కార్తీకమాసంలో ఉసిరిచెట్టుకిందే ఎందుకు వనభోజనాలు చేస్తారు? | Singnificance Of Amla Tree In Karthika Masam | bhakthi margam | భక్తి మార్గం
కార్తీకమాసంలో ఉసిరిచెట్టుకిందే ఎందుకు వనభోజనాలు చేస్తారు?
కార్తీకమాసములో బంధువులు, స్నేహితులతో కలసి చెట్ల నీడలో (ప్రత్యేకించి ఉసిరి చెట్టు నీడన) కలసి భోజనం చేయటాన్ని వన భోజనం అంటారు. ఈ రోజును ప్రకృతితో మన బంధాన్ని గుర్తుచేసుకునే రోజుగా చెప్పవచ్చు. అసలు కార్తీక మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. ఏడాది కాలంలో ఎప్పుడు కుదిరినా కుదరక పోయినా బంధుమిత్రులతో కలిసి కొంత సమయం గడింపేందుకు వనభోజనాలు గొప్ప సందర్భంగా మారింది.
పురాణ కధల ప్రకారం చెప్పాలంటే కార్తీక పురాణంలో వనభోజనాల ప్రసక్తి ప్రముఖంగా కనిపిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనంలో, విష్ణుమూర్తిని అర్చించి వనభోజనం చేసినవారి సకల పాపాలూ తొలగిపోతాయన్నది పురాణంలోని మాట. ఈ సంప్రదాయాన్ని తరచి చూస్తే వనభోజనానికి ఎందుకంత ప్రాధాన్యతో అర్థమవుతుంది.
సూత మహర్షి మునులందరితో కూడి నైమిశారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలను చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడినది. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కల్గిన వృక్షం మరియు దామోదరునికి (శ్రీహరికి) అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్టం. వనభోజనాల ప్రారంభానికి ముందు, ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి, పూజించి ఆ తరువాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలసి వనభోజనాలను చేస్తారు.
శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడి తోను, మరియు తోటి గోప బాలకులతో కలసి ఉసిరి మొదలైన మహా వృక్షాల నీడన యమునా నదీ తీరాన, బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేసాడని భాగవతంలో వర్ణించబడినది.
ఉసిరిచెట్టు క్రింద ఉసిరికాయలతో దీపారాధన చేసి శ్రీమహావిష్ణువును అర్చించే వారిని చూడటానికి యమునికి కూడ శక్తి చాలదట. ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయని భక్తుల విశ్వాసం
ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీకమాసంలో ఈ ఉసిరిక వృక్షం కింది భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి, మధుర పదార్థాలను నివేదించాలి.
ఉసిరి చెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలని, ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చెయ్యాలని పెద్దలు అంటుంటారు. ఈ కాలంలోనే ఉసిరి కాయలు బాగా వస్తాయి. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవినిలాంటిది. రోజూ ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తినాలి. ఇందులో షడ్రుచులలోని చేదు తప్ప మిగతా ఐదు రుచులు వున్నాయి.
ఇది మన జీర్ణశక్తిని కాపాడుతుంది. మన శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది. శరీరంలో సమతుల్యం తీసుకువస్తుంది. ఈ చెట్టుగాలి కూడా చాలా మంచిది. అందుకే కార్తీకమాసంలో ఉసిరి చెట్టు దగ్గర దీపాలు, పూజలు, ప్రదక్షిణలు, వన భోజనాలు అంటూ ఎక్కువసేపు ఈ చెట్టుదగ్గర గడపాలని చెప్పారు.
ఉసిరిచెట్టు మూలంలో శ్రీహరి, స్కంధంలో రుద్రుడు, ఊర్ధ్వంలో బ్రహ్మ, శాఖలలో సూర్యుడు, ఉపశాఖలలో దేవతలు ఆశ్రయించి ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువును పూజించి, చిత్రాన్నాలను నివేదించి, మధ్యాహ్నం బంధుమిత్రులతో కలసి ఉసిరి చెట్టు నీడలో వన భోజనం చేస్తే సకల పాపాలు తొలగిపోయి విష్ణులోకం పొందుతారు.
కార్తీకమాసంలో వాతావరణ ప్రభావం వల్ల మనిషిలో ఉష్ణాంశము తక్కువై, త్రిదోషాలు వికృతి చెందుతాయి. తులసి వాసన, ఉసిరిక వాసన పీల్చుకోవడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందనే నమ్మకం వనభోజనాలు ఏర్పాటు చేయడానికి నాంది పలికిందని పెద్దలు అంటారు. కార్తీక పొర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం, ఉసిరి కాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి.
వన భోజనం చేయడం వల్ల ఆధ్యాత్మిక ఫలితాలు, ఆరోగ్యంతో పాటు ప్రజల్లో ఆత్మీయతానురాగాలు పెంపొంది సామాజిక సామరస్యతకు, సమైక్యతకు దోహదం చేస్తుంది. ఆనందానికి సంకేతం పచ్చదనం. దాన్ని పంచుకుంటూ ఆనందాన్ని మనసులో నింపుకొంటూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆటపాటలతో, నృత్య గీతాలతో ఆనందంగా గడుపుతారు.
వనంలోకి వెళ్లి ఆ ఉసిరి చెట్టు కింద, తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని, పరమేశ్వరుడికి మహా నైవేద్యం పెట్టి, అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని, ఆ ప్రకృతి అనుగ్రహాన్ని, పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి వచ్చే పక్రియనే వన భోజన పక్రియ అంటారు. వన భోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వన భోజనాలకు వెళ్లకూడదు.
ఉసిరిచెట్టు క్రిందే ఉత్తమం
వన భోజనానికి ఎంచుకునే ప్రదేశం అత్యంత పవిత్రంగా ఉండాలి. వన భోజనాలకు రకరకాల ఫల, పుష్ప, వృక్షాలు కలిగిన ఏటి ఒడ్డున ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోవడం ఉత్తమం. అక్కడ తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉండాలి. తులసివంటి మొక్కలు కూడా ఉంటే మరీ మంచిది. బయట నుండి తెచ్చినవి కాకుండా సాధ్యమైనంత వరకు ఆహార పదార్థాలు ఆ వన ప్రదేశంలోనే వండుకోవాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామం పెట్టి కార్తీక పూజలు చేయాలి. తరువాత విస్తరాకులలో గానీ అరిటాకుల్లో గాని అందరూ కలసి భోజనం చేయాలి. ఇలా అందరూ కలసి పని చేయడంలో సహకార స్ఫూర్తి మనకు కనపడు తుంది. స్నేహాన్ని, సమైక్యతను పెంచేదే ఈ వనభోజనాల సంప్రదాయం.
క్షమాగుణానికి ప్రతీకగా ఉసిరి చెట్టును పిలుస్తుంటారు. ధాత్రి చెట్టు అని కూడా ఉసిరిని పిలుస్తుంటారు. ఈ చెట్టు లక్ష్మీ స్వరూపం కూడా. పురణాల ప్రకారం లక్ష్మీ దేవి ఎక్కడుంటే విష్ణుమూర్తి కూడా అక్కడే ఉంటాడు. అందుకే మన పెద్దలు ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేయాలని చెప్తుంటారు. క్షమాగుణానికి ప్రతీక అయిన ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడని వివరిస్తున్నారు పెద్దలు. పరబ్రహ్మ స్వరూపం అయినటువంటి ఆహారం ముందర అందరూ సమానమని చెప్పడమే వన భోజనాల ఉద్దేశమని పెద్దలు పేర్కొంటున్నారు.
ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే కనుక అది స్వామి వారి ప్రసాదంగాగానే భావించబడుతుందట. అందుకే ఉసిరి చెట్టును ప్రజలు దేవుడిలా పూజిస్తుంటారు. ఇకపోతే పిక్నిక్ మాదిరిగా అలా వనభోజనాలకు వెళ్లి ప్రజలంతా హ్యాపీగా పచ్చటి ప్రకృతి వాతావరణంలో కొద్ది సేపు సేద తీరి ఎంజాయ్ చేయొచ్చు. ఉసిరి చెట్టు కింద భోజనం చేయడంతో పాటు మహా విష్ణువుకు పూజ చేస్తే అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుతుందట.
కార్తీకమాసంలో శివుని ఆరాధన చాలా ప్రాముఖ్యమైనదిగా చెబుతారు. అలాంటి కార్తీక మాస సమయంలో శివునితోపాటు శ్రీమన్నారాయణుడికి కూడా పూజలు చేయాలి. కార్తీక మాసంలో ప్రత్యేకంగా చెప్పబడిన అంశం.. చెట్ల కింద వనభోజనాలకు వెళ్లడం.. ఇది చాలా సంప్రదాయ పద్ధతిలో అందరూ ఒకేచోట కలిసి భోజనం చేయడం అనేది అనాధిగా వస్తోంది. పురాణాల్లో కూడా చెట్లకిందకు వెళ్లడంపై అనేక కథలు ఉన్నాయి.
ప్రత్యేకంగా ఉసిరి చెట్టు కిందకు ఎందుకు వెళ్తారో కూడా మహా పండితులు చక్కగా వివరణ ఇచ్చారు. ఉసిరి అంటే.. లక్ష్మీదేవి.. లక్ష్మీనారాయణుడి స్వరూపంగా కొలుస్తారు. అందుకే ఉసిరి చెట్లును దేవతగా పూజిస్తారు. చెట్టుకు పసుపు, కుంకమతో పూజించి దీప నైవేద్యాలను సమర్పించి పూజలు చేస్తారు. ప్రదక్షిణులు చేసి సకల సంపదలు, ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుతారు.
కార్తీక మాసంలో విశిష్టంగా చెప్పబడిన ఈ ఉసిరిచెట్టు ఉద్యానవనానికి చాలా ప్రాముఖ్యత ఉందనే చెప్పాలి. అందరూ కలిసి సూర్యోదయానికి ముందే నిద్రలేసి తలస్నాన్నాలు ఆచరించి ఇంట్లో పూజలు చేసుకుంటారు. ఇంట్లో అందరూ కలిసి పట్టువస్త్రాలు ధరించి చెట్లకు కిందకు వనభోజనాలకు వెళ్తుంటారు. కార్తీక మాసంలో ఇలా వనభోజనాలకు వెళ్లడం ద్వారా అంతా మంచి జరుగుతుందని, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.. అందరూ కలిసి ఒకేచోట భోజనం చేయడం ద్వారా అందరూ ఒక్కటే అనే విషయాన్ని లోకానికి చాటిచెప్పవచ్చు.
కార్తీక మాసంలో వన భోజనాలకున్న ప్రాధాన్యత
కార్తీకమాసం అనగానే వనభోజనాల హడావిడి మొదలౌతుంది. ఊరూవాడా సందడిగా ఉంటుంది. వనభోజనాల ప్రసక్తి అనేక ధార్మిక గ్రంధాల్లో ఉంది. ముఖ్యంగా ''కార్తీక పురాణం''లో కార్తీక పౌర్ణమినాడు నైమిశారణ్యంలో మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు లిఖితమైంది.
ఉసిరిచెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి, ఉసిరికలతో హరిని పూజించి, గోవింద నామస్మరణ చేస్తూ షోడశోపచారాలతో పూజించి ఆనక వనభోజనాలు చేశారు.అలా పూర్వం మహర్షులు ఆచరించిన కార్తీక వనభోజనాలు ఇప్పటికీ ఏర్పాటు చేసుకుంటున్నాం. నలుగురితో కలిసి ఆనందిస్తున్నాం. ఇంతకీ కార్తీక వనభోజనాలు ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం.
కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం,ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటిచెబుతున్నాయి. దేశ సంస్కృతి సంప్రదాయాలను,హైందవ ధర్మ మార్గాన్ని అనుసరించి అనాదిగా వస్తున్న ఎన్నో పర్వదినాలను మనం పాటిస్తూ వస్తున్నాం. ఇందులో భాగమే కార్తీక మాసంలో జరుపుకునే వన సమారాధన కార్యక్రమం. దీనినే కార్తీక వన భోజనాలుగా పేర్కొంటారు.
కార్తీకమాసం వచ్చిందంటే చాలు వనభోజనాలకు పెట్టింది పేరు.
వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడవుందా అని ప్రజలు వెతుకుతుంటారు. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైన భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మయినా వెంట తీసుకు వెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరూ ఉసిరి చెట్టువద్ద కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం.
ఉసిరిని భూమాతగాను కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం ఉంది. ఉసిరి సకల మానవాళిని రక్షిస్తుందనీ విశ్వసిస్తారు. వృద్దాప్యాన్ని దరిచేరనివ్వని ఔషద మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చెపుతుంది ఆయుర్వేదం. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు.
కార్తీక మాసంలో వనభోజనాల్లో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండితులను పిలిచి సత్కరించి అందరూ భోజనం చేయాలి. వనభోజన కార్యక్రమాలను నిర్వహించే వారికి పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకమాస వన భోజనం అంటే ఎక్కడ పడితే అక్కడ చేసే కార్యక్రమం కాదు.
వన భోజనానికి ఎంచుకునే ప్రదేశం అత్యంత పవిత్రంగా ఉండాలి. వన భోజనాలకు రకరకాల పల, పుష్ప, వృక్షాలు కలిగి ఏటి ఒడ్డున ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోవడం ఉత్తమం. అక్కడ తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉండాలి. తులసివంటి మొక్కలు కూడా ఉంటే మరీ మంచిది. బయట నుండి తెచ్చినవి కాకుండా ఆహార పదార్థాలు అక్కడే వండుకోవాలి. సాత్విక ఆహారాన్ని తీసుకోవడం మేలు.
కార్తీక మాసంలోనే వనభోజనాలు ఎందుకెళ్తారో మీకు తెలుసా?
ఇతర మాసాలతో పోలిస్తే కార్తీక మాసానికి ఆధ్యాత్మికంగా బాగా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో శివుడిని పూజించేందుకుగాను శైవాలయాల కు భక్తులు పోటెత్తుతుంటారు. పరమ శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన ఈ మాసంలో పూజలు చేయడం వల్ల మనుషులందరూ ఆరోగ్యంగా ఉంటారు.ss
ఈ మాసంలో బంధుమిత్రులందరూ చక్కగా ఆనందంగా సమ్మేళనాలు జరుపుకోవడంతో పాటు వన భోజనాలకు వెళ్తుంటారు. ఇకపోతే అందరూ కలిసి హ్యాపీగా వనభోజనాలకు వెళ్తుంటారు. కాగా, ఈ క్రమంలోనే అందరు ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తుంటారు. ఇలా ఈ చెట్టు కిందనే భోజనం చేయడానికి గల కారణాలు మీకు తెలుసా.. జనరల్‌గా ఉసిరికాయల వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు గురించి అందరికీ తెలిసే ఉంటుంది.

Comments
Post a Comment