పున్నమి చవితి
పున్నం చవితి తేదీ మరియు సమయం
నవంబర్ 30 :- మధ్యాహ్నం 2:30 నుండి డిసెంబర్ 1 :- 3:34 వరకు
పున్నం చవితి అనేపెరు ఎలా వచ్చింది?
పున్నం చవితి ఎప్పుడు జరుపుకుంటారు?
పున్నమి చవితి ముఖ్య ఉద్దేశం
పున్నమి చవితి రోజు పుట్టకు పాలు పోసి, పుట్టకు ప్రదక్షిణ, నమస్కారాలు చేస్తు ఏం కొరుకోవాలి .?
పున్నమి చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. అందుచేత పున్నమి చవితి రోజున "నాగేంద్రా! మేము మా వంశములో వారము నిన్ను ఆరాధిస్తున్నాము.
నీ పుట్టదరికి నాపాప లొచ్చేరు పాపపుణ్యమ్ముల వాసనే లేని బ్రహ్మస్వరూపులౌ పసికూనలోయి!
కోపించి బుస్సలు కొట్టబోకోయి! పున్నమిచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
చీకటిలోన నీ శిరసు తొక్కేము కసితీర మమ్మల్ని కాటేయబోకు కోవపుట్టలోని కోడెనాగన్న
పగలు సాధించి మాప్రాణాలు దీకు నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
అర్ధరాత్రీవేళ అపరాత్రీవేళ పాపమే యెఱగని పసులు తిరిగేని ధరణికి జీవనాధార మైనట్టి
వాటిని రోషాన కాటేయబోకు పున్నమిచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
అటు కొండ యిటు కొండ ఆ రెంటినడుమ నాగులకొండలో నాట్యమాడేటి దివ్యసుందరనాగ! దేహియన్నాము
కనిపెట్టి మమ్మెపుడు కాపాడవోయి! పున్నమిచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
పగలనక రేయనక పనిపాటలందు మునిగి తేలేటి నా మోహాలబరిణె కంచెలు కంపలూ గడచేటివేళ
కంపచాటున వుండి కొంప దీకోయి! పున్నమిచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
అంటూ పుట్టకు ప్రదక్షిణ, నమస్కారాలు చేయాలని పురోహితులు అంటున్నారు.
ఈ స్తోత్రాన్ని పున్నమి చవితి రోజున పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పఠించాలి.
సర్ప సర్ప భద్రాంతే దూరం గచ్ఛ మహావిషమ్|
జనమేజయ యాగాంతే ఆస్తిక వచనమ్|
అనంతాయ నమస్తుభ్యం సహస్రశిరస్తేనమః|
నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయేనమః|
అనంతో వాసుకిం శేషం తక్షకః గుళికస్తథా||
నాగ పంచమి పూజ కోసం మంత్రం
నాగ పంచమి నాడు.. సర్పరాజుని పూజించిన పుణ్య ఫలితాలను పొందడానికి రుద్రాక్ష జపమాలతో “ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తినాగః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపించండి.
నాగదేవత మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు
హిందూ విశ్వాసం ప్రకారం సర్పాలకు సంబంధించిన మంత్రాలతో దేనినైనా జపిస్తే,.. పాము కాటు అనే భయం ఉండదు.
భక్తి, విశ్వాసంతో నాగ దేవత మంత్రాన్ని పఠించడం ద్వారా, ఒక వ్యక్తి అన్ని రకాల సుఖ సంతోషాలను పొందుతాడు.
Comments
Post a Comment