కార్తీక మాసంలో ఆహార నియమాలు మరియు తినకూడని ఆహార పదార్థాలు | Food Rules In Karthika Masam | BhakthiMargam | భక్తి మార్గం


కార్తీక మాసంలో ఆహార నియమాలు మరియు తినకూడని ఆహార పదార్థాలు

కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ సమయంలో కొన్ని ఆహార నియమాలు పాటించాలి.ఈ ఆహార నియమాలను పాటించడం మంచిది

కార్తీక మాసంలో ఆహార నియమాలు

కార్తీక మాసాన్ని చాలా శుభప్రదమైనదిగా హిందువులు భావిస్తారు. ఈ మాసంలో చాలా నిష్టతో ఉంటారు. దీపారధన, పూజలు చేస్తుంటారు. ఏడాదిలో ఈ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మిగతా మసాలకంటే.. ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని ఆహారాల నియమాలు పాటించాలి. కార్తీక మాసం  హిందువులకు చాలా పవిత్రమైన మాసం. ఈ ఏడాది కార్తీక మాసం నవంబర్ 14న ప్రారంభమై డిసెంబర్ 13న ముగుస్తుంది.

కార్తీక మాసం సమయంలో ఆహారంలో మార్పు రావాలి. అనేక మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మాసంలో సాత్విక ఆహారమే తీసుకోవాలి.

ఈ మాసంలో మాంసాహారం వండకూడదని అంటారు. శాస్త్రీయ దృక్కోణంలో ఇది కార్తీక మాసంలో జంతువుల శరీరంలో మార్పులు ఉంటాయి. వీటిని తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. చలి కూడా ఎక్కువ అవుతుంది. శరీరంలో మార్పులు వస్తాయి. నాన్ వెజ్ తింటే సరిగా అరగదు. దీంతో ఆరోగ్య ఇబ్బందులు ఎదురవుతాయి.

పాలలో బెల్లం కలిపి తాగడం వల్ల బలం వస్తుంది. ఈ మాసంలో ఇలా తాగండి అంటారు. శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో బెల్లం ఎంతగానో సహకరిస్తుంది. ఈ మాసంలో బెల్లం తింటే దగ్గు, జలుబు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

కార్తీక మాసం శీతాకాలంలో వస్తుంది. చలికాలంలో చల్లటి నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో చల్లటి నీరు తాగకండి. గోరు వెచ్చని నీటిని తాగాలి.

వాతావరణంలో మార్పులు ఎసిడిటీ సమస్యను కలిగిస్తాయి. ఆహారంలో బెల్లం, కల్లుప్పు, బ్లాక్ సాల్ట్ వాడితే ఎసిడిటీ అదుపులో ఉంటుంది.

కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఈ పండుగలో గోధుమ హల్వా ఉపయోగించండి. గోధుమ పిండి, నెయ్యి, పంచదార, యాలకుల పొడి, ఎండు ద్రాక్షలు వేసి చేసిన గోధుమ హల్వా ఆరోగ్యానికి మంచిది.

తులసిని ఆహారంలో వాడటం మంచిది. ఈ సమయంలో తులసిని ఉపయోగిస్తే, శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో, జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

కార్తీక మాసంలో కాకరకాయ తినడం మంచిది కాదు. ఈ మాసం పక్వానికి వచ్చే సమయం కాబట్టి దీని గింజల్లో ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ సమయంలో పచ్చిమిర్చి కూడా ఎక్కువగా తినకూడదు.

వాంఛలు పెంచే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి. కనీసం ఈ నెల రోజులు ఓ నియమంలా పాటిస్తూ పాపపు ఆలోచనలు, ఒకరికి ద్రోహం చేయాలనే ఆలోచనలు మానేయాలి. దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరత్రా అవసరాలకు ఉపయోగించకండి.

మినుములు తినకూడదు, నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు. ఉల్లిపాయ, ఉసిరి, రాత్రిమిగిలినవి, ఒకరు తినగా మిగిలినవి, చల్లని పదార్థాలు తినొద్దు. నెయ్యి, నూనె, ఉసిరి, మైదా వంటలకు దూరంగా ఉంటే మంచిది.

కార్తీకమాసంలో తినకూడని ఆహార పదార్థాలు

ఋతుచక్రాన్ని అనుసరించి కాలం మారుతుంది. ప్రకృతిలో కూడా మార్పు వస్తుంది. దేవీనవరాత్రులతో శరత్కకాలం మొదలవుతుంది కాబట్టి కార్తీకమాసంలో చలి ఉంటుంది.  ఈ మాసంలో కొన్ని ఆహారాలు తినకూడదని  శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే వీటని చాదస్తం అని, మూఢనమ్మకాలు అని కొందరు తేలికగా కొట్టిపడేస్తారు. కానీ ఆయుర్వేదం కార్తీక మాసంలో అస్సలు తినకూడని పదార్థాలేవో శాస్త్రీయ ఆధారాలతో సహా చెప్పింది. వీటిని వాతావరణ మార్పుల ఆధారంగా నిర్ణయించినట్టు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కార్తీకమాసంలో అస్సలు తినకూడని ఆహారాలేంటో తెలుసుకుంటే..

సాధారణంగా కార్తీక మాసం అనగానే ఉల్లిపాయలు, వెల్లుల్లి, నాన్​వెజ్​కు దూరంగా ఉండాలి అనుకుంటారు. అయితే వీటితో పాటు కొన్ని పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది అంటున్నారు. మరి ఆ ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1వ రోజు

ఉల్లిపాయ, ఉసిరి, రాత్రిమిగిలినవి, ఒకరు తినగా మిగిలినవి, చల్లని పదార్థాలు తినకూడదు.

2వ రోజు

కట్ చేసిన వాటిని తినకూడదు. అంటే కూరకు కూరగాయలు తరుగుతాం కదా. అలాంటివి తీసుకోకూడదు.

3వ రోజు

సాల్ట్ వేసిన పదార్థాలు, ఉసిరికాయను తినకూడదు.

4వ రోజు

వంకాయ, ఉసిరికాయ తినకూడదు.

5వ రోజు

పులుపు పదార్థాలకు దూరంగా ఉండాలి.

6వ రోజు

మీకు ఇష్టమైన పదార్థాలతో పాటు.. ఉసిరి కూడా తినకూడదు.

7వ రోజు

ఉసిరికాయను, నమిలి తినే వస్తువులకు దూరంగా ఉండాలి. అంటే లిక్విడ్ రూపంలో తీసుకోవచ్చు.

8వ రోజు

ఉల్లిపాయ, ఉసిరికాయను విస్మరించాలి.

9వ రోజు

నూనెతో తయారు చేసిన వాటిని, ఉసిరికాయను తినకూడదు.

10వ రోజు

ఉసిరికాయ, గుమ్మడికాయ, నూనెతో వండిన వాటికి దూరంగా ఉండాలి.

11వ రోజు

పులుపు పదార్థాలు తినకూడదు.

12వ రోజు

ఉప్పు, కారం, పులుపు లేని ఆహారాన్ని తీసుకోవచ్చు.

13వ రోజు

ఉసిరికాయ తినకూడదు. డిన్నర్ చేయకూడదు.

14వ రోజు

ఇష్టమైన వస్తువులతో పాటు ఉసిరికాయ కూడా తినకూడదు.

15వ రోజు

కట్ చేసిన ఫుడ్ తినకూడదు.

16వ రోజు

ఉల్లి, ఉసిరి, రాత్రి వండిన భోజనం, మజ్జిగ సేవించకూడదు.

17వ రోజు

ఉల్లి, రాత్రి వండిన ఫుడ్, ఉసిరి, మజ్జిగ, కట్ చేసిన ఫుడ్ తీసుకోకూడదు.

18వ రోజు

ఉసిరికాయలు తినకూడదు.

19వ రోజు

నెయ్యి, నూనె, ఉసిరి, మైదా వంటలకు దూరంగా ఉండాలి.

20వ రోజు

పాలు మాత్రమే తీసుకోవాలి. ఇంకేమి తినకూడదు.

21వ రోజు

ఉప్పు, పులుపు కారం తినకూడదు. ఉసిరి, ఉల్లికి కూడా దూరంగా ఉండాలి.

22వ రోజు

తాగే పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. నమిలేవి తీసుకోకూడదు.

23వ రోజు

ఉసిరి, తులసిని సేవించరాదు.

24వ రోజు

ఉసిరి, మైదాతో చేసిన వాటికి దూరంగా ఉండాలి.

25వ రోజు

పులుపు, రసం వంటి ద్రవపదార్థాలు తీసుకోకూడదు.

26వ రోజు

సంపూర్ణ ఉపవాసం చేయాలి.

27వ రోజు

వంకాయ, ఉల్లి, ఉసిరితో చేసినవి తినకూడదు.

28వ రోజు

ఉల్లి, ఉసిరి, సొరకాయ, వంకాయ, గుమ్మడికాయలతో చేసిన వంటలు తినకూడదు.

29వ రోజు

పగలు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసే ఓపిక లేకపోతే.. ఉసిరికి మాత్రం దూరంగా ఉండండి.

30వ రోజు

పగలు ఉపవాసం చేయాలి

శ్రావణ మాసం, కార్తీకం, మాఘమాసం ఇలా పుణ్యప్రదమైన మాసాలు రాగానే మాంసాహారం తినకూడదు అనే నియమాలు పాటిస్తారు చాలా మంది. అయితే నేటికాలంలో హిందూ విశ్వాసాలను హేళన చేసేవారు తింటే ఏమవుతుంది? అని వితండవాదం చేస్తారు. ఆయుర్వేదం ఆహారాన్ని వివిధరకాలుగా  పేర్కొంది. వాటిలో మాంసాహారం తినడాన్ని భూత ఆహారం అని అంటారు. పుణ్యం సంపాదించుకోవాల్సిన కాలంలో భూత ఆహారం తినడం మహా పాపం అని పురాణం చెబితే..

శాస్త్రప్రకారం మాత్రం ఈ మాసంలో జంతువులలో పునరుత్పత్తి ప్రక్రియ జరుగుతుంది.  ఇలాంటి సమయంలో జంతువులను వధించి వాటి మాంసాన్ని తింటే వాటి పునరుత్పత్తి ప్రక్రియకు  నష్టం కలిగించినట్టే కాకుండా వాటి మాంసాన్ని తింటే బోలెడు రోగాలు కూడా వచ్చే ఆవకాశం ఉంటుంది.  ఈ మాసంలో జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదిగా ఉంటుంది. మాంసాహారం తింటే ఈ జీర్ణవ్యవస్థ మరింత బలహీనపడుతుంది. అందుకే కార్తీకమాసంలో మాంసాహారం అస్సలు తినకూడదు.

Related Postings:

1. Stotras In Telugu

tags: Food Rules in Karthika Masam and what are the foods to avoid ?importance of karthika masam, karthika masam importance in telugu, significance of karthika masam,  karthika masam 2023 telugu panchangam, karthika masam important days in telugu, karthika masam importance in telugu, karthika masam important days in telugu 2023, karthika masam 2023,karthika masam pooja vidhanam in telugu,  bhakthimargam, bhaktimargam, bhakti margam, bhakthimargam.in,  bhakthi margam telugu , Bhakthimargam.com,bhakthi margam,in, bhakti margam.in, bhakti margam.com, bhaktimargamtelugu, telugu bhakthi margam, karthika masam rules in telugu, food rules in karthika masam,what are the foods to avoid in karthika masam , 

Comments