దీపారాధన - ఫలితాలు | Deeparadhana benefits In telugu | bhakthi margam | భక్తి మార్గం


దీపారాధన - ఫలితాలు

మనం నిత్యం దైవానికి చేసే దీపారాధనలో ఎన్ని వత్తులు వేయాలి.. ఏ  నూనె వాడాలి, ఆవివాడితే ఎలాంటి ఫలితాలనిస్తాయనే విషయంలో చాలా సందేహాలు కలగడం సహజం. శుభాలనిచ్చే దీపారాధన ఏమిటో గమనిద్దాం.   

దీపారాధన - ఫలితాలు

* దీపారాధన  మంత్రం ఫలితములు :- 

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ 

దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమో‌உస్తుతే

మనం నిత్యం దైవానికి చేసే దీపారాధనలో ఎన్ని వత్తులు వేయాలి.. ఏ  నూనె వాడాలి, ఆవివాడితే ఎలాంటి ఫలితాలనిస్తాయనే విషయంలో చాలా సందేహాలు కలగడం సహజం. శుభాలనిచ్చే దీపారాధన ఏమిటో గమనిద్దాం.    

* ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటలలోపు చేసిన సర్వశుభములు, శాంతి కలుగును.

1 ) నెయ్యి :- నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగును.

 2 ) నువ్వుల నూనె  :- నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు , పీడలు తొలగును.

3 ) ఆముదం :- ఆముదముతో దీపారాధన చేసిన దేదీప్య మానమగు జీవితం , బంధుమిత్రుల శుభం, దాంపత్య సుఖం వృద్ధి యగును.

4 ) వేరుశెనగ ( పల్లి ) నూనె :- వేరుశెనగ నూనెతో దీపారాధన చేసిన నిత్య ఋణములు, దుఖం, చోర భయం, పీడలు మొదలగునవి జరుగును.

5 ) నెయ్యి , ఆముదం , వేప నూనె , కొబ్బరి నూనె , ఇప్ప నూనె కలిపి 48 రోజులు దీపారాధన చేసిన వారికి దేవీ అనుగ్రహం కలుగును.

6 ) వేప నూనె, నెయ్యి , ఇప్ప నూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం.., ఇలవేల్పులకు సంతృప్తి కలుగును.

1 ) ఒకవత్తి :- సామాన్య శుభం

2 ) రెండువత్తులు :- కుటుంబ సౌఖ్యం

3 ) మూడువత్తులు :- పుత్ర సుఖం

4 ) ఐదువత్తులు :- ధనం, సౌఖ్యం, ఆరోగ్యం, ఆయుర్ధాయం , అభివృద్ధి.. దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్ఠము..

* దీపాలయొక్కదిక్కుల ఫలితములు :- 

1 ) తూర్పు :- కష్టములు తొలగును , గ్రహ దోషములు పోవును.

2 )పశ్చిమ :- అప్పుల బాధలు , గ్రహ దోషములు, తొలగును.

3 )దక్షిణం :- ఈ దిక్కున దీపము వెలిగించరాదు, కుటుంబమునకు కష్టము కలుగును.

 4 )ఉత్తరం :- ధనాభివృద్ధి, కుటుంబములో శుభ కార్యములు జరుగును.

* దీపవత్తులయొక్క_ఫలితములు :-

1) పత్తి:- పత్తితో దీపము వెలిగించినదో ఆయుషు పెరుగును.

2) అరటినార :- ఆరటి నారతో దీపము వెలిగించినచో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును.

3) జిల్లేడునార:- జిల్లేడినారతో దీపము వెలిగించినచో భూత, ప్రేత, పిశాచాల బాధలు ఉండవు.

4) తామరనార :- పూర్వ జన్మలో చేసిన పాపములు తొలగును.. ధనవంతులు అగుదురు. 

5) నూతన పసుపురంగు వస్త్రము :- అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులగుదురు.

6) నూతన ఎరుపు రంగు వస్త్రము :- వివాహాలు జరుగును, సంతానము కల్గును. >

7) నూతనతెల్లవస్త్రము :- పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగించిన శుభకార్యములు జరుగును.ss

* సాయంసంధ్య సమయములలో  శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసుపు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం, సౌభాగ్యం కల్గును. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితి ఆధారంగా దీపారాధన చేసినచో మరిన్ని సత్పలితాలను ఇస్తాయి.   

*వెలుగుతున్న దీపాన్ని ఎట్టి పరిస్థితలలో నోటితో ఊద కూడదు. 

* దీపాన్ని భూమిపై పెట్టకూడదు. దీపం కుంది క్రింద వస్త్రం కానీ బియ్యం కానీ తమలపాకు, అరటిఆకు ఏదైనా ప్లేట్ మొదలైనవి తప్పక వేయాలి. 

* దీపం వెలిగించిన తర్వాత తప్పక కుంకుమ బొట్టు పెట్టాలి

Related Postings:

1. Stotras In Telugu

5. Rashi Phalalu

tags : deeparadhana mantram , deeparadhana , karthika masam , karthika purnima pooja vidhanam , karthika masam deeparadhana , karthika masam deeparadhana mantram , bhakthi margam.in , దీపారాధన మంత్రం , దీపారాధన , దీపారాధన - ఫలితాలు , దీపవత్తులయొక్క_ఫలితములు , దీపాలయొక్కదిక్కుల ఫలితములు , దీపారాధన  మంత్రం ఫలితములు , benifits of deeparadhana , 

Comments