అరుణాచలం పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ తేదీలు 2024 | Arunachalam Giri Pradakshina Dates 2024 Dates in Telugu | Thiruvannamalai Girivalam Dates 2024 | Bhakthi Margam

అరుణాచలం 2024 పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ తేదీలు ముఖ్యమైన రోజులు మరియు సమయాలు 

దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగా క్షేత్రాలలో అగ్ని భూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని.. అచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావం. మనం చేసిన రుణ పాపాలను తొలగించునది అని అర్థం అని పండితులు చెబుతారు. 

అదే తమిళంలో అయితే ‘‘తిరువన్నామలై’’ అంటారు. శివ భక్తులు తిరువాన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. తిరు అంటే శ్రీ, అణ్ణామలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి.

అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల.. ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని చాలా మంది నమ్మకం. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు. 

ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలా మంది విశ్వాసం.

అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్తి వివరాలు

  1. కొండ చుట్టూ నడవడానికి మొత్తం అరుణాచలం ఆలయ గిరి ప్రదక్షిణ దూరం 14 కి.మీ. దీనికి 3 గంటల నుండి 4 గంటల సమయం పడుతుంది.
  2. ఉత్తమంగా అరుణాచలం ఆలయ గిరి ప్రదక్షిణ నడక సమయం 4:00 am, 4:00 pm, లేదా 10 pm తర్వాత ఉంటుంది.
  3. దర్శనానికి 6 నుండి 7 గంటలు పట్టవచ్చు, పొడవైన క్యూ లైన్లలో నిలబడటానికి సిద్ధంగా ఉండండి.
  4. గిరి ప్రదక్షిణ సంవత్సరంలో ఎప్పుడైనా చేయవచ్చు, కానీ పౌర్ణమి రోజులలో ఇది శుభప్రదం.
  5. పౌర్ణమి రోజుల్లో అధిక రద్దీని చూడవచ్చు.
  6. రెండు మార్గాలు: ఆలయాలు, అష్ట లింగాలు, తీర్థాలు మరియు పుణ్యక్షేత్రాలతో బయటి మార్గం (సాధారణంగా ప్రయాణించేది).
  7. గిరివాలం కోసం లోపలి మార్గం అందుబాటులో ఉంది కానీ భద్రతా కారణాల దృష్ట్యా మూసివేయబడింది.
  8. లోపలి మార్గం అడవి గుండా వెళుతుంది మరియు రాళ్లతో కప్పబడి ఉంది, పాదరక్షలు లేకుండా నడవడం కష్టం.
జనవరి నెలలో పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ తేదీలు

24 జనవరి 2024 బుధవారం, రాత్రి 09.50 నిమిషాల నుండి 

25 జనవరి 2024 గురువారం, రాత్రి 11.23 నిమిషాలు  వరకు 

ఫిబ్రవరి నెలలో పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ తేదీలు 

23 ఫిబ్రవరి 2024 శుక్రవారం, సాయంత్రం 03.34 నిమిషాల నుండి 

24 ఫిబ్రవరి 2024 శనివారం, సాయంత్రం 06.00 నిమిషాలు వరకు  

మార్చి నెలలో పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ తేదీలు 

24 మార్చి 2024 ఆదివారం, ఉదయం 09.55 నిమిషాల నుండి 

25 మార్చి 2024 సోమవారం,మధ్యాహ్నం 12.30 నిమిషాలు వరకు 

ఏప్రిల్ నెలలో పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ తేదీలు

23 ఏప్రిల్  2024 మంగళవారం తెల్లవారు జామున  03.26 నిమిషాల నుండి 

24 ఏప్రిల్  2024 బుధవారం తెల్లవారు జామున  05.18 నిమిషాలు వరకు 

మే నెలలో పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ తేదీలు

22 మే 2024 బుధవారం సాయంత్రం 06.48 నిమిషాల నుండి 

23 మే 2024 గురువారం రాత్రి 07.23 నిమిషాలు వరకు 

జూన్ నెలలో పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ తేదీలు

21 జూన్ 2024 శుక్రవారం ఉదయం 07.32 నిమిషాల నుండి 

22 జూన్ 2024 శనివారం ఉదయం 06.37 నిమిషాలు వరకు 

జూలై నెలలో పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ తేదీలు

20 జూలై 2024 శనివారం సాయంత్రం 05.59 నిముషాలు నుండి 

21 జూలై 2024 ఆదివారం సాయంత్రం 03.47 నిమిషాలు వరకు 

ఆగస్టు నెలలో పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ తేదీలు

19 ఆగస్టు 2024 సోమవారం తెల్లవారు జామున 03.05 నిమిషాలు నుండి 

19 ఆగస్టు 2024 సోమవారం రాత్రి 11.55 నిమిషాలు వరకు 

సెప్టెంబర్ నెలలో పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ తేదీలు

17 సెప్టెంబర్ 2024 మంగళవారం ఉదయం 11.44  నిమిషాల నుండి 

18 సెప్టెంబర్ 2024 బుధవారం ఉదయం 08.04 నిమిషాలు వరకు 

అక్టోబర్ నెలలో పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ తేదీలు

16 అక్టోబర్ 2024 బుధవారం రాత్రి 08.41 నిమిషాల నుండి 

17 అక్టోబర్ 2024 గురువారం సాయంత్రం 04.56 నిమిషాలు వరకు 

నవంబర్ నెలలో పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ తేదీలు

15 నవంబర్ 2024 శుక్రవారం ఉదయం 06.19 నిమిషాల నుండి 

16 నవంబర్ 2024 శనివారం రాత్రి 02.58 నిమిషాల వరకు 

డిసెంబర్ నెలలో పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ తేదీలు

14 డిసెంబర్ 2024 శనివారం సాయంత్రం 04.59 నిమిషాల నుండి 

15 డిసెంబర్ 2024 ఆదివారం మధ్యాహ్నం  02.31  నిమిషాల వరకు   

గిరి ప్రదక్షిణం మొత్తం 14 కిలోమీట్ల వరకు ఉంటుంది. పగటిపూట ప్రదక్షిణ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఉదయం 10 గంటలలోపు గిరి పద్రక్షిణాన్ని ముగించాలి. ఎక్కువమంది పౌర్ణమి రోజే గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. మిగిలిన భక్తులు ప్రతిరోజూ గిరి ప్రదక్షిణం చేస్తారు.

అరుణాచల గిరి పద్రక్షిణం చేసేవారికి మోక్షం లభిస్తుందని.. కోరిన కోరికలన్నీ నెరువేరుతాయని చాలా మంది నమ్ముతారు. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది నమ్మకం.

Related Postings:

1. Stotras In Telugu

tag: arunachalam temple giri pradakshina dates, Arunachalam Giri Pradakshinam 2023 Dates Temple Darshan , ,arunachalam temple giri pradakshina distance, arunachalam giri pradakshina dates 2024 in telugu,arunachalam giri pradakshina timings telugu, arunachalam giri pradakshina dates in 2024, arunachalam giri pradakshina starting point, arunachalam giri pradakshina distance and time, arunachalam temple timings, Tiruvannamalai Arunachalam Temple Giri Pradakshina Timings, Tiruvannamalai Giri Pradakshina 2024 dates and time , arunachalam temple giri pradakshina history in telugu, arunachalam temple history in telugu, arunachalam temple timings in telugu, arunachalam temple free accommodation, tiruvannamalai temple accommodation online booking, అరుణాచలం గిరి ప్రదక్షిణ 2023, అరుణాచలం గిరి ప్రదక్షిణ 2024,  bhakthimargam, bhaktimargam, bhakti margam, bhakthimargam.in,  bhakthi margam telugu , Bhakthimargam.com,bhakthi margam,in, bhakti margam.in, bhakti margam.com, bhaktimargamtelugu, telugu bhakthi margam

Comments