదాపుల్లోకి రానీయకుండా చేసే శక్తి తులసికి వుంది. ఇంటికి తులసి రక్షణ కవచమనీ ...కోరికలను నెరవేర్చే కల్పవృక్షంతో సమానమని అంటారు. ఆరోగ్యంతోపాటు ఆర్ధికపరమైన అభివృద్ధిని వరంగా ప్రసాదించే తులసిని కార్తీకంలో పూజించడం ఎలాంటి పరిస్థితుల్లోను మరిచిపోకూడదు.
తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే
కార్తీకమాసంలో మహా లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టును పూజిస్తారు. ఉసిరి చెట్టును నారాయణుడిగా, తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు. ఈ మాసం విష్ణువుకి అత్యంత ఇష్టమైన మాసం కావడంతో, ఈ మాసంలో విష్ణువును, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం పూజలు నిర్వహిస్తారు. తులసి మొక్క మూలంలో సర్వ తీర్థాలు, మధ్యభాగంలో సమస్త దేవతలు, తులసి మొక్క పైభాగంలో సర్వ వేదాలతో కొలువై ఉన్న లక్ష్మీదేవి ఉంటారు. అందుకే కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు.
లక్ష్మీదేవి ప్రతిరూపమైన తులసిని పూజిస్తే ఫలితం
ముఖ్యంగా కార్తీకమాసంలో క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులవుతారు అని, ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మన ప్రాచీన కాలం నుండి హిందువులు తులసి మొక్కలు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. రోజు తులసి మాతను పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో తులసికి ఎంతో భక్తితో పూజలు చేస్తారని చెబుతారు. కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి స్నానమాచరించి భూమిపై లక్ష్మీదేవి ప్రతిరూపమైన తులసిని పూజిస్తే పసుపు, కుంకుమలు కూడా పది కాలాల పాటు ఉంటాయని నమ్ముతారు.
లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ తల్లి పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తే నట్టింట్లో సిరులవాన కురుస్తుంది. కార్తీకమాసంలో తులసిని పూజించడం వలన కూడా ఇదే ఫలితం కలుగుతుందని చెప్పబడుతోంది. ఈ మాసంలో తులసిని పూజించడం వలన ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగిపోయి, సంపదలు చేకూరతాయని స్పష్టం చేయబడుతోంది.
తులసిపూజతో వైకుంఠానికి నేరుగా చేరే అవకాశం
తులసిని సర్వరోగ నివారిణిగా, తులసి తీర్థాన్ని సర్వపాప హరిణి గా భావిస్తారు. కార్తీకమాసంలో తులసిని పూజించడం వల్ల మోక్ష సిద్ధి కలుగుతుందని, వైకుంఠానికి నేరుగా చేరే అవకాశం దొరుకుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. నిత్యం తులసి మొక్కను పూజించే ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయని, తులసిని పూజించిన వారికి మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతారు. తులసి మొక్క ఇంట్లో ఉన్నవారు అనారోగ్యాల బారిన నుండి రక్షించబడతారని పండితులు చెబుతున్నారు.
క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి కొమ్మకూ, తులసి మొక్కకు వివాహం శ్రేష్టం
కార్తీక మాసంలో తులసిని పూజించడం, క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి కొమ్మకూ, తులసి మొక్కకు వివాహం చేయడం, విష్ణువు కు లక్ష్మి కి చేసిన వివాహంగా పరిగణించడం ఎంతో కాలం నుంచి వస్తుంది. ఇలా ఈ మాసంలో విష్ణువుకు ఇష్టమైన తులసిని పూజించటం వల్ల విష్ణువు యొక్క కరుణ కటాక్షం భక్తులపై ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే కార్తీక మాసంలో విశేషంగా తులసి పూజను చేస్తారు.

Comments
Post a Comment