ధన త్రయోదశి ఎప్పుడు వచ్చింది? ఈ రోజు బంగారాన్ని ఎందుకు కొంటారు? | Dhana Trayodashi Pooja Vidhanam In Telugu | Bhakthi Margam


ధన త్రయోదశి ఎప్పుడు వచ్చింది  ఈ రోజు బంగారాన్ని ఎందుకు కొంటారు?

ప్రతి సంవత్సరం అశ్వీయుజ మాసంలో క్రిష్ణ పక్షంలోని త్రయోదశి రోజున ధంతేరాస్ పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ధన్వంతరి జయంతి సందర్భంగా బంగారం, వెండి, ఇత్తడి, రాగితో పాటు ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయని, సంపద కూడా రెట్టింపు అవుతుందని నమ్ముతారు. 

ఈ సందర్భంగా ఈ ఏడాది ధన త్రయోదశి పండుగ ఎప్పుడొచ్చింది.. శుభ ముహుర్తం ఎప్పుడు.. పూజా విధానం, ధంతేరాస్ ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

నవంబర్ 13 శుక్రవారం ధనత్రయోదశి. శుక్రవారం సాయంత్రం నుంచే త్రయోదశి గడియలు ప్రారంభమవుతున్నాయి. ధనత్రయోదశి నాడు ఇంటి ముంగిళ్ళలో దీపాలు వెలిగిస్తే లక్ష్మీ దేవి ఇంటికొస్తుంది, యముడు మీ వైపు చూడడు. ఐదు రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగ వేడుకల్లో తొలి రోజు ధన త్రయోదశి. దీపావళి పండుగకు రెండు రోజుల ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశి అంటారు. ఈ పర్వదినానినే ధన్వంతరీ త్రయోదశి, యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లూ ఉన్నాయి. ఆరోగ్యప్రాప్తి, ఐశ్వర్య సిద్ధికోసం దైవ స్వరూపాల్ని విశేషంగా ఆరాధించే పర్వదినమే ధన త్రయోదశి.

ధన త్రయోదశి 2023 శుభ ముహూర్తం

కార్తీక మాసం కృష్ణ పక్ష త్రయోదశి తిథి ప్రారంభం - 10 నవంబర్ 2023, మధ్యాహ్నం 12.36 నుండి

కార్తీక మాసం కృష్ణ పక్ష త్రయోదశి తేదీ ముగింపు - 11 నవంబర్ 2023, మధ్యాహ్నం 1.57 వరకు

ధన్వంతరిని పూజించడానికి శుభ సమయం - 10 నవంబర్ 2023 సాయంత్రం 5.44 నుండి 06.05 వరకు.

ప్రదోష కాలం: సాయంత్రం 5.44 నుండి రాత్రి 8.16 వరకు

ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజేనని చెబుతారు. ఈ శుభదినాన వెండి – బంగారం కానీ, ఒకటి రెండు కొత్త పాత్రలు కానీ కొంటే అదృష్టం వస్తుందని నమ్మకం. అలాగే వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించాడు. భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో వామనుడు ఈ ధన త్రయోదశి నాడే ఆక్రమించాడంటారు.

ధనత్రయోదశి నాడు ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం నుంచి దాదాపు రెండున్నర గంటల సేపు కాలంలో లక్ష్మీదేవీ పూజ శ్రేష్ఠం. ప్రదోషకాలంలో, అందులోనూ స్థిరలగ్నంలో లక్ష్మీ పూజ వల్ల అమ్మ మన ఇంటికి వచ్చి, స్థిరంగా నివాసం ఉంటుందని పెద్దల నమ్మకం.

ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు.

ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నదీ స్నానం కాని లేదా సముద్ర స్నానం కాని ఆచరించాలి. గృహంలో కాని, నదీ లేదా సముద్ర తీరాలలో కాని, వైద్యశాలలో కాని తూర్పు దిక్కుగా కలశ స్థాపన చేసి ధన్వంతరికి ఆవాహన చెయ్యాలి.

ధనత్రయోదశి నాడు లక్ష్మీ దేవిని భక్తితో పూజించాలి. తీపి వంటల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున బంగారము కొనుక్కోదలచినవారు కొనుక్కొని ధనలక్ష్మికి తమ శక్తీ కొలది పూజిస్తారు. వ్యాపారస్థులు – గృహస్థులు తమ ప్రాంగణాల్ని శుభ్రం చేసుకొని అలంకరించుకోవాలి. శుచిగా, శుభ్రంగా ఉన్న ఇంటికే లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. ఈ తల్లిని స్వాగతిస్తూ గుమ్మంలో అందమైన ముగ్గులు వేయాలి. దీపాలతో అలంకరించాలి. లక్ష్మీదేవి ఇంట్లో కాలుమోపడానికి ప్రతీకగా ఇంట్లో బియ్యప్పిండి, పసుపుతో బుడిబుడి అడుగుల గుర్తులు వేస్తారు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ, రాత్రి మొత్తం దీపాలు వెలుగుతూనే ఉండాలి.  

అట్లే పరిపూర్ణ ఆయువు కోసం ధనత్రయోదశి నాడు యమధర్మరాజును పూజించాలి. ఈ దినాన సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాల్ని వెలిగించాలి. వీటిని యమదీపాలుగా పేర్కొంటారు. యముడు దక్షిణదిక్కుకు అధిపతి కావున ఇంటి ఆవరణలో దక్షిణం వైపున, ధాన్యపు రాశిమీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ యమ దీపంవల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది, అకాల మృత్యువును దరిచేరనీయడని ప్రతీతి.

ధన్వంతరిని ధ్యానించిన తర్వాత యధాశక్తి షోడశోపచార సహితంగా పురుషసూక్త విధానంతో అర్చన జరపాలి. మత్స్యపురాణాంతర్గతమైన స్తోత్రాన్ని పఠించి, గరుడ పురాణాంతర్గతమైన ధన్వంతరి సార్థవ్రత కథను పారాయణ చేయాలి. వ్రత సమాప్త్యానంతరం ఇతర వైద్యులకి, పెద్దలకి తాంబూలం సమర్పించి, ఘృతయుక్తమైన పెసర పులగం నివేదన చేసి భుజించాలి.

అహం హి ధన్వంతరి ఆదిదేవో 

జారు మృత్యు హరోం హరణము ||

శల్యంగమ అంగై పర పే 

ప్రాప్టోస్మి గాం భూయ ఇూపదేష్టుమ్ ||

ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరకాలం జీవిస్తారు.

ధ‌న్వంత‌రి జ‌యంతి రోజు చదవాల్సిన మంత్రం

న‌మామి ధన్వంతరిమ్ ఆది దేవం

సురాసురైహి వందిత పాదపద్మం

లొకే జరా రుక్ భయ మృత్యు నాశకం

దాతారం ఈశం స‌క‌ల‌ ఔషధీనాం

ధన్వంతరి జయంతి రోజున, భగవంతుడు ధన్వంతరి జీని పూజిస్తారు. ఆయుర్వేద పాఠశాలలు కూడా ధన్వంతరి పూజ నిర్వహిస్తాయి. ఈ రోజున మందులు దానం చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఏదైనా మందులు మొదలైన వాటిని దానం చేస్తే, అతను/ఆమె ఏ వ్యాధితో బాధపడుతున్నా నయం అవుతారని నమ్ముతారు.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

tags: Dhana Trayodashi 2023, DhanaTrayodashi Time And Date 2023, DhanaTrayodashi 2023, dhantrayodashi 2023 date in telugu, dhantrayodashi 2023 date, dhanteras 2023 date and time, dhanteras 2023 muhurat time, dhanteras puja 2023, dhanteras puja vidhi 2023, dhanatrayodashi 2023, dhantrayodashi 2023 date in telugu, dhantrayodashi puja vidhi in telugu, bhakthimargam , bhaktimargam, bhakthi margam , bhakti margam, bhakthi margam telugu, Telugu bhakthi margam,Bhakthimargam.in,bhathimargam.com 

Comments