కార్తీక చలిమిళ్ల నోము కథ | The story of Karthika Chalimilla Nomu | Karthika Chalimilla Nomu | bhakthi margam | భక్తి మార్గం


కార్తీక చలిమిళ్ల నోము

స్త్రీలు సంపద ... సంతానం ... సౌభాగ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఈ మూడింటిని ప్రసాదించే నోముగా 'కార్తీక చలిమిళ్ల నోము' చెప్పబడుతోంది.

కార్తీక చలిమిళ్ల నోము కథ

కార్తీక చళిమిళ్ళ నోము కథరాజకుమార్తెయు, మంత్రి కుమార్తెయు నొకదినమున రాజపురోహితుని చూచి బ్రాహ్మణోత్త్తమా! సకల శుభములనిచ్చు వత్రము నొకదానిని తెలుపమనగా ఆ విప్రుడు "కన్యలారా! మీరు కార్తీక చలిమిళ్ళ నోము పోయుడు. కార్తీకపౌర్ణమినాడీ వ్రతము ప్రారంభింపవలయును. ఆ సంవత్సరము ఐదుశేర్ల బియ్యముతో చేసిన చలిమిడిని ఐదుగురు ముత్తైదువులకును, రెండవ సంవత్సరము పదిశేర్ల బియ్యముతో చేసిన చలిమిడిలను పదిమంది ముత్తయిదువులకును, మూడవఏడు పదునయిదు శేర్ల బియ్యముతో చేసిన చలిమిడిని పదునయుదుగురు ముత్తైదువులకు వాయనము లీయవలయును. దక్షిణ తాంబూలములు ఈయవలయును. యిష్టమృష్టాన్నములు పెట్టవలయునని చెప్పిరి.

వారిలో మంత్రికూతురు వ్రతమును నియమముతో చేసి యొక సామ్రాజ్యమునేలు రాజునకు భార్యయై ఎంతో ఐశ్వర్యమునను భవించినది. రాజకుమారి మదోన్మాదమున వత్రమునుల్లంఘించిన కారణమున దరిద్రురాలయి భర్తచే వెడలనంపబడి యడవులంబడి దుఃఖించుచు బోవుచుండగ పార్వతీపరమేశ్వరులు ఆమెకు దర్శనమిచ్చి "అమ్మాయీ! వ్రతోల్లంఘనము చేసినందున నీకీలోపము కలిగినది. అపరాధము చెప్పుకొని మరలనోము పట్టమనగ నామె తిరిగి కార్తీక చలిమిళ్లనోమునోచి సర్వసౌఖ్యముల ననుభవించినది.

కార్తీక చలిమిళ్ల నోము ఎలా చేస్తారు ?

కార్తీకమాసమంతా ఉదయాన్నే స్నానం చేసి, ఈ నోముకు ఆధారమైన కథ చెప్పుకుని తలపై అక్షింతలు ధరించాలి. మొదటి సంవత్సరం కార్తిక పౌర్ణమి రోజున 'అయిదు మానికల బియ్యం చలిమిడి'ని అయిదుగురు ముత్తయిదువులకు నదీ తీరంలో వాయనమివ్వాలి. రెండవ సంవత్సరం కార్తీక పౌర్ణమికి 'పది మానికల బియ్యం చలిమిడి'ని ఉసిరి చెట్టుకింద పదిమంది ముత్తయిదువులకు వాయనమివ్వాలి. 

ఇక మూడవ సంవత్సరం కార్తీక మాసం చివరి రోజున ఉదయాన్నే దేవాలయానికి వెళ్లి 'గౌరీ పూజ'చేయాలి. ఆ తరువాత 'పదిహేను మానికల బియ్యం చలిమిడి'ని పదిహేను మంది ముత్తయిదువులకు వాయనమివ్వాలి. ప్రతి ఏడాది కార్తీక మాసం నెలంతా కథ చదువుకుని అక్షింతలు తలపై వేసుకున్న తరువాతే ఇలా చేయాలి. ఇక ఈ నోముకు సంబంధించిన కథ గురించి తెలుసుకుందాం.

పూర్వం ఒక రాజు గారికి మంత్రి గారికి ఒకే ఈడు ఆడ పిల్లలు వుండేవారు. వాళ్లిద్దరూ కూడా మూడేళ్లపాటు 'కార్తీక చలిమిళ్ల నోము'నోచారు. అయితే మంత్రిగారి కూతురికి ప్రతి ఏడాది మంచి ఫలితాలు కనిపిస్తూ వచ్చాయి. ఆమెకి చక్కని సంతానం సౌభాగ్యం  సంపదలు ప్రాప్తించాయి. ఇక రాజుగారి కూతురు విషయంలో ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. దాంతో ఆమె తీవ్రమైన అసహనానికి అసంతృప్తికి లోనైంది. 

నోము విషయంలో కూడా తాను రాజు కూతురిననే అహంకారాన్ని చూపడం వల్లనే ఆమెకి అలాంటి ఫలితాలు వచ్చాయని పార్వతీ దేవి గ్రహించింది. ఆ రాత్రే అమ్మవారు రాజుగారి కూతురు కలలో కనిపించి ఆ విషయాన్ని చెప్పింది. ఆ వెంటనే ఆమె తన పద్ధతిని మార్చుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నోమునోచి ఆశించిన ఫలితాలను అందుకుంది.

ఈ నోమును నోచుకొనేవారు అయిదు మానికల (పది కిలోల) బియ్యంతో చలిమిడి చేసి మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువలకు, ఆపై సంవత్సరం పదిమందికి, తరవాతి సంవత్సరం పదిహేను మందికి వాయనాలనిస్తారు. ఇదే ఈ నోముకు ఉద్యాపన.

Related Postings:

1. Stotras In Telugu

tags : chalimilla nomu, chalimilla nomu katha, karthika chalimilla nomu katha , karthika chalimilla nomu, karthika masam , karthika puranam , karthika puranam pooja vidhanalu , bhakthi margam , the story of karthika chalimilla nomu , కార్తీక చలిమిళ్ల నోము కథ , చలిమిళ్ల నోము కథ ,  చలిమిళ్ల నోము  , స్త్రీలు నోములు , karthika masam nomulu , కార్తీక చలిమిళ్ల నోము ఎలా చేస్తారు ? ఈపేరు ఎలా వచ్చింది ?

Comments