అరుణాచలం దేవాయలం సమాచారం | Arunachalam Temple Giri Pradakshina Full Details In Telugu | Bhakthi Margam


అరుణాచలం దేవాయలం సమాచారం

జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs. సమయం పడుతుంది.

The total Arunachalam Temple Giri Pradakshina distance covered to walk around the hill is 14km which takes 3hrs to 4hrs. Preferably Arunachalam Temple Giri Pradakshina's timings to walk would be 4:00 am, 4:00 pm, or 10 pm onwards.

అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్ధం, తమిళం వాళ్ళు తిరువణ్ణామలై అని పిలుస్తారు, తిరు అనగా శ్రీ, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్ధం, స్మరణ మాత్రమూ చేతనే ముక్తినొసగే క్షేత్రం అరుణాచలం.

ఈ క్షేత్రాన్ని శివుని ఆజ్ఞ మేరకు విశ్వకర్మ అరుణాచల దేవాలయాన్ని నిర్మించాడని, దాని చుట్టూ అరునమనే పురము నిర్మింపబదినదనీ పురాణాలూ తెలుపుతున్నాయి. గౌతమి మహర్షి శివాజ్ఞ మేరకు పూజవిధనమంతా ఏర్పాటు చేసారని స్కాందపురాణంలో అరుణాచల మహత్యం తెలియచేస్తుంది.

అరుణాచలము(Arunachalam) అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ = పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళం లో "తిరువణ్ణామలై" (Tiruvannamalai) అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ.  ఇది చాల గొప్ప పుణ్యక్షేత్రము . స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము . కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని చెప్పుకుంటారు.

అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయం శివజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ , దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి  శివజ్ఞచేత ఏర్పాటు చేశరనీ స్కాందపురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది.

ఇక్కడున్న కొండే శివుడని పురాణాలూ తెలియచేయడం చేత, ఈ కొండకు తూర్పున గల అతిపెద్ద దేవాలయమైన అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇది తేజో లింగం కనుక అగ్ని క్షేత్రం అంటారు. ఇది జ్యోతిర్లింగమని చెప్పు కొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు. దక్షిణభాతరతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభుతమునకిది ప్రతీక .


అరుణాచలేశ్వరాలయము

అరుణాచలేశ్వరాలయము  అతిపెద్ద దేవాలయం ఒక్కొక్క రాజగోపురం ఒకదానితొ ఒకటి పోటిపడి కట్టినట్లు కనిపిస్తాయి . నాగుగుదిక్కులు నాలుగు రాజగొపురములు  ఉంటాయి.

పాతాళలింగము ( Patala Lingam ):

ఇక్కడే రమణమహర్షి (Ramana Maharshi)కొంతకాలం తపస్సు చేసారు . మెట్లద్వార క్రిందకు దిగితె పాతాళలింగము ఉంటుంది.

ఈ గోపురమే  చిలుక (కిలి) గోపురం .. అరుణగిరినాధర్ కధ తెలుసుకధా మీకు ..ఈ గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టించరంటా.. ఈ గోపురంలో అరుణగిరినాధుడు చిలుక రూపంలో ఉండిపోయాడని చెప్పుకుంటారు.  మీకు గోపురం పైన చిలుక కూడ కనిపిస్తుంది.

(1. వెయ్యిస్తంభాల మండపము, 2. దక్షిణగోపురము, 3. తూర్పు రాజగోపురం, 4. పెద్ద నంది, 5. గర్భగుడి, 6. గోపురం పైన చిలుక, 7. బ్రహ్మ  ప్రతిష్ఠింఛిన లింగం)


గర్భగుడి లో  పరమ  పవిత్రమైన అరుణాచలేశ్వర స్వయంభూ లింగము సుందరమై, సురుచిరమై , సర్వసిద్ది ప్రదమై , పానపట్ట్ముపై విరాజిల్లుతూ  ఉంటుంది.

ఇది త్రిమూర్త్యాత్మకము గనుక ఇక్కడ ఇతర దేవతారాధన జరుపనవసరము లేదు. ఈ అలయం ప్రక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది .ఇక్కడే  మీరు పంచ లింగాలయల దర్శనం  కూడ చెయవచ్చు.

ఏకాంబరేశ్వరుడు, చిదంబరేశ్వరుడు..జంబుకేశ్వరుడు, కాళహస్తేశ్వరుడు

ఈ ఆలయం లో  శివగంగతీర్ధము , బ్రహ్మాతీర్ధము ఉన్నాయి. వాటిని కొన్ని ముఖ్య రోజుల్లో  మాత్రమే   తెరుస్తారు

శివగంగతీర్ధము, బ్రహ్మాతీర్ధము

తమిళ దేశం లో ఆలయాలన్ని 12.30 వరకు మాత్రమె లొపలికి అనుమతినిస్తారు.. సాయంత్రం  3.45 - 4.00 కి తెరుస్తారు. రాత్రి 8.30 -9.00 గంటలకు మూసివెస్తారు

పౌర్ణమి రోజు / ప్రసిద్దమైన రోజున మాత్రం రాత్రిపూట అందరకి దర్శనం అయ్యేలా చూస్తారు .

ఈ ఆలయం చాల పెద్దది కావడం వళ్ళ మీరు లొపలనే ఉండవచ్చు( పండగ సమయం లో లొపలికి అనుమతించారు ) .  గర్బగుడి ఒకటె తెరచి ఉండదు.

కిలి గోపురానికి ఎదురుగా  మరో గోపురం ఉంటుంది దానికి అనుకుని సుబ్రహ్మణ్యుల గుడి   ఉంటుంది, మరోల చెప్పలంటే పెద్ద నందికి ఎదురుగ కుడి  పక్కన ఉంటుంది . మీరు స్వామి ని దర్శించుకుని వచ్చెకుండా .. పక్కనే ఒకగది ఉంటుంది ఆ గదిలో శివుని నాట్య ముద్రలు చిత్రికరించినవి అద్భుతంగ ఉంటాయి.

అరుణాచలం గిరి ప్రదక్షణం ( Girivalam Arunachalam):

ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపమే కావటంవలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం.

శ్రీరమణులు దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఊద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగవావిస్తూ ప్రదక్షిణ చేసేవార్కి మహాపుణ్య సిద్దిస్తుందని మహత్లుల వచనం. అందుచేత నిత్యమూ, అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు.   గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుంది.


Arunachala Giripradakshina Route Map

గిరిప్రదక్షణం చేస్తున్నప్పుడు మనకి అష్ట లింగములు కనిపిస్తాయి.  

అవి అగ్ని లింగం రమణాశ్రమానికి (Ramana Ashrama )వేళ్ళే దారిలో కనిపిస్తుంది.

గిరిప్రదక్షణం చాల వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలం లొ గిరిప్రదక్షణం చెయనికి వీలుగా రోడ్డు పక్కన పూట్ పాత్ కూడ వేసారు. ఎక్కువ మంది ఉయదయం సూర్యతాపన్ని తట్టుకోవడం  కష్టం కనుక రాత్రి పూట లేద తెల్లవారుజామున చెస్తారు. రమణ ఆశ్రామానికి  2కి.మి దూరం వెళ్ళిన  తరువాత  కుడివైపుకు తిరగలి రోడ్ కి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది.  అక్కడ మీరు కొండను చూస్తే మీకు నంది కనిపిస్తుంది.

దారిలో మనకు తీర్దములు కనిపిస్తాయి కాని వాటిని వారు పెద్దగ పట్టించుకున్నట్టు కనిపించదు. మీరు జాగ్రత్తగ చూడగలిగితే .. 

  1. శ్రీరమణాశ్రమం నుంచి ప్రారంభించి, పాలితీర్థం, గళశగుడి అగస్త్యతీర్థం,
  2. ద్రౌపదిగుడి, స్కందాలయం, యమలింగం, సిద్ధాశ్రమం, శోణతీర్థం,
  3. నైరుతిలింగం, హనుమాన్‌గుడి, ఉణ్ణామలై అమ్మగుడి, ఉణ్ణామలై తీర్థం,
  4. రామలింగేశ్వరాలయం, రాఘవేంద్రమఠం, ప్రతిధ్వని మంటపం, గోశాల,
  5. రాజరాజేశ్వరి ఆలయం, గౌతమాశ్రమం, సూర్యలింగం, వరుణాలింగం,
  6. ఆది అణ్ణామలై ఆలయం, రేణుకాలయం, వాయులింగం, అక్షర మంటపం,
  7. ఈశాన్యలింగం, ప్రవాళ పర్వతం, అరుణాచలేశ్వరాలయం, ఇంద్రలింగం,
  8. గురుమూర్తం, మామిడితోట, అగ్నిలింగం, శేషాద్రిస్వామి  ఆశ్రమం,
  9. దక్షిణామూర్తి దేవాలయంలో ముగిస్తే, అది ప్రదక్షిణం.


  • గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి.
  • బరువు ఎక్కువగాఉన్నావాటిని మీ కూడ తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
  • గిరిప్రదక్షణం 14కి.మి దూరం ఉంటుంది.
  • ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం .. 9 లోపు ముగించడం మంచిది .
  • గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు .పౌర్ణమి రోజు / ప్రసిద్దమైన రోజున మాత్రం రాత్రిపూట అందరకి దర్శనం అయ్యేలా చూస్తారు .
  • మీరు చిల్లర తిసుకువేళ్ళడం మరిచిపొవద్దు.
  • గిరిప్రదక్షణం లో "నేర శివాలయం" అని ఉంది కద లిస్ట్ లో దానికర్ధం శిఖరానికి ఏదురుగ ఉన్న శివాలయం అని.
  • నిత్యనంద స్వామి అశ్రమం కూడ కనిపిస్తుంది గిరిప్రదక్షణం చేసేటప్పుడు. ఆశ్రమానికి పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది.
  • గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు.

రమణాశ్రమం (Ramana Maharshi Ashram):

రమణాశ్రమం అరుణాచలేశ్వరాలయమునకు 2 కి.మి దూరం లో ఉంటుంది. అరుణాచలం(Arunachalam) వేళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తూంటారు. అక్కడ అరవవాళ్ళకంటే అమెరికా వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు మనకు . సాయంత్రం సమయం లో రమణాశ్రమంలో చెసే ప్రార్దన  చాల బాగుంటుంది . రమణాశ్రమంలో  రమణుల  సమాధిని మనం చూడవచ్చు.

రమణాశ్రమం(Ramana Ashramam) లో కోతులు ఎక్కువగ మనకు కనిపిస్తాయి. నేమళ్ళు కూడ స్వేచ్చాగ తిరుగుతూంటాయి . రమణాశ్రమం లో ఇంకా లక్ష్మి (ఆవు) సామధి, కాకి సమాధి, కుక్క సమాధి నికూడ ఛుడవచ్చు . ఇవన్ని వరుసాగ ఉంటాయి. అక్కడ  గ్రంధాలాయం  లో మనకు రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి. మీరు ఆశ్రమంలో ఉండలాంటె మిరు ముందుగానె బూక్ చెసుకొవాల్సి ఉంటుంది.

శేషాద్రి స్వామి ఆశ్రమం (Seshadri Swami Ashram)

రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి అశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడ అక్కడే ఉంది.  ఇక్కడ కూడ ఉండటానికి రూం లు ఉన్నవి. మీరు ముందుగానే రూం లను బూక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Hotel / Ashramam Accommodation in Tiruvannamalai

వసతి సమాచారం: 

1. Sri Ramanasramam,
Sri Ramanasramam post,
Tiruvannamalai – 606 603.
Tamilnadu.
email:- ashram@sriramanamaharshi.org
website:- www. sriramanamaharshi.org

రమణాశ్రమం లో రూమ్స్ కావాలంటే మనం ముందుగా వాళ్ళకి మెయిల్ చేసి రూమ్స్  బుక్ చేస్కోవాలి. రూమ్స్ ఫ్రీ గానే ఇస్తారని విన్నాను. భోజనం కూడా వారే ఏర్పాటు చేస్తారు, ఒకట్రెండు నెలల ముందు బుక్ చేస్కోవడం మంచింది. 

2. SIVA SANNIDHI,
Ramana Nagar Post Office,
Siva Sannidhi Street,
TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.Ph:- 04175-235089
Cell:- 9789378779

Shiva Sanndihi ఆశ్రమం ఆంధ్ర వాళ్ళదే. ఇక్కడ కూడా ముందుగానే బుక్ చేస్కోవాలి. రమణాశ్రమం దగ్గరలోనే ఈ ఆశ్రమం కలదు.

3. ANDHRA ASHRAMAM,
Opp. Sri Ramanasramam,
Chengam road, 
3rd street,
TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.
Ph:- 04175-236174

ఈ ఆశ్రమం కూడా రమణాశ్రమం దగ్గరలోనే కలదు. ఇక్కడ రూమ్స్ అంతగా బాగోకపోయినా అందరిలానే వీరు కూడా 400 /-  నుంచి  500/- వరకు ఛార్జ్ చేస్తున్నారు . మీకు రూమ్స్ దోరకని పక్షం లో ఇక్కడ రూమ్స్ తీస్కొవచ్చు. భోజనం కూడా వీళ్ళే స్వయంగా వండి వడ్డిస్తారు భోజనానికి మీరు డబ్బులు వేరేగా ఇచ్చుకోవాల్సి వస్తుంది. మనం ఇచ్చే డబ్బులకి  విలువ చేయకపోయినా భోజనం బాగేనే ఉంటుంది.

4.Sri Seshadri Swamigal Asramam,
Room No. 8,
Chengam Road, 
TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.
Ph:- 04175-236999, 238599, 236740.

రమణాశ్రమం లో రూమ్స్ కావాలంటే మనం ముందుగా వాళ్ళకి మెయిల్ చేసి రూమ్స్  బుక్ చేస్కోవాలి. రూమ్స్ ఫ్రీ గానే ఇస్తారని విన్నాను . భోజనం కూడా వారే ఏర్పాటు చేస్తారు , ఒకట్రెండు నెలల ముందు బుక్ చేస్కోవడం మంచింది. శేషాద్రి స్వామి ఆశ్రమం లో రూమ్స్ కావాలంటే కనీసం 15 రోజులు ముందుగానే బుక్ చేస్కోవాలి. వీళ్ళు రూమ్స్ ఫ్రీ గా ఇవ్వరు.A/C Rooms ( 800/- ) నలుగురు ఉండవచ్చు . రూమ్స్ బాగున్నాయి .  వీళ్ళు కొత్తగా a/c పెట్టించారు ఆ రూమ్స్ తీస్కోవడానికి ప్రయత్నించండి . పాత రూమ్స్ లో కొన్ని ఏసీ పనిచేయడం లేదు. Deluxe రూమ్స్ ( 450/- ) ఇద్దరు ఉండవచ్చు. రూమ్స్ బాగున్నాయి. Normal రూమ్స్ ( 200/- ) ఇద్దరు ఉండవచ్చు. కాస్త విశ్రాంతి తీస్కోవడానికి, లేదా పర్వాలేదు అనుకుంటే ఉండవచ్చు. మరీ బాలేదు అని చెప్పలేం అలా అని బాగుంది అని చెప్పలేం.

Related Postings:

1. Stotras In Telugu

tags: arunachalam temple tour plan, arunachalam temple giri pradakshina , arunachalam temple giri pradakshina distance, arunachalam temple giri pradakshina dates 2023, arunachalam giri pradakshina timings telugu, arunachalam accommodation, Tiruvannāmalai Accommodation , arunachalam temple accommodation online booking, arunachalam temple accommodation ramana maharshi ashram, arunachalam temple rooms, arunachalam temple free accommodation, tiruvannamalai temple accommodation online booking, arunachalam temple online room booking, ramana maharshi ashram rooms online booking, ramana maharshi ashram contact number, arunachalam temple to ramana maharshi ashram distance, arunachalam temple to tirupati, arunachalam temple giri pradakshina distance, arunachalam tour plan datails in telugu, arunachalam full information in telugu, Arunachalam temple full tour in telugu , Tiruvannamalai, arunachalam temple history in telugu, arunachalam by chaganti, arunachalam pravachanam by chaganti, importance of arunachalam temple, how to reach arunachalam temple 

Comments