కార్తీక మాసంలో కోటి సోమవారాలు | Karthika Koti Somavaram Vratham | koti somavaram 2023 | bhakthi margam | భక్తి మార్గం


కోటి సోమవారాలు
 

కోటి సోమవారం వ్రతం (Koti Somavaram Vratam) కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు.

కోటి సోమవారాలు ఎలా చేయాలి ?

నేడు కోటి సోమవారం. ఈ కార్తీకమాసం తొలి సోమవారం కూడా నేడే. ఇలా ఈ రెండు కలిసి రావడం అరుదుగా సంభవిస్తుంటుంది. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. రోజంతా ఆహారాన్ని త్యజిస్తే- ఉంటే కోటి సోమవారాల్లో ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.

కార్తీక మాసంలో సోమవారం రోజున సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం కలిసి రావడాన్ని కోటి సోమవారంగా పిలుస్తారు. కార్తిక మాసం.. శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైనది. అందులోనూ సోమవారం అంటే ఆధ్యాత్మిక పరంగా ఆ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో భక్తులు భక్తి శ్రద్ధలతో అన్ని సోమవారాలు ఉపవాసం ఉండటం ఆనవాయితీ.

ఈ ఏడాది కార్తీక మాసంలో సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం రోజున సోమవారం రావాడం అరుదు. ఆధ్యాత్మికపరంగా ఎంతో విశిష్ఠమైన ముహుర్తంలో వస్తున్నందున ఈ సోమవారాన్ని కోటి సోమవారంగా భావిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతుంటారు.

ఈ కార్తీకమాసంలో శ్రావణ నక్షత్రం ఈ నెల 18వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 1:18 నిమిషాలకు ప్రారంభమౌతుంది. 19 రాత్రి 11:51 నిమిషాలకు ముగుస్తుంది. ఈ రోజు ఉపవాసం ఉంటూ శివాలయాలను సందర్శించుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. సాయంత్రం ప్రదోష కాల సమయంలో దీపారాధన చేయాలి. కార్తిక మాసంలో నది/ సముద్ర స్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 

నదీ స్నానం అనంతరం ఉపవాసం ఉండటం, దీపారాధన, దీప దానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ నెల పొడవునా అచరిస్తారు. కార్తిక మాసంలో శ్రీమహా విష్ణువు నదులు, చెరువుల్లో నివసిస్తాడని విశ్వసిస్తారు. అందుకే ఈ మాసంలో నదీ స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. నదీ స్నానం కుదరనప్పుడు కార్తీక మాసంలో అన్ని రోజుల్లోనూ సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయాలి. గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు నదులను స్మరించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం, మాంసాన్ని ముట్టుకోకూడదు.

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఈ తెల్లవారు జాము నుంచే పూజాదికాలు మొదలయ్యాయి. 3 గంటలకు అర్చకులు ప్రాతఃకాల పూజలు, ఆర్జిత చండీ హోమం, రుద్ర హోమం నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గర్భాలయ ఆర్జిత అభిషేకం, సామూహిక ఆర్జిత అభిషేకాన్ని రద్దు చేశారు. 

కోటి సోమవారం పూజా విధానం

కార్తీక సోమవారం: రేపు సూర్యోదయానికి ముందే శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజ గదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం అనంతరం శివాయలయాని వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకుని ఆలయంలో దీపారాధన చేయాలి. ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. అనంతరం భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించుకోవాలి. ఇలా చేయడం వలన కోటి సోమవారాలు చేసిన ఫలితం దక్కుతుందని విశ్వాసం.

కార్తీక మాసంలో చేసే స్నానం, దీపం, పూజ, దానం విశిష్ట ఫలితాలను ఇస్తాయని నమ్మకం. శివ శివ అంటూ నామస్మరణ,  చేసినా.. కార్తీక దామోదర అంటూ కీర్తించినా శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో శివ నామస్మరణ, పూజ అత్యంత ఫలవంతం. సోమవారం చేసే స్నానం, పూజ, జపం ఆచరించినవారు అశ్వమేథ యాగం చేసిన ఫలితం పొందుతారని విశ్వాసం. అయితే కార్తీక మాసంలో  సోమవారానికి మరింత విశిష్టత ఉంది.

ఈ ఏడాది కార్తీక మాసం మొదటి సోమవారం నవంబర్ 20వ తేదీన వచ్చింది. శివ కేశవులకు ప్రీతిపాత్రమైన కోటి సోమవారం రోజున చేసే పూజ అత్యంత ఫలవంతం. శివాలయ సందర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి మేరకు వారు ఆచరించడం మంచిదని శాస్త్ర వచనం. రేపు చేసే దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలు ఇస్తారని విశ్వాసం.

కార్తీకమాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. నెల రోజులు పూజ చేసినా.. ముఖ్యంగా సోమవారం ఉపవాసం ఉండి.. అత్యంత భక్తిశ్రద్దలతో శివయ్యను పూజిస్తారు. కొంతమంది సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శివయ్యకు పూజ చేసి అనంతరం ఉపవాస దీక్ష విరమిస్తారు. అయితే కోటి సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని ఉవాచ. అందుకే రేపు కోటి సోమవారం కనుక ఉపవాస దీక్ష చేపట్టి ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సొంతం చేసుకోండి.

ఉపవాసం ఎలా చేయాలంటే..

కార్తీక సోమవారం: రేపు సూర్యోదయానికి ముందే శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజ గదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం అనంతరం శివాయలయాని వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకుని ఆలయంలో దీపారాధన చేయాలి. ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. అనంతరం భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించుకోవాలి. ఇలా చేయడం వలన కోటి సోమవారాలు చేసిన ఫలితం దక్కుతుందని విశ్వాసం.

కార్తీక మాస విశిష్టత..

కార్తీకమాసం మహత్యం గురించి మొదటగా వశిష్ట మహర్షి జనక మహరాజునకు వివరించగా..  శౌనకాది మునులకు సూతుడు చెప్పాడు. ఈ నెలలో ప్రతీరోజూ పుణ్య ప్రదమైనదే. రోజూ చేసే స్నానం, అర్చనలు, అభిషేకాలు విశిష్టమైనవి. నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన మహోత్సవ వేడుకలు ఆచరిస్తారు.

ఇక ఈ మాసంలో మహా విష్ణువు నదుల్లో మాత్రమే కాదు..చెరువులలో, దిగుడు బావుల్లో, పిల్లకాలువల్లో  నివసిస్తాడని విశ్వాసం. కనుకనే ఈ నెలలో సూర్యోదయానికి ముందే చేసే స్నానం గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలైన నదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఈ నెలలో శివకేశవులను, శ్రీ కృష్ణుడిని పూజించడం, తులసి కళ్యాణం అత్యంత ఫలవంతం.  ఈ మాసంలో ప్రతీరోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ రోజున ఏ తిథి వచ్చింది.. ఏ దేవుడిని పూజించాలి.. ఏమి చేస్తే  మంచిదో తెలుసుకుని దాని ప్రకారం పూజలను చేయడం అత్యంత ఫలవంతం.

Related Postings:

1. Stotras In Telugu

tags: karthika masam somavaram upavasam, karthika masam fasting rules, karthika masam fasting rules in telugu, karthika pournami fasting rules, karthika somavara vratham fasting rules, karthika somavaram upavasam ela cheyali, karthika somavaram pooja vidhanam in telugu, karthika somavaram 2023, karthika masam 2023, Bhakthi Margam, bhakthimargam, bhakthimargam.in, bhakthimargam.com,bhaktimargam, bhaktimargam.in , కోటి సోమవారాలు , koti somavaram pooja vidhanam , koti somavaram pooja benefits , koti somavaram , koti somavaram koti somavaram date telugu

Comments