ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఈ 21 నామాలు చెప్పండి | karthika masam usiri deepam mantra In Telugu | Bhakthi Margam


కార్తీక మాసం ప్రారంభమైంది. శివ,కేశవులకు అత్యంత ఇష్టమైన కార్తీకమాసంలో శివుడిని, విష్ణువుని విశేషంగా పూజిస్తారు. ముఖ్యంగా కార్తీకమాసంలో భక్తులు నిర్వహించే పూజలు విశేషంగా చెప్పుకోదగినది ఉసిరి చెట్టుకు పూజ

కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టాలని పెద్దలు చెప్తారు. అయితే ఆ సమంయలో ఉసిరికి సంబంధించిన పవిత్రమైన 21 నామాలను చదివితే విశేష ఫలితాలు వస్తాయి,

21 నామాలు

ఓం ధాత్రై నమ:

ఓం రామాయై నమ:

ఓం శా0త్యి నమ :

ఓం లోక మాత్రయై నమ:

ఓం కా0త్యి నమ :

ఓం ఆబ్ధి తనయాయై నమ:

ఓం మేధాయై నమ:

ఓం గాయత్రీయై నమ:

ఓం కళ్యానై నమ:

ఓం సావిత్రియై నమ:

ఓం విష్ణు పట్నై నమ:

ఓం విశ్వరూపాయై నమ:

ఓం మహాలక్ష్మిఁ నమ:

ఓం సురూపాయై నమ:

ఓం ప్రకృతె నమ:

ఓం కమనీయాయై నమ:

ఓం ఇందిరాయై నమ:

ఓం అవ్యక్తాయై నమ:

ఓం సుధ్యత్యి నమ:

ఓం కమలాయై నమ:

ఓం జగధ్దాత్రియై నమ:

ఇలా పైన పేర్కొన్న నామాలను చదివి ఉసిరి దగ్గర దీపం పెట్టాలి. ఉసిరి చెట్టుకొమ్మలను తెచ్చి దీపం పెట్టడం శాస్త్రసమ్మతం కాదు. 

ఉసిరిచెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం.శివకేశవులతో పాటు బ్రహ్మ, సకల దేవతలో ఉసిరి చెట్టులో కొలువై ఉంటే అద్భుత వృక్షం.

కార్తీక మాసం అంటే దీపాలు ప్రధానమైనవి. పత్తితో చేసిన వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి వాటిని అరటి డొప్పల్లో పెట్టి వెలిగిస్తారు. వేకువ జామునే లేచి చన్నీటి స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక దీపాలు అంటే సాధారణంగా ఒత్తులతో చేసి వెలిగించేవే. కానీ కార్తీక మాసంలో ‘ఉసిరి దీపాలు’లకు విశిష్టత ఉంది. ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనాలు చేస్తే మంచిదని అందరికి తెలుసు..కానీ ఉసిరి కాయ (రాసి ఉసిరి అంటే పెద్ద ఉసిరి)తో దీపాలు పెడితే అన్ని శుభాలు కలుగుతాయని..నవ గ్రహ దోషాల పరిహారం జరుగుతుందని చాలామందికి తెలియదు

కార్తీక మాసంలో రోజూ ఉసిరిని తింటే మంచిది ఫలితంగా చలికాలంలో అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయి. అంతేకాదు చలికాలాన్ని యమ దంష్ట్ర లు బయటకు వచ్చే కాలంగా చెబుతారు. అందుకే అనారోగ్యాల బారి నుండి బయటపడి, యముడి కోరల నుండి కాపాడుకోవడం కోసం ఉసిరి ఎంతో ప్రధానమైనదని చెబుతారు. ఇక ఉసిరి చెట్టు ను ధాత్రీ చెట్టు అని కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం, ప్రతిరోజు ఉసిరిని తినడం, ఉసిరి దీపాలను వెలిగించి దానమివ్వడం, ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేయడం చేస్తే ఆరోగ్యం గా ఉంటామని చెబుతున్నారు.

Related Postings:

1. Stotras In Telugu

tags: Mantras and Slokas to chant at Usiri Tree , Usiri Deepam Ela Pettali, Usiri Deepam , Usiri Kaya Deepam, karthika masam deepam timings, usiri deepam ela pettali, karthika masam 2023, karthika deepam , bhakthi margam , bhakthimargam.in, bhakthimargam.com


Comments