ఏరువాక పౌర్ణమి అంటే ఏమిటి? | What is Aeruvaka purnami ? | What do you do that day? | Bhakthi Margam | భక్తి మార్గం
ఏరువాక పౌర్ణమి
వర్షఋతువులో జ్యేష్ఠశుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారు
ఏరువాక పౌర్ణమి తిథి
26 నవంబర్ 3:53 గంటలకు ముగుస్తుంది. పౌర్ణమి తేదీ : 27 నవంబర్ 2023, సాయంత్రం 2.45 గంటలకు ప్రారంభమవుతుంది.
ఏరువాక పౌర్ణమి అంటే ఏమిటి? ఆరోజు ఏం చేస్తారు?
ఏరువాక పౌర్ణమి రైతులకు సంబంధించిన అతిపెద్ద పండగ. దీనినే జ్యేష్ట పౌర్ణమి అంటారు. తొలకరి ఆసన్నమవగా దున్నడానికి సిద్ధంగా ఉన్న పంటపొలాన్ని శుద్ధి చేసుకుని సేద్యం మొదలుపెట్టే ఉత్సవాన్ని ఏరువాక పున్నమి అంటారు. ఏరుపొంగి పొర్లడానికి చేసే పూజ అని కూడా అంటారు. ఈ ఆదివారం జూన్ 4న ఏరువాక పౌర్ణమి రానుంది.
ఈరోజున భూమిని, పశువులను, సేద్యానికి అవసరమైన పనిముట్లను పూజించే పండగ ఇది. ప్రకృతిని పూజించే పండగే ఏరువాక పున్నమి. అయితే జ్యేష్ట మాసంలో భూమిని ఎక్కువగా తవ్వకూడదని చెబుతారు. భూమి వేడెక్కి ఉన్నప్పుడు తవ్వడం వల్ల అందులో నుంచి విష వాయువులు వెలువడతాయని నమ్మకం. కేవలం పూజ కోసం మాత్రమే కాసింత దున్నుతారు. వర్షం పడగానే తిరిగి సేద్యపు పనులు ప్రారంభిస్తారు.
ఏరువాక పౌర్ణమి రోజున పశువులకు స్నానం చేయిస్తారు. వాటి గిట్లకు పూజ చేస్తారు. గోమాతకు పూజ చేస్తారు. నాగళ్లను దున్నేందుకు కష్టపెడుతున్నందున క్షమించి కరుణించమని అన్నదాత వాటికి పూజ చేస్తాడు. ఆహారం పండించేందుకు సహకరించాలని కోరుతాడు.
బెల్లం, బియ్యం, ఆవుపాలతో పులగం వండి పశువులకు ఆహారంగా పెడతారు. రైతులు ఏరువాక పున్నమి పాటలు పాడుకుంటారు.
అలాగే సేద్యానికి అవసరమైన పరికరాలన్నింటికీ పూజ చేస్తారు. నాగలి, కర్రు, గొర్రు, పార, ఆకురాయి వంటి వాటికి పూజ చేస్తారు.
ఏరువాక పున్నమి పండుగ విశేషాలు
మన భారతదేశంలో భిన్నమతతత్వాలు కలిగినవారు ఎక్కువగా వుండడంతో... పండుగలు కూడా వారివారి విధానాలకు అనుగుణంగానే నిర్వహించుకుంటారు. ముఖ్యంగా హిందువుల పండుగలు లెక్కలేనివన్నీ! సందర్భాలను బట్టి దేవతల పూజలను, కొన్ని పవిత్రమైన కార్యాలను పండుగ రూపంలో వైభవంగా జరుపుకుంటారు. అలాగే మన హిందూ సంస్కృతీ - సంప్రదాయాల ప్రకారం... ప్రాచీనకాలం నుంచి కొన్ని గుర్తుతెలియని పండుగలు కూడా ఇప్పటికీ అమలులో వున్నాయి. పట్టణప్రాంతాల్లో వాటి హవా అంతగా లేకపోయినా.. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రాచీన పండుగలను ఆచారాలుగా వ్యవహరిస్తూ ఘనంగా జరుపుకుంటారు. అటువంటి పండుగల్లో ఒకటైన ఈ ‘‘ఏరువాక పున్నమి’’ ఎంతో ముఖ్యమైంది.
సాధారణంగా ఈ ఏరువాక పున్నమి పండుగను గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేసుకునేవారు వైభవంగా నిర్వహించుకుంటారు. ‘‘ఏరువాక’’ అనే పదంలో ‘‘ఏరు’’ అంటే.. ఎద్దులను కట్టి, దుక్కి దున్నటానికి సిద్ధపరిచిన నాగలి అని అర్థం. అంటే దీనిని బట్టి అర్థమయ్యేదేమిటంటే... ప్రత్యేకంగా ఈ పండుగ కేవలం వ్యవసాయదారులకు మాత్రమేనని తెలుస్తోంది. ఈ పండుగను నిర్వహించుకోవడం ప్రారంభం అయిందంటే... గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు కూడా మొదలవుతున్నట్టు లెక్క!
మన భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. ప్రపంచం మొత్తం మీద చాలావరకు పంటలు మన దేశంలోనే ఎక్కువగా పండుతాయి. అందువల్ల మన దేశంలో ఈ వ్యవసాయాన్ని ఒక పవిత్రమైన కార్యంలా రైతులు భావిస్తారు. అలాగే మన పూర్వీకులు ఆనాటిరోజుల్లో భూమిని ఒక దేవతగా పూజించేవారు. ఎందుకంటే.. దేశాన్ని పచ్చని చెట్లతో - పంట పొలాలతో సస్యశ్యామలం చేసి, మానవాళికి అవసరమైన ప్రాణవాయువు, ఆకలిని తీర్చే చల్లని తల్లే మన భూమాత! దాంతో భూమిని భూదేవతగా వర్ణిస్తారు. అటువంటి భూమాతను నాగలితో గుచ్చి, దుక్కిదున్నడాన్ని ఎంతో బాధాకరంగా భావిస్తారు మన రైతన్నలు. అందువల్లే భూదేవతకు క్షమాపణలు చెప్పుకుంటూ.. వ్యవసాయం ప్రారంభించడానికి ముందుగా భూపూజా కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. ఆ విధంగా జరుపుకునే ఈ పండుగను ‘‘ఏరువాక పున్నమి’’గా పరిగణిస్తారు.
మన హిందూ పురాణాలలో కూడా వ్యవసాయం చేయడానికి ముందు భూపూజలు చేసుకోవాలని కొన్ని కథనాలు కూడా వున్నాయి. అలాగే... ఋగ్వేదంలో కూడా... ‘‘తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చేసుకోవాలి’’ అని వివరించి వుంది. ఆ భూపూజను కూడా హిందూ శాస్త్రాల ప్రకారం ‘‘జ్యేష్ఠ పౌర్ణమి’’ నాడు జరుపుకోవాలని నిర్ణయించబడి వుంది. అటువంటి పవిత్ర పర్వతినమైన జ్యేష్ట పౌర్ణమిని రైతాంగం ఏరువాక పున్నమిగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రాచీన సాహిత్యాలలో ఈ పండుగను ‘‘వప్పమంగల దివసం’’గా రైతులు జరుపుకునే పండుగదినం అని... పాళీ, ప్రాకృత వంటి భాషలలో జాతక కథల ద్వారా వెల్లడవుతోంది.
Comments
Post a Comment