కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాసం, ప్రాముఖ్యత, ఫలితం | Kartika Suddha Ekadashi Fasting, Significance and Benefits | Bhakthi Margam | భక్తి మార్గం
కార్తీక శుద్ధ ఏకాదశి
ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం.
కార్తీకమాసం
కార్తీకమాసం అత్యంత పవిత్రమైంది. ఈ మాసంలో శివకేశవుల పూజ చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాల్లో శివారాధన చేసేవారికి పుణ్యఫలం చేకూరుతుందని పురోహితులు అంటున్నారు.
కార్తీక మాసం మొత్తం మీద కార్తీక ఏకాదశి, ద్వాదశులకు ప్రత్యేకత ఉంది. అందుకే ఈ రెండు తిథుల్లో వైష్ణవ సంబంధమైన పూజలు ఎక్కువ చేస్తుంటారు. కార్తీకమాసం అంటేనే సాధారణంగా శివప్రధానమైన పూజలు నిర్వహించడం కనిపిస్తుంటే.. వీటితో పాటు జరిగే విష్ణుపూజలు.. మనకు శైవ, వైష్ణవ భేదాలు పాటించకూడదనే విషయాన్ని ప్రభోదిస్తాయని పండితులు అంటున్నారు.
కార్తీక మాసంలో వచ్చే తొలి ఏకాదశిని ప్రబోధ ఏకదాశి అంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది. ఆషాఢ ఏకాదశి (శయనైకాదశి) నాడు శయనించిన స్వామి (యోగనిద్ర) నుంచి ఈ రోజు మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాసం
కార్తీక శుద్ధ ఏకాదశిని ‘ప్రబోధైకాదశి’,‘బృందావన ఏకాదశి’ అనే పేరుతో పిలుస్తారు.కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేర్లు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశి అయ్యింది. దీనినే హరి-భోధిని ఏకాదశి అని కూడా అంటారు.
తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈరోజునే జన్మించారు. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరన చేయాలి. మర్నాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి.
కార్తీక ఏకాదశి మహత్మ్యం గురించి బ్రహ్మదేవుడు, నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు, తన వేలజన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈ రోజు చిన్న పుణ్యకార్యం చేసినా, అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానంతో పాటు పాపాపరిహారం జరుగుతుంది... పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు.
"అందుచేత ఉత్తిష్ఠోత్తిష్ట గోవింద! త్యజనిద్రాం జగత్పతే,
త్వయిస్తుపే జగత్ సుప్తం ఉత్థితే చోత్థితం జగత్" అనే ప్రబోధన మంత్రంతో ప్రార్థనచేసి, శ్రీమహావిష్ణువును అర్చించి, ఉపవసించాలి. ఈ రోజున భాగవతంలో "అంబరిషోపాఖ్యానం" చదివినా, విన్నా మేలు జరుగుతుందని పురోహితులు అంటున్నారు.
అందుచేత కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శివ, విష్ణువులతో పాటు తులసీ కోటను కూడా పూజించేవారికి ఈతిబాధలు తొలగి, సకల సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా ఈ రోజుల్లో శైవ, వైష్ణవ క్షేత్రాలను దర్శించుకునే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.
కార్తీక శుద్ధ ఏకాదశి-ప్రాముఖ్యత
కార్తీక శుద్ధ ఏకాదశిని ‘ప్రబోధైకాదశి’,‘బృందావన ఏకాదశి’ అనే పేరుతో పిలుస్తారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం. కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేర్లు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశి అయ్యింది. దీనినే హరి-భోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది.
మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈరోజునే జన్మించారు. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరన చేయాలి. మర్నాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి. కార్తీక ఏకాదశి మహత్మ్యం గురించి బ్రహ్మదేవుడు, నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుంది.
కొండంత పత్తిని చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు, తన వేలజన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈ రోజు చిన్న పుణ్యకార్యం చేసినా, అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానంతో పాటు పాపాపరిహారం జరుగుతుంది… పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు.
ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం. వస్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్దులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు.
అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి విష్ణుమూర్తికి హరతి ఇవ్వాలి.. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్లి అక్కడ స్వామికి ఇచ్చె హారతిని కన్నులారా చూసినా, హారతి కర్పూరం సమర్పించినా అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది.
కార్తీక శుద్ధ ఏకాదశి ఫలితాలు
ఈ ఏకాదశి సర్వపాపాలను హరిస్తుంది. వెయ్యి అశ్వమేథ యాగాలు, వంద రాజసూయ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. జీవుడు వేలజన్మాలలో చేసిన పాపాలను కాల్చేస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం చేసి, ఒక చిన్న మంచిపని చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలం ఇస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానం కలగడంతో పాటు సర్వపాపపరిహారం కలుగుతుంది, పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞాలు, యాగాలు, వేదం చదవడం వలన కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం లభిస్తుంది’ అని బ్రహ్మదేవుడు నారదమహర్షికి తెలిపాడు.
ఏకాదశి వ్రతం చేసినవారు ఒకరికి అన్నదానం చేయడం వలన సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానదీ తీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది. వస్త్రం, పళ్ళు, దక్షిణ తాంబూలాన్ని పండితులను దానం చేయడం వల్ల ఈ లోకంలోనే కాకుండా మరణం తరువాత కూడా స్వర్గసుఖాలు పొందుతారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, శ్రీమహావిష్ణువుని పూజించి, రాత్రి జాగరణ చేసి, ద్వాదశి ఘడియలు ఉండగానే శ్రీమహావిష్ణుపూజ చేసి, భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి.
Related Postings:
1. Stotras In Telugu
tags : కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాసం, ప్రాముఖ్యత,ఫలితం, కార్తీక శుద్ధ ఏకాదశి-ప్రాముఖ్యత , కార్తీక శుద్ధ ఏకాదశి: ఉపవాసం, కార్తీక శుద్ధ ఏకాదశి ఫలితం , Kartika Suddha Ekadashi Fasting, Significance and Benifits , benifits of suddha ekhadashi,suddha ekhadashi importance,fasting of suddha ekhadashi, bhakthi margam.in , suddha ekdhashi ,

Comments
Post a Comment