అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు వెనక ఉన్న ఆంతర్యం ఏంటి ?| Sabarimala Ayyappa Swamy Temple 18 Steps | bhakthi margam |భక్తి మార్గం
శబరిమల ఆలయం యొక్క 18 పవిత్ర మెట్లు
శబరిమల యాత్రలో పతినెట్టాంపాడి లేదా 18 మెట్లు అధిరోహించడం అత్యంత ముఖ్యమైన భాగం. భక్తులు తమ కుడిపాదాన్ని మొదటి మెట్టుపై ఉంచి స్వామివారి దర్శనం కోసం ఆరోహణాన్ని ప్రారంభిస్తారు. 18 మెట్లు శబరిమల ఆలయం చుట్టూ ఉన్న 18 కొండలను సూచిస్తాయి. కానీ, దాని ఆధ్యాత్మిక ప్రతీకవాదం కోసం ఇది చాలా ఎక్కువగా గౌరవించబడుతుంది.
ఈ దశల్లో మొదటి ఐదు ఐదు ఇంద్రియాలను సూచిస్తాయి - దృష్టి, వినికిడి, వాసన, రుచి మరియు స్పర్శ. తదుపరి ఎనిమిది కోరిక, కోపం, దురాశ, కామం, గర్వం, అసూయ, అసూయ మరియు ప్రగల్భాలు వంటి మానవ భావోద్వేగాల ఎనిమిది ప్రతికూల లక్షణాలను సూచిస్తుంది. తదుపరి మూడు మూడు గుణాలు లేదా లక్షణాలను సూచిస్తాయి - సత్వ (స్పష్టత), రజస్, (కార్యకలాపం) మరియు తమస్ (జడత్వం); మరియు చివరి రెండు దశలు జ్ఞానం మరియు అజ్ఞానం యొక్క కవలలను సూచిస్తాయి.
ఈ మెట్లను అధిరోహించి, అవి ప్రాతినిధ్యం వహించే వాటన్నింటిని దాటిన తర్వాత మాత్రమే, ఒక వ్యక్తి తనను తాను అన్ని ప్రాపంచిక బంధాల నుండి వేరు చేసి, ఉన్నతమైన స్థితిని పొందగలడని నమ్ముతారు. దీని కోసం, 41+ రోజుల మండలకళావృత్తం కాలంలో తపస్సులను ఖచ్చితంగా పాటించడం అవసరం.
అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లే ఉండటానికి గల కారణాలేంటి.. ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటో తెలుసా...
ప్రస్తుతం శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతున్నాయి. పంబ నది దగ్గర నుంచి శబరి గిరులన్నీ అయ్యప్ప స్వామి భక్తులంతా నిండిపోయింది. స్వామి వారిని దర్శించుకునేందు భక్తులందరూ తండోపతండాలుగా తరలివస్తున్నారు. కరోనా తర్వాత పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వామి ఆలయం తెరచుకోవడంతో, అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తుండటంతో అయ్యప్ప మాల వేసిన ప్రతిఒక్కరూ శబరి సన్నిధికి చేరుకుంటున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే..
ఈ ఆలయానికి చేరుకున్న వారిలో కేవలం అయ్యప్ప స్వామి మాల వేసి, ఇరుముడితో వచ్చే వారికి మాత్రమే స్వర్ణ మెట్లు(18)పై నుంచి వెళ్లేందుకు అనుమతిస్తారు. సాధారణ భక్తులకు ఈ మెట్లపై అనుమతించరు. ఈ సందర్భంగా ఎందుకని అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లే ఉన్నాయి.. స్వామి వారికి ఈ 18 బంగారం మెట్లకు ఉన్న సంబంధమేంటి.. ఆ మెట్ల వెనుక ఉన్న రహస్యాలేంటి.. ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం
18 దేవతా రూపాలు.
అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను ‘పదునెట్టాంబడి’ అంటారు. ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి, మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి. పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అష్టదిగ్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారారు. అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగేస్తూ తన స్థానాన్ని అధిష్టించారు.
అష్టాదశ దేవతలెవరంటే..
1) మహంకాళి 2) కళింకాళి 3) భైరవ, 4) సుబ్రహ్మణ్యం 5) గంధర్వరాజ 6) కార్తవీర్య 7) క్రిష్ణ పింగళ 8) భేతాళ 9) మహిషాసుర మర్దని 10) నాగరాజ 11) రేణుకా పరమేశ్వరి 12) హిడింబ 13) కర్ణ వైశాఖ 14) అన్నపూర్ణేశ్వరి, 15) పుళిందిని 16) స్వప్న వారాహి 17) ప్రత్యంగళి 18) నాగ యక్షిణి
18 మెట్ల ప్రత్యేకతలు..
ఈ 18 మెట్లలో తొలి పంచమ(ఐదు) మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్లు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు. ఆ తర్వాతి ఎనిమిది మెట్లను అష్ట రాగాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాస్తర్యం, అసూయ, దంబంను సూచిస్తాయని పండితులు చెబుతారు. ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని విడనాడి, స్వార్థాన్ని వదిలేయాలి. భగవంతుడిని తలచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్లమని సూచించాలి.
చివరి మూడు మెట్లు..
అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి మూడు మెట్లు సత్వం, తామసం, రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలట. ఆ తర్వాతి రెండు మెట్లు అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనందం జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది. ఇలా 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులవుతారని చాలా మంది నమ్ముతారు.
మణికంఠుని 18 అస్త్రాలిలా..
మణికంఠుడు తన మెట్ల దగ్గర 18 అస్త్రాలను వదిలి వెళ్లాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ అస్త్రాల పేర్లిలా ఉన్నాయి.
1) శరం 2) క్షురిక 3) డమరుకం 4)కౌమోదకం 5) పాంచజన్యం 6) నాగాస్త్రం 7)హలాయుధం 8) వజ్రాయుధం 9) సుదర్శనం 10) దంతాయుధం 11)నఖాయుధం 12) వరుణాయుధం 13) వాయువ్యాస్త్రం 14) శార్ఘ్నాయుధం 15) బ్రహ్మాస్త్రం 16) పాశుపతాస్త్రం 17) శూలాయుధం 18) త్రిశూలం.
18 మెట్ల నామకరణం ఇలా..
అయ్యప్ప ఆలయంలో ఉండే స్వర్ణ, వెండి, రాగి, ఇత్తడి పంచమ లోహాల మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరు ఉంది. అవి ఇలా ఉన్నాయి. 1) ఆణిమ 2) లఘిమ 3) మహిమ 4) ఈశ్వత 5) వశ్యత 6) ప్రాకామ్య 7) బుద్ధి 8) ఇచ్ఛ 9)ప్రాప్తి 10)సర్వకామ 11) సర్వ సంపత్కర 12) సర్వ ప్రియకర 13) సర్వమంగళాకార 14) సర్వ దుఃఖ విమోచన 15) సర్వ మృత్యుప్రశమన 16) సర్వ విఘ్ననివారణ 17) సర్వాంగ సుందర 18) సర్వ సౌభాగ్యదాయక
18 కొండల పేర్లు ఇలా
అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్న కూడా 18 కొండలను దాటాల్సి ఉంటుంది. అంటే మణికంఠుడు 18 కొండలను దాటొచ్చిన వారికే తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా 18 కొండల పేర్లేంటో తెలుసుకుందాం. 1) పొన్నాంబళమేడు 2) గౌదవమల 3) నాగమల 4) సుందరమల 5) చిట్టంబలమల 6) దైలాదుమల 7) శ్రీపాదమల 8) ఖలిగిమల 9) మాతంగమల 10) దేవరమల 11)నీల్కల్ మల 12) దాలప్పార్ మల 13) నీలిమల 14) కరిమల 15) పుత్తుశేరిమల 16) కాళైకట్టి మల 17) ఇంజప్పార మల 18) శబరిమల
ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు, ఉండకూడని దుర్గణాలన్నింటికీ సంకేతంగా పండితులు చెబుతారు. అందుకే 18 కొండలు, 18 మెట్లను ఎక్కిన వారికి మాత్రమే దర్శనభాగ్యం కలుగుతుంది.
అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు వెనక ఉన్న ఆంతర్యం ఏంటి ?
అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే.. ఖచ్చితంగా 18 మెట్లు ఎక్కాల్సిందే. అది కూడా తలపై ఇరుముడి పెట్టుకుని 18 మెట్లు ఎక్కితేనే ఆ అయ్యన్ అయ్యప్ప స్వామి దర్శనభాగ్యం కలుగుతుంది. ఆలయ దర్శనానికి ముందు అనేక నియమాలు, పద్ధతులు పాటించాలి. 41 రోజులు దీక్ష తీసుకుని భక్తులు స్వామి దర్శనానికి వెళ్తారు. దీక్షాసమయంలో కఠిన నియమాలు పాటించాల్సి ఉంటుంది.
అయితే ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఎందుకు ఉన్నాయి ? ఈ 18కి అయ్యప్ప స్వామికి ఉన్న సంబంధమేంటి ? 18 మెట్లనే ఆ అయ్యప్ప స్వామి ఎందుకు ఎంచుకున్నారు అనేది చాలామందికి సందేహం. కాబట్టి.. ఈ 18 మెట్ల విశిష్టత, విశేషమేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
18 మెట్లు
బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో.. ఈ 18 మెట్లకు పూతలా వేస్తారు. 41 రోజులు దీక్ష చేసిన వాళ్లు మాత్రమే ఈ పదునెట్టాంబడి అంటే 18 మెట్లు ఎక్కడానికి అవకాశం ఉంటుంది.
మొదటి ఐదు మెట్లు
ఈ 18 మెట్లలో మొదటి ఐదు మెట్లను పంచేంద్రియాలుగా సూచిస్తారు. అంటే నేత్రాలు, చెవులు, నాసిక, జిహ్వ, స్పర్శలకు సంకేతం.
పంచేంద్రియాం
మనుషుల చూపు ఎప్పుడు మంచివాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి విషయాలు వినాలి, మంచి విషయాలు మాట్లాడటానికి నాలుకను, ఎప్పుడూ తాజా శ్వాస పీల్చుకోవాలని సూచిస్తాయి. అలాగే.. స్పర్శ జపమాల ద్వారా ఎప్పుడూ ఆ దైవనామస్మరణలో ఉండాలని తెలుపుతుంది.
తర్వాత 8 మెట్లు
5 మెట్ల తర్వాతి 8 మెట్లు అష్టరాగాలకు సంకేతం. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మధం, మాస్తర్యం, అసూయ, దంబంనుసూచిస్తాయి.
అష్టరాగాలు
ఈ అష్టరాగాలను చక్కటి సందేశాన్ని ఇస్తాయి. మనుషులు అహంకారాన్ని విడనాడి, స్వార్థాన్ని వదిలిపెట్టాలి. దేవుడిని స్మరించుకుంటూ ఉండాలి. చెడు మార్గంలో వెళ్తున్నవాళ్లకు మంచి మార్గంలో వెళ్లాలని సూచించాలి.
తర్వాత 3 మెట్లు
తర్వాత మూడు మెట్లు సత్వం, తామసం, రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలు.. బద్ధకాన్ని విడిచిపెట్టాలని సూచిస్తాయి.
చివరి 2 మెట్లు
చివరి రెండు మెట్లు విద్య, అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనమందరం జ్ఞానం పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం.
పరిపూర్ణత
శబరిమల ఆలయంలోని 18 మెట్లు ఎక్కిన వాళ్లు జ్ఞానంతో పాటు సంపద పొంది జీవితంలో పరిపూర్ణులవుతారని ఒక నమ్మకం ఉంది.
కొబ్బరికాయ
18 మెట్లు ఎక్కేటప్పుడు తలపై ఇరుముడి పెట్టుకోవాలి. ఈ ఇరుముడిని దేవాలయంలో ఇచ్చి.. ప్రసాదం ఇంటికి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. /span>
అయ్యప్పకు 18 శబరిమల ఆలయంలో స్వామి దర్శనానికి మాత్రమే కాదు.. ఆయన ఆలయానికి చేరుకోవాలన్నా.. 18 కొండలు దాటాలి. అంటే అయ్యప్ప ఆలయం 18 కొండలపై, అయ్యప్ప దర్శన భాగ్యం 18 మెట్లపై కలుగుతుంది.
Related Postings:
Tags : sri ayyappa swamy temple sabarimala history in telugu, kerala famous temples, sabarimala famous temples, india famous temples, world famous temples, Pathanamthitta famous temples,sabarimala temple story in telugu, sabarimala temple opening dates,sabarimala online, sabarimala online booking,sabarimala temple opening dates 2022 to 2023,makara jyothi, ayyappa swamy mala niyamalu, ayyappa swamy songs, dappu srinu ayyappa swamy songs, sabarimala yatra , sabarimala tour , bhakthimargam, bhaktimargam, bhakti margam, bhakthimargam.in bhakthi margam telugu , sabharimala mandala kalam , శబరిమల మండల కలాం ప్రారంభం , sabharimala , mandalakalam , మకర విళక్కు , అయ్యప్ప దీక్షలో ఇరుముడి కెట్టు అంటే ఏమిటి? , What is Irumudi Kettu in Ayyappa Deeksha? , ఇరుముడి కెట్టు , ఇరుముడికట్టు… శబరిమలైక్కి సాహిత్యం ,అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు వెనక ఉన్న ఆంతర్యం ఏంటి ? , అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లే ఉండటానికి గల కారణాలేంటి.. ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటో తెలుసా... , Sabarimala Ayyappa Swamy Temple 18 Steps , 18 steps story ,
Comments
Post a Comment