ఏరువాక పూర్ణిమ విశిష్టత | characteristics of Eruvaaka Pournami 2023|Bhakthi Margam | భక్తి మార్గం


ఏరువాక పౌర్ణమి

వర్షఋతువులో జ్యేష్ఠశుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారు

ఏరువాక పౌర్ణమి తిథి

31 ఆగస్టు ఉదయం 7:05 గంటలకు ముగుస్తుంది. పౌర్ణమి తేదీ : 28 సెప్టెంబర్ 2023, సాయంత్రం 6:49 గంటలకు ప్రారంభమవుతుంది.

ఏరువాక పున్నమి 

నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే హలపౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి. దాన్ని జేష్ట పౌర్ణమి రోజునే ఎందుకు చేసుకుంటారు . ఈ ఏడాది జూన్ 4 నుంచి ఏరుకాక పనులు ప్రారంభమయ్యాయి.  

దుక్కిదున్నే రోజు..

వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటూ ఇటూ అయినా కూడా, జ్యేష్ఠ పౌర్ణమినాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఏరువాక అంటే ‘దుక్కిని ప్రారంభించడం’ అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం. ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారు తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి. 

సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలదీకరణం చెందేందుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు... ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయిక కేలెండర్‌ను ఏర్పరిచారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి. కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా, మరికొందరు బద్ధకించకుండా... ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.

వ్యవసాయ పనిముట్లకు పూజలు.. ఎద్దులకు పొంగలి ప్రసాదం

ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రంచేసుకుంటారు రైతులు. వాటికి పసుపుకుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దుల సంగతైతే చెప్పనక్కర్లేదు. వాటికి శుభ్రంగా స్నానం చేయించి, వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. కాళ్లకు గజ్జలు కట్టి, పసుపుకుంకుమలతో అలంకరించి హారతులిస్తారు. పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కలో కొందరు, తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు. 

వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి, కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఇక ఏరువాక సాగుతుండగా, అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకనే ఏరువాక పాటలు, నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతటా ఉంటుంది. మన దేశంలోని దాదాపు 80 శాతం వర్షపాతం ఈ నైరుతి వల్లనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతటా జరుపుకోవడం గమనించవచ్చు. 

ఏరువాక అంటే ఏమిటి..

వ్యవసాయాన్ని ఓ యజ్ఞంగా భావిస్తారు. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమి పూజ చేసి దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు. ఈ వేడుకను జ్యేష్ఠ పౌర్ణమిరోజే ఎందుకు జరుపుకుంటారంటే. ఏరువాక అనే మాట అందరికీ తెలిసినదే! కానీ ‘ఏరువాక’ అనే పదానికి అర్ధం చాలామందికి తెలియదు. ఏరు అంటే ఎద్దులను పూన్చి దుక్కి దున్నడానికి సిద్దపరచిన నాగలి. దుక్కిదున్నే పనిని శాస్త్రోక్తంగా ప్రారంభించడాన్ని ‘ఏరువాక’ అని పేరు అంటే వ్యవసాయ పనుల ప్రారంభించడం అని అర్థం.

జ్యేష్ఠ పౌర్ణమి రోజే  ఎందుకు... 

సస్యానికి అధిపతి చంద్రుడు  ఇంకా చెప్పాలంటే నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు పూర్తిగా ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమనాడు మొదటిసారి పొలాన్ని దున్నడం సెంటిమెంట్.

పంటపొలం దైవక్షేత్రం..

పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సంప్రదాయం. భూమిని భూమాతగా కొలుస్తారు, వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం..అందుకే దీన్న యజ్ఞంలా పవిత్రంగా భావించి చేస్తారు. అందుకే పొలం గట్లపై చెప్పులేసుకుని నడుస్తారు కానీ పొలాలు లోపలకు దిగేటప్పుడు మాత్రం చెప్పులు వేసుకోరు. ఏందుకంటే ఆ క్షేత్రం దైవసమానంగా భావిస్తారు. అందుకే వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. జ్యేష్ఠ పూర్ణిమరోజు రైతులు ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరించి పూజిస్తారు. వాటికి భక్ష్యాలు సమర్పించి మేళతాళాలతో ఊరేగిస్తారు.

ఏరువాకకి ఎన్ని పేర్లో..

ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో అంటారు, కన్నడంలో కారణి పబ్సం అని జరుపుకుంటారు. అధర్వణవేదం ఏరువాకను 'అనడుత్సవం'గా చెప్పింది. క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది. ఆ తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు లాంటి  మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. 

విష్ణు పురాణంలో..

 విష్ణు పురాణంలో సీతాయజ్ఞంగా ఏరువాక గురించి ప్రస్తావించబడింది. ఇందులో సీత అంటే నాగలి అని అర్థం. 'వప్ప మంగళ దివసం'.. 'బీజవాపన మంగళ దివసం'...'వాహణ పుణ్ణాహ మంగళమ్‌'...'కర్షణ పుణ్యాహ మంగళమ్‌..' అనే పేర్లతో ఈ పండుగను వైభవంగా జరుపుకునేవారు. శుద్ధోదనమహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా శాస్త్రాలలో వివరించబడింది. హాలుడు రాసిన గాథాసప్తశతిలో ఏరువాక గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్యధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నల ప్రస్తావన వచ్చింది

వేదకాలం నుంచే..

వేద కాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారు. ప్రాచీనకాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తున్నారు. అధర్వవేదం ఏరువాకను 'అనడుత్సవం'గా చెప్పింది. క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం వంటి పద్ధతులను ఆచరించేవారు. ఆ తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగ గురించి ప్రస్తావించారు.కొన్ని ప్రాంతాలలో ఊరు బయట, గోగునారతో చేసిన తోరాలు కడతారు.

రైతులంతా అక్కడికి చేరి చెర్నాకోలతో ఆ తోరాలను కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకొచ్చి ఎద్దుల మెడలో కడతారు. ఇలా చేయడం వల్ల వ్యవసాయం, పశు సంపద వృద్ది చెందుతుందని నమ్ముతారు. వేదకాలంలో సైతం ఈ పండుగ ప్రసక్తి కనిపిస్తుంది. కాకపోతే ఆ రోజుల్లో ఇంద్రుని ఆరాధన ఎక్కేవగా ఉండేది కాబట్టి, ఈ రోజున ఇంద్రపూజకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారు. నమ్మకాలు మారుతున్న కొద్దీ ఇంద్రుడు పక్కకి జరిగినా... వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పలేదు, తప్పదు కూడా..

ఏరువాక పూర్ణిమ విశిష్టత

నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు అనేది అక్షర సత్యం కాదు. నిజమైన వాస్తవిక సత్యం. రైతు లేనిదే జగత్తు లేదు. ఎందుకంటే రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పెద్ద పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే హలపౌర్ణమి, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, ఏరువాక పున్నమి, కృషిక పున్నమి అని కూడా అంటారు. ఏరువాక అనగానే ప్రయాణం చేయడం అనే అర్థాన్ని మనకు వెంటనే గుర్తుకు వస్తుంది. ‘ఏరు’అంటే పంటపొలాలు, ‘వాక’ అంటే నాగలి అని అర్థం వస్తుంది. నాగలితో కృషిక క్రియకు ఉపక్రమించడం ఏరువాక అని నిజమైన అర్థం. అంటే దుక్కి దున్నడం అన్నమాట. అయితే ‘ఏరువాక పౌర్ణమి’ ని అనేక నామాలతో పిలుచుకుంటూ ఒక పండగలా జరుపుకుంటున్నాం. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి యొక్క వాస్తవిక విశిష్టత ఏమిటి, దాన్ని ఈ రోజునే ఎందుకు చేసుకుంటారు అంటే…

వైశాఖ మాసం ముగిసిన వెంటనే జేష్ఠ మాసం మొదలవుతుంది. ఈ మాసంలో వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటు ఇటుగా అయినా సరే జ్యేష్ఠ పౌర్ణమినాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకుండా మానదు. ఇదే నాగలితో సాగే అసలైన వ్యవసాయం అన్నమాట. వ్యవసాయపు పనులకు ఇది అసలైన శుభారంభం. అందుకనే ఈ రోజున ఏరువాక పౌర్ణమి అంటే ‘దుక్కిని ప్రారంభించడం’ అనే పనిని మొదలు పెడతారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం.. కాస్త ముందరగానే ఖాళీ సమయాల్లో దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న సందేహం అందరికీ రావచ్చు. ఎవరికి తోచినట్లు వారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళ తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తలక్రిందులవుతాయి. ప్రతి ఒక్కరూ సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు అనేవి ఫలదీకరణం చెందేందుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని ముందుకు సాగించేందుకు… ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయిక కేలెండర్‌ అనేది మన పెద్దలు ఏర్పరిచారు.

ఏరువాక పౌర్ణమి పండగ రోజున రైతులందరూ వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రంచేసుకుంటారు. ఇక పశువుల గురించి చెక్కర్లేదు. ఎందుకంటే ఆరోజు వాటికి శుభ్రంగా స్నానం చేయించి, కొమ్ములకి రంగులు పూస్తారు. వాటి కాళ్ళకి గజ్జలు కట్టి, పసుపు కుంకుమలతో అలంకరించి హారతులు ఇస్తారు. పొంగలిని నైవేద్యంగా చేసి ఎద్దులకి తినిపిస్తారు. ఇక ఈ ఏరువాక పండగ రోజున జరిగే తొలి దుక్కలో కొందరు, తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో పాటు సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు వెన్నంటే ఉండి, తమ కష్టసుఖాల్లో పాలుపంచుకునే మూగ జీవాల పట్ల ఇలా తమ యొక్క ప్రేమాభిమానాన్ని వ్యక్తం చేస్తారు. అయితే ఏరువాక సాగుతున్నంతసేపు, అలుపు సొలుపూ తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ కూడా వ్యవసాయంలో ఉంది. అందుకనే మన జానపద సాహిత్యంలో ఏరువాక పాటలు, నాగలి పాటలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది.

అయితే జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతటా ఉంటుంది. భారతదేశంలో దాదాపు 80 శాతం వర్షపాతం అనేది నైరుతి రుతుపవనాల వల్లనే ఏర్పడుతుంది. అందుకే ఈ ఏరువాక పౌర్ణమి పండగ దేశమంతా జరుపుకోవడం మనం గమనించవచ్చు. ఉద్వృషభ యజ్ఞమనీ సంస్కృతంలో, కారుణిపబ్బ అనీ కన్నడ లో.. ఇలా రకరకాల పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. వేదకాలంలో సైతం కూడా ఈ పండగ యొక్క ప్రస్తావన కనిపించింది. కాకపోతే ఈ రోజుల్లో ఇంద్ర భగవానుడి యొక్క ఆరాధన ఎక్కువగా ఉండేది కాబట్టి, ఈ రోజున ఇంద్రుడి పూజ కి కూడా అధిక ప్రాధాన్యతని ఇచ్చేవారు. రోజులు, నమ్మకాలు మారుతున్న కొద్దీ ఇంద్రుడు ప్రస్తావన పక్కకి జరిగినా.. వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పలేదు, తప్పదు కూడా.

పండుగరోజు చేయాల్సిన పనులు - సందడి :

ఏరువాక పున్నమినాడు రైతులు ఎద్దులను శుభ్రం స్నానం చేయించి, వాటి కొమ్ములకు రకరకాల రంగులు అద్ది, వాటి మెడకు - కాళ్లకు గంటలు కట్టి అందంగా అలంకరిస్తారు. అలాగే పొలం పనులకు ఉపయోగించే సామాగ్రిని ముఖ్యంగా ‘‘కాడి నాగలి’’ని బాగా కడిగి.. దానిని రంగురంగుల పువ్వులతో అలంకరిస్తారు. ఆ విధంగా అలంకరించుకున్న ఎడ్లకు, నాగలికి, భూమాతకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి... ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి, ఎడ్లకు ఆహారంగా పొంగలిని పెడతారు. తరువాత కాడి నాగలిని రైతులు తమ భుజాన వేసుకుని, మంగళవాయిద్యాలను వాయించుకుంటూ ఊరేగింపుగా ఎద్దులకు తీసుకుని వెళతారు. అక్కడికి చేరుకున్న తరువాత భూమాతకు నమస్కరించి, భూమిని దున్నడం ప్రారంభిస్తారు. ఇలా ఈ విధంగా ఈ పండుగను భక్తిశ్రద్ధలతో పూర్తి చేసుకుంటారు.

ప్రతి సంవత్సరం ఏరువాక పున్నమినాడు ఈ విధంగా పండుగను నిర్వహించుకుంటే... ఆ సంవత్సరమంతా పంటలు సమృద్ధిగా పండి, లాభాలబాటవైపు నడిపిస్తాయని కర్షకుల ప్రగాఢ నమ్మకం. మరికొన్ని ప్రాంతాలలో ఈ పండుగను కొంచెం ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఊరుబయట గోగునారతో చేసిన ‘‘తోరం’’ కడతారు. రైతులందరూ ఆ ప్రదేశానికి చేరుకుని.. ‘‘చెర్నాకోల’’తో ఆ తోరాన్ని కట్టి.. ఎవరికి దొరికిన నారను వారు తీసుకెళతారు. ఆ నారను నాగళ్లకు, ఎద్దుల మెడలలో కడతారు. ఇలా ఈ విధంగా చేయడం వల్ల వ్యవసాయం, పశుసంపద వృద్ధి చెందుతాయని ఆ ప్రాంత ప్రజల విశ్వాసం! నిజానికి ఈ పండుగ రైతులకు మాత్రమే అయినప్పటికీ... అందరి ఆకలినీ తీర్చే పండుగ కాబట్టి.. ‘‘ఏరువాక పున్నమి’’ని ప్రతిఒక్కరు జరుపుకోవచ్చు. 

Related Postings:

1. Stotras In Telugu

5. Rashi Phalalu

tags : karthika pooranam,karthika masam,karthika pournami , story of karthika pournami , importance of karthika pournami , fasting of karthika pournami , speciality of karthika pournami in karthika masam , karthika pournami timings and date , karthika pournami relation with vaikunta chaturdhi , bhakthi margam.in ,వైకుంఠ చతుర్దశి మరియు కార్తీక పూర్ణిమ సంబంధం , eruvaka pournami , eruvaka pournami importance , eruvaka pournami story , eruvaka pournami ala chestharu , festivals of eruvaka pournami ,  ఏరువాక పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి తిథి , ఏరువాక పున్నమి ప్రత్యేకత , ఏరువాక పూర్ణిమ విశిష్టత , ఏరువాక పౌర్ణమి అంటే ఏమిటి? ఆరోజు ఏం చేస్తారు?

Comments