తులసి కల్యాణం వివాహ పూజా విధానం | Tulasi kalyanam pooja vidhanam | bhakthi margam | భక్తి మార్గం


తులసి వివాహ పూజా విధానం

తులసి పూజా విధానం

తులసి వివాహం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. మీ ఇంటి పెరట్లో లేదా గుడిలో ఉండే తులసి మొక్కకు పూలు, పండ్లు, ఎర్రని రంగు వస్త్రాలను సమర్పించి పూజను ప్రారంభించాలి.

తులసి చెట్టు ఎదుట ధూపం, దీపాలను వెలిగించాలి. తులసి చెట్టుకు పూల మాల వేసి, తులసి గాయత్రీ మంత్రాలను 108 సార్లు చదవాలి.

సంధ్యా సమయంలో తులసి చెట్టు ఎదుట దీపం వెలిగించాలి.

శాలిగ్రామంతో పాటు ఉసిరి కాయలను తులసి మొక్కలకు సమర్పించాలి.

తులసి పూజ ఎలా చేయాలి? 

తులసికోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణము చేయాలి, నమస్కరించాలి. దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి.

తులసి వనమున్న గృహము పుణ్య తీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి. నమస్తులసి కళ్యాణీ! నమో విష్ణుప్రియే! శుభే! నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే! బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ! పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ! ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం యః పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్ అని తులసిని ప్రార్థించి, అచ్యుతానంతగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి. 

తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అని చెంబులోని నీళ్లను తులసిచెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి. తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే అని తులసికోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి.

పూజ కోసం తులసీ పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం. తులసీం యే విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాః - పూజ చేయటం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యములు అని స్కాందపురణం చెప్పింది. తులసి చెట్టు నుండి దళాలను మంగళ , శుక్ర , ఆది వారములలో, ద్వాదశి , అమావాస్య , పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో త్రెంప కూడదు . ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది. తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు. ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను త్రెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి.

సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధము వర్తించదు. సాలగ్రామమున్నవారు అన్ని తిథి,వారములయందు తులసి దళములను త్రెంపవచ్చు. ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం. శ్రీమహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలూ వర్తించవు. ఇది ఆహ్నిక సూత్రావళిలో చెప్పబడింది. "స్నానము చేయకుండా మరియు పాద రక్షలు ధరించి" తులసి చెట్టను తాకరాదు, దళములను త్రెంపకూడదు. ఇది పద్మపురాణంలో చెప్పబడింది.

తులసి మంత్రాలు

దేవీ త్వం నిర్మితా పూర్వమర్చితసి మునీశ్వరైః

మనో నమస్తే తులసీ పాపం హర హరిప్రియే ||

తులసి శ్రీ మహాలక్ష్మీర్విద్యా విద్యా యయశస్వినీ|

ధర్మ ధర్మాననా దేవీ దేవీదేవమానః ప్రియా||

తులసీ భూర్మహలక్ష్మీః పద్మినీ శ్రీహరిప్రియా||

ఓం శ్రీ తులసాయి విద్మహే |

విష్ణు ప్రియై ధీమహీ |

తన్నో వృందా ప్రచోదయాత్ |

వృందా - అన్ని వృక్షాలు, చెట్ల దేవత

బృందావని - యుమునా నది ఒడ్డున జన్మించింది

విశ్వ పూజితా - ప్రపంచమంతా పూజించబడేది

పూల సారాంశం - ప్రతి పువ్వుకు సంబంధించిన సారాంశం

క్రిష్ణ జీవని - శ్రీ క్రిష్ణుని జీవితం

తులసి - ప్రత్యేకమైనది

Related Postings:

1. Stotras In Telugu

tags : karthika masam lo tulasi puja yendhuku chestharu?karthika masam lo tulasi poja vishistatha, karthika ,masam lo tulasi poja timings, karthika masam lo tulasi poja yeppudu cheyyali, tulasi and amla or usiri trees relation,benefits of tulasi poja in karthika masam, karthika masam lo lakshmi poja kuda chesthara,bhakthi margam.in, Bhakthi Margam,karthika tulasi kalyanam , tulasi kalyanam , tulasi vivaha pooja vidhanam , tulasi pooja vidhanam , తులసి కల్యాణం వివాహ పూజా విధానం , తులసి పూజా విధానం , తులసి వివాహ పూజా విధానం

Comments