కార్తీక మాసం అనగానే ఉపవాసాలు, దీపాలు, వనభోజనాలు గుర్తుకువస్తాయి. వీటితో పాటు కార్తీక స్నానం కూడా తలపులోకి వస్తుంది. కార్తీకమాసంలో ప్రాతఃకాలానే నిద్రలేచి నది, చెరువు, బావుల దగ్గర స్నానమాచరించి దీపారాధన చేస్తారు. ఇక సముద్ర స్నానం చేసేందుకు మన పెద్దలు నిర్దేశించిన నాలుగు మాసాలలోనూ కార్తీకం ఒకటి.
సనాతన హిందూ మతం ప్రకారం.. స్నానానికి గొప్ప స్థానం ఉంది. అందులోనూ సముద్ర స్నానానికి, పుణ్యక్షేత్రాల్లో నదీస్నానానికి కూడా ప్రత్యేక రోజులు ఉన్నాయి. ఇవాళ మనం ఆశ్వయుజ మాసం పౌర్ణమి నుండి కార్తీక మాసం చివరి వరకు చేసే కార్తీక స్నానం గురించి తెలుసుకుందాం.
కార్తీకపురాణంలో నదీస్నాన మహత్యం గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. అధికార గర్వంతో కన్నూమిన్నూ కానక ఒకడు, తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసుకోక మరొకడు, వ్యసనాలలో మునిగితేలిన ఇంకొకడు బ్రహ్మరాక్షసులుగా మారిన వృత్తాంతం అందులో కనిపిస్తుంది. వీరు ముగ్గురూ కూడా నదీస్నాన మహిమ వలన శాపవిముక్తులుగా మారినట్లు కార్తీక పురాణం పేర్కొంటోంది.
ఒక నెలపాటు తీర్థస్నానం చేయడం వలన ఆధ్మాత్మిక పరంగా చాలా శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ మాసంలో, సూర్యోదయానికి ముందు రెండు ఘాటీలు అంటే ఒక సుమారు ఒక గంట ముందు చేసే తీర్థస్నానాన్ని కార్తీక స్నానం అంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లడం అసాధ్యమనుకుంటే.. పుణ్యక్షేత్రాల నుంచి తీసుకువచ్చిన నీటిని ఉపయోగించి స్నానం చేయొచ్చు. అయితే దీనికి ముందు ఒక మంత్ర పఠించాల్సి ఉంటుంది. ‘మహావిష్ణోః అనుగ్రహ ప్రాప్త్యర్థం తీర్థస్నానం కరిష్యే’ ఈ మంత్రాన్ని జపించి స్నానం చేయాలి.
కార్తీక మాసం స్నానం మంత్రం:
నమః కమలనాభాయ నమస్తే జలశాయినే |
నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే ||
అని చెప్పి, ముందుగా అర్ఘ్యాన్ని సమర్పించాలి.
కార్తికేహం కరిష్యామి ప్రాతః సన్నం జనార్దన |
ప్రీత్యర్థం తవ దేవేశ దామోదర మహాశయ ||
ధ్యాత్వాహం త్వాం చ దేవేశ జలేస్మిన్ స్నాతు ముద్యతః |
తవ ప్రసాదాత్ పాపం మే దామోదర విన్యస్యతు ||
ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలి.
కార్తీక మాసంలో ఈ విధంగా స్నానం చేస్తే సర్వపాపాలు నశించి, శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో సంపదలు పెరుగుతాయి. నిత్యే నైమిత్తికే కృష్ణకార్తికే పాపనాశ అనే మంత్రం శాస్త్రాలలో ఉంది. అలాగే ఏదైనా మతపరమైన పనుల నిమిత్తం నిత్యం స్నానం చేస్తే బాహ్య పాపాలు నశిస్తాయి. కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల అంతర్గత పాపాలు కూడా నశిస్తాయి. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత నుదుటిపై తిలకం పెట్టుకోవాలి.
వ్రతినః కార్తికే మాసి స్నాతస్య విధివత్ మమ |
గృహాణార్ఘ్యం మయాదత్తం రాధయా సహితో హరే ||
ఈ మంత్రాన్ని చెప్పిన తరువాత తూర్పు ముఖంగా నిలబడి, ఒక గిన్నెలో నీటిని నింపి.. ఆ నీటిని తులసి మొక్కకు పోయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని సమస్యలన్నీ తొలగిపోయిన సుఖఃసంతోషాలు కలుగుతాయి.
అలాగే కార్తీకమాసంలో అష్టాక్షరీ మంత్రాన్ని పఠించడం ఉత్తమం. అష్టాక్షరీ మంత్రం ‘ఓం నమో నారాయణాయ’. ఈ మంత్రాన్ని పఠించి లక్ష్మీ సమేతుడైన నారాయణుడికి హవిష్యన్న(నెయ్యితో అన్నం) నైవేద్యంగా సమర్పించి, స్వీకరిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది. సంతానం లేకపోతే సంతానం కలుగుతుంది. అలాగే కార్తీక స్నానానికి పుణ్యక్షేత్రాలకు వెళ్లడం వల్ల పుణ్యఫలం ఎక్కువ. కార్తీక మాసంలో విష్ణు సంబంధిత పుణ్యక్షేత్రాలలో స్నానం చేయడం విశేషం.
కార్తీకమాసంలో నీటి మీద చంద్రుని కిరణాల ప్రభావం అధికంగా ఉంటుందంటారు. ఇలా చంద్రకిరణాలను సోకిన నీటితో స్నానం చేయడం వలన అనేక వ్యాధులు నయమవుతాయని చెబుతారు. సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయమని సూచించడం వెనుక ఇదే అంతరార్థం కావచ్చు.
Related Postings:
1. Stotras In Telugu
tags: nitya pooja vidhanam in telugu , nitya parayana slokas in telugu, nitya parayana mantralu , daily puja procedure at home , daily pooja vidhi ,most powerful mantras in telugu , most powerful slokas , tulasi pooja vidhanam in telugu pdf, Tulasi Pooja Vidhanam In Telugu | Tulasi Pooja Ela Cheyali , How to do Tulasi pooja at Home, Tulasi Puja Vidhanam, Tulasi Vivaha in Telugu, Tulasi Kota Significance in Telugu, Ksheerabdhi Dwadasi Tulasi Pooja Vidhanam, tulasi stotram in telugu, tulasi ashtothram in telugu pdf, tulasi ashtottara shatanamavali in telugu, tulasi kalyanam pooja vidhanam in telugu, karthika masam tulasi pooja vidhanam in telugu, Bhakthi Margam, Bhakthi Margam telugu, Telugu Bhakthi margam, Bhakti margam, bhakti margam telugu, bhakthimargam.com, bhakthimargam.in, karthika masam snanam mantra in telugu, Karthika Snanam, karthika snanam mantra in telugu, karthika snanam mantra PDF Download in telugu

Comments
Post a Comment