దీపారాధ‌న ఎలా చేయాలి ? | How to perform Deeparadhana | Karthika Masam | bhakthi margam | భక్తి మార్గం


దీపారాధ‌న ఎలా చేయాలి ?

కార్తీక మాసం ప‌ర్వ‌దినాల‌లో దీపారాధ‌న చేసే భ‌క్తులు అవ‌కాశం ఉంటే రాగి ప్ర‌మిద‌లో నిర్వ‌హిస్తే చాలా మంచిది. స‌ర్వ రోగాలు, దోషాలు ప‌రిపూర్ణంగా న‌శిస్తాయి. కుందుని ఒక ప‌ళ్శెంలో కానీ త‌మ‌ల‌పాకు మీద కానీ పెట్టాలి. కింద ఆధారం లేకుండా పెట్ట‌కూడ‌దు.

దీపారాధ‌న చేసేందుకు కొన్ని ప‌ద్ధ‌తులు ఉన్నాయి. ఎలాగంటే అలా చేయ‌కూడ‌దు. దీపారాధ‌న చేసేముందు వ‌త్తి వేసి త‌ర్వాత నూనె పోస్తుంటారు కానీ ఇది ప‌ద్ధ‌తి కాదు. దీపారాధ‌న చేసేట‌ప్పుడు నూనె పోసి త‌ర్వాత వ‌త్తులు వేయాలి. వెండి కుందులు, పంచ లోహ కుందులు, ఇత్త‌డి కుందులు మంచివి. మ‌ట్టి కుందులు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. స్టీలు కుందుల్లో దీపారాధ‌న చేయ‌కూడ‌దు. కుందుల‌ను రోజు శుభ్రంగా క‌డిగిన త‌ర్వాతే ఉయోగించాలి. అంతేకానీ శుభ్ర‌ప‌ర‌చ‌కుండా వ‌త్తులను మార్చ‌డం ప‌ద్ధ‌తి కాదు.

కార్తీక మాసం ప‌ర్వ‌దినాల‌లో దీపారాధ‌న చేసే భ‌క్తులు అవ‌కాశం ఉంటే రాగి ప్ర‌మిద‌లో నిర్వ‌హిస్తే చాలా మంచిది. స‌ర్వ రోగాలు, దోషాలు ప‌రిపూర్ణంగా న‌శిస్తాయి.

కుందుని ఒక ప‌ళ్శెంలో కానీ త‌మ‌ల‌పాకు మీద కానీ పెట్టాలి. కింద ఆధారం లేకుండా పెట్ట‌కూడ‌దు

దీపారాధన చేసేముందు పెట్టే కుందుల్లో నూనె, రెండు వ‌త్తులు వేసుకుని సిద్దంగా ఉండాలి. అగ్గిపుల్ల‌తో నేరుగా వ‌త్తుల‌ని వెలిగించకూడ‌దు. అందుకు మీరు ముందుగా ఏక‌హార‌తిలో క‌ర్పూరం వెలిగించి దానితో కానీ లేక‌పోతే ఒక అడ్డ‌వ‌త్తిని ఏక‌హార‌తిలో వేసి వెలిగించి దాని సాయంతో దాపారాధ‌న‌ని చేయాలి. అగ‌ర‌వ‌త్తులు, ఏకహార‌తి, క‌ర్పూర హార‌తి ఇవ్వాల్సి వ‌చ్చిన‌ప్పుడు దీపారాధ‌న నుంచి వెలిగించ‌కూడ‌దు.

 “దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్

     దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”


  “సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా

       గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్

       భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే

       త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే”

 “మూడు వత్తులు, నూనెలో తడిపి, అగ్నితో వెలిగించి శుభ ప్రదమైన, మూడు లోకాల చీకట్లను పోగొట్ట గలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నుండి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను.” అని, ప్రతి రోజు ఇంట్లో దీపం పెట్టేప్పుడు అనుకుంటాం. ఎంత గొప్ప భావన! ఎంతటి ఉదాత్తమైన ఆలోచన!!  పెట్టేది చిన్నదీపం. ఆశించేది మూడు లోకాల చీకట్లు పోవాలని . అంతే  కాదు. నరకం నుండి రక్షింపబడాలట.

దీపారాధ‌న చేయ‌గానే దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింత‌లు వేయాలి. దీప పీఠ భాగ‌ము బ్ర‌హ్మ‌తో స‌మానం. స్తంభం విష్ణు రూపం, ప్ర‌మిద ప‌ర‌మేశ్వ‌రుడ‌ని, దీప‌తైలం నాదం, వ‌త్తి అగ్ని దేవుడిగాను భావ‌న ఉంది. వెలుగు శ‌క్తి స్వ‌రూపం.

ఒక వ‌త్తి దీపాన్ని చేయ‌రాదు. ఏక వ‌త్తి అశుభ సంద‌ర్భంలో మాత్ర‌మే వెలిగిస్తారు. అమ్మ‌వారి ముందు బియ్యం పోసి దాని మీద వెండి కుందిలో దీపారాధ‌న చేసి, తెల్ల‌క‌లువ పూల‌తో దీపాన్ని అలంక‌రించి, పూజ చేస్తే తెలివి తేట‌లు, మేథ‌స్సు పెరిగి, సాత్విక మార్గంలో సంపాద‌న పెరుగుతుంది. తుల‌సి కోట ముందు మ‌ట్టి ప్ర‌మిద‌లో దీపారాధ‌న చేస్తే ఇంట్లోకి దుష్ట శ‌క్తులు రావ‌ని విశ్వాసం.

దీపారాధ‌న‌లో ఆవు నెయ్యి శ్రీ‌మ‌హాల‌క్ష్మికి, నువ్వుల నూనె శ్రీ‌మ‌హావిష్ణువు, శ్రీ‌సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి, కొబ్బరి నూనె శ్రీ‌మ‌హాగ‌ణ‌ప‌తికి ముఖ్య‌మ‌ని చెబుతుంటారు. అలాగే ఆవు నెయ్యి, విప్ప‌నూనె, వేప‌నూనె, ఆముదం, కొబ్బ‌రి నూనెలు ప‌రాశ‌క్తికి చాలా ముఖ్యం.

ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, ఆముదం కానీ ఏదో ఒక తైలం శ్రేష్ఠం. ఎట్టి ప‌రిస్థితుల్లో శ‌న‌గ‌నూనె వాడ‌రాదు.

Related Postings:

1. Stotras In Telugu

5. Rashi Phalalu

tags : deeparadhana mantram , deeparadhana , karthika masam , karthika purnima pooja vidhanam , karthika masam deeparadhana , karthika masam deeparadhana mantram , bhakthi margam.in , దీపారాధన మంత్రం , దీపారాధన , దీపారాధ‌న ఎలా చేయాలి ? , How to perform Deeparadhana , Deepam mantram in Telugu, Deepam Slokas in Telugu, 

Comments