దీపావళి రోజు తప్పకుండా స్నానం చేస్తూ ఈ మంత్రాన్ని జపించండి | Deepavali Narakachaturdhasi Story and Rules in Telugu | Diwali 2023 | bhakthi margam


దీపాల వెనుక దాగిన కథ 

దీపావళి అనగానే.. సరదా పండుగ అనీ.. టపాకాయలు కాల్చుకుని ఎంజాయ్ చేసే పండుగ అనీ.. దీపాలు వరుసగా వెలించి ఆడుకునే ఉల్లాసవంతమైన పండుగ అని అందరూ అనుకుంటారు. కానీ దీపాలు వెలిగించడంలో చాలా అంతరార్థం ఉంది. పితృదేవతలకూ.. దీపావళికి మనం వెలిగించే దీపాలకు చాలా సంబంధం ఉంద

దీపావళి అనగానే.. ద్వారపయుగంలో నరకాసురుడ్ని శ్రీకృష్ణుడు  సంహరించిన రోజు అనే అందరూ అనుకుంటారు. కానీ త్రేతాయుగంలో కూడా ఇది పవిత్రమైన రోజే. 

నరకచతుర్దశి – నియమాలు

శ్రీకృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుని సంహరించిన పుణ్యదినమే ఈ నరకచతుర్దశి. నిజానికి దీపావళి ప్రాముఖ్యత అంతా ఈ నరకచతుర్దశి రోజునే ఉంది. ఈ రోజున మన పెద్దలు సూచించిన నియమాలను, వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను గమనిస్తే వారి మేధకు ఆశ్చర్యపోక తప్పదు!

అభ్యంగన స్నానం:

నరకచతుర్దశి రోజున సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేయమన్నారు మన పెద్దలు. అభ్యంగనం అంటే కేవలం తల మీద నాలుగు చెంబులు కుమ్మరించుకోవడం కాదు. ఒంటినిండా శుభ్రంగా నూనెను పట్టించి, దానిని శనగపిండితో రుద్దుకుంటూ రోజుల తరబడి ఒంటికి పేరుకున్న మకిలిని వదిలించడమే అభ్యంగనం! ఈ రోజున తప్పనిసరిగా అభ్యంగనాన్ని చేయాలని చెప్పడం వెనుక ఒక కారణం కనిపిస్తుంది. దీపావళి నాటి నుంచి ఇక చలికాలం మొదలైపోతుంది. 

ఒంట్లోని రక్తప్రసరణ వ్యవస్థ సరిగా లేకుంటే, వచ్చే చలికాలంలో ఇబ్బందులు తప్పవు. శరీరభాగాలు మొద్దుబారిపోవడం దగ్గరనుంచీ, గుండెపోటు వరకూ రక్తప్రసరణకి సంబంధించిన ఎన్నో రోగాలు చలికాలంలో విజృంభిస్తాయి. చలికి రక్తానాళాలు ముడుచుకుపోవడమే దీనికి కారణం! ఈ రోజు చేసే అభ్యంగనం మన రక్తప్రసరణలో కొంత చురుకుని పుట్టిస్తుంది. 

అందుకే ఈ రోజున నువ్వులనూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటారని మన పెద్దలు చెప్పారు. అలాగైనా జనమంతా తప్పకుండా అభ్యంగనాన్ని ఆచరిస్తారని ఒక ఆలోచన కావచ్చు. నువ్వులనూనె సాంద్రత ఎక్కువగా ఉండి వేడి కలిగించే గుణంతో ఉంటుంది. ఇక శనగపిండికి చర్మానికి ఉండే స్వేదరంధ్రాలను శుభ్రపరిచే స్వభావం ఉంది. ఈ రెంటితో మన శరీరానికి చేసే మర్దనం, ఒంట్లోని రక్తనాశాలలో చురుకుని పుట్టిస్తుంది. ఇదీ స్థూలంగా ఈ రోజు అభ్యంగనం చేయడం వల్ల కలిగే లాభం!

దీపం వెలిగించేటప్పుడు ఏ మంత్రం చదవాలి?

“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్

   దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”

దీపం జ్యోతి స్వరూపమైనది. అదే పరంబ్రహ్మం, దీపం చీకటిని పారద్రోలుతుంది. ఈ దీపం వల్లే సర్వకార్యాలు సుగమం అవుతున్నాయి. అటువంటి సంధ్యా దీపమా! నీకు నమస్కారం అని అర్థం. 

దీపం సర్వవేళలా ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు. ఎవరి ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులని పురోహితులు అంటున్నారు. అజ్ఞానం = చీకటి, జ్ఞానం = వెలుతురు. మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే కాంతిని సర్వత్ర ప్రసరింపజేసే పరమాత్మ స్వరూపమే దీపం అని శాస్త్రాలు చెబుతున్నాయి.

దీపం:

నరకచతుర్దశినాటినుంచే మనం దీపాలను వెలిగిస్తాము. ఈ రోజు ఆలయాల్లో నువ్వులనూనెతో చేసిన దీపాలను విరివిగా పెడతారు. దీపం నుంచి వెలువడే పొగ, అది వాతావరణం మీదా, చుట్టూ ఉన్న మనుషుల మీదా చూపించే ప్రభావాన్ని బట్టి నువ్వులనూనె దీపారాధనకు శ్రేష్ఠమని మన పెద్దలు నిర్ణయించారు. పైగా చలికాలానికి ముసురుకునే క్రిమికీటకాదులను దూరంగా ఉంచే వెలుతురు, వేడిని ఈ దీపారాధన కలుగచేస్తుంది.

దక్షిణదీపం:

నరకచతుర్దశినాటి మునిమాపువేళ దక్షిణ దిక్కుకేసి ఒక దీపాన్ని వెలిగించాలని చెబుతున్నారు పెద్దలు. దక్షిణం యమస్థానం, కాబట్టి యమలోకం కూడా అటువైపే ఉందని చెబతారు. యమలోకంలో ఉన్న మన పితృదేవతలకు ఈ దీపం దారిని చూపిస్తుందని నమ్మకం. ఎవరైతే ఇలా దీపాలను వెలిగిస్తారో వారు తమ పితృదేవతలను నరకలోకం నుంచి స్వర్గాన్ని చేరవేర్చినవారవుతారు అని శాస్త్రం చెబుతోంది. 

అందుకనే ఈ రోజుకి `ప్రేతచతుర్దశి` అన్న పేరు కూడా ఉంది. సాధారణంగా పెద్దలను తల్చుకుని వారికి అభిమానపూర్వకంగా ఏదన్నా సమర్పించడానికి ఏదో ఒక క్రతువు ఉంటుంది. అలా ధనంతో కానీ, క్రతువులతో కానీ సంబంధం లేకుండా బీదాసాదా అందరూ తమ పితృదేవతలను మనస్ఫూర్తిగా తల్చుకుని కొల్చుకునే అవకాశమే ఈ దీపం! నిజానికి మొదట నరకచతుర్దశే ముఖ్యమైన పండుగగా ఉండేదనీ, నరక అన్న పదం నరకాసురుని కాకుండా నరకాన్ని సూచించేదనీ కొందరి వాదన కూడా!

ఇక నరకచతుర్దశినాడు చేసుకునే పిండివంటలలో నువ్వులు కూడా ఉండాలన్నది మరో నియమం. నువ్వుల శరీరంలో విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. చలికాలం మొదలవుతున్న ఈ సమయంలో నువ్వులతో కూడిన ఆహారపదార్థాలు, శరీరాన్ని చలికి సిద్ధంగా ఉండే అవకాశాన్ని ఇస్తాయి. మొత్తానికి నువ్వుల నూనెతో అభ్యంగనం, నువ్వులతో పిండివంటలు, నువ్వులనూనెతో దీపం… ఇదీ నరకచతుర్దశినాటి నియమం!

Related Postings:

1. Stotras In Telugu

tags: deepavali 2023 date andhra pradesh, deepavali 2023 date and time, deepavali amavasya 2023 date and time, diwali 2023 muhurat time , diwali 2023 date muhurat time, deepavali pooja vidhanam, లక్ష్మి పూజ విధానం , deepavali pooja vidhanam in telugu pdf, Diwali pooja vidhanam in telugu pdf, Diwali 2023, deepavali amavasya 2023, deepavali amavasya pooja vidhanam in telugu, Deepavali lakshmi pooja vidhanam, diwali lakshmi pooja vidhanam,deepavali amavasya importance in telugu, 10 points about diwali in telugu, diwali significance in telugu, what is the importance of diwali in the culture of india,naraka chaturdashi, naraka chaturdashi 2023, why is naraka chaturdashi celebrated,naraka chaturdashi history in telugu,naraka chaturdashi story in telugu, naraka chaturdashi pooja vidhanam in telugu  , lakshmi pooja on diwali, diwali laxmi puja date 2023, diwali laxmi puja 2023 date and time, diwali lakshmi puja procedure in telugu, diwali lakshmi puja muhurat 2023, diwali lakshmi pooja procedure, diwali significance in telugu, lakshmi pooja on diwali, diwali laxmi puja date 2023, diwali laxmi puja 2023 date and time, diwali lakshmi puja procedure in telugu, diwali lakshmi puja muhurat 2023, diwali lakshmi pooja procedure, diwali significance in telugu

Comments