పంచభూత లింగాలు ఎక్కడ వున్నాయి ? వాటి ప్రాశస్త్యం మనం ఇప్పుడు తెలుసుకుందాం
సకల ప్రాణికోటికి ఆధారం పంచ భూతాలైన గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని అంటారు. ఆ పంచ భూతాలకు ప్రతి రూపంగా మన దేశంలో పరమేశ్వరుడి పంచ భూత శివలింగాలను పూజిస్తారు.
పంచ భూత స్థలాలు అయిదు ప్రముఖ శివాలయాలను సూచిస్తుంది. ఈ అయిదింటిలో ఒకొక్కటీ ఒక్కొక్క మూలకానికి ప్రాతినిధ్యం ఉంది. పంచ భూతాలనగా 1. నింగి 2. నేల 3. గాలి 4. నీరు 5. నిప్పు. ఈ అయిదు మూలకాల అభివ్యక్తీకరణమే పంచ భూత క్షేత్రాలు. పంచభూత స్థలాలన్నీ దక్షిణ భారతదేశమందే ఉన్నాయి.ఇందులో నాలుగు తమిళనాడు ఉండగా, ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది.
హిందూ సంస్కృతిలో పరమేశ్వరున్ని లింగ రూపంలో భక్తులు పూజిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి పంచభూత శివలింగాలు.
లింగోద్భవ పుణ్యకాలంలో శివస్మరణ, ముక్తిదాయకమంటారు. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశాలన్నిటా వ్యాపించి ఉన్న పంచభూతాత్మ స్వరూపుడు, సాకారుడు, నిరాధరుడు అయిన లయకారుడు ఆ మహాశివుడు. ఈ పంచభూతాత్ముని పంచభూతలింగాలు నెలకొన్న పుణ్యక్షేత్రాలు
2.జంబుకేశ్వరం
3.అరుణాచలం
4.శ్రీకాళహస్తి
5 చిదంబరం
ముఖ్యంగా కార్తీక మాసంలో పరమేశ్వరుడి దివ్య క్షేత్రాలను సందర్శిచేందుకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వన భోజనాలు చేసేందుకు వివిధ పుణ్య క్షేత్రాలకు వెళుతుంటారు. కాబట్టి మీ తీర్ధయాత్ర పర్యటనల్లో పంచ భూత లింగాల సందర్శనను ఓ భాగం చేసుకోండి. మహాశివరాత్రి వంటి ముఖ్యమైన రోజుతో పాటు ఇతర పవిత్ర పుణ్యదినాల్లో ఈ క్షేత్రాలను దర్శించేందుకు భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. మీకు కూడా ఈ క్షేత్రాలను దర్శించాలనే ఆసక్తి ఉంటే ఈ కధనాన్ని పూర్తి చదివి మరింత సమాచారాన్ని పొందండి.
1. ఆకాశ లింగం: చిదంబరం, తమిళనాడు
ప్రయాణ సమయం: 4 నుంచి 4 ½ గంటలు
తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరం పట్టణంలో తిల్లై నటరాజ ఆలయం ఉంది. భారతదేశంలోని అతిపెద్ద ఆలయ గోపురాల్లో ఈ ఆలయ గోపురం కూడా ఒకటి.
పరమేశ్వరుని అతి పవిత్రమైన పంచభూత లింగాలలో ఆకాశ లింగం ఒకటి. ఆకాశతత్వానికి ప్రతీకగా ఇక్కడి శివలింగాన్ని పూజిస్తారు. ఈ ఆలయంలో 9 గోపురాలు ఉంటాయి. వీటిని మనిషిలోని నవరంధ్రాలకు ప్రతీకగా చెబుతారు. 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం శైవ, విష్ణు భక్తులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ ప్రాచీన దేవాలయం శివుని నటరాజ స్వరూపంతో పాటు గోవిందరాజ పెరుమాళ్లుకు సంబంధించినది.
ఇక్కడ పరమశివుడు మూడు రూపాల్లో దర్శనమిస్తాడు. శివుడి శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా ఇక్కడ స్వర్ణాలంకార భూషితుడైన నటరాజస్వామి రూపంలో పరమశివుడు ఉంటాడు. చంద్రమౌళీశ్వర స్పటిక లింగం, రూపం లేని దైవ సాన్నిధ్యం అనే రూపాల్లోనూ పరమేశ్వరుడు దర్శనమిస్తాడు.
పరమేశ్వరుని మూడవ రూపాన్నే చిదంబర రహస్యం అంటారు. ఈ ప్రదేశాన్ని యంత్రం చిత్రం కలిగిన తెరతో కప్పి ఉంచుతారు. దీని వెనుక ఎలాంటి ఆకారం లేని శూన్యం మాత్రమే ఉంటుంది. దీనినే ఆకాశ తత్వానికి ప్రతీకగా భావిస్తారు. తెరను తొలగించినప్పుడు బంగారు బిల్వ పత్రాల వరుసలు స్వామి సమక్షాన్ని సూచిస్తాయి. తెరకు బయట వైపు ఉండే నలుపు అజ్ఞానాన్ని, లోపల వైపు ఉండే ఎరుపు జ్ఞానాన్ని సూచిస్తుంది.
2. పృధ్వీ లింగం: (కంచి, తమిళనాడు)
ప్రయాణ సమయం: 2 గంటలు
భారతదేశంలో అతిపెద్ద గోపురాలు గల ఆలయాల్లో కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం ఒకటి.
కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర శివలింగం భూమిని సూచిస్తుంది. ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉంటాయి. భారతదేశంలోని అతిపెద్ద గాలి గోపురాలు గల ఆలయాల్లో ఇది ఒకటి.
ఆలయం లోపల య్యి స్తంభాల నిర్మాణంతో పాటు 1,008 శివలింగాలు ప్రతిష్టించబడ్డాయి. ఇక్కడ 3,500 సంవత్సరాల వయస్సు గల మామిడి వృక్షం ఉంది. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద నిలబడి కింద పడే పండును పట్టుకుని తింటే సంతానం కలుగుతుందని నమ్ముతారు.
ఆమ్ర అంటే మామిడి అని అర్ధం. మామిడి చెట్టు కింద వెలసిన దైవం కాబట్టి ఇక్కడి శివలింగాన్ని ఏకాంబరేశ్వర లింగంగా కొలుస్తారు.
3. అగ్ని లింగం: తేజో లింగం (తిరువణ్ణామలై, తమిళనాడు)
ప్రయాణ సమయం: 3 నుంచి 4 గంటలు
పంచభూతాలలో అగ్ని తత్వానికి ప్రతీక ఈ తేజో లింగం. తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం కొండపై తిరువణ్ణామలై పవిత్ర క్షేత్రం ఉంది.
ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు.
పంచ భూతాలలోని అగ్ని భూతానికి ఇది ప్రతీక. అరుణ అంటే ఎర్రని, అచలము అని కొండ అని అర్ధం. దీన్ని బట్టి ఈ క్షేత్రానికి అరుణాచలము అనే పేరు వచ్చింది. కేవలం స్మరణంతోనే ముక్తిని ప్రసాదించే ప్రదేశంగా భక్తులు ఈ క్షేత్రాన్ని నమ్ముతారు. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమశివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే అని పురాణాలు చెబుతున్నాయి.
వేద, పురాణాల్లో ఈ క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శివాజ్ఞతో విశ్వకర్మ ఈ అరుణాచలేశ్వర దేవాలయాన్ని నిర్మించినట్లు కధనం. అక్కడ జరగాల్సిన క్రతువులు గౌతమ మహర్షిచే ఏర్పాటు చేయబడినట్లు అరుణాచల మహత్యం ద్వారా తెలుస్తుంది.
4. జలలింగం: జంబుకేశ్వరం, తమిళనాడు
ప్రయాణ సమయం: 6 గంటలు
పూర్వం ఇక్కడి శివలింగం ఏనుగులచే పూజలందుకోవడం, ఈ ప్రదేశంలో జంబు వృక్షాలు అధికంగా ఉండడం వలన ఈ క్షేత్రానికి జంబుకేశ్వరంగా పేరు వచ్చినట్లు చెబుతారు. తిరుచ్చికి 11 కిలోమీటర్లలో జంబుకేశ్వర ఆలయం ఉంది.
ఈ ఆలయానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. పూర్వం ఇక్కడ జంబు వృక్షాలు అధికంగా ఉండడం వలన, ఏనుగుల చేత పూజలందుకున్న క్షేత్రం కావడం వలన ఈ ప్రదేశానికి జంబుకేశ్వరంగా పేరు వచ్చింది.
ఈ దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఎత్తైన 7 గోపురాలతో నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ జంబుకేశ్వర లింగం పశ్చిమ ముఖంగా ఉంటుంది. నీటితో నిర్మితమైన ఈ లింగం నుంచి పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. అందుకే పానపట్టంపై ఓ వస్త్రాన్ని కప్పుతారు. దీనిని కొద్ది సేపటి తర్వాత పిండి.. ఆ నీటిని భక్తులకు చూపిస్తారు.
5. వాయు లింగం: శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్
ప్రయాణ సమయం: 6 నుంచి 7 గంటలు
సమస్త జీవరాశులకు ప్రాణాధారమైన వాయుభూతానికి చిహ్నంగా ఈ శివలింగాన్ని పూజిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఈ వాయు లింగం భక్తులకు దర్శనమిస్తుంది.
ఇక్కడి శివలింగాన్ని వాయు భూతానికి ప్రతీకగా కొలుస్తారు. దీనికి నిదర్శనంగా భక్తులు ఆలయ గర్భగుడిలో ఓ అద్భుతాన్ని వీక్షించవచ్చు.
కర్పూర లింగంగా పిలిచే ఈ శివలింగం చుట్టూ అనేక దీపాలు నిశ్చలంగా ఉంటాయి. కానీ స్వామి వారి ఎదురుగా ఉండే దీపం మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ కనిపిస్తుంది. అందుకే ఈ లింగాన్ని ప్రాణ వాయు లింగంగా పూజిస్తారు. స్వామి ఉఛ్వాస నిశ్వాసల కారణంగానే ఇది జరుగుతుందని, ఇక్కడి లింగానికి ప్రాణం ఉందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రపంచంలోనే ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రంగా శ్రీకాళహస్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
Related Postings:
1. Stotras In Telugu
tags: pancha bhoota lingas history in telugu, pancha bhoota lingas places, pancha bhoota temples map, pancha bhoota temples tour, five elements temples of shiva, pancha lingam temples in india,pancha bhoota shiva temples, pancha lingam temples in india, 5 shiva temples in straight line, tiruvannamalai history in telugu, arunachalam temple history in telugu,Bhumi Lingam Ekambareswarar Temple , Varuna Lingam (Jambu Lingam) Jambukeshwarar Temple, Thiruvanaikaval, Agni Lingam (Jyothi Lingam), Arunachaleswara Temple, Vayu Lingam SriKalahasti temple , Aagaya Lingam (Akasha Lingam) Thillai Nataraja Temple ,Chidambaram, lord shiva famous temples, 12 famous shiva temples in india, biggest shiva temple in india, oldest shiva temple in india, biggest shiva temple in the world, largest hindu temple in india, bhakthi margam, bhakthi margam telugu, telugu bhakthi margam, bhaktimargam, bhakti margam , bhakthimargam.com, bhakthimargam,in, Pancha Bhoota Temples story in telugu

Comments
Post a Comment