కార్తీకమాసంలో ఉసిరికాయ ప్రాముఖ్యత | Importance of Indian Gooseberry (Usiri) Karthika Masam Usiri Chettu Mantram In Telugu | Bhakthi Margam


కార్తీకమాసంలో 
 ఉసిరికాయ ప్రాముఖ్యత

ఉసిరికాయనే ధాత్రీ ఫలం అంటారు. ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ఈ ఉసిరికాయకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది.


 "ధాత్రీఫలం పరంపూతం సర్వలోకేషు విశ్రుతం
యస్యరోపాన్నరో  నారీ ముచ్యతే జన్మబంధనాత్

భక్షతేభవేదాయుః పానేవైధర్మ సంచయః
అలక్ష్మీనాశనం స్నానే సర్వైశ్వర్య మవాప్నుయాత్"

  • ఉసిరిపండు ఎంతో పవిత్రమైనదిగా ముల్లోకాలలోనూ కీర్తించబడుతుంది.
  • ఉసిరి మొక్కల్ని నాటితే భవబంధాలు దూరమౌతాయి.
  • ఉసిరికాయని తింటే ఆయుర్దాయం పెరుగుతుంది.
  • ఉసిరిరసంతో స్నానం చేస్తే దరిద్రం తొలగిపోతుంది.
  • ఉసిరి చెట్టు ఉన్నచోట ఐశ్వర్యం తాండవిస్తుంది.
  • ఈ చెట్టు ఉన్న ఇంట్లో దుష్టగ్రహపీడలు ఉండవు.

శుక్ల లేక కృష్ణ పక్షంలో గానీ, ఏకాదశి నాడు గానీ ఉసిరి ఆకులని నీళ్ళలో వేసి లేదా ఉసిరి రసం కలుపుకుని గానీ స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి.
నిత్యం ఉసిరి రసంతో తలకి స్నానం చేస్తే  తల వెంట్రుకలు నల్లగా ఏపుగా పెరుగుతాయి.

ఉసిరిరసం నియమంగా సేవించిన వారికి పునర్జన్మ ఉండదు‌.
ధాత్రీ వృక్షాన్ని(ఉసిరి) చూసినా తాకినా ఆ వృక్ష నామాన్ని స్మరించినా శ్రీహరి ప్రీతి చెందుతాడు.

ఉసిరి చెట్టు ఉన్న స్థలంలో లక్ష్మీనారాయణులు, బ్రహ్మ సరస్వతులు నివసిస్తారు.

"సర్వయజ్ఞేషు కార్యేషు శస్తం చామలకేఫలం
సర్వదేవస్య పూజాయాం వర్జయిత్వా రవిసుతం

తత్మాద్రవిదినే తాత సప్తమ్యాం చ విశేషతః
ధాత్రీ ఫలాని సతతం దూరతః పరివర్జయేత్"

వివిధ రకాల యజ్ఞాయాగాలలో సకలదేవతల పూజలో ఉసిరిఫలాన్ని వినియోగిస్తారు. అయితే కేవలం సూర్యుడి పూజలో మాత్రమే ఉసిరిఫలాన్ని వినియోగించరు. అందుకే సూర్యవారమైన ఆదివారం, సప్తమి తిథి నాడు ఉసిరికాయని తాకకూడదు, స్వీకరించకూడదు.

కార్తీకమాసంలో ఉసిరి కాయ ప్రాముఖ్యత తెలుసా?

కార్తీక మాసం అంటే నిత్య దీపారాధన, ప్రత్యేక పూజలు, తులసి పూజ, కార్తీక వనభోజనాలు, కార్తీక స్నానం వంటి వాటికి ఎంతో ప్రసిద్ధి.ఇదే కాకుండా ఈ కార్తీకమాసం అంటే ఆ పరమ శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల.

ఈ నెలలో ఆ పరమశివుడు ప్రత్యేకమైన అభిషేకాలను పూజలను అందుకుంటాడు.అయితే వీటన్నిటితోపాటు కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకు ఉసిరికాయలు కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.

కార్తీక మాసంలో ఉసిరి చెట్టును ఎందుకు పూజిస్తారు ఇక్కడ తెలుసుకుందాం….
పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు క్షీరసాగర మధనం చేస్తున్నప్పుడు సముద్రగర్భం నుంచి అమృతం ఉద్భవిస్తుంది.

ఈ అమృతం కోసం దేవతలు, దానవులు పోటీ పడుతుండగా వీరిమధ్య జరిగిన పెనుగులాటలో అమృతం కొన్ని చుక్కలు నేలపై పడ్డాయని క్రమంగా ఆ అమృత చుక్కలే ఉసిరి చెట్టు గా మారాయని పురాణాలు చెబుతున్నాయి.అందువల్ల ఉసిరి చెట్టుకు కార్తీక మాసంలో ఎంతో ప్రాముఖ్యతనిచ్చి పూజలను నిర్వహిస్తారు.
కార్తీకమాసంలో ఉసిరికాయ మీద దీపారాధన చేయడం, క్షీరాబ్ది ద్వాదశినాడు తులసి చెట్టుతో పాటుగా ఉసిరి చెట్టును కూడా పూజి స్తారు.కార్తీక సోమవారం భోజనం చేయడం ద్వారా సకల వ్యాధులు తొలగిపోయి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని ప్రజలు విశ్వసిస్తారు.

మన ఆరోగ్యానికి పర్యావరణానికి మేలు చేసే వృక్షాలను దేవతా వృక్షాలు గా భావించి వాటిని పూజిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి
.
అందుకోసమే అత్యంత విశిష్టమైన తులసి మొక్కతో పాటు ఉసిరి చెట్టుకు కూడా కార్తీక మాసంలో విశేష పూజలను అందుకుంటాయి.

అందుకోసమే కార్తీకమాసంలో క్షీరాబ్ది ద్వాదశినాడు `ధాత్రి సహిత లక్ష్మీనారాయణస్వామినే నమః` అంటూ ఆ విష్ణు భగవానుడిని ప్రార్థిస్తారు.ఉసిరి చెట్టును సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపంగా భావించి హిందువులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

tags: Karthika Masam 2023, Karthika Masam pooja vidhanam in telugu, karthika masam usiri deepam, karthika masam usiri chettu pooja vidhanam in telugu, karthika masam usiri chettu mantram in telugu, karthika masam usiri mantras in telugu, karthika masam usiri deepam mantrams,  Bhakthi Margam, Bhakthi Margam telugu, Telugu Bhakthi margam, Bhakti margam, bhakti margam telugu, bhakthimargam.com, bhakthimargam.in

Comments