ఆంధ్ర ప్రదేశ్ లో దసరా ఒక ముఖ్య పండగ. ఇది శక్తి ఆరాధనకు ప్రాముఖ్యతను ఇచ్చే పండగ. ఈ పండుగనే శరన్నవరాత్రి, నవరాత్రి అని కూడా పిలుస్తారు. తెలుగువారు దసరా వేడుకలు జరుపుకోవడంలో ముందుంటారు. పది రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించే దసరా వేడుకలలో తెలంగాణ ప్రజలు బతుకమ్మ ఆడతారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దసరా అంటే ఠక్కున గుర్తుకొచ్చేది కనకదుర్గ దేవాలయం. ఈ గుడి విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై కలదు. ఇక్కడ రోజువారీ వచ్చే భక్తుల కన్నా, నవరాత్రి పర్వదినాలలో సందర్శించే భక్తుల సంఖ్య అధికం. తిరుపతి తర్వాత ఏపీలో రెండవ పెద్ద దేవాలయంగా కనకదుర్గ గుడి ఖ్యాతిగాంచినది.
దసరా ఉత్సవాలకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి.. అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి ఉత్సవాలు
దసరా శరన్నవరాత్రి వేడుకలకు ఇంద్రకీలాద్రి సిద్ధం అవుతుంది. అక్టోబర్ 15 నుండి 23 వరకు నవరాత్రులు చెయ్యటానికి ఇప్పటికే వైదిక కమిటీ నిర్ణయం తీసుకుంది.
విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల వివరాలు.. తొలిసారి శ్రీ మహాచండి దేవి దర్శనం
ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు.
అక్టోబర్ 16 తేదీ - శ్రీ గాయత్రీ దేవి అలంకారం
అక్టోబర్ 17 తేదీ - శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం
అక్టోబర్ 18 తేదీ - శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం
అక్టోబర్ 19 తేదీ - శ్రీ మహా చండీ దేవి అలంకారం
అక్టోబర్ 20 తేదీ - శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి
అక్టోబర్ 21 తేదీ - శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం
అక్టోబర్ 22 తేదీ - శ్రీ దుర్గాదేవి అలంకారం
అక్టోబర్ 23 తేదీ ఉత్సవాల ఆఖరు రోజున రెండు అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. ఉదయం శ్రీ మహిషా సురమర్ధనీ దేవి అలంకారం.. మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం.. సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు.
అమ్మవారు
ఇంద్రకీలుడనే మహర్షి దుర్గ దేవిని ప్రార్థించగా అమ్మవారు ప్రత్యక్షమై కోరిక కోరమని అడగగా, కీలుడు తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని కోరతాడు. అప్పుడు అమ్మవారు అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుదీరుతుంది. ఇక్కడ వెలసిన మహిసాశురమర్ధిని ఆమె కనక వర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయింది.
పాశుపతాస్త్రం అంతేకాదు, అర్జునుడు ఈ కొండపై మహాశివుడు గురించి తపస్సు చేసి శివుని నుండి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. శివలీలలు, శక్తి మహిమలు ఆలయంలో అక్కడక్కడ కనిపిస్తాయి.
గర్భగుడిలో
కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరమిట్లు గొలిపే ఆభరణాలు, గుబాళించే పూలతో అలంకరించబడి ఉంటుంది. శక్తి స్వరూపిణి ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిశాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తుంది.
దుర్గాదేవి ఆలయంలో
దుర్గాదేవి ఆలయంలో చూడవలసినవి : భవానీ మండపం, అశ్వర్థ వృక్షం, ఆంజనేయస్వామి గుడి, మల్లేశ్వర స్వామి, నాగేంద్రస్వామి, లక్షకుంకుమార్చన స్థలం, శ్రీచక్రం పూజా స్థలం, కళ్యాణ మండపం, శంకరాచార్య మండపం, చండీ హోమం, వినాయకస్వామి, శ్రీరాముడు ఆలయాలు మొదలనవి చూడదగ్గవి.
అన్నదానం
కనకదుర్గ గుడిలో ఉచితంగా అన్నదానం నిర్వహిస్తారు. ప్రతిరోజు 5 వేల మందికి, దసరా ఉత్సవాల సమయంలో లక్షా 25 వేల మందికి అన్నదానం వడ్డిస్తారు.
ఫ్రీ గా దేవస్థానంలో
ఫ్రీ గా ప్రసాదం వడ్డిస్తారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్నప్రసాదం భక్తులకు ఇస్తారు. ప్రసాదం : దద్దోజనం, కట్టు పొంగలి, పులిహోర, బెల్లం పొంగలి, శనగలు.
వసతి
ఎలా చేరుకోవాలి ?
విజయవాడలో వాయు, రైలు, బస్సు మార్గాలు చక్కాగా ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రైళ్లు, బస్సులు, విమానాలు వస్తుంటాయి. విజయవాడ బస్ స్టాండ్ నుండి, రైల్వే స్టేషన్ నుండి కనకదుర్గమ్మ గుడికి వెళ్ళటానికి ఉచిత బస్సు సేవలు కలవు. కొండ మీదకు ప్రవేట్ ఆటోలు, టాక్సీలు కూడా వెళతాయి. కాలినడకన కూడా భక్తులు కొండపైకి చేరుకోవచ్చు.

Comments
Post a Comment