కార్తీక మాసంలో తులసి కోట పూజ విధానము
ఈ రోజులలో శివారాధన చేయడం ద్వారా ఆ పరమశివుని అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం.ఎంతో పవిత్రమైన ఏకాదశి, ద్వాదశి తిధుల్లో మనం ఏం చేయాలో ఎలా పూజలను నిర్వహించాలో ఇక్కడ తెలుసుకుందాం….
కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి తిధుల్లో ఈ రెండు రోజులు విష్ణు సంబంధించినటువంటి పూజలను నిర్వహిస్తారు.అంతే కాకుండా కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ప్రబోధ ఏకాదశి అని కూడా పిలుస్తారు.
ఈ ఏకాదశి స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనది ఆషాడ మాసంలో వచ్చే ఏకాదశి రోజు శయన పై నిద్రించిన విష్ణు భగవానుడు ఈ ఏకాదశి రోజున నిద్రలేవడం వల్ల ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి వారిని పూజిస్తారు.
అదేవిధంగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజును క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తారు.ఏకాదశి రోజున విష్ణు భగవానుడు క్షీరసాగరమధనం నుంచి బయలుదేరి వచ్చి తనకెంతో ఇష్టమైన తులసి బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు.అందుకోసమే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసికోటకు ఎంతో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు.
కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యాస్తమయ సమయంలో తులసికోట ముందు దీపాలను వెలిగించి తులసికి, విష్ణుభగవానుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించి దానధర్మాలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా ఎన్నో రకాల వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చని, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి చెట్టును పూజించడం వల్ల ఈతిబాధలు తొలగిపోయి సకల సంపదలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని వేద పండితులు తెలియజేస్తున్నారు.ఈ పవిత్రమైన రోజుల్లో శివాలయాలు, విష్ణుదేవాలయాలను దర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి.
ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి.
నమస్తులసి కళ్యాణీ! నమో విష్ణుప్రియే! శుభే! నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే!
బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ! పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ!
ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం
యః పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్
అని తులసిని ప్రార్థించి, అచ్యుతానంతగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి. తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి.
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం
అని చెంబులోని నీళ్లను తులసిచెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి.
తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే
అని తులసికోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి. పూజ కోసం తులసీ పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం. తులసీం యే విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాః - పూజ చేయటం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యములు అని స్కాందపురణం చెప్పింది.
Related Postings:
1. Stotras In Telugu
tags: nitya pooja vidhanam in telugu , nitya parayana slokas in telugu, nitya parayana mantralu , daily puja procedure at home , daily pooja vidhi ,most powerful mantras in telugu , most powerful slokas , tulasi pooja vidhanam in telugu pdf, Tulasi Pooja Vidhanam In Telugu | Tulasi Pooja Ela Cheyali , How to do Tulasi pooja at Home, Tulasi Puja Vidhanam, Tulasi Vivaha in Telugu, Tulasi Kota Significance in Telugu, Ksheerabdhi Dwadasi Tulasi Pooja Vidhanam, tulasi stotram in telugu, tulasi ashtothram in telugu pdf, tulasi ashtottara shatanamavali in telugu, tulasi kalyanam pooja vidhanam in telugu, karthika masam tulasi pooja vidhanam in telugu, Bhakthi Margam, Bhakthi Margam telugu, Telugu Bhakthi margam, Bhakti margam, bhakti margam telugu, bhakthimargam.com, bhakthimargam.in

Comments
Post a Comment