నాగుల చవితి రోజు ఈ స్తోత్రాన్నిచదివి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ? | nagula chavithi mantram in telugu | Nagula Chavithi 2023 | Bhakthi Margam


నాగుల చవితి రోజు 
పుట్టకు పాలు పోసి, పుట్టకు ప్రదక్షిణ, నమస్కారాలు చేస్తు ఏం కొరుకోవాలి .?

నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. అందుచేత నాగుల చవితి రోజున "నాగేంద్రా! మేము మా వంశములో వారము నిన్ను ఆరాధిస్తున్నాము.

నీ పుట్టదరికి నాపాప లొచ్చేరు పాపపుణ్యమ్ముల వాసనే లేని బ్రహ్మస్వరూపులౌ పసికూనలోయి!

కోపించి బుస్సలు కొట్టబోకోయి! నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!

చీకటిలోన నీ శిరసు తొక్కేము కసితీర మమ్మల్ని కాటేయబోకు కోవపుట్టలోని కోడెనాగన్న

పగలు సాధించి మాప్రాణాలు దీకు నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!

అర్ధరాత్రీవేళ అపరాత్రీవేళ పాపమే యెఱగని పసులు తిరిగేని ధరణికి జీవనాధార మైనట్టి

వాటిని రోషాన కాటేయబోకు నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!

అటు కొండ యిటు కొండ ఆ రెంటినడుమ నాగులకొండలో నాట్యమాడేటి దివ్యసుందరనాగ! దేహియన్నాము

కనిపెట్టి మమ్మెపుడు కాపాడవోయి! నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!

పగలనక రేయనక పనిపాటలందు మునిగి తేలేటి నా మోహాలబరిణె కంచెలు కంపలూ గడచేటివేళ

కంపచాటున వుండి కొంప దీకోయి! నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!

అంటూ పుట్టకు ప్రదక్షిణ, నమస్కారాలు చేయాలని పురోహితులు అంటున్నారు.

ఈ స్తోత్రాన్ని నాగుల చవితి రోజున పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పఠించాలి.

సర్ప సర్ప భద్రాంతే దూరం గచ్ఛ మహావిషమ్|  

జనమేజయ యాగాంతే ఆస్తిక వచనమ్|  

అనంతాయ నమస్తుభ్యం సహస్రశిరస్తేనమః|  

నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయేనమః| 

అనంతో వాసుకిం శేషం తక్షకః గుళికస్తథా|| 

నాగ పంచమి పూజ కోసం మంత్రం

నాగ పంచమి నాడు.. సర్పరాజుని పూజించిన పుణ్య ఫలితాలను పొందడానికి రుద్రాక్ష జపమాలతో “ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తినాగః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని  జపించండి.

నాగదేవత మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు

హిందూ విశ్వాసం ప్రకారం సర్పాలకు సంబంధించిన మంత్రాలతో దేనినైనా జపిస్తే,.. పాము కాటు అనే  భయం ఉండదు.

భక్తి, విశ్వాసంతో నాగ దేవత మంత్రాన్ని పఠించడం ద్వారా, ఒక వ్యక్తి అన్ని రకాల సుఖ సంతోషాలను  పొందుతాడు.

Related Postings:

1. Stotras In Telugu

5. Rashi Phalalu


tags: nagula chavithi mantram in telugu, nagula chavithi, nagula chavithi 2023, nagula chavithi 2023 date time, nagula chavithi 2023 date time in telugu, nagula amavasya 2023 date and time, nagula panchami 2023 date, nagula chavithi pooja vidhanam telugu

Comments