కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎలా పెట్టాలి..? | Usiri Deepam Ela Pettali | Karthika Masam Usiri Deepam | Bhakthi Margam
ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే
కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకే కాదు ఉసిరికాయకు వున్న సంబంధం అంతా ఇంతా కాదు. ఉసిరిచెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం.శివకేశవులతో పాటు బ్రహ్మ, సకల దేవతలో ఉసిరి చెట్టులో కొలువై ఉంటే అద్భుత వృక్షం.
కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా ఉసిరికాయలో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఉసిరిచెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు.
ఉసిరి కాయ గుండ్రంగా ఉంటుంది. దానితో దీపం ఎలా పెట్టాలి..? అనేది పెద్ద సందేహమే వస్తుంది. మరి ఉసిరికాయతో దీపం ఎలా పెట్టాలి..ఉసిరి దీపంతో ఎటువంటి పరిహారాలు కలుగుతాయి..? ఉసిరి దీపంతో ఎటువంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం..
అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయను తీసుకుని దానిలో నెయ్యి నిండేలా కట్ చేసుకుని.. నేతితో నింపాలి. ఆపై తామర కాడల వత్తులను వేసి దీపమెలిగించాలి. ఇలా చేస్తే.. మహిళలు దీర్ఘసుమంగళీగా కలుగుతుంది అని చెప్పారు.
కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టాలని పెద్దలు చెప్తారు. అయితే ఆ సమంయలో ఉసిరికి సంబంధించిన పవిత్రమైన 21 నామాలను చదివితే విశేష ఫలితాలు వస్తాయి,
21 నామాలు
ఓం ధాత్రై నమ:
ఓం రామాయై నమ:
ఓం శా0త్యి నమ :
ఓం లోక మాత్రయై నమ:
ఓం కా0త్యి నమ :
ఓం ఆబ్ధి తనయాయై నమ:
ఓం మేధాయై నమ:
ఓం గాయత్రీయై నమ:
ఓం కళ్యానై నమ:
ఓం సావిత్రియై నమ:
ఓం విష్ణు పట్నై నమ:
ఓం విశ్వరూపాయై నమ:
ఓం మహాలక్ష్మిఁ నమ:
ఓం సురూపాయై నమ:
ఓం ప్రకృతె నమ:
ఓం కమనీయాయై నమ:
ఓం ఇందిరాయై నమ:
ఓం అవ్యక్తాయై నమ:
ఓం సుధ్యత్యి నమ:
ఓం కమలాయై నమ:
ఓం జగధ్దాత్రియై నమ:
-ఇలా పైన పేర్కొన్న నామాలను చదివి ఉసిరి దగ్గర దీపం పెట్టాలి. ఉసిరి చెట్టుకొమ్మలను తెచ్చి దీపం పెట్టడం శాస్త్రసమ్మతం కాదు. కానీ ఆపధర్మంగా బజారులో అమ్ముతున్న వాటిని తెచ్చి ప్రస్తుత కాలంలో భక్తులు దీపం పెడుతున్నారు. కనీసం వచ్చే ఏడాదికన్నా మీమీ ఇండ్లలలో ఉసిరి చెట్టు పెంచి అక్కడ దీపాలను పెట్టండి.
ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అంతేగాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే.. నవగ్రహ దోషాలు తొలగిపోతాయి.
నవగ్రహాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలంటే.. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు అంటూ వుండవు. అష్ట దరిద్రాలు తొలగిపోతాయి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
అంతేగాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిదానం చేస్తే.. భూమండలానికి ప్రభువు అవుతారని, దారిద్ర్యం తొలగిపోతుందని విశ్వాసం. అలాగే ఇంటి ముందు తులసీ కోట వద్ద ఉసిరికాయతో దీపమెలిగిస్తే కోరిక కోర్కెలు నెెెరవేరుతాయని భక్తుల ప్రగాణ నమ్మకం.

Comments
Post a Comment